భక్తులు భారీగా..

50 Thousand Devotees Visited Medaram Jatara On Sunday - Sakshi

ఎస్‌ఎస్‌ తాడ్వాయి: ములుగు జిల్లా మేడారం జాతర సమీపిస్తున్న కొద్దీ భక్తుల రద్దీ పెరుగుతోంది. ఆదివారం సెలవు రోజు కావడంతో సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను దాదాపు 50 వేలకు పైగా భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందిన భక్తులు తరలివచ్చి.. జంపన్నవాగు వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తులు వేలాదిగా తరలి రావడంతో ఉదయం 11 గంటల వరకే గద్దెలపైకి భక్తులను అనుమతించిన పోలీసులు ఆ తర్వాత గ్రిల్స్‌కు తాళాలు వేశారు. అనంతరం భక్తులు బయటి నుంచే అమ్మవార్లకు మొక్కుకున్నారు. ప్రైవేటు వాహనాల్లో భక్తులు తరలి రావడంతో అక్కడ క్కడ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కా గా.. మేడారం వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి జంపన్న వాగు వద్ద ఫిట్స్‌తో మృతి చెందాడు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top