
వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ నటి
పదిహేను రోజులు కిందట ఎచ్చెర్ల పోలీస్టేషన్ పరిధిలో పట్టుబడ్డ వ్యభిచార ముఠా మరోసారి పట్టణంలోని ఒన్‌టౌన్ పరిధి
-గతంలో పట్టుబడ్డ నిందుతులే కీలక సూత్ర దారులు
-భార్యభర్తలు పేరిట ఓ అపార్ట్‌మెంట్‌లో కార్యకలాపాలు
-చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
శ్రీకాకుళం : పదిహేను రోజులు కిందట ఎచ్చెర్ల పోలీస్టేషన్ పరిధిలో పట్టుబడ్డ వ్యభిచార ముఠా మరోసారి పట్టణంలోని ఒన్‌టౌన్ పరిధిలో గల అపార్ట్‌మెంట్‌లో భార్యభర్తలుగా అసాంఘీక కార్యక్రమాలు నిర్వహిస్తూ బుధవారం రాత్రి పట్టుబడ్డారు. అందులో ముగ్గురు మహిళలు, ఇద్దరు విటులు ఉన్నారు. ఒన్‌టౌన్ సిఐ అప్పలనాయుడు, ఎస్‌ఐ చిన్నంనాయుడు అందించిన వివరాలు మేరకు...స్దానిక టిపిఎం స్కూల్ వెనుక గల సాయిమౌళి అపార్ట్‌మెంట్స్‌లో (రూంనెంబర్-909) గడిచిన కొద్ది రోజులుగా ఈప్రాంతంలో కొత్తవ్యక్తులు సంచరిస్తున్నారు. స్దానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాటువేసి వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురిని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు.
-భార్యభర్తలు పేరిట అసాంఘీక కార్యక్రమాలు....
ఆమదాలవలస మండలం అక్కివరంకు చెందిన తాండ్ర శ్రీనువాసరావుతో పాటు మరో మహిళ భార్యభర్తలుగా చెలామణి అవుతూ కొత్త వ్యక్తులచే అసాంఘీక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పోలీసులు విచారణలో వెల్లడయ్యింది. వీరిద్దరూ విశాఖపట్నం, విజయనగరంకు చెందిన మహిళ ను తీసుకొచ్చి ఇటుంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పట్టుబడ్డ వారికిలో ఇద్దరు విటులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. శ్రీనుకు విశాఖపట్నం, వియనగరంతో పాటు మరికొన్ని ప్రాంతాలకు చెందిన కొంతమంది అమ్మాయిలతో పరిచయాలు ఉన్నాయని కమీషన్ పద్దతిపై అసాంఘీక కార్యక్రమాలకు శ్రీను ఆధ్యం పోస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. 15రోజులు క్రితమే శ్రీనుతో పాటు మరో మహిళను వ్యభిచారం కేసులో ఎచ్చెర్ల పోలీస్టేషన్ పరిధిలో అరెస్టు చేసామని పోలీసులు తెలిపారు.
-రామ్ సరసన గెస్ట్‌రోల్‌గా...
ఇదిఇలావుండగా పట్టుబడ్డ ముగ్గురి మహిళల్లో విశాఖపట్నంకు చెందిన ఓ మహిళ రామ్ సరసన ఓ కొత్తసినిమాలో గెస్ట్‌రోల్‌గా నటిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ సినిమా సూటింగ్ దశలో ఉందని ఆమె వెల్లడించింది. రాఖి పండుగ సందర్భంగా తన ఫ్రెండ్ ఇంటికి వచ్చానని విలేకరులకు తెలిపింది అంతేకాకుండా కొన్ని టివీ సీరియల్స్‌లో నటిస్తున్నట్లు చెప్పింది.
-నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం....
పట్టుబడ్డ విటుల నుంచి ఒన్‌టౌన్ పోలీసులు రూ.15వందల రూపాయలు నగదుతో పాటు రెండు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిపై కేసు నమోదు చేసామన్నారు.