మంచిర్యాలలో వ్యభిచారం | Prostitution In Mancherial | Sakshi
Sakshi News home page

మంచిర్యాలలో వ్యభిచారం

Apr 7 2018 11:31 AM | Updated on Aug 17 2018 2:56 PM

Prostitution In Mancherial - Sakshi

పోలీసుల అదుపులో విటులు  

మంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లా కేంద్రంలో మరో వ్యభిచారం ముఠాను పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. పట్టణంలోని హమాలీవాడలో ఓ మహిళ వ్యభిచారం నడిపిస్తుందన్న సమాచారం మేరకు పట్టణ ఎస్సై శ్రీనివాస్‌యాదవ్‌ సిబ్బందితో కలిసి వ్యభిచార స్థావరంపై దాడిచేశారు. నిర్వాహకురాలితోపాటు ముగ్గురు విటులు, బెంగళూర్‌కు చెందిన ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు.

పెద్దపెల్లి జిల్లా కమాన్‌పూర్‌కు చెందిన పెండ్యాల సంతోష్,  నాగరాజు, కార్తీక్‌లతోపాటు నిర్వాహకురాలు, బెంగళూర్‌కు చెందిన ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణాపూర్‌కు చెందిన ఓ మహిళ మంచిర్యాలలో అద్దెకు ఉంటూ టైలరింగ్‌ నిర్వహిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో వ్యభిచారంలోకి దిగిం ది.

తనతోపాటు మరికొంత మందిని హైదరాబాద్, బెంగళూర్, విజయవాడ ప్రాంతాల నుంచి మహిళలను పిలిపించి మంచిర్యాలలో వ్యభిచారం నడిపిస్తున్నట్లు వివరించింది. ప్రస్తుతం పోలీసుల అ అదుపులో ఉన్న బెంగళూర్‌కు చెందిన యువతి రైలులో పరిచయం అయిందని, ఆమె ఆర్థిక పరిస్థితిని వివరించగా చేరదీశానని తెలిపింది. ఈ  మేరకు ఎస్సై నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement