14 కిలోమీటర్లు.. 16 మలుపులు | 14 km.. 16 turns in tadvai - medaram road way | Sakshi
Sakshi News home page

14 కిలోమీటర్లు.. 16 మలుపులు

Jan 3 2016 2:54 AM | Updated on Sep 3 2017 2:58 PM

మేడారం-తాడ్వాయి మార్గంలో ‘యూ’ ఆకారంలో ఉన్న మలుపు (ఇన్‌సెట్‌లో) ‘ఎల్’ ఆకారంలో ఉన్న మరో మూలమలుపు

మేడారం-తాడ్వాయి మార్గంలో ‘యూ’ ఆకారంలో ఉన్న మలుపు (ఇన్‌సెట్‌లో) ‘ఎల్’ ఆకారంలో ఉన్న మరో మూలమలుపు

వనదేవతలు కొలువుదీరిన అటవీ ప్రాంతంలోని తాడ్వాయి- మేడారం మధ్య ఉన్న మూలమలుపులు భక్తులను భయూందోళనకు గురిచేస్తున్నాయి.

ఎస్‌ఎస్ తాడ్వాయి : వనదేవతలు కొలువుదీరిన అటవీ ప్రాంతంలోని తాడ్వాయి- మేడారం మధ్య ఉన్న మూలమలుపులు భక్తులను భయూందోళనకు గురిచేస్తున్నాయి. కన్ను మూసి తెరిచే లోపలే ఉన్న మలుపులతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. కొలిచిన వారికి కొంగు బంగారం అందిస్తూ.. దీన జనులకు అండగా నిలుస్తున్న వనదేవతలు సమ్మక్క, సారలమ్మలు కొలువుదీరిన మేడారానికి.. జాతర సమయంలో భక్తుల సంఖ్య విపరీతంగా ఉంటుంది.

తెలంగాణ రాష్ర్టంతోపాటు ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు. మూడు రోజులపాటు జరిగే జాతరలో ఆనందంగా గడుపుతారు. అయితే జిల్లా కేంద్రం నుంచి మేడారానికి వెళ్లాలంటే తాడ్వాయి మీదుగానే ప్రయూణించాల్సి ఉంటుంది.
 
వంద మీటర్లకు ఒక మలుపు..
 వరంగల్, ఖమ్మం, తదితర ప్రాంతాల నుంచి వచ్చే భ క్తులు తాడ్వాయి మీదుగానే మేడారానికి చేరుకోవాల్సి ఉంటుం ది. అయితే తాడ్వాయి నుంచి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడారం రహదారిపై 16 మూల మలుపు లు ఉన్నాయి. రోడ్డులో ఒక్కో దగ్గర వంద మీట ర్ల దూరంలో రెండు, మూడు మలుపులు ఉండడంతో ద్విచక్ర వాహనదారులు, ఫోర్‌వీలర్ డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. జాతరలో రాత్రివేళల్లో ఎదురుగా వచ్చే వాహనాలు కని పించకపోవడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి.
 
సూచిక బోర్డులు ఏర్పాటు చేయూలి..
వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి వ చ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని తాడ్వారుు, మేడారం మార్గంలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయూల్సిన అవసరం ఉం ది. మూల మలుపుల వద్ద బోర్డులు లేకపోవడం తో రాత్రివేళల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని భక్తులు ఆందోళనకు గురవుతున్నా రు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైన తర్వాత తొలి సారిగా జరిగే జాతరను దృష్టిలో ఉంచుకుని అధికారులు మూలమలుపుల వద్ద సూచిక బోర్డులు ఏ ర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని భక్తులు కోరుతున్నారు.
 
చురుగ్గా చిలకలగుట్ట రోడ్డు మరమ్మతు పనులు
మేడారం (తాడ్వాయి) : జాతరను పురస్కరించుకుని చిలకలగుట్టలో చేపట్టిన సీసీ రోడ్డు మరమ్మతు పనులు చురుగ్గా సాగుతున్నాయి. జాతర సమయంలో చిలకల గుట్ట నుంచి సమ్మక్క తల్లిని సీసీ రోడ్డుపై నుంచి పూజారులు గద్దెపైకి తీసుకొస్తారు. అయితే గత జాతరలోనే ఇక్కడి గ్రావెల్ రోడ్డును సీసీగా మార్చారు.కాగా, రెండేళ్ల కాలంలో రోడ్డు శిథిలావస్థకు చేరింది. ఈ నేపథ్యంలో పాత సీసీ రోడ్డుపై 550 మీటర్ల మేరకు వెరింగ్ కోట్ నిర్మాణం చేపట్టేందుకు పంచాయతీ రాజ్‌శాఖ రూ. 37 లక్షల నిధులు మంజూరు చేసింది. కాగా, పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ఏఈఈ కృష్ణ, కాంట్రాక్టర్ తిరుపతిలు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

పాత సీసీ రోడ్డు కింది భాగంలో ఐరన్ రాడ్లు వేసి ఐదు ఇంచుల మందంతో సీసీ రోడ్డు వేస్తున్నామని ఏఈఈ కృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. 550 మీటర్లలో ఇంకా 200 మీటర్ల పని మాత్రమే ఉందన్నారు. మరో నాలుగు రోజుల్లో సీసీ రోడ్డు వెరింగ్ కోట్ పనులు పూర్తవుతాయని ఆయన పేర్కొన్నారు.
 
స్నానఘట్టాల పనుల పరిశీలన

ఎస్‌ఎస్ తాడ్వాయి : మహాజాతరను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం మేడారంలో జరుగుతున్న స్నానఘట్టాల నిర్మాణ పనులను టీఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షుడు ఎనగందుల బాపిరెడ్డి, జిల్లా సీనియర్ నాయకుడు కాక లింగయ్య శనివారం పరిశీలించా రు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ తెలంగా ణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా జరిగే జాతర నిర్వహణ కు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుందన్నారు.

ఆలయ ప్రాంగణాన్ని గాయత్రి గ్రానైట్స్ యూజమని రవిచంద్ర లక్షలాది రూపాయల గ్రానైట్‌తో తీర్చిదిద్దడం సంతోషకరమన్నారు. పనులను సకాలంలో పూర్తి చేసి జాతరను విజయవంతం చేయూలని వారు అధికారులను కోరారు. వారి వెంట టీఆర్‌ఎస్ జిల్లా యూత్ అధికార ప్రతినిధి పత్తి గోపాల్‌రెడ్డి, తదితరుల ఉన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement