దసరా పండుగకు ప్రత్యేక రైళ్లు

Special trains for Dussehra festival - Sakshi

రద్దయిన రైళ్ల పునరుద్ధరణ 

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): దసరా సీజన్‌లో రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సత్రగచ్చి–బెంగళూరు (06286) రైలు ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలకు సత్రగచ్చిలో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10 గంటలకు బెంగళూరు చేరుతుంది. చైన్నై సెంట్రల్‌–భువనేశ్వర్‌ (06073) రైలు ఈ నెల 23, 30, నవంబర్‌ 6 తేదీల్లో రాత్రి 11.45 గంటలకు చెన్నై సెంట్రల్‌లో బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 6.30 గంటలకు భువనేశ్వర్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (06074) ఈ నెల 24, 31, నవంబర్‌ 7 తేదీల్లో రాత్రి 9 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు చెన్నై సెంట్రల్‌ చేరుతుంది. 

చెన్నై సెంట్రల్‌–సత్రగచ్చి (06071) రైలు ఈ నెల 28, నవంబర్‌ 4 తేదీల్లో రాత్రి 11.45 గంటలకు చెన్నై సెంట్రల్‌లో బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 3.45 గంటలకు సత్రగచ్చి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (06072) ఈ నెల 23, 30, నవంబర్‌ 6 తేదీల్లో ఉదయం 5 గంటలకు సత్రగచ్చిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11 గంటలకు చెన్నై సెంట్రల్‌ చేరుకుంటుంది. భువనేశ్వర్‌ న్యూ–బెంగళూరు (06288) రైలు ఈ నెల 22న ఉదయం 8.15 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. 

నాందేడ్‌–పానిపట్‌ (07635) రైలు ఈ నెల 26న ఉదయం 5.40 గంటలకు నాందేడ్‌లో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1.15 గంటలకు పానిపట్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07636) ఈ నెల 27న మధ్యాహ్నం 3.15 గంటలకు పానిపట్‌లో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 7.30 గంటలకు నాందేడ్‌ చేరుతుంది. 

పునరుద్ధరించిన రైళ్లు ఇవే... 
నిర్వహణ పనుల కారణంగా రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 23–26 వరకు విజయవాడ–గుంటూరు (07783), గుంటూరు–మాచర్ల (07779), మాచర్ల–నడికుడి (07580), నడికుడి–మాచర్ల (07579), మాచర్ల–గుంటూరు (07780), గుంటూరు–విజయవాడ(07788) రైళ్లను పున
రుద్ధరించినట్లు చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top