వేసవికి ప్రత్యేక రైళ్లు 

Hyderabad: Summer Special Trains Between Various Destinations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌.రాకేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.  

హైదరాబాద్‌–నర్సాపూర్‌ (07477/07478) 13వ తేదీ సాయంత్రం 4.55 గంటలకు నాంపల్లి నుంచి.. తిరుగు ప్రయాణంలో 14వ తేదీ ఉదయం 7 గంటలకు బయలుదేరుతుంది. 

కాచిగూడ–తిరుపతి (07297/07298) 13రాత్రి 10.20 గంటలకు.. తిరుగు ప్రయాణంలో 14 మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతుంది.

సికింద్రాబాద్‌–తిరుపతి (07438/07437) స్పెషల్‌ ట్రైన్‌ 13వ తేదీ సాయంత్రం 6.40 గంటలకు.. తిరుగు ప్రయాణంలో 14వ తేదీ సాయం త్రం 7.50 గంటలకు బయలుదేరుతుంది.

సికింద్రాబాద్‌–కాకినాడ (07468/07469)13వ తేదీ రాత్రి 8.45 గంటలకు.. తిరుగు ప్రయాణం లో 17వ తేదీ రాత్రి 8.45 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9.50గం.లకు సికింద్రాబాద్‌ మీదుగా వికారాబాద్‌కు చేరుకుంటుంది.

సికింద్రాబాద్‌–బరంపూర్‌ (07586/07587) 13 సాయంత్రం 4.35 గంటలకు.. తిరుగు ప్రయాణంలో 14వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరుతుంది.

తిరుపతి–సికింద్రాబాద్‌ (07583/07584) స్పెషల్‌ ట్రైన్‌ 15వ తేదీ రాత్రి 9 గంటలకు.. తిరుగు ప్రయాణంలో 16వ తేదీ సాయంత్రం 6.40 గంటలకు బయలుదేరుతుంది.

సికింద్రాబాద్‌–నర్సాపూర్‌ (07439/07440) 15 రాత్రి 10.35 గంటలకు.. తిరుగుప్రయాణంలో 17రాత్రి 8 గంటలకు బయలుదేరుతుంది.

తిరుపతి–సికింద్రాబాద్‌ (07585) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 17 సాయంత్రం 7.50కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.10 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top