prostitution gang arrest
-
వ్యభిచార ముఠా గుట్టు రట్టు
నర్సంపేట రూరల్ : వ్యభిచార ముఠా గుట్టు రట్టు అయ్యింది. విశ్వసనీయ సమాచారం మేరకు వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై దాడిచేసి నిర్వాహకురాలితోపాటు ముగ్గురు విటులను అరెస్ట్ చేసి ఇద్దరు మహిళలను కాపాడినట్లు వరంగల్ టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ కథనం ప్రకారం.. నర్సంపేటలోని మాధన్నపేట రోడ్డులో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు వరంగల్ టాస్క్‌ఫోర్స్, నర్సంపేట పోలీసుల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఇందులో ముగ్గురు విటులు నర్సంపేటకు చెందిన కేసనపల్లి విక్రమ్, బానోజీపేటకు చెందిన కొయ్యల రమేశ్, కొయ్యల నితిన్, గృహ నిర్వాహకురాలు మాధన్నపేట రోడ్డులోని సీపీఐ కాలనీ చెందిన కన్నెరపు ఉమ పట్టుబడ్డారు. దీంతో వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 5 సెల్ఫోన్లు, రూ. 2,750 న గదు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీధర్, నర్సంపేట ఎస్సై అరుణ్, హెడ్‌కానిస్టేబుల్ రాజేశ్వరి, కానిస్టే బుళ్లు కృష్ణ, రాజు, నరేశ్, గణేశ్ పాల్గొన్నారు. -
అమెరికాలో వ్యభిచార ముఠా.. ఐదుగురు తెలుగు వారు అరెస్ట్
-
కేపీహెచ్బీలో ఓయో రూమ్లపై పోలీసుల దాడులు..
సాక్షి, హైదరాబాద్: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సర్దార్ పటేల్ నగర్‌లోని బ్యూటిఫుల్ స్టే ఓయో రూమ్‌పై ఎస్వోటి పోలీసులు మంగళవారం దాడులు జరిపారు. వెస్ట్ బెంగాల్‌కి చెందిన 8 మంది మహిళలను పోలీసులు కాపాడి రెస్క్యూ హోమ్‌కి తరలించారు. ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి నుంచి 10 వేలు నగదు, 5 సెల్ ఫోన్లు, 130 కండోమ్ ఫ్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిన్న(సోమవారం) కూడా కేపీహెచ్‌బీలోని పలు ఓయో రూమ్లపై బాలానగర్ ఎస్వోటి పోలీసులు దాడులు చేశారు. 9 మంది యువతులను రక్షించారు. చదవండి: ఎమ్మెల్యే మోసం చేశారు.. మరో వీడియో విడుదల చేసిన యువతి -
Kukatpally: స్పా, మసాజ్ సెంటర్ల మాటున అక్రమాలు..
సాక్షి, కూకట్పల్లి: నగరంలోని కూకట్‌పల్లిలో స్పా ముసుగులో వ్యభిచారం దందా నడుపుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. స్పా సెంటర్లపై ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. కాగా, పక్కా సమాచారంతో ఎస్వోటీ పోలీసులు కూకట్‌పల్లిలోని పలు స్పా సెంటర్లపై శుక్రవారం దాడులు జరిపారు. ఈ దాడుల్లో స్పా ముసుగులో వ్యభిచారం నడుపుతున్న ముఠాలను గుర్తించారు. ఈ సందర్భంగా దాదాపు 15 మందిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఐదు స్పా సెంటర్లను మూసివేశారు. స్పా, మసాజ్ సెంటర్లు ఇవే.. - స్ప్రింగ్ వెల్ స్పా, మసాజ్ సెంటర్ - అవంతి స్పా, మసాజ్ సెంటర్ - సారా వెల్నెస్ స్పా, మసాజ్ సెంటర్ - స్నో యూనిసెక్స్ స్పా, మసాజ్‌సెంటర్ ఇక, ఈ విషయంలో సంబంధిత యజమానులు, నిర్వాహకులు, థెరపిస్టులను అవసరమైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత పోలీసు స్టేషన్లలకు అప్పగించారు. -
హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఆన్లైన్ వ్యభిచార ముఠా గుట్టురట్టు అయింది. వాట్సాప్ ద్వారా అమ్మాయిల ఫోటోలు పంపి దందాకు పాల్పడుతున్న ఇరువురిని సైబరాబాద్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖులకు యువతులను నిందితులు సరఫరా చేస్తున్నారు. ముంబై,ఢిల్లీ, బెంగాల్ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. గోవా, బెంగుళూరులో సైతం ఈ ముఠా వ్యభిచారం నిర్వహిస్తుంది. చదవండి: రెండేళ్లుగా ఫ్రిజ్లోనే తల్లి శవం..కన్న కూతురికి కూడా తెలియకుండా.. -
మాదాపూర్: ఓయో రూంలో వ్యభిచారం చేస్తూ..
మాదాపూర్(హైదరాబాద్): వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న సంఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాదాపూర్‌లోని శిల్పారామం ఎదురుగా ఎన్ కన్వెన్షన్ వద్ద ఉన్న హైటెక్ టవర్ హోటల్ 4వ ఫ్లోర్ గది నంబర్ 401లో ఇద్దరు వ్యక్తుల సాయంతో దాడి చేశారు. చదవండి: ర్యాపిడో డ్రైవర్ అరాచకాలు.. కాలేజీ అమ్మాయిలకు అందులో ఓ మహిళ ఇతరులతో ఉండడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా బిహార్‌కు చెందిన అజిత్భగత్(25), ఓ కంపెనీలో హౌస్‌కీపింగ్ పనిచేస్తున్నాడు. అమీన్పూర్ బీరంగూడకు చెందిన పట్లోళ్ల రాహూల్‌రెడ్డి (24), ప్రైవేటు ఉద్యోగి. పశ్చిమ బెంగాల్‌కి చెందిన నున్నిహర్ ఖాతున్ ఫలెజ్ అలీ(34)కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. వీరితో కలసి అర్జున్ అలియాస్ కమలాకర్‌రెడ్డి హైదరాబాద్ నుంచి పలువురిని పిలిపించుకుని అజిత్ భగవత్ సాయంతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. ఈ సంఘటనలో అర్జున్ పరారీలో ఉండగా పట్టుబడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. సోదాలో రూ.1010 నగదు, తదితర సామగ్రితో పాటు రెండు సెల్పోన్లు, స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు -
HYD: స్పా ముసుగులో వ్యభిచారం.. తొమ్మిది మంది యువతులను..
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. జూబీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో స్పా ముసుగులో వ్యభిచారం నడిపిస్తున్న ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి జూబ్లీహిల్స్ పోలీసులు వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ రైడ్స్‌లో నిర్వాహకులతో సహా 9 మంది యువతులను, ఇద్దరు కస్టమర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: డిజిటల్ రేప్ కింద వృద్ధుడి అరెస్ట్ -
వ్యభిచార ముఠా గుట్టురట్టు
సాక్షి, ఆదిలాబాద్: ఆసిఫాబాద్‌లోని ఓ లాడ్జిలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం చేస్తున్న ఇద్దరు విటులు, ముగ్గురు యువతులతో పాటు లాడ్జి యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముందస్తు సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్, స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో సంయుక్తంగా శుక్రవారం సాయంత్రం నిర్వహించిన దాడుల్లో వ్యభిచారం చేస్తున్న విటులతో పాటు యువతులను పట్టుకున్నారు. దాడుల్లో లాడ్జి యజమాని, వ్యభిచార నిర్వహకుడు ఖాండ్రే ప్రమోద్, విటులు జిల్లా కేంద్రంలోని దస్నాపూర్‌కు చెందిన ఆకాశ్, బూర్గుడకు చెందిన వేముల ప్రసాద్‌తో పాటు ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం బాధిత యువతులను సంరక్షణ నిమిత్తం జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రానికి తరలించినట్లు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ సీఐ పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఎస్సై వెంకటేశ్, అబ్దుల్ సత్తార్, పోలీసులు మధు, తిరుపతి, రమేశ్, విజయ్, సంజీవ్, మహిళా కానిస్టేబుల్ సుమిత్రి పాల్గొన్నారు. -
వ్యభిచార ముఠా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ వ్యభిచార ముఠాను బంజారా హిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షేక్‌పేట్‌లోని ఓ అపార్ట్మెంట్లో పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసుల తనిఖీల్లో ఇద్దరు నైజీరియన్లతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన యువతులు ఉన్నట్లు గుర్తించారు. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ కేంద్రంపై దాడులు నిర్వహించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. (చదవండి: ఫాతిమాగా తప్పిపోయి.. స్వప్నగా తిరిగొచ్చింది) -
నాలాంటోళ్లు చాలా మంది సార్..
ధర్మపురి/జగిత్యాలక్రైం: ధర్మపురి పట్టణంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో ఆదివారం రాత్రి సీఐ లక్ష్మిబాబు ఆధ్వర్యంలో వ్యభిచార గృ హాలపై దాడులు నిర్వహించారు. ముగ్గురు నిర్వాహకులు, ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ లక్ష్మిబాబు వివరాల ప్రకారం.. చిన్నారులను వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారన్న సమాచారంతో ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి ధర్మపురిలోని జాతీయ రహదారి పక్కనున్న వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. అమాయకపు యువతులను వ్యభిచార కూపంలోకి దింపుతున్న ఓ నిర్వాహకుడిని, అందుకు సహకరిస్తున్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ముగ్గురిని రిమాండ్ చేశారు. వ్యభిచార గృహం నుంచి ఓ యువతికి విముక్తి కల్పించి కరీంనగర్‌లోని ప్రభు త్వ వసతిగృహానికి తరలించారు. ‘ధర్మపురిలోని వేశ్య గృహాలకు మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్ జిల్లా నుంచి విటులు నిత్యం వస్తున్నారు. ఇక్కడ వ్యభిచారం జోరుగా సాగుతోంది. కొంత మంది వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని దందాను సాగిస్తున్నారు. పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో చాలా వరకు యువతులను ఇతర ప్రాంతాలకు తరలించారు. ఈ విషయమై కఠిన చర్యలు తప్పవు’ అని సీఐ లక్ష్మిబాబు ఈ సందర్భంగా హెచ్చరించారు. కాగా జగిత్యాలలోని గాంధీనగర్‌లో సైతం పోలీసులు దాడులు నిర్వ హించారు. అయితే ముందస్తు సమాచారంతో నిర్వాహకులు యువతులను వేరే చోటికి తరలిం చారని, తప్పకుండా పట్టుకుంటామని పోలీసులు పేర్కొంటున్నారు. ఐదు నెలలుగా చిత్రహింసలు ‘నన్ను బలవంతంగా ఈ కూపంలోకి దింపారు. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. అమ్మానాన్న చనిపోయారు. ఒంటరిగా ఉంటున్నానని తెలుసుకున్న కరీంనగర్‌కు చెందిన ఓ మహిళ పరిచయం పెంచుకుంది. ఇంట్లో విందు ఉందని తీసుకెళ్లింది. అక్కడి నుంచి ధర్మపురి తరలించింది. ఐదు నెలల నుంచి ఇక్కడ చిత్రవదలు పెట్టిండ్రు. నాలాంటోళ్లు చాలా మంది ఉన్నారు. పోలీసుల చొరవతో ఈ నరకం నుంచి విముక్తి కలిగింది’ అంటూ ధర్మపురి వ్యభిచార గృహం నుంచి బయటపడిన యువతి కన్నీరుమున్నీరుగా విలపించింది. -
మంచిర్యాలలో వ్యభిచారం
మంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లా కేంద్రంలో మరో వ్యభిచారం ముఠాను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పట్టణంలోని హమాలీవాడలో ఓ మహిళ వ్యభిచారం నడిపిస్తుందన్న సమాచారం మేరకు పట్టణ ఎస్సై శ్రీనివాస్‌యాదవ్ సిబ్బందితో కలిసి వ్యభిచార స్థావరంపై దాడిచేశారు. నిర్వాహకురాలితోపాటు ముగ్గురు విటులు, బెంగళూర్‌కు చెందిన ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. పెద్దపెల్లి జిల్లా కమాన్‌పూర్‌కు చెందిన పెండ్యాల సంతోష్, నాగరాజు, కార్తీక్‌లతోపాటు నిర్వాహకురాలు, బెంగళూర్‌కు చెందిన ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణాపూర్‌కు చెందిన ఓ మహిళ మంచిర్యాలలో అద్దెకు ఉంటూ టైలరింగ్ నిర్వహిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో వ్యభిచారంలోకి దిగిం ది. తనతోపాటు మరికొంత మందిని హైదరాబాద్, బెంగళూర్, విజయవాడ ప్రాంతాల నుంచి మహిళలను పిలిపించి మంచిర్యాలలో వ్యభిచారం నడిపిస్తున్నట్లు వివరించింది. ప్రస్తుతం పోలీసుల అ అదుపులో ఉన్న బెంగళూర్‌కు చెందిన యువతి రైలులో పరిచయం అయిందని, ఆమె ఆర్థిక పరిస్థితిని వివరించగా చేరదీశానని తెలిపింది. ఈ మేరకు ఎస్సై నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో మరో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు
-
హైదరాబాద్‌లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు
సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలో మరో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయ్యింది. ఉప్పర్‌పల్లిలోని హ్యాపీ హోమ్స్ కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. నిర్వాహకులతో పాటు ముగ్గురు విటులను సైతం కటకటాల వెనక్కి నెట్టారు. పాతబస్తీకి చెందిన నిషా ఖాన్ అనే మహిళను ముఠా లీడర్‌గా గుర్తించారు. గతంలో పలుమార్లు వ్యభిచార కేసుల్లో పట్టుబడిన నిషాఖాన్.....ఓ మైనర్ బాలికతో బలవంతంగా వ్యవభిచారం చేయిస్తోంది. ఆ బాధను తట్టుకోలేకపోయిన సదరు బాలిక.....ఆ నరకకూపం నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది. నిర్వాహకురాలు నిషాఖాన్‌తో పాటు....అందుకు సహకరించిన పహాడీ షరీఫ్‌కు చెందిన తహసీన్ ఫాతిమా , సభా అనే మరో ఇద్దరు మహిళలను కూడా అరెస్ట్ చేశారు. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి....మైనర్ బాలికను నరకకూపంలోకి దింపారు. మారియట్ హోటల్‌పై టాస్క్‌ఫోర్స్ దాడి సికింద్రాబాద్ ట్యాంక్‌బండ్ సమీపంలోని మారియట్ హోటల్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున దాడి చేశారు. ఈ సందర్భంగా హోటల్లో పేకాట ఆడుతున్న 38మందిని అదుపులో తీసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ శశిధర్ రాజు తెలిపారు. నిందితులను మీడియా ముందు హాజరుపరిచి వివరాలు వెల్లడించారు. హోటల్లో మూడు గదులను ఆర్గనైజర్స్ బుక్ చేసుకున్నారని, సంజయ్ అనే ఆర్గనైజర్‌తో పాటు మరో ఇద్దరు కూడా హోటల్లో వేరువేరుగా రూమ్స్ బుక్ చేసుకుని మూడు కార్డ్స్ గేమ్‌ను ఆడిస్తున్నారన్నారు. పట్టుబడిన వారి నుంచి రూ.24 లక్షల నగదుతోపాటు 1800 క్యాసినో కాయిన్స్, 38 సెల్ఫోన్లు, మద్యం సీసాలు, హుక్కా పాట్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మరో ముగ్గురు ఆర్గనైజర్లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. హోటల్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగిందని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. -
వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ నటి
-గతంలో పట్టుబడ్డ నిందుతులే కీలక సూత్ర దారులు -భార్యభర్తలు పేరిట ఓ అపార్ట్మెంట్లో కార్యకలాపాలు -చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు శ్రీకాకుళం : పదిహేను రోజులు కిందట ఎచ్చెర్ల పోలీస్టేషన్ పరిధిలో పట్టుబడ్డ వ్యభిచార ముఠా మరోసారి పట్టణంలోని ఒన్‌టౌన్ పరిధిలో గల అపార్ట్మెంట్లో భార్యభర్తలుగా అసాంఘీక కార్యక్రమాలు నిర్వహిస్తూ బుధవారం రాత్రి పట్టుబడ్డారు. అందులో ముగ్గురు మహిళలు, ఇద్దరు విటులు ఉన్నారు. ఒన్‌టౌన్ సిఐ అప్పలనాయుడు, ఎస్ఐ చిన్నంనాయుడు అందించిన వివరాలు మేరకు...స్దానిక టిపిఎం స్కూల్ వెనుక గల సాయిమౌళి అపార్ట్‌మెంట్స్‌లో (రూంనెంబర్-909) గడిచిన కొద్ది రోజులుగా ఈప్రాంతంలో కొత్తవ్యక్తులు సంచరిస్తున్నారు. స్దానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాటువేసి వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురిని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. -భార్యభర్తలు పేరిట అసాంఘీక కార్యక్రమాలు.... ఆమదాలవలస మండలం అక్కివరంకు చెందిన తాండ్ర శ్రీనువాసరావుతో పాటు మరో మహిళ భార్యభర్తలుగా చెలామణి అవుతూ కొత్త వ్యక్తులచే అసాంఘీక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పోలీసులు విచారణలో వెల్లడయ్యింది. వీరిద్దరూ విశాఖపట్నం, విజయనగరంకు చెందిన మహిళ ను తీసుకొచ్చి ఇటుంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పట్టుబడ్డ వారికిలో ఇద్దరు విటులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. శ్రీనుకు విశాఖపట్నం, వియనగరంతో పాటు మరికొన్ని ప్రాంతాలకు చెందిన కొంతమంది అమ్మాయిలతో పరిచయాలు ఉన్నాయని కమీషన్ పద్దతిపై అసాంఘీక కార్యక్రమాలకు శ్రీను ఆధ్యం పోస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. 15రోజులు క్రితమే శ్రీనుతో పాటు మరో మహిళను వ్యభిచారం కేసులో ఎచ్చెర్ల పోలీస్టేషన్ పరిధిలో అరెస్టు చేసామని పోలీసులు తెలిపారు. -రామ్ సరసన గెస్ట్‌రోల్‌గా... ఇదిఇలావుండగా పట్టుబడ్డ ముగ్గురి మహిళల్లో విశాఖపట్నంకు చెందిన ఓ మహిళ రామ్ సరసన ఓ కొత్తసినిమాలో గెస్ట్‌రోల్‌గా నటిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ సినిమా సూటింగ్ దశలో ఉందని ఆమె వెల్లడించింది. రాఖి పండుగ సందర్భంగా తన ఫ్రెండ్ ఇంటికి వచ్చానని విలేకరులకు తెలిపింది అంతేకాకుండా కొన్ని టివీ సీరియల్స్‌లో నటిస్తున్నట్లు చెప్పింది. -నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం.... పట్టుబడ్డ విటుల నుంచి ఒన్‌టౌన్ పోలీసులు రూ.15వందల రూపాయలు నగదుతో పాటు రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిపై కేసు నమోదు చేసామన్నారు.