కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు | Special trains for Kumbh Mela | Sakshi
Sakshi News home page

కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు

Published Thu, Feb 20 2025 5:11 AM | Last Updated on Thu, Feb 20 2025 5:11 AM

Special trains for Kumbh Mela

నేటి నుంచి 28 వరకు... చర్లపల్లి–దానాపూర్‌ మధ్య సర్వీసులు  

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 26వ తేదీన మహాకుంభమేళా ముగియనున్న దృష్ట్యా.. చర్లపల్లి–దానాపూర్‌ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి–దానాపూర్‌ (07791) ప్రత్యేక రైలు ఈ నెల 20వ తేదీ నుంచి 28 వరకు (9 సర్వీసులు) ఉదయం 9.30 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరి రెండోరోజు తెల్లవారుజామున 1.30 గంటలకు దానాపూర్‌ చేరుకుంటుంది. 

తిరుగు ప్రయాణంలో దానాపూర్‌–చర్లపల్లి (07792) ప్రత్యేక రైలు ఈ నెల 20 నుంచి 28 వరకు (9 సర్వీసులు) ఉదయం 4.45 గంటలకు దానాపూర్‌ నుంచి బయలుదేరి.. మర్నాడు రాత్రి 9.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. 

ఈ రైళ్లు నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బర్హంపూర్‌ తదితర రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement