12 నుంచి 24 ప్రత్యేక రైళ్లు  | 24 special trains to start from 12th September | Sakshi
Sakshi News home page

12 నుంచి 24 ప్రత్యేక రైళ్లు 

Sep 9 2020 5:52 AM | Updated on Sep 9 2020 10:52 AM

24 special trains to start from 12th September - Sakshi

సాక్షి, విజయవాడ: విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో ఈ నెల 12 నుంచి రైళ్లను పెంచనున్నారు. కోవిడ్‌–19 కారణంగా ఇప్పటి వరకు 14 ప్రత్యేక రైళ్లను మాత్రమే నడిపిన రైల్వేశాఖ.. ఇక నుంచి 24 రైళ్లకు పెంచాలని నిర్ణయించింది. రైళ్లలో రాకపోకలకు ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆక్యుపెన్సీ 70 నుంచి 80శాతం ఉంటోందని రైల్వే అధికారులు చెబుతున్నారు.  

► డివిజన్‌ పరిధిలోని ఒక్కో జిల్లాలో ఒకొక్క స్టేషన్లో మాత్రమే రైలు ఆగుతుంది. అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ప్రకాశం (ఒంగోలు), నెల్లూరు స్టేషన్లలో ఆగుతుంది.  
► షెడ్యూల్‌ రైళ్లకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. గతంలోలా ఈ 24ను ప్రత్యేక రైళ్లగానే నడుపుతారు. ముందుగానే రిజర్వేషన్లు ఇస్తారు.  
► రైలులో ఎక్కేందుకు గంట ముందుగానే రావాల్సి ఉంటుంది. కరోనా పరీక్షలు చేసిన తరువాతనే రైలులోకి అనుమతిస్తారు. బోగీలు శానిటైజేషన్‌ తరువాతనే ప్రయాణీకుల్ని అనుమతిస్తున్నారు. మాస్క్‌లు, శానిటైజర్లు తప్పని సరిగా వాడాలనే నిబంధన పెట్టారు.  

12వ తేదీ నుంచి నడిచే 24 రైళ్లు ఇవే..... 
ఎంజీఆర్‌ మద్రాస్‌ సెంట్రల్‌– చాప్రా (02669), ఎంజీఆర్‌ మద్రాస్‌ సెంట్రల్‌– న్యూఢిల్లీ(02615), హౌరా–సికింద్రాబాద్‌ (02703), విశాఖపట్నం–న్యూఢిల్లీ (02805), హౌరా–యశ్వంత్‌పూర్‌ (02245), భువనేశ్వర్‌–ముంబై(01020), తిరుచ్చిరాపాలి –హౌరా (02664), దానాపూర్‌– కెఎస్‌ఆర్‌ బెంగళూరు (02296), చాప్రా–ఎంజీఆర్‌ మద్రాస్‌ సెంట్రల్‌ (02670), గుంటూరు– సికింద్రాబాద్‌ (07201), హౌరా–తిరుచ్చిరాపాలి (02663), ఎంజీఆర్‌ మద్రాస్‌ సెంట్రల్‌– న్యూఢిల్లీ (02433), బెంగళూరు కంటోన్మెంట్‌–గౌహతి (02509), ముంబై–భువనేశ్వర్‌(01019), న్యూఢిల్లీ–ఎంజీఆర్‌ మద్రాస్‌ సెంట్రల్‌ (02434), సికింద్రాబాద్‌–గుంటూరు (07202), గౌహతి–బెంగళూరు కంటోన్మెంట్‌ (02510), సికింద్రాబాద్‌–హౌరా (02704), కెఎస్‌ఆర్‌ బెంగళూరు–దానాపూర్‌ (02295), యశ్వంత్‌పూర్‌–హౌరా (02246), న్యూఢిల్లీ–విశాఖపట్టణం (02806), హైదరాబాద్‌– విశాఖపట్టణం (02728), న్యూఢిల్లీ –ఎంజీఆర్‌ మద్రాస్‌ సెంట్రల్‌ (02616), విశాఖపట్నం– హైదరాబాద్‌ (02727). 

Advertisement
 
Advertisement
Advertisement