breaking news
tadvai - medaram
-
మేడారంలో విషాదం.. తల్లీ ఇక సెలవు..
సాక్షి, ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం గ్రామానికి చెందిన సమ్మక్క పూజారి సిద్దబోయిన సాంబశివరావు(40) అనారోగ్యంతో మృతి చెందాడు. మేడారానికి చెందిన సాంబశివరావు ఇటీవల ఆనారోగ్యానికి గురయ్యాడు. బుధవారం ఉదయం శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా ఉండటంతో ఆయనను కుటుంబ సభ్యులు ఏటూరునాగారంలోని సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందాడు. ప్రతి ఏటా మహాజాతరలో సమ్మక్కను చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెపైన ప్రతిష్టించేంత వరకు బూర కొమ్ము శబ్దం ఊదుతూ కీలక పాత్ర పోషించేవాడు. జాతర ప్రారంభం నుంచి తల్లులు వన ప్రవేశం చేసేంత వరకు ఆయన పూజారులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. జాతరలో సాంబశివరావు అధికారుల నుంచి మంచి పేరు సంపాదించాడు. ఆయన మృతితో మేడారంలో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పూజారులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మేడారంలో ఆయన దహన సంస్కారాలను ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులతోపాటు మేడారం వాసులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన మృతిపట్ల పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, జాతర పునరుద్దరణ కమిటీ చైర్మన్ శివయ్య, సమ్మక్క– సారలమ్మ పూజారులు, ఆదివాసీ సంఘాల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. జిల్లాలోని పలువురు అధికారులు సంతాపం తెలిపారు. మృతుడికి భార్య సంతోషిని, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. చదవండి: మహిళా ప్రతినిధులతో సంబంధం.. ఇతర మహిళలను ట్రాప్‌లో పడేసి సాంబశివరావు భౌతికకాయం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే సీతక్క ఎమ్మెల్యే సీతక్క సంతాపం సాంబశివరావు మృతిపై ఎమ్మెల్యే సీతక్క వ్యక్తం చేశారు. మేడారంలోని వారి స్వగృహం వద్ద మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. సాంబశివరావు కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆమెతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి, తదితరులు ఉన్నారు. సంతాపం తెలిపిన మంత్రి ఎర్రబెల్లి .. సమ్మక్క పూజారి సాంబశివరావు మృతి చెందిన విషయం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
14 కిలోమీటర్లు.. 16 మలుపులు
ఎస్ఎస్ తాడ్వాయి : వనదేవతలు కొలువుదీరిన అటవీ ప్రాంతంలోని తాడ్వాయి- మేడారం మధ్య ఉన్న మూలమలుపులు భక్తులను భయూందోళనకు గురిచేస్తున్నాయి. కన్ను మూసి తెరిచే లోపలే ఉన్న మలుపులతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. కొలిచిన వారికి కొంగు బంగారం అందిస్తూ.. దీన జనులకు అండగా నిలుస్తున్న వనదేవతలు సమ్మక్క, సారలమ్మలు కొలువుదీరిన మేడారానికి.. జాతర సమయంలో భక్తుల సంఖ్య విపరీతంగా ఉంటుంది. తెలంగాణ రాష్ర్టంతోపాటు ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు. మూడు రోజులపాటు జరిగే జాతరలో ఆనందంగా గడుపుతారు. అయితే జిల్లా కేంద్రం నుంచి మేడారానికి వెళ్లాలంటే తాడ్వాయి మీదుగానే ప్రయూణించాల్సి ఉంటుంది. వంద మీటర్లకు ఒక మలుపు.. వరంగల్, ఖమ్మం, తదితర ప్రాంతాల నుంచి వచ్చే భ క్తులు తాడ్వాయి మీదుగానే మేడారానికి చేరుకోవాల్సి ఉంటుం ది. అయితే తాడ్వాయి నుంచి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడారం రహదారిపై 16 మూల మలుపు లు ఉన్నాయి. రోడ్డులో ఒక్కో దగ్గర వంద మీట ర్ల దూరంలో రెండు, మూడు మలుపులు ఉండడంతో ద్విచక్ర వాహనదారులు, ఫోర్‌వీలర్ డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. జాతరలో రాత్రివేళల్లో ఎదురుగా వచ్చే వాహనాలు కని పించకపోవడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. సూచిక బోర్డులు ఏర్పాటు చేయూలి.. వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి వ చ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని తాడ్వారుు, మేడారం మార్గంలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయూల్సిన అవసరం ఉం ది. మూల మలుపుల వద్ద బోర్డులు లేకపోవడం తో రాత్రివేళల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని భక్తులు ఆందోళనకు గురవుతున్నా రు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైన తర్వాత తొలి సారిగా జరిగే జాతరను దృష్టిలో ఉంచుకుని అధికారులు మూలమలుపుల వద్ద సూచిక బోర్డులు ఏ ర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని భక్తులు కోరుతున్నారు. చురుగ్గా చిలకలగుట్ట రోడ్డు మరమ్మతు పనులు మేడారం (తాడ్వాయి) : జాతరను పురస్కరించుకుని చిలకలగుట్టలో చేపట్టిన సీసీ రోడ్డు మరమ్మతు పనులు చురుగ్గా సాగుతున్నాయి. జాతర సమయంలో చిలకల గుట్ట నుంచి సమ్మక్క తల్లిని సీసీ రోడ్డుపై నుంచి పూజారులు గద్దెపైకి తీసుకొస్తారు. అయితే గత జాతరలోనే ఇక్కడి గ్రావెల్ రోడ్డును సీసీగా మార్చారు.కాగా, రెండేళ్ల కాలంలో రోడ్డు శిథిలావస్థకు చేరింది. ఈ నేపథ్యంలో పాత సీసీ రోడ్డుపై 550 మీటర్ల మేరకు వెరింగ్ కోట్ నిర్మాణం చేపట్టేందుకు పంచాయతీ రాజ్‌శాఖ రూ. 37 లక్షల నిధులు మంజూరు చేసింది. కాగా, పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ఏఈఈ కృష్ణ, కాంట్రాక్టర్ తిరుపతిలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. పాత సీసీ రోడ్డు కింది భాగంలో ఐరన్ రాడ్లు వేసి ఐదు ఇంచుల మందంతో సీసీ రోడ్డు వేస్తున్నామని ఏఈఈ కృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. 550 మీటర్లలో ఇంకా 200 మీటర్ల పని మాత్రమే ఉందన్నారు. మరో నాలుగు రోజుల్లో సీసీ రోడ్డు వెరింగ్ కోట్ పనులు పూర్తవుతాయని ఆయన పేర్కొన్నారు. స్నానఘట్టాల పనుల పరిశీలన ఎస్ఎస్ తాడ్వాయి : మహాజాతరను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం మేడారంలో జరుగుతున్న స్నానఘట్టాల నిర్మాణ పనులను టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు ఎనగందుల బాపిరెడ్డి, జిల్లా సీనియర్ నాయకుడు కాక లింగయ్య శనివారం పరిశీలించా రు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ తెలంగా ణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా జరిగే జాతర నిర్వహణ కు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఆలయ ప్రాంగణాన్ని గాయత్రి గ్రానైట్స్ యూజమని రవిచంద్ర లక్షలాది రూపాయల గ్రానైట్‌తో తీర్చిదిద్దడం సంతోషకరమన్నారు. పనులను సకాలంలో పూర్తి చేసి జాతరను విజయవంతం చేయూలని వారు అధికారులను కోరారు. వారి వెంట టీఆర్ఎస్ జిల్లా యూత్ అధికార ప్రతినిధి పత్తి గోపాల్‌రెడ్డి, తదితరుల ఉన్నారు.