ములుగు: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనిలెక్టర్ దివాకర అన్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ 18వ వార్డులో విద్యుత్ లైన్లు, ములుగులోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాన్ని, మిషన్ భగీరథ, ఇరిగేషన్ కార్యాలయాలను, లైసెన్స్‌డ్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమాలను శనివారం పరిశీలించి మాట్లాడారు. ములుగు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి తోపుకుంట వరకు ఉన్న విద్యుత్ లైన్ షిఫ్టింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాన్ని పరిశీలించి తాగునీటి శుద్ధి కేంద్రం, వంటగది, స్టోర్ రూమ్, కూరగాయలను పరిశీలించారు. అనంతరం ఇరిగేషన్, మిషన్ భగీరథ కార్యాలయాలను సందర్శించి పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయాలని ఆదేశించారు.
● కలెక్టర్ టీఎస్.దివాకర


