SCR To Run Spl Trains Between Narsapur -Secunderabd And Hyderabad-Gorakhpur - Sakshi
Sakshi News home page

పలు రూట్లలో ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే

Nov 17 2021 1:13 PM | Updated on Nov 17 2021 3:25 PM

SCR Special Trains Between Narsapur Secunderabad Hyderabad Gorakhpur - Sakshi

పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

సాక్షి, హైదరాబాద్‌: పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు నర్సాపూర్‌–సికింద్రాబాద్‌ (07455) ట్రైన్‌ ఈనెల 21, 28 తేదీల్లో నర్సాపూర్‌ నుంచి సాయంత్రం 6 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 4.10 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

సికింద్రాబాద్‌–విజయవాడ (07456)ట్రైన్‌ ఈనెల 22, 29 తేదీల్లో సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11.55 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.

హైదరాబాద్‌–గోరఖ్‌పూర్‌ (02575/02576) ట్రైన్‌ ఈనెల 19వ తేదీ రాత్రి 9.05 గంటలకు బయల్దేరి రెండోరోజు ఉదయం 6.30 గంటలకు గోరఖ్‌పూర్‌ చేరుకుం టుంది. తిరుగుప్రయాణంలో 21వ తేదీ ఉదయం 8.30 గంటలకు గోరఖ్‌పూర్‌ నుంచి బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3.20 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది. (చదవండి: ఇకపై అన్నీ రెగ్యులర్‌ రైళ్లే.. రైల్వేశాఖ కీలక నిర్ణయం)

Advertisement
 
Advertisement
Advertisement