దసరా పండుగకు ప్రత్యేక రైళ్లు 

Special trains for Dussehra festival - Sakshi

రైల్వేస్టేషన్‌(విజయవాడ పశ్చిమ): దసరా పండు­గ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకు­ని విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. నాందేడ్‌–కాకినాడ టౌన్‌ (07061) రైలు ఈ నెల 20న సాయంత్రం 4.30 గంటలకు నాందేడ్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7.45 గంటలకు కాకినాడ టౌన్‌ చేరుకుంటుంది.

హైదరాబాద్‌–కటక్‌ (07165) రైలు ఈ నెల 24న రాత్రి 8.10 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 5.45 గంటలకు కటక్‌ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07166) ఈ నెల 25న రాత్రి 10.30 గంటలకు కటక్‌లో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top