జనారణ్యంగా మేడారం.. 8 కిలోమీటర్ల ట్రాఫిక్‌ జామ్‌ | Medaram Sammakka–Sarlamma Jatara 2026, Massive Traffic Jam In Tadwai Route As Millions Of Devotees Flock To Jatara | Sakshi
Sakshi News home page

Medaram Jatara 2026: జనారణ్యంగా మేడారం.. 8 కిలోమీటర్ల ట్రాఫిక్‌ జామ్‌

Jan 30 2026 1:42 PM | Updated on Jan 30 2026 2:04 PM

Medaram Jatara: Massive Traffic Jam On Tadvai Medaram Road

సాక్షి, వరంగల్‌: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ప్రారంభం కావడంతో భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో తాడ్వాయి–మేడారం రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తాడ్వాయి నుంచి మేడారం వెళ్లే మార్గంలో దాదాపు 8 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భక్తులు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు, ప్రైవేట్ వాహనాలతో రద్దీ విపరీతంగా పెరిగింది. ట్రాఫిక్‌ నియంత్రణకు పోలీసులు చర్యలు చేపట్టారు.

కోట్లాది భక్తుల ఇలావేల్పు  అయినా సమ్మక్క సారాలమ్మ గద్దెల మీదకు రావడంతో మేడారం  జనారణ్యం అయ్యింది  లక్షలాది భక్తులతో మేడారం పరిసరాల ప్రాంతం కిక్కిరిసిపోయింది. గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను అట్టహాసంగా పూజారులు  తీసుకురాగా.. గురువారం రాత్రి గద్దెలపైకి సమ్మక్కను తీసుకొచ్చారు అమ్మ వారికి అధికారిక లాంఛనాలతో మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. శుక్రవారం.. లక్షలాది భక్తులు.. సమ్మక్కసారాలమ్మల దర్శనం కోసం బారులు తీరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement