హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ శబ్ధాలు | Loud Noises Heard In Several Areas Of Hyderabad Rajendranagar, Triggering Panic Among Residents | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ శబ్ధాలు

Oct 27 2026 10:27 AM | Updated on Oct 27 2026 11:05 AM

Loud Noises Heard In Several Areas Of Rajendranagar Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌లో పలు ప్రాంతాల్లో భారీ శబ్దాలు కలకలం రేపాయి. ఎర్రబోర, ఉప్పరపల్లి, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌లో పేలుడు శబ్ధాలు వినిపించాయి.10 సెకన్ల పాటు భూమి కంపించింది. నాలుగు ప్రాంతాల్లో ఒక్కసారిగా పేలుడు శబ్దాలు రావడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. భూకంపమా..? ఇతర పేలుడు పదార్థాల కారణంగా వచ్చిన శబ్దమా? అంటూ స్థానికుల్లో చర్చ జరుగుతోంది. 

కాగా, ఈ ఏడాది ఫిబవ్రరిలో గాజుల రామారంలోని మెట్‌కానిగూడ పరిసర ప్రాంతాలలో భూమి కంపించిన సంగతి తెలిసిందే. మెట్‌కానిగూడ, హెచ్‌ఏఎల్, ఓక్షిత్‌ ఎన్‌క్లేవ్, ఆదర్శనగర్‌ కాలనీలలో ఒక్కసారిగా భారీ శబ్దంతో భూమి కంపించింది. భూమి కంపించడంతో స్థానిక పాఠశాలలకు  యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి.

ఇదీ  చదవండి: అనుమానంతోనే అర్ధాంగి హత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement