
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, ఆదిలాబాద్: ఆసిఫాబాద్‌లోని ఓ లాడ్జిలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం చేస్తున్న ఇద్దరు విటులు, ముగ్గురు యువతులతో పాటు లాడ్జి యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముందస్తు సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్, స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో సంయుక్తంగా శుక్రవారం సాయంత్రం నిర్వహించిన దాడుల్లో వ్యభిచారం చేస్తున్న విటులతో పాటు యువతులను పట్టుకున్నారు.
దాడుల్లో లాడ్జి యజమాని, వ్యభిచార నిర్వహకుడు ఖాండ్రే ప్రమోద్, విటులు జిల్లా కేంద్రంలోని దస్నాపూర్‌కు చెందిన ఆకాశ్, బూర్గుడకు చెందిన వేముల ప్రసాద్‌తో పాటు ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం బాధిత యువతులను సంరక్షణ నిమిత్తం జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రానికి తరలించినట్లు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ సీఐ పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఎస్సై వెంకటేశ్, అబ్దుల్ సత్తార్, పోలీసులు మధు, తిరుపతి, రమేశ్, విజయ్, సంజీవ్, మహిళా కానిస్టేబుల్ సుమిత్రి పాల్గొన్నారు.