సాక్షి, ములుగు: తెలంగాణలో మేడారం జాతరకు భక్తులకు శుభవార్త. రేపటి నుండి మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు అందుబాటులో రానున్నాయి. టూరిజం శాఖకు చెందిన జాయ్ సేవలను ములుగులో మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు.
వివరాల మేరకు.. తెలంగాణ టూరిజం శాఖ మేడారంలో భక్తులకు హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. తాడ్వాయి మండలం ఎలుబాక నుండి మేడారం ఏరియల్ వ్యూ వీక్షించేందుకు హెలికాప్టర్ నడపనున్న టూరిజం శాఖ తాజాగా తెలిపింది. టూరిజం శాఖకు చెందిన జాయ్ సేవలను మంత్రి సీతక్క రేపు ప్రారంభించనున్నారు. కాగా, ఒక్కరికి 5000 వేల రూపాయలు చార్జీతో ఏడు నిమిషాలు హెలికాప్టర్‌లో ఏరియల్ వ్యూ వీక్షించే అవకాశం కల్పించారు.


