ఉజ్బెకిస్తాన్‌ మహిళలతో వ్యభిచారం | Prostitution Gang Busted in Madhapur | Sakshi
Sakshi News home page

ఉజ్బెకిస్తాన్‌ మహిళలతో వ్యభిచారం

Oct 27 2026 7:40 AM | Updated on Oct 27 2026 7:40 AM

Prostitution Gang Busted in Madhapur

హైదరాబాద్‌: ఉజ్బెకిస్తాన్‌ మహిళలతో సాగుతున్న వ్యభిచార కార్యకలాపాలకు మాదాపూర్‌ పోలీసులు చెక్‌ పెట్టారు. కూకట్‌పల్లి ఎస్‌వోటీ బృందంతో కలిసి ఆదివారం రాత్రి దాడి చేసి ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ కేవీ సుబ్బారావు తెలిపిన మేరకు.. 

చంద్రనాయక్‌ తండాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం జరుగుతున్నట్టు సమాచారం రావడంతో దాడి చేశారు. నిర్వాహకుడు నాయక్‌ పరారీ కాగా అతడి కోసం గాలిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న మహిళలు ఉజ్బెకిస్తాన్‌ సనర్‌ఖండ్‌ ప్రాంతానికి చెందినవారు. వీరికి సరైన పాస్‌పోర్టు, వీసాలు లేవు. నెల క్రితం నేపాల్‌ నుంచి మన దేశంలోకి వచ్చారు. ఢిల్లీకి చెందిన వ్యక్తి వీరిని నాయక్‌కు అప్పగించాడు. కోర్టు ద్వారా హోంకు పంపించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement