breaking news
Mulugu District Latest News
-
కొనసాగుతున్న డైవర్షన్ రోడ్డు పనులు
వాజేడు: మండల పరిధిలోని చీకుపల్లి, పెద్దగొళ్లగూడెం గ్రామాల మధ్యన ఇసుక వాగు వద్ద డైవర్షన్ రోడ్డు పనులు ఇంకా కొనసాగుతున్నాయి. 163 జాతీయ రహదారిపై ఇసుక వాగు వద్ద రహదారి విస్తరణ పనుల్లో భాగంగా బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. మంగళవారం రాత్రి వరకు తాత్కాలికంగా నడకదారిని ఏర్పాటు చేశారు. బుధవారం పెద్ద పెద్ద సిమెంట్ పైపులు తీసుకొచ్చి నీళ్లు పోయేలా ఏర్పాటు చేసి వాటి పైనుంచి రహదారి పనులు మొదలు పెట్టారు. భారీ వర్షాలకు సోమవారం ఎన్‌హెచ్ తెగిపోయిన విషయం తెలియక తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, నాగాలాండ్ తదితర రాష్ట్రాలకు చెందిన లారీలు వివిధ రకాల సరుకులతో ఛత్తీస్‌గఢ్ వైపునకు వెళ్లేందుకు భారీగా తరలివచ్చాయి. దీంతో రహదారి సౌకర్యం లేకపోవడంతో కోతకు గురైన రోడ్డుకు ఇరు వైపులా కిలో మీటర్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. శ్రీరాంనగర్ మీదుగా వాహనాల రాక మండల పరిధిలోని శ్రీరాంనగర్ గ్రామం మీదుగా రెండు వాగులను దాటుతూ వాహనాలు వస్తున్నాయి. కోయ వీరాపురం, శ్రీరాంనగర్ గ్రామాల మధ్యన ముష్టి, రాళ్ల వాగు ఉన్నాయి. ఈ రెండు వాగుల వద్ద ప్రస్తుతం లోతు తక్కువగా ఉండడంతో వాహనాలు వచ్చి వెళ్తున్నాయి. 163 ఎన్‌హెచ్‌పై కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు తాత్కాలికంగా నడకదారి ఏర్పాటు -
గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు
● కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు ములుగు రూరల్: గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. ఈ మేరకు బుధవారం బీబీనగర్ ఎయిమ్స్ డీన్ రీసెర్చ్ రాహుల్ నరాంగ్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనులకు ఆరోగ్య సేవలు, వైద్య పరిశోధనలు చేసే దిశగా జిల్లాలో అత్యాధునిక కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. సమ్మక్క–సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ సహకారంతో సెంటర్ ఫర్ ట్రైబల్ హెల్త్ అండ్ అకాడమిక్ ఎక్సలెన్స్ ఏర్పాటు ప్రతిపాదనలపై చర్చించినట్లు వివరించారు. తలసేమియా, రక్తహీనత, టెలిమెడిసిన్ సేవలు విస్తరించడం, సికిల్ సెల్ అనీమియా, మలేరియా, డెంగీ, క్షయ వంటి వ్యాధులపై ప్రత్యేకంగా మాట్లాడి తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు, ములుగు, ఏటూరునాగారం ఆస్పత్రి సూపరింటెండెంట్లు చంద్రశేఖర్, సురేశ్, ఎయిమ్స్ వైద్య బృందం సభ్యులు పాల్గొన్నారు. మార్గదర్శకాలను పాటించాలి ములుగు నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పూర్తి చేయాలని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాన్ 25 నుంచి బూత్‌స్థాయి అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తూ ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలను సేకరిస్తారని తెలిపారు. జిల్లాలో సుమారు 83.03 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైలేజేషన్ పూర్తి అయిందని వివరించారు. బూత్‌లెవల్ ఏజెంట్లు, బూత్ స్థాయి అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. డిజిటైలేజేషన్ ఫారాలను తప్పకుండా అప్లోడ్ చేయాలని బీఎల్ఓలకు సూచించారు. అనంతరం వచ్చే నెల 10 నుంచి ప్రారంభమయ్యే క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఓటర్ల పేర్ల చేర్పు, సవరణ, తొలగింపు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణవేణి, డీడబ్ల్యూఓ ప్రేమలత, తహసీల్దార్ విజయభాస్కర్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం
హన్మకొండ: ప్రజలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హనుమకొండ, వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో టీజీ ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో రూ.56కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్.నాగరాజుతో కలిసి ఆయన బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జరిగిన సమీక్ష సమావేశంలో ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి.. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సంస్థ అమలు చేస్తున్న కార్యక్రమాలు, ఆధునిక సాంకేతిక వినియోగం, భద్రతా చర్యలు, తదితర అంశాలను వివరించారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ రంగానికి ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికతను జోడించి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్నారు. ప్రజలు అధికారుల వద్దకు రావడం కాదు.. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లాలనే ఆలోచనతో ‘ప్రజాబాట – పొలంబాట’ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నేరుగా అధికారులు వినియోగదారుల ముంగిటికి వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారన్నారు. అహర్నిశలు శ్రమిస్తున్న విద్యుత్ జీవితాల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. ప్రమాదవశాత్తు ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ఆ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రూ.కోటి నుంచి రూ.1.20 కోట్ల వరకు బీమా సౌకర్యాన్ని కల్పించామన్నారు. అదేవిధంగా లైన్మన్లకు అవసరమైన సేఫ్టీ కిట్లు, యూనిఫాం, ఆధునిక పరికరాలను అందజేశామన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ వినతి మేరకు 132/33 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు చేస్తున్నామని, స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ సోలార్‌తోపాటు, విండ్ పవర్ ఉత్పత్తిపై దృష్టి సారించాలని సూచించారు. సాంకేతికత వినియోగం వల్ల ఉద్యోగులకు రిస్క్ తగ్గడంతోపాటు సమయం, డబ్బు ఆదా అవుతున్నాయని, వినియోగదారులు, రైతులకు తక్షణ సేవలు అందుతున్నాయని తెలిపారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు దేవాదాయశాఖ పరిధిలోని భూములు కేటాయించడానికి తమ శాఖ సిద్ధంగా ఉందన్నారు. దీనివల్ల ఆక్రమణలు అరికట్టడంతోపాటు దేవాలయాలకు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, సమీకృత కలెక్టరేట్ భవనాలపై సోలార్ పలకలు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నారు. కార్యక్రమం చివరలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, సత్యశారద, సీపీ శ్వేత, జిల్లా అటవీ శాఖాధికారి నిఖిత, ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు వి.మోహన్‌రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, అధికారులు పాల్గొన్నారు. ప్రజాబాట, పొలంబాట ద్వారా నేరుగా వినియోగదారుల ముంగిటికి ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క టీజీ ఎన్పీడీసీఎల్ చేపట్టిన రూ.56 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు పాల్గొన్న మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు -
ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
ములుగు రూరల్: యువత ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. ఈ మేరకు పోలీస్‌శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో యువతకు ఉచిత శిక్షణ అందించేందుకు దేహదారుఢ్య పరీక్షలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేహదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఉచిత వసతితో కూడిన శిక్షణ అందిస్తామని వివరించారు. నిరుద్యోగ యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బంగారు భవిష్యత్‌కు పునాది వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సదానందం, సీఐ సురేశ్‌కుమార్, ఆర్ఐలు స్వామి, తిరుపతి, వెంకటనారాయణ, శ్రీకాంత్, ఆర్ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. ఆశ్రమ పాఠశాల తనిఖీ మంగపేట: మండల పరిధిలోని చుంచుపల్లి గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను జిల్లా పంచాయతీ అధికారి, మండల స్పెషలాఫీసర్ కొండ వెంకయ్య బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు ఉదయం అందించే బ్రేక్ పాస్ట్‌తో పాటు హాస్టల్లోని స్టాక్ రిజిస్టర్, కూరగాయలను పరిశీలించారు. అలాగే విద్యాబోధన, వసతి, భోజన సౌకర్యాలు, పరిశుభ్రత, తాగునీటి సదుపాయాలపై ఆరా తీశారు. విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో ఆహార నాణ్యత, వంటశాల నిర్వహణ, హాజరు రికార్డులు, ఆరోగ్య పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. మెనూ పాటించడంతో పాటు వర్షాకాలంలో విద్యార్థినులు అనారోగ్యాల బారిన పడకుండా చూడాలని డీపీఓ హాస్టల్ వార్డెన్‌కు సూచించారు. విద్యార్థినులకు మౌలిక వసతులు కల్పించాలని హెచ్ఎం వెంకట్‌రెడ్డికి సూచించారు. డీపీఓ వెంట టీఎస్‌ఈజీసీ సభ్యుడు గుమ్మడి సోమయ్య ఉన్నారు. ఓటర్ల వివరాలు నమోదు చేయాలి ములుగు రూరల్: 2002 ఓటరు జాబితా నుంచి ఇప్పటి వరకు గుర్తింపు కాని ఓటర్ల వివరాలను క్షేత్ర స్థాయిలో సేకరించి వివరాలను తప్పకుండా నమోదు చేయాలని బీఎల్ఓలకు ఆర్డీఓ కృష్ణవేణి సూచించారు. ఈ మేరకు బుధవారం మల్లంపల్లి మండల కేంద్రంలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఎన్యూమరేషన్ ఫారాలను త్వరితగతిన పూర్తి చేసి యాప్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు. కరకట్ట నిర్మాణ పనుల పరిశీలన మంగపేట/ఏటూరునాగారం: మంగపేట మండల కేంద్రంలోని గోదావరి ఒడ్డు వెంట రూ.60 కోట్ల అంచనాతో చేపట్టిన 2.5 కిలో మీటర్ల కరకట్ట నిర్మాణం పనులను ఇరిగేషన్ జిల్లా చీఫ్ ఇంజనీర్ ధర్మ బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా కరకట్ట నిర్మాణం డ్రాయింగ్ మ్యాప్‌ను ఆయన పరిశీలించి ఇప్పటి వరకు ఎంతమేరకు పనులు జరిగాయనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచించారు. అలాగే ఏటూరునాగారం మండల పరిధిలోని రామన్నగూడెంలో గోదావరి కరకట్ట కోతకు గురికాకుండా నిర్మిస్తున్న జియో ట్యూబ్స్ పనులను పరిశీలించారు. పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కరకట్ట మట్టి ఒర్లిపోకుండా వేసిన ఇసుక బస్తాలను తనిఖీ చేశారు. వరద పెరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు. ఆయన వెంట ఇరిగేషన్ ఎస్ఈ మోహన్‌రావు, ఏటూరునాగారం ఈఈ శంకరయ్య, డీఈఈ వేణుగోపాల్, ప్రవీణ్, ఏఈఈ రోహిత్, కిశోర్, కార్తీక్ పాల్గొన్నారు. -
ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలి
ఏటూరునాగారం/కన్నాయిగూడెం: గిరిజన రైతులు ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలని, ఒకే రకమైన పంటలను పండించడం వల్ల నేల చౌడుబారుతుందని ఎన్హెచ్ఆర్సీ న్యూఢిల్లీ ట్రైబల్ వెల్ఫేర్ స్పెషల్ మానిటరింగ్ అధికారి హేమంత్ కుమార్ అన్నారు. జిల్లాలోని ఏటూరునాగారం మండల పరిధిలోని ముళ్లకట్టలోని ఇందిరమ్మ ఇళ్లు, శివాపురంలోని సబ్బుల పరిశ్రమ, కన్నాయిగూడెం మండలంలోని కంతనపల్లిలో గల పీఎం గిరివికాసం బోరు బావులను బుధవారం ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి హేమంత్‌కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా కంతనపల్లిలోని రైతులతో ఆయన మాట్లాడుతూ ఒకేరకమైన పంటలను పండించకుండా వరి, మిర్చి, ఇతర దేశవాలి పంటలను పండించాలని సూచనలు చేశారు. మార్కెట్లో ఏ రకమైన పంటకు డిమాండ్ ఉందని తెలుసుకొని దానిని పండించాలన్నారు. కంతనపల్లిలో 18 బోరు బావులను రెవెన్యూ, అటవీ భూముల్లో సాగు చేసుకున్న రైతులకు అందజేసినట్లు పీఓ వెల్లడించారు. కంతనపల్లి అడవిలో ఉన్న కంటైనర్ గిరిజన పాఠశాలను సందర్శించి పిల్లలకు పాఠాలను బోధించారు. విద్యార్థులు చక్కగా చదువుకోవాలని సూచించారు. అక్కడి నుంచి ముళ్లకట్టకు చేరుకొని ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. మండలంలో ఎన్ని మంజూరు చేశారని ఎంపీడీఓ శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శివాపురంలోని సమ్మక్క సారలమ్మ సబ్బుల పరిశ్రమను పరిశీలించి తయారు చేస్తున్న మహిళలతో మాట్లాడారు. సబ్బుల తయారీలో ఉపయోగించే కెమికల్స్‌ను తక్కువ మోతాదులో మిక్సింగ్ చేయాలన్నారు. చేతులు మంటలు రాకుండా జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. కలిసికట్టుగా పనిచేస్తూ యూనిట్‌ను మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని వివరించారు. ఆయన వెంట ఐటీడీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంట ప్రతాప్, అటవీశాఖ ఎఫ్డీఓ రమేశ్, డీడీ దబ్బగట్ల జనార్దన్, ఎంపీడీఓ శ్రీనివాస్, డీటీ అనిల్, జేడీఎం కొండల్రావు, సర్పంచ్‌లు, కార్యదర్శులు పాల్గొన్నారు. న్యూఢిల్లీ ట్రైబల్ వెల్ఫేర్ స్పెషల్ మానిటరింగ్ అధికారి హేమంత్‌కుమార్ -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
● డీఎంహెచ్ఓ గోపాల్‌రావు ములుగు రూరల్: సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నియంత్రణకు ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. మలేరియా, డెంగీ, అతిసార, టైఫాయిడ్ వ్యాధుల పట్ల జిల్లా టీంలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పీహెచ్‌సీల పరిధిలో టీంలను ఏర్పాటు చేసి గ్రామాలలో మలేరియా, డెంగీ వ్యాధుల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. జ్వర పీడితుల నుంచి రక్తపూతలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టాలని సూచించారు. ఇంటి ఆవరణలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. పంచాయతీ అధికారులు ఫాగింగ్ చేపట్టాలని సూచించారు. దోమల ద్వారా వ్యాధులు వ్యాప్తి చెందుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కీటక జనిత నియంత్రణ అధికారి రవితేజ, ఏఎంఓ దుర్గారావు, మాస్ మీడియా అధికారి సంపత్ పాల్గొన్నారు. -
ఎమ్మెల్యేలు ఏమన్నారంటే..
● వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్‌లో మిషన్ భగీరథ పైప్లైన్ల లీకేజీలతో తాగునీటి సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు. తక్షణం సరిచేయాలని కోరారు. ● స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు తాగునీరు, సాగునీటికి దేవాదుల ప్రాజెక్టే ప్రధాన ఆధారమని అన్నారు. మూడు దశల్లోని 10 మోటార్లను కనీసం 100 రోజులపాటు నిరంతరాయంగా నడిపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాంకేతిక లోపాలు తలెత్తితే 48 గంటల్లోపు మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు. ● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు మాట్లాడుతూ హసన్‌పర్తి మండలంతోపాటు విలీన గ్రామాల్లో తాగునీటి సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు. వర్ధన్నపేటలో అమృత్ పథకం పనులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ● భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ తక్కువ నీటితో అధిక ఆదాయం వచ్చే వాణిజ్య పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. దేవాదుల ప్రాజెక్టు, భీమ్‌ఘనపూర్, చలివాగు తదితర నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. ● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ ఎరువుల సరఫరాపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ● మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్ మాట్లాడుతూ మహబూబాబాద్ పట్టణంలో తాగునీటి పంపిణీలో ఇబ్బందులు ఉన్నాయని, ముఖ్యంగా మెడికల్ కాలేజీకి ప్రత్యామ్నాయ వనరుల ద్వారా నీరు అందించాలని కోరారు. డ్రిప్ ఇరిగేషన్‌పై రైతులకు అవగాహన కల్పించి కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. సమీక్షలో పాల్గొన్న ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య, ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి, నాగరాజు, మురళీనాయక్ -
త్వరగా ప్రాజెక్టు పూర్తికి చర్యలు.. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి ఉమ్మడి జిల్లాలో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు అంతా సిద్ధం
హన్మకొండ అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎల్‌నినోతో నెలకొన్న కరువు పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటలు, రైతుల ప్రయోజనాలు, సాగు, తాగునీటి లభ్యత, పశుసంపద రక్షణ తదితర అంశాలపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, కలెకర్లు, అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. జిల్లాల వారీగా ప్రస్తుత పంటల పరిస్థితులపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఎమ్మెల్యేలు స్థానిక పరిస్థితులను వివరించారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారిగా ఐఏఎస్ అధికారి శ్రీదేవసేనను నియమించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఎల్‌నినో ప్రభావం, వర్షాభావం, వివిధ శాఖల సంసిద్ధతపై సుదీర్ఘ సమీక్ష హాజరైన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు దేవాదుల పూర్తికి ప్రభుత్వం చర్యలు : మంత్రి పొంగులేటి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సాగు, తాగునీటికి ప్రధాన ఆధారమైన దేవాదుల ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పంపింగ్ వ్యవస్థలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. తాగు, సాగునీరు, పశువులకు మేత, ఉపాధి హామీ పనులు, రైతులకు అవసరమైన విత్తనాల సరఫరాపై సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. లెమన్ గ్రాస్ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై వచ్చిన సూచనలు పరిశీలిస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలిస్తే ప్రభుత్వం స్వాగతిస్తుందని, అవసరమైతే దేవాదులపై ప్రత్యేకంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రైతులకు శాసీ్త్రయ అవగాహన కల్పించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులపై శాస్త్రవేత్తల అంచనాలను గ్రామస్థాయికి తీసుకెళ్లి రైతులకు అవగాహన కల్పించడం అత్యంత అవసరమన్నారు. ఈ సీజన్లో తీసుకునే నిర్ణయాలు వచ్చే ఏడాది జూన్ వరకు ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. కలెక్టర్ల నేతృత్వంలో ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో రైతులకు శాసీ్త్రయ ఆధారాలతో అవగాహన కల్పించాలని, కరపత్రాలు, ఇతర ప్రచార సాధనాల ద్వారా ప్రత్యామ్నాయ పంటలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. -
ఉగ్ర, శివదూతీ క్రమాల్లో భద్రకాళి అమ్మవారు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు మంగళవారం అమ్మవారిని ఉగ్ర, శివదూతీ క్రమాల్లో అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం స్నపనమూర్తిని కాళీక్రమంలో ఉగ్రమాతగా, బోగభేరాన్ని షోడశీక్రమంలో శివదూతీమాతగా అలంకరించి పూజలు నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. వరంగల్ పోలీస్ కమీషనర్ శ్వేతరెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రాంచంద్రు నాయక్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ రాముల సునీత, సిబ్బంది పర్యవేక్షించారు. కేయూ క్యాంపస్: టీఎన్ఎస్ ముంబై ఇండియా ఫౌండేషన్‌తో హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాల ఎంఓయూ మంగళవారం కుదుర్చుకుంది. ఈ ఎంఓయూతో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులకు ఆ ఫౌండేషన్ ఉచితంగా 200 గంటల ఉచిత శిక్షణ ఇవ్వనుందని ఆకళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి తెలిపారు. సరైన కేరీర్ ఆప్షన్, కమ్యూనికేషన్ ప్రొఫెషనల్ స్కిల్స్‌తో పాటు అప్లై ఎ జాబ్, టూల్స్, కవరింగ్ లెటర్, మాక్ ఇంటర్వూలపై, అనేక నైపుణ్యాలు పెంచేందుకు ఆ ఫౌండేషన్ సహకారం అందించనుందని తెలిపారు. కార్యక్రమంలో ఆకళాశాల ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఆఫీసర్ డాక్టర్ ఎల్.జితేందర్, ఏఆర్ శ్రీలత, కామర్స్ విభాగం అధ్యాపకుడు డాక్టర్ స్వామి, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ గిరిప్రసాద్, టీఎన్ఎస్ ముంబై ప్రతినిధులు ఆ మేనేజర్ కమ్ ట్రైనర్స్ సౌరవ్ పాండే, దేవిక, ఎస్.దీపు తదితరులు పాల్గొన్నారు. అడ్వెంచర్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం వరంగల్ స్పోర్ట్స్: సాహస రంగంలో విజయాలను గుర్తించడానికి యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ అందించే ‘టెన్సింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు’ ఎంపికలకు ఆగస్టు 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి కొత్త ప్రశాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. భూమి, సముద్రం, గాల్లో సాహస కార్యకలాపాలకు ఒక్కొక్కరికి ఒక అవార్డును ప్రదానం చేయనున్నారు. అదనంగా, సాహస రంగంలో ‘జీవిత సాఫల్యత’ కోసం ఒక అవార్డును అందించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు మూడేళ్ల నుంచి చేసిన సాహస కృత్యాల గురించి వివరిస్తూ 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు జత చేసి ఆగస్టు 20వ తేదీలోగా వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాళేశ్వరంలో అష్టతీర్థాలకు శ్రీకారం కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని పూర్వపు అష్టతీర్థాలకు రూ.60కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసి శ్రీకారం చుట్టింది. ఇటీవల ఆర్కిటెక్చర్ బృందం కాళేశ్వరంలో పర్యటించి అష్టతీర్థాలపై సర్వే చేపట్టింది. అష్ట తీర్థాలను అభివృద్ధి చేసి ఘాట్ల నిర్మాణం చేపట్టడానికి ప్రణాళికలు రూపొందించారు. వీఐపీ ఘాట్‌లోని సంగమ తీర్థం ఇప్పటికే అభివృద్ధి చేశారు. వచ్చే ఏడాది జూన్ 26నుంచి జూలై 7 వరకు జరుగు గోదావరి నది పుష్కరాల వరకు నిర్మాణాలు చేపట్టడానికి సన్నద్ధమయ్యారని తెలిసింది. ప్రస్తుతమున్న సరస్వతీఘాటు ఎగువన ఉన్న పక్షి తీర్థం నుంచి హనుమత్ తీర్థం అంతర్రాష్ట్ర వంతెన వరకు 3.5 కిలోమీటర్ల మేర ఘాట్ల తీర్థాఽలను కలుపుతూ బండ్ నిర్మాణాలు చేపట్టడానికి డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఆయా బండ్ల వద్ద ఆయా తీర్థాలకు సంబంధించిన ప్రత్యేకమైన విగ్రహాలను ఏర్పాటు చేస్తారని దేవాదాయశాఖ, ఆర్కిటెక్చర్ల బృందం పేర్కొంది. -
వైద్యం అందాలంటే..మోయాల్సిందే..
మంగపేట: ఏజెన్సీలోని అటవీ ప్రాంతాల్లో నివసించే గొత్తికోయలు ఎవరైనా అనారోగ్యంతో గురైతే మంచంలో మోసుకెళ్లాల్సిన వచ్చింది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని బాలన్నగూడెం పంచాయతీ పరిధిలోని ప్రాజెక్టునగర్ గొత్తికోయగూడెం అటవీ ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్ నుంచి వలసవచ్చిన సుమారు 20కి పైగా గొత్తికోయ కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గూడెంకు చెందిన మడకం శ్రీనుకు గతంలో కాలుకు గాయమైంది. సరైన వైద్యం అందక కాలుకు ఇన్ఫెక్షన్ కావడంతో కొద్ది రోజుల నుంచి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇచ్చారు. గూడెం వద్దకు అంబులెన్స్ రావడానికి రోడ్డు సౌకర్యం సరిగా లేదు. దీంతో బాధితుడిని మంచంలో పడుకోబెట్టి అతని కుటుంబ సభ్యులు, 108 సిబ్బంది ఈఎంటీ రాము, పైలట్ మధుకుమార్ సుమారు అరకిలో మీటర్ దూరం వరకు మోసుకొచ్చారు. అనంతరం అంబులెన్స్‌లో ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. -
భారీ వర్షం.. తెగిపోయిన రోడ్లు
ఏటూరునాగారం/ వాజేడు: జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. పలు గ్రామాల్లోని చెరువులు, వాగుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. మరోపక్క రైతుల్లో ఆనందం నెలకొంది. పంటలకు ప్రాణం వచ్చినట్లు అయిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా వాజేడులో వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా కన్నాయిగూడెంలో నమోదైంది. వాజేడులో తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ 163 జాతీయ రహదారి కొట్టుకుపోయి రవాణా స్తంభించింది. అలాగే 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే ఏటూరునాగారం మండలంలోని కొండాయి వద్ద తాత్కాలికంగా వేసిన డైవర్షన్ రోడ్డు తెగిపోయి ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. కొండాయి బ్రిడ్జి వద్ద అధికారులు ప్రతీ ఏడాది వర్షాకాలంలో గ్రామస్తులు వాగు దాటేలా తాత్కాలికంగా పడవలను ఏర్పాటు చేసేవారు. ఈ ఏడాది ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎలిశెట్టిపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలోఉన్న జంపన్నవాగు ఉప్పొంగడంతో ఎలిశెట్టిపల్లి, కొత్తూరు గ్రామాలకు రాకపోకలను స్తంభించాయి. దీంతో అధికారులు వాగు దాటేందుకు పడవను ఏర్పాటు చేశారు. జోరందుకున్న నాట్లు రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో వరినాట్లు జోరుగా సాగుతున్నాయి. వర్షం పడుతున్నా మరో పక్క నాట్లు వేసే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షం కురుస్తుందా లేదా అని నెల రోజుల పాటు వేచి చూసిన రైతుల కళ్లలో ఆనందం నెలకొంది. ప్రభుత్వం సన్నరకం పంటలను సాగు చేస్తేనే బోనస్ ఇస్తామనే నిబంధనలు పెట్టడంతో రైతులు సన్నరకానికి మొగ్గు చూపారు. అలాగే పత్తి పంటకు వర్షం జీవం పోసిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పలువురు కలుపు తీస్తుండగా మరికొందరు కలుపును ఎడ్లతో దున్నుతున్నారు. అలాగే పోడు భూములను రైతులు నాగళ్లతో దున్నడంతో పాటు ఇతర వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే పలువురు గిరిజన రైతులు పోడు భూముల పక్కనే ఊట కుంటలను తవ్వి నీటి నిల్వలను ఏర్పాటు చేసుకుంటున్నారు. చత్తీస్‌గఢ్‌కు రాకపోకలు బంద్ వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి, పెద్ద గొళ్లగూడెం గ్రామాల మధ్యన ఇసుక వాగు బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డు భారీ వర్షానికి కొట్టుకుపోయింది. ఉదయం 9 గంటల వరకు బాగానే ఉన్నా ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా రావడంతో రహదారి కొంచెం కొంచెంగా కోతకు గురవుతూ పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌తో పాటు రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకుని అప్రమత్తమైన ఏటూరునాగారం ఏఎస్పీ మనన్‌భట్, వాజేడు తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కృపాకర్, ఎస్సై జక్కుల సతీష్, ఎంపీఓ చందూలాల్ అక్కడికి వెళ్లి పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. అలాగే వాజేడు వద్ద జాతీయ రహదారి తెగిపోవడంతో అయ్యవారిపేట గ్రామానికి చెందిన కావిరి వసంత్(అనూష) 5వ కాన్పు కోసం పేరూరు వైద్యశాలకు వెళ్లింది. తిరిగి వచ్చేందుకు ట్రాక్టర్ ద్వారా ఆమెను కోయవీరాపురం గ్రామం వరకు వచ్చేలా ఏర్పాటు చేసి అక్కడి నుంచి 108 అంబులెన్స్‌లో ఏటూరునాగారం ప్రభుత్వ వైద్యశాలకు పంపించారు. అలాగే గర్భిణులను 102 వాహనంలో సిబ్బంది పరీక్షల నిమిత్తం ఏటూరునాగారం వైద్యశాలకు తీసుకెళ్లే వారిని రోడ్డు సౌకర్యం లేకపోవడంతో పేరూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. వాజేడు తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌కు నిలిచిపోయిన రాకపోకలు పూర్తిగా తెగిన కొండాయి డైవర్షన్ రోడ్డు వాజేడులో అత్యధికంగా 112.6 మిల్లీమీటర్ల వర్షంజిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు (మిల్లీమీటర్లలో)మంగపేటతాడ్వాయిగోవిందరావుపేటములుగుమల్లంపల్లిఏటూరునాగారంవెంకటాపురం(ఎం)వెంకటాపురం(కె)కన్నాయిగూడెం -
కాజ్‌వేల వద్ద బారికేడ్ల ఏర్పాటు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో నార్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూడు కాజ్‌వేల వద్ద పోలీసులు మంగళవారం బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రి సీతక్క, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదేశాల మేరకు నార్లాపూర్ ఎస్సై అచ్చ కమలాకర్ ఆధ్వర్యంలో జంపన్నవాగు ఊరట్టం, కొత్తూరు కాజ్వే, ఎల్బాక లోలెవల్ బ్రిడ్జిని పరిశీలించారు. వరద ప్రవాహం అధిక స్థాయిలో ఉండడంతో ప్రజలు ప్రమాదాలకు గురికాకుండా కాజ్‌వేల వద్ద భారికేడ్లు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సెకండ్ ఎస్సై నరేశ్, సిబ్బంది పాల్గొన్నారు. -
బెటాలియన్‌లో వసతులు భేష్
● ఏడీజీపీ సంజయ్‌కుమార్ జైన్గోవిందరావుపేట: బెటాలియన్‌లో ఆధునిక మౌలిక వసతులను ప్రభుత్వం కల్పించిందని తెలంగాణ పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఏడీజీపీ) సంజయ్‌కుమార్ జైన్ తెలిపారు. మండల పరిధిలోని చల్వాయిలో గల 5వ బెటాలియన్(టీజీఎస్పీ) ఆవరణలో నూతనంగా నిర్మించిన గార్డ్ రూమ్, గ్యాలరీ షెడ్లు, రిక్రియేషన్ హాళ్లను మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. పోలీస్ సిబ్బంది అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టిన పలు నిర్మాణాలు భేష్‌గా ఉన్నాయని తెలిపారు. బెటాలియన్ సిబ్బంది విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. అనంతరం నూతన నిర్మాణాలను పరిశీలించిన ఆయన నిర్మాణాల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేస్తూ బెటాలియన్ అభివృద్ధికి అధికారులు చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం సిబ్బందితో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఏఎస్పీ మానన్ భట్, 5వ బెటాలియన్ కమాండెంట్ సుబ్రహ్మణ్యం, అదనపు కమాండెంట్ సీతారాం, సహాయ కమాండెంట్ కృష్ణప్రసాద్, ఆర్ఐలు భాస్కర్, వెంకటేశ్వర్లు, సాయిబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కార్మికులకిచ్చిన హామీలు నెరవేర్చాలి
ములుగు రూరల్: మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జాతీయ రహదారిపై వంట కార్మికులతో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ హరే రామ హరే కృష్ణ స్వచ్ఛంద సంస్థకు అల్పాహార పథకం అప్పగించడం కార్మికులను రోడ్డున పడేయడమేనని తెలిపారు. కోడిగుడ్ల ధరలు మార్కెట్లో అధికంగా పెరగడంతో ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు సరిపోవడం లేదన్నారు. తక్షణమే కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. ఎన్నికల సమయంలో వంట కార్మికులకు రూ.10 వేల వేతనం చెల్లిస్తామని హామీనిచ్చి అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అక్షయ పాత్ర సంస్థ అందిస్తున్న అల్పాహారం సరిగా ఉండడం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపణలు చేసినా సీఎం, మంత్రులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి నర్సయ్య, ముత్యాల రాజు, ఇంజం కొమురయ్య, శ్యాంసుందర్, గడ్డం భారతి, రాజకుమారి, సమ్మక్క, పద్మ, శోభ, అమృత, భవాని, కమలక్క, లక్ష్మి, నాగమణి తదితరులు పాల్గొన్నారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ -
వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు
● డీఎంహెచ్ఓ గోపాల్‌రావు ములుగు: ప్రజలకు వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం చేస్తే సీహెచ్‌ఓలు, హెచ్‌ఏలు, ఏఎన్ఎంలపై చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ గోపాల్‌రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17న సాక్షిలో వైద్యులు రారు, సిబ్బంది ఉండరు శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించి సమగ్ర విచారణ జరిపిస్తున్నట్లు వెల్లడించారు. పీహెచ్‌సీల సేవలు, వైద్య సిబ్బంది హాజరును పర్యవేక్షించేందుకు డిప్యూటీ డీఎంహెచ్ఓలు, ప్రోగ్రాం ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. మెడికల్ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది స్థానికంగానే ఉండాలని, లేదంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధులకు హాజరయ్యే వైద్యాధికారులు, సిబ్బంది తమ హాజరును జిల్లా వాట్సాప్ గ్రూపులో నమోదు చేయాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేసిన, సమయపాలన పాటించకున్నా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లా బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. -
ఎంజీఎం సూపరింటెండెంట్ రాంకుమార్‌కు సవాలే..
కాశిబుగ్గ: వరంగల్ మహాత్మాగాంధీ స్మారక వైద్యశాల (ఎంజీఎం) కు అధికారికంగా బాధ్యతలు చేపట్టిన సూపరింటెండెంట్ (ఎఫ్ఏసీ) డాక్టర్ రాంకుమార్‌రెడ్డికి పలు సమస్యలు సవాళ్లుగా మారనున్నాయి. దాదాపు రెండు నెలల పాటు ఇన్చార్జ్ సూపరింటెండెంట్ లేకుండానే ఆస్పత్రిని నెట్టుకొచ్చారు. చివరకు అదే ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్‌తో పాటు ఆర్థోపెడిక్ హెచ్ఓడీగా పనిచేసిన రాంకుమార్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. డీఎంఈ నుంచి అధికారికంగా ఆర్డర్ వస్తే రెగ్యులర్ విధులు నిర్వహించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆయన ఎఫ్ఏసీ హోదాలో చెక్ పవర్ రావడంతో ఆస్పత్రిలోని ఆర్థిక సమస్యలు తీరనున్నాయి. పెండింగ్ బిల్లులపై దృష్టి పెట్టాలి... ఆస్ప్రతిలో చాలాకాలం నుంచి పెండింగ్ బిల్లులు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డ్రగ్స్, స్టేషనరీ, తదితర పెండింగ్ బిల్లులు మూలుగుతున్నట్లు సమాచారం. డ్రగ్స్‌కు సంబంధించిన కొందరు కాంట్రాక్టర్లు రెగ్యులర్‌గా దవాఖానా చుట్టూ తిరుగుతున్నారు. అలాగే స్టేషనరీ సంబంధించి రూ.కోటి బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. బిల్లులు చెల్లించకపోవడంతో ల్యాబ్, ఎక్స్‌రే పరీక్షలకు సంబంధించిన రిక్విజేషన్ ఫారాలు సరఫరా లేక తెల్ల కాగితాలపైనే వైద్యులు రాయాల్సి వచ్చింది. భవనం ప్రారంభోత్సవంపై కసరత్తు... నగరంలో 24 అంతస్తుల నూతన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. దసరా నాటికి లేదా డిసెంబర్లో ప్రారంభమవుతుందనే ప్రచారం జరుగుతున్నందున అందులో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఎంజీఎంతో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటిపై ప్రత్యేక దృష్టి సారించాలి. డిప్యూటీ సూపరింటెండెంట్‌ను నియమించాలి కేఎంసీలోని సూపర్ స్పెషాలిటీ హాస్పటల్లో డిప్యూటీ సూపరింటెండెంట్ బదిలీ అయిన నెల రోజుల దాటిన ఎవరిని నియమించలేదు. కేవలం అక్కడ ఉన్న ఏకై క ఆర్ఎంవో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇన్చార్జి సూపరింటెండెంట్‌గా ఉన్న డాక్టర్ రాంకుమార్‌రెడ్డి సూపరింటెండెంట్ హోదాల్లో సూపర్‌కు డిప్యూటీ సూపరింటెండెంట్‌ను నియమించే అధికారం ఉంది. అదేవిధంగా ఆస్పత్రిలో రెండు నెలలనుంచి సీటీ స్కాన్ యంత్రం పనిచేయకపోవడంతో పరీక్షలు ఆగిపోయాయి. వారంరోజులనుంచి రోగుల లిఫ్ట్ పనిచేయడం లేదు. మరికొన్ని సమస్యలు ఇలా..ఎంజీఎంలో పనిచేస్తున్న వందలాది మంది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందికి మూడు నెలల నుంచి వేతనాలు రావడం లేదు. చాలాకాలం నుంచి ఉన్న సెంట్రల్ ల్యాబ్‌ను పూర్తిగా మూసేశారు. ఇక ఆయా వార్డుల్లో చికిత్స పొందుతున్న ఇన్ పేషంట్ల బ్లడ్ పరీక్షల కోసం గతంలో శ్యాంపిల్ టేకర్స్ ఉండేవారు. ప్రస్తుతం వారినే ఎందుకో తీసేశారు. వార్డుల్లోని పేషంట్లు వివిధ పరీక్షల కోసం ల్యాబ్‌ల వద్దకు రాకుండా చూడాలి. ఆస్పత్రిలో ఉన్న పలు ఎక్స్‌రే మిషన్లు తరచూ రిపేర్‌కు గురవుతున్నాయి. డిజిటల్ ఎక్స్‌రే మిషన్ సైతం పనిచేసిన సందర్భాల్లో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా క్యాజువాలిటీలో ఉన్న ఎక్స్‌రే మిషన్ వద్ద ఇబ్బందులు లేకుండా చూడాలి. ల్యాబ్‌ల్లో అన్ని రకాల పరీక్షలు జరిగే ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇన్పేషంట్లకు డైట్‌ను సరఫరా జరిగే విధంగా ఏర్పాట్లు చేయాలి. డైటీషియన్ బదిలీ తర్వాత ఎవరినీ నియమించకపోవడంతో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంది. వైద్యులు లేకపోవడంతో డెంటల్ పరికరాలు నిరుపయోగంగా ఉన్నాయి. ఆస్పత్రిలో పేరుకుపోయిన పెండింగ్ బిల్లులు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందికి అందని వేతనాలు రోగుల సత్వర వైద్య పరీక్షలకు ల్యాబ్‌ల ఏర్పాట్లు ప్రారంభానికి సిద్ధమవుతున్న 24 అంతస్తుల వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి రేడియాలజీలో ఎక్స్‌రే మిషన్ల మరమ్మతు, సదుపాయాలు కాశిబుగ్గ: ఎట్టకేలకు వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్‌గా డాక్టర్ కాటం రాంకుమార్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఎంజీఎం ఇన్చార్జి సూపరింటెండెంట్‌గా (ఎఫ్ఎసీ) నియమిస్తూ రెండు రోజుల క్రితం కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, సూపరింటెండెంట్‌గా బాధ్యతలు తీసుకున్న డాక్టర్ రాంకుమార్‌రెడ్డికి ఆర్‌ఎంఓలు డాక్టర్ రఘురామయ్య, డాక్టర్ మధుకర్ యాదవ్, డాక్టర్ అశ్విని, ఏడీ బాలాజీ, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. -
వినతులు 101
గిరిజన దర్బార్‌లో వినతులు ఇలా.. తొర్రూరు దుబ్బతండా గ్రామం నుంచి కారుణ్య నియామకం కింద తండ్రి పోస్టును ఇవ్వాలని కూతురు విన్నవించింది. ఏటూరునాగారం మండలం బూటారం గ్రామం నుంచి కుటుంబ సర్వేలో మైగ్రేట్ అని పడిందని దానిని తొలగించాలని కోరారు. వాజేడు మండలం కొంగాల గ్రామానికి చెందిన ఓ మహిళ ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని పీఓ వేడుకుంది. ఖానాపురం మండలంలోని మంగళవారిపేటకు చెందిన ఓ వ్యక్తి 2008లో డీఎస్సీలో సెలక్ట్ అయ్యాయని దానికి సంబంధించిన రికార్డు ఇప్పించాలని అర్జీ అందజేశారు. గూడూరు మండలం మర్రిమిట్ట నుంచి గాంధీనగర్ కొత్తగూడలో స్వీపర్, అటెండర్, వాచ్ మెన్ పోస్టులు ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రతాప్, డీడీ జనార్దన్, డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్, జీసీసీ డీఎం నాని పాల్గొన్నారు.ములుగు రూరల్/ఏటూరునాగారం: జిల్లాలో ప్రజావాణి, గిరిజన దర్బార్‌లో వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బాధితులు 101 అర్జీలను ఉన్నతాధికారులకు సమర్పించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో బాధితులు 82 అర్జీలను అందజేయగా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) సంపత్‌రావు డీఆర్ఓ రవికుమార్, ట్రైనీ కలెక్టర్ కుషీల్, ఆర్డీఓ కృష్ణవేణితో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అదే విధంగా ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో పీఓ లెనిన్ వత్సల్ టొప్పో 19 అర్జీలు రాగా వాటిని స్వీకరించారు. అధికారులు వాటిని త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు భూ సమస్యలు 22ఇతర శాఖలు 25ఇందిరమ్మ ఇళ్లు 18పింఛన్లు 17మూడు నెలలుగా పింఛన్ రావడం లేదు మూడు నెలల నుంచి పింఛన్ రావడం లేదు. వేలి ముద్రలు, ఐరిష్ రాకపోవడంతో పింఛన్ నిలిపి వేశారు. దీంతో పోషణ భారంగా మారింది. ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే పింఛన్ ఇప్పించాలి. –శాననేని స్వరూప, ఇంచర్లఉపాధి కల్పించాలి.. కుటుంబ పెద్దను కోల్పోయి ఇద్దరు పిల్లలను పెంచడం భారంగా ఉంది. గత ఏడాది భర్త జ్వరంతో మృతి చెందాడు. వాజేడు ఐటీఐ కళాశాలలో స్వీపర్ పోస్టు ఇప్పించి ఉపాధి కల్పించాలి. – హరిత, వాజేడు● ప్రజావాణిలో 82, గిరిజన దర్బార్‌లో 19 అర్జీల రాక స్వీకరించిన అదనపు కలెక్టర్ సంపత్‌రావు, పీఓ లెనిన్ వత్సల్ టొప్పో పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు -
పనులు త్వరగా పూర్తిచేయాలి..
దొడ్ల– కొండాయి జంపన్నవాగుపై చేపట్టిన హైలెవల్ బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలి. వర్షాకాలంలో గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జి లేకపోవడంతో కొండాయి, కొత్తూరు, మల్యాల, ఐలాపూర్, గోవిందరాజుల కాలనీ ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. బ్రిడ్జి లేక విద్యార్థులు సైతం చదువుకు దూరం అవుతున్నారు. – పి. దేవేందర్, దొడ్ల, ఏటూరునాగారం ఎలిశెట్టిపల్లి వద్ద బ్రిడ్జి నిర్మించాలి..గతేడాది భూమి నమూనాలను తీసుకెళ్లారు. ఇంత వరకు పనులు చేపట్టలేదు. బ్రిడ్జి లేక కాలినడకన ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాగు దాటాల్సి వస్తుంది. ఇప్పుడు పడవను ఏర్పాటు చేశారు. విద్యార్థులు చుదువుకునేందుకు మండల కేంద్రంలో నివాసం ఉండాల్సిన పరిస్థితి ఉంది. బ్రిడ్జి పనులు చేపట్టి గిరిజనులను ఆదుకోవాలి. – డి.రమేశ్, ఎలిశెట్టిపల్లి, ఏటూరునాగారం -
అర్హులందరికీ ఓటుహక్కు కల్పించాలి
ములుగు: అర్హులైన రైస్ మిల్లర్లందరికీ త్వరలో జరగనున్న రాష్ట్ర కమిటీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని అసోసియేషన్ కార్యాలయంలో ఆరు జిల్లాలకు చెందిన అసోసియేషన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకుల సమావేశంలో ప్రవీన్ మాట్లాడారు. 2013 నుంచి అసోసియేషన్ ఎన్నికలు జరగకపోవడంతో అప్పటి నుంచి ఒకే కార్యవర్గం అధికారంలో ఉందని తెలిపారు. గ్రామీణ స్థాయిలో ఉన్న మిల్లర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో ఆ కమిటీ పూర్తిగా విఫలమైందన్నారు. మిల్లర్ల సంక్షేమానికి సదరు రాష్ట్ర అసోసియేషన్ కృషి చేయకపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా రైస్ మిల్లర్లు అసోసియేషన్ నుంచి బయటకు వచ్చారని పేర్కొన్నారు. పాత బైలా ప్రకారంగా 25 వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్‌కు ఒక ఓటు చొప్పున నిర్ణయించారని తెలిపారు. ఇది రైస్ మిల్లర్ల సంక్షేమానికి పూర్తి విరుద్ధమని వెల్లడించారు. మిల్లు నడుపుతున్న ప్రతీ యజమానికి ఓటుహక్కు కల్పించాలని కోరారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్లను సమీకరించి ఎన్నికల కమిటీపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. ఉద్యమ కార్చాచరణ సిద్ధమైందని, రైస్ మిల్లర్లందరూ సంఘటితం కావాలని కోరారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు సంపత్ కుమార్, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంజయ్య, వరంగల్ జిల్లా అధ్యక్షుడు రవీందర్, జనగామ జిల్లా అధ్యక్షుడు ముత్తయ్య, భూపాలపల్లి జిల్లా గౌరవాధ్యక్షుడు రవి, మహబూబాబాద్ జిల్లా కోశాధికారి సతీశ్ పాల్గొన్నారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్ -
నామినేట్..లేట్ !
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీపై నెలకొన్న ఉత్కంఠకు మరికొంత కాలం తెరపడే అవకాశం కనిపించట్లేదు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడంతో నామినేటెడ్ పోస్టుల నియామకాల ప్రక్రియను ఆగస్టు 3వ తేదీ తర్వాత చేపట్టే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో పదవీకాలం ముగిసిన నేతలు, కొత్తగా అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారిలో అయోమయం నెలకొంది. ఇటీవలే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న నేతల పదవీకాలం పూర్తయ్యింది. మరోసారి కొనసాగిస్తారా? లేక కొత్తవారికి అవకాశం కల్పిస్తారా? అనే చర్చ కొనసాగుతుండగానే నియామకాలు వాయిదా పడతాయనే సంకేతాలు రావడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. సభ్యత్వ నమోదుపైనే దృష్టిప్రస్తుతం పార్టీకి అత్యంత ప్రాధాన్యమైన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపైనే సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ దృష్టి కేంద్రీకరించినట్లు సమాచారం. ఈకార్యక్రమం పూర్తయ్యే వరకు ఎలాంటి నామినేటెడ్ పోస్టుల నియామకాలపై నిర్ణయం తీసుకోకూడదని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆగస్టు 3 తర్వాతే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అధిష్టానం అప్రమత్తంనామినేటెడ్ పదవుల కోసం కొద్ది రోజులుగా ఆశావహులు పెద్దఎత్తున హైదరాబాద్‌కు వెళ్లి మంత్రులు, ముఖ్యనేతలను కలుస్తున్న నేపథ్యంలో.. పార్టీ అధిష్టానం కూడా అప్రమత్తమైనట్లు సమాచారం. సభ్యత్వ నమోదుపైనే దృష్టి పెట్టాలని, లాబీయింగ్ కోసం హైదరాబాద్‌కు రావొద్దని ముఖ్యనేతలు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. గాంధీభవన్‌లో కూడా ప్రస్తుతం నామినేటెడ్ పోస్టుల అంశంపై చర్చలకు పెద్దగా అవకాశం ఇవ్వడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఆగస్టు 3 తర్వాతే నామినేటెడ్ పోస్టులకు మోక్షం ‘సర్’పై దృష్టి పెట్టాలన్న సీఎం, టీపీసీసీ చీఫ్ హైదరాబాద్‌కు రావొద్దని నేతలకు సూచన గాంధీభవన్‌లో లాబీయింగ్‌కు ఇక బ్రేక్ ఉమ్మడి వరంగల్‌లో పలువురి పదవీకాలం ముగింపు ఆశావహుల్లో అంతా అయోమయంఉమ్మడి జిల్లాలో ముగిసిన పలువురి పదవీకాలం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా ఉండగా, జంగా రాఘవరెడ్డి, ఇనగాల వెంకట్రాంరెడ్డి, బెల్లయ్యనాయక్, అయిత ప్రకాశ్‌రెడ్డి, పోదెం వీరయ్య, ఎండీ రియాజ్‌తోపాటు కీలక నామినేటెడ్ బాధ్యతల్లో ఉన్న నాయకుల పదవీకాలం ఇటీవల ముగిసింది. వీరిలో ఎవరిని కొనసాగిస్తారు? ఎవరికి కొత్త బాధ్యతలు అప్పగిస్తారు? అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. -
పోచమ్మ తల్లికి బోనాలు
కన్నాయిగూడెం: మండల పరిధిలోని ముప్పనపల్లి గ్రామస్తులు ఆదివారం పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. అనంతరం మొక్కులు సమర్పించి యాటలు బలిచ్చారు. కొండచిలువ కలకలం ఏటూరునాగారం: మండల పరిధిలోని శంకరాజుపల్లిలో పాత రైస్‌మిల్లులో ఉన్న కొండచిలువ ఆదివారం కలకలం లేపింది. ఈ మేరకు రైస్‌మిల్లు యజమానికి లింగాల ఓంకార్ అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు అక్కడకు చేరుకున్నారు. చాకచక్యంగా కొండచిలువను పట్టుకొని దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టినట్లు సెక్షన్ ఆఫీసర్ తార, బీట్ ఆఫీసర్ దయానంద్ తెలిపారు. వారి వెంట సిబ్బంది హరీశ్, సాంబయ్య, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. అంతరాలు లేని సమాజమే లక్ష్యం భూపాలపల్లి అర్బన్: అంతరాలు లేని సమాజ నిర్మాణమే సీపీఐ లక్ష్యమని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజారెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు భాగం హేమంతరావు అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇల్లందు క్లబ్లో రెండు రోజుల పాటు నిర్వహించిన రాజకీయ శిక్షణ తరగతులు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా సీహెచ్ రాజారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే గొంతు కమ్యూనిస్టులదేనని అన్నారు. కార్మికులు, రైతులు, పేదల హక్కుల కోసం నిరంతరం పోరా డేది కమ్యూనిస్టులని చెప్పారు. సమాజంలోని అసమానతలు, అంతరాలను రూపుమాపేందుకు ప్రతి కార్యకర్త వర్గ దృక్పథంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. భాగం హేమంతరావు మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎదురవుతున్న అవరోధాలను అధిగమించి పార్టీ నిర్మాణాన్ని బలో పేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు పైండ్ల శాంతికుమార్, సుధాకర్ రెడ్డి, పరమాండ్ల రాజయ్య, అన్నారపు రాజేందర్, సొతుకు ప్రవీణ్‌కుమార్, కొరిమి సుగుణ, క్యాతరాజ్ సతీష్, కుడుదుల వెంకటేష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు మామిడాల సమ్మిరెడ్డి, పెంట రవి, రేగొండ రాజయ్య, కుమారస్వామి, నబీ, గుంటి చంద్రమౌళి, మాతంగి రామచందర్, జి. శ్రీనివాస్, నూకల చంద్రమౌళి, ఆసిఫ్ పాషా, నేరెళ్ల జోసెఫ్, వేముల శ్రీకాంత్, గోలి లావణ్య, యాకుబ్ పాషాలు పాల్గొన్నారు. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి భూపాలపల్లి అర్బన్: ఆటో కార్మికులు ఎదుర్కోంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జిల్లా కన్వీనర్ నాగుల అరవీంద్ డిమాండ్ చేశారు. ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం సెంటర్లో ఆటో అన్నలతో ముఖాముఖ్ఙి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగుల అరవింద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయడంతో ఆటో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటో కార్మికులకు నెలకు రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయడంతో పాటు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నెలకు రూ.15 వేల ఆర్థిక సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
భక్తుల కోలాహలం
బొగతలో పర్యాటకులుప్రత్యేక అలంకరణలో స్వామి వారు, హారతి తీసుకుంటున్న భక్తులుజలపాతం వద్ద పర్యాటకులుమంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. వాజేడు: మండల పరిధిలోని చీకుపల్లి గ్రామ సమీపంలో ఉన్న బొగత జలపాతానికి ఆదివారం పర్యాటకులు భారీగా తరలి వచ్చారు. శనివారం రాత్రి మండలంలో ఒక మోస్తరు వర్షం కురువడంతో బొగత జలపాతానికి జలదారలు కొంచెం పెరిగాయి. దీంతో పర్యాటకుల అక్కడికి చేరుకుని సందడి చేశారు. సెల్ఫీలు, ఫొటోలు దిగారు. సమీపంలోని నీటి కొలనులో దిగి జలకాలాడుతూ ఆనందంగా గడిపారు. -
మొక్కలకు రక్షణ కరువు
ములుగురూరల్: ములుగు మున్సిపాలిటీ పరిధిలోని మంత్రి సీతక్క నాటించిన మొక్కలకే రక్షణ లేకుండా పోయిందని 9వ వార్డు కౌన్సిలర్ గండ్రకోట వాణికుమార్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. ఇటీవల కాలంలో మంత్రి సీతక్క, కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావులు 14, 15, 9 వార్డుల్లో రూ.50వేలు ఖర్చు పెట్టి మెయిన్ రోడ్డుకు డివైడర్లకు ఇరుపక్కల మొక్కలు నాటించారని తెలిపారు. నాటిన మొక్కలను మున్సిపాలిటీ అధికారులు గాలికి వదిలేశారని వెల్లడించారు. అధికారుల నిర్లక్ష్యంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని వివరించారు. నాటిన మొక్కల చుట్టూ కనీసం ఫెన్సింగ్ ఏర్పాటు చేయకపోవడంతో మొక్కలను పశువులు మేస్తున్నాయని తెలిపారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి మిగిలిన మొక్కలను రక్షించేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
భద్రకాళి అమ్మవారికి పూజలు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో శాకంబరీ నవరాత్ర మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు ఆదివారం అమ్మవారిని విరోధిని, వహ్నివాసినిగా అలంకరించి పూజలు చేశారు. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం అమ్మవారికి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, క్షీరాన్ననివేదన, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. అనంతరం కాళీ క్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని విరోధిని క్రమంలో, షోడశీ క్రమాన్ని అనుసరించి బోగభేరాన్ని వహ్నివాసిని క్రమంలో అలంకరించి విశేష పూజలు చేశారు. మహిళలు హాజరై అమ్మవారికి చీర, సారె సమర్పించారు. సెలవు దినం కావడంతో అధికసంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ రామల సునీత ఏర్పాట్లను పర్యవేక్షించారు. విరోధిని, వహ్నివాసిని క్రమంలో అమ్మవారు -
ఎన్నాళ్లీ కష్టాలు?
ఏటూరునాగారం: ఏజెన్సీలోని గిరిజనుల కష్టాలు తీరడం లేదు. వర్షం వచ్చినా.. వాగువచ్చినా వారికి నడకదారే శరణ్యంగా మారుతుంది. ఒక్కోసారి వాగులు ఉధృతంగా ప్రవహిస్తే ఇళ్లకే పరిమితం అవుతున్న పరిస్థితి. ఏటూరునాగారం మండల పరిధిలోని కొండాయి–దొడ్ల గ్రామాల మధ్యలోని జంపన్నవాగు బ్రిడ్జి నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. అదే ప్రాంతంలో ప్రజల రాకపోకలకు కోసం నిర్మించిన తాత్కాలిక రోడ్డు భారీ వర్షానికి వరద వచ్చి ఆదివారం కొట్టుకుపోయింది. రూ.16కోట్లతో బ్రిడ్జి పనులు భారీ వర్షం కురిస్తే జంపన్నవాగులోకి వరద వచ్చి చేరడంతో తాత్కాలికంగా కొండాయి–దొడ్ల మధ్యలోని రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో కొండాయి, మల్యాల, గోవిందరాజుల కాలనీ, కొత్తూరు, ఐలాపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలు నిత్యావసర సరుకులు తెచ్చుకునేందుకు వెళ్లాలంటే ఇద్దరు, ముగ్గురు కలిసి వాగులో ఈత పడి దొడ్లకు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. గత మూడేళ్ల నుంచి ఇదే దుస్థితి నెలకొంది. మంత్రి సీతక్క చొరవతో ఆర్అండ్బీ అధికారుల పర్యవేక్షణలో రూ.16 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కొండాయి బ్రిడ్జికి ఏడు పిల్లర్లు, రెండు అబాడ్స్మెంట్ పూర్తి కాగా పిల్లర్లపై గడ్డర్స్‌ను అమర్చారు. కానీ ఇంకా స్లాబ్ పడలేదు. దీంతో ప్రజలకు బ్రిడ్జి వినియోగంలోకి రాలేదు. ఎలిశెట్టిపల్లి వద్ద బ్రిడ్జి నిర్మించాలని వేడుకోలు మండలంలోని ఎలిశెట్టిపల్లి, కొత్తూరు గ్రామాలకు బన్నాజీబంధం నుంచి వెళ్లాలంటే జంపన్నవాగు దాటి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో వర్షాకాలంలో ఆయా గ్రామాల ప్రజలు ఏం అవసరం వచ్చినా మండల కేంద్రానికి రావాలంటే తిప్పలు తప్పటం లేదు. ఉప్పొంగి ప్రవహించే జంపన్నవాగును దాటలేక ఇళ్లకే పరిమితమై ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది నవంబర్‌లో ఎలిశెట్టిపల్లి వద్ద సీతక్క చొరవతో బ్రిడ్జి నిర్మాణానికి భూమి నమూనాలను అధికారులు సేకరించారు. ఇంజనీరింగ్, శాస్త్రవేత్తలు కూడా వచ్చి పరిశీలించారు. కానీ ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి పనులు చేపట్టలేదు. బ్రిడ్జి లేకపోవడంతో ఎలిశెట్టిపల్లి, కొత్తూరు గ్రామాల ప్రజలు వాగులో నుంచి నడిచేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంత్రి సీతక్క చొరవతో ప్రస్తుతం అక్కడ పడవలను ఏర్పాటు చేశారు. మంత్రి సీతక్క తక్షణమే స్పందించి బ్రిడ్జి నిర్మాణంపై దృష్టి సారించాలని ఆయా గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు.భారీ వర్షానికి కొట్టుకుపోయిన కొండాయి– దొడ్ల తాత్కాలిక రోడ్డు ఐదు గ్రామాలకు నిలిచిన రాకపోకలు ఇబ్బందులు పడుతున్న ఆయా గ్రామాల ప్రజలు జంపన్నవాగుపై కొనసాగుతున్న హైలెవల్ బ్రిడ్జి పనులు -
అన్నం ముద్దముద్ద..
● తినేందుకు ఇబ్బండి పడిన విద్యార్థులు ఏటూరునాగారం: మండల పరిధిలోని చిన్నబోయినపల్లి బాలుర ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు వండిపెడుతున్న అన్నం ముద్ద ముద్దగా కావడంతో విద్యార్థులు తినేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఐటీడీఏ పరిధిలోని బాలుర గిరిజన ఆశ్రమ పాఠశాలలో 330 మంది విద్యార్థులు 3 నుంచి 10వ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్నారు. ఆదివారం స్పెషల్‌గా బగార రైస్ తయారు చేశారు. కానీ ఆ అన్నం ముద్దలు ముద్దలుగా ఉండి రుచిగా లేకుండా పోయింది. నాసిరకం బియ్యాన్ని జీసీసీ అధికారులు సరఫరా చేసినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పేరుకే సన్నబియ్యం చూస్తే దొడ్డు రకం బియ్యంగా ఉండడం గమనార్హం. ఈ విషయంపై సాక్షి డీడీ జనార్దన్ వివరణ కోరగా బియ్యాన్ని పరిశీలించి బాగాలేకపోతే వాటి స్థానంలో వేరే బియ్యాన్ని పంపిస్తామని వివరించారు. -
298.40 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
గోవిందరావుపేట: పేదలకు ప్రభుత్వం పంపిణీ చేయాల్సిన 298.40 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా ఛత్తీస్‌గఢ్‌కు తరలిస్తున్న లారీని అధికారులు పట్టుకున్నారు. డిప్యూటీ తహసీల్దార్(సివిల్ సప్లయీస్) విజయ్ కుమార్, పస్రా ఎస్హెచ్ఓ తాజొద్దీన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సంయుక్త దాడుల్లో ఈ భారీ అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. పక్కా సమాచారంతో నిఘా ఏర్పాటు చేసిన అధికారులు ఓ లారీని తనిఖీ చేయగా అందులో 298.40 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వాటిని సీజ్ చేసి మండలంలోని లక్ష్మీగణపతి రైస్ మిల్లులో భద్రపరిచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి రవాణాకు పాల్పడిన వారిపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ బియ్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి నుంచి బయలుదేరి, లింగాల–పస్రా మార్గం మీదుగా ఛత్తీస్‌గఢ్‌కు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై తాజొద్దీన్ మాట్లాడుతూ పేదలకు అందాల్సిన పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
క్రీడలతో ఆరోగ్యం
● బెటాలియన్ కమాండెంట్ సుబ్రహ్మణ్యంగోవిందరావుపేట: క్రీడలతో శారీరక ధృడత్వంతో పాటు క్రమశిక్షణ, ఆరోగ్యం పెంపొందుతుందని చల్వాయి 5వ బెటాలియన్ కమాండెంట్ కె.సుబ్రహ్మణ్యం అన్నారు. ఈ మేరకు బెటాలియన్ ప్రాంగణంలో ఐదు రోజుల పాటు నిర్వహించిన క్రీడాపోటీలకు సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు, మెడల్స్, ప్రశంసపత్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు విధి నిర్వహణతో పాటు ఆరోగ్య పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పోటీల్లో అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనబర్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్ సీతారాం, సహాయక కమాండెంట్లు కృష్ణప్రసాద్, ధర్మారావు, ఆర్ఐలు భాస్కర్, కిరణ్ కుమార్, శ్రీనివాసచారి, వెంకటేశ్వర్లు, సాయిబాబు, శ్రీధర్, స్వామితో పాటు అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ప్రయాణం.. భయానకం
గోవిందరావుపేట: జిల్లాలోని రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌తో అనుసందానమైన జాతీయ రహదారి–163పై రోజురోజుకూ వాహనాల రద్దీ పెరుగుతోంది. భారీగా ఇసుక లారీలు, సరుకు రవాణా వాహనాలు, పర్యాటకుల వాహనాల రద్దీతో భయానకంగా నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వంటి కారణాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు అరైవ్ అలైవ్ అవెర్నెస్ ప్రోగ్రాం ద్వారా వాహనదారులకు పలుమార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. హెల్మెట్ ధరించాలని, సీట్‌బెల్ట్ పెట్టుకోవాలని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని, అతివేగం ప్రాణాంతకమని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పదేపదే సూచిస్తున్నారు. పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా వాహనదారుల తీరు మాత్రం మారడం లేదు. 137 ప్రమాదాలు..55 ఘోర ప్రమాదాలు జిల్లా పోలీసుల గణాంకాల ప్రకారం ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈ నెల 17వ తేదీ 137 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. వీటిలో 55 ఘోర ప్రమాదాలు కాగా 63 సాధారణ ప్రమాదాలు, 19 గాయాలు లేని ప్రమాదాలు నమోదయ్యాయి. ఈ ప్రమాదాల్లో 60 మంది ప్రాణాలు కోల్పోగా 170 మంది గాయపడ్డారు. అయితే ట్రాఫిక్ పెరిగినంతగా రహదారి భద్రతా వ్యవస్థ బలోపేతం కాలేదనే అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు స్పందించడం కంటే, ప్రమాదం జరగకముందే నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే గుర్తించిన బ్లాక్స్పాట్లతో పాటు తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న ఇతర ప్రాంతాలను కూడా అధికారికంగా గుర్తించి లోపాలను సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు. రిఫ్లెక్టివ్ హెచ్చరిక బోర్డులు, హైమాస్ట్ లైట్లు, రంబుల్ స్ట్రిప్స్, స్పీడ్ కెమెరాలు, అత్యవసర వైద్య సేవలు, హైవే పెట్రోలింగ్‌ను మరింత బలోపేతం చేస్తే ప్రమాదాలను నివారించవచ్చని పలువురు సూచిస్తున్నారు. మూడు బ్లాక్స్పాట్ల గుర్తింపు ప్రమాదాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు ఇప్పటికే పెద్ద గొల్లగూడెం, చిన్నబోయినపల్లి, ఎస్ఎస్ తాడ్వాయి ప్రాంతాలను అధికారికంగా బ్లాక్ స్పాట్లుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో రహదారి విస్తరణ, మూలమలుపుల సవరణ, హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇది స్వాగతించదగిన చర్య అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అధికారికంగా గుర్తించిన మూడు బ్లాక్స్పాట్లతో పాటు మరెన్నో ప్రాంతాలు నిత్యం ప్రమాదాలకు వేదికగా మారుతున్నాయి. జిల్లాలో గట్టమ్మ తల్లి దేవాలయం సమీపంలోని మూలమలుపు, మచ్చాపూర్ గ్రామ శివారు, పస్రా–గోవిందరావుపేట మధ్య చర్చి సమీపంలోని మూలమలుపు, గుండ్లవాగు మూలమలుపు, కొండపర్తి–జలగలంచ వాగు మూలమలుపు, చిన్నబోయిన పరిసరాలు, ఏటూరునాగారం వై జంక్షన్, జగన్నాథపురం జంక్షన్ ప్రాంతాల్లో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ పూర్తిస్థాయి శాశ్వత భద్రతా చర్యలు చేపట్టాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. పోలీస్ స్టేషన్ ప్రమాదాలు మృతులుమొత్తం ప్రమాదాలు 137మొత్తం మృతులు 60ఎన్‌హెచ్–163పై రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యం ఏడున్నర నెలల్లో 60 మంది మృత్యువాత అతివేగం, మద్యం సేవించడమే కారణంములుగు పస్రా వెంకటాపురం(ఎం) ఏటూరునాగారం ఎస్‌ఎస్‌తాడ్వాయి మంగపేట నార్లాపూర్ వెంకటాపురం(కె) కన్నాయిగూడెం పేరూర్ వాజేడు అతివేగంతో ప్రమాదాలుజిల్లాలో జాతీయ రహదారి–163పై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను ఎప్పటికప్పుడు గుర్తించి అవసరమైన చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే పెద్ద గొల్లగూడెం, చిన్నబోయినపల్లి, ఎస్ఎస్ తాడ్వాయి ప్రాంతాలను బ్లాక్స్పాట్లుగా గుర్తించి రహదారి విస్తరణ, మూలమలుపుల సవరణ, హెచ్చరిక బోర్డులు, రిఫెక్టర్లు తదితర భద్రతా చర్యలు చేపడుతున్నాం. వాహనదారులు అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి అలవాట్లకు దూరంగా ఉండి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయి. –బి కుమారస్వామి, ఎన్‌హెచ్ డీఈఈ, ములుగు -
అధిక రుసుము వసూలు చేస్తే చర్యలు
● ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ ములుగు: మీసేవ కేంద్రాలలో వినియోగదారుల నుంచి అధిక రుసుము వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈ డిస్ట్రిక్ మేనేజర్ దేవేందర్ తెలిపారు. ములుగు మున్సిపాలిటీ పరిధిలోని పలు మీసేవ కేంద్రాలను మీసేవ మేనేజర్ విజయ్‌తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ మీ సేవ కేంద్రాల్లో కొత్తగా వచ్చిన ఈ మెమో ప్రింట్, యూరియా బుకింగ్, ఫార్మర్ రిజిస్ట్రేషన్ వ్యవసాయేతర మార్కెట్ విలువ సర్వీసుల గురించి మీసేవ నిర్వాహకులకు వివరించారు. కులం, ఆదాయం, నివాసం, జనన, మరణ కుటుంబ ధ్రువీకరణ పత్రం, నేటివిటి, గ్యాప్, నాన్ క్రిమిలేయర్ వంటి సర్టిఫికెట్లు ఎన్నిసార్లు అయినా తీసుకునే వెసులుబాటు ఉందన్నారు. మీసేవ సెంటర్లలో తప్పకుండా సిటిజెన్ చాప్టర్, భూభారతికి సంబంధించిన ఫ్లెక్సీలు, మీసేవ లోగో, తహసీల్దార్, ఈడీఎం, పరిష్కారం కాల్ సెంటర్ల ఫోన్ నంబర్లు తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన నిర్ణీత రుసుము కంటే ఎక్కువ రుసుము దరఖాస్తుదారుడు నుంచి తీసుకుంటే తప్పనిసరిగా ఆ సెంటర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో పౌర సేవలను పారదర్శకంగా వేగవంతంగా అందించేందుకు ప్రభుత్వం నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని వివరించారు. ఇకపై పౌర సేవల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, రెవెన్యూ సిబ్బంది నివేదికల సమర్పణ తదితర ప్రక్రియ మొత్తం ఆన్లైన్ విధానంలోనే కొనసాగుతుందన్నారు. కాగిత రహిత విధానం అమల్లోకి రావడంతో సమయానికి సేవలు అందడంతో పాటు పారదర్శకత పెరుగుతుందని దేవేందర్ తెలిపారు. -
చెక్కుబౌన్స్ కేసుల పరిష్కారం
ములుగు: జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్‌లో 10 చెక్కుబౌన్స్ కేసులు పరిష్కరించినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ కన్హయ్యలాల్ తెలిపారు. పెండింగ్‌లో ఉన్న 10 చెక్కు బౌన్స్ కేసులను పరిష్కరించి రూ.14,72,973లను సెటిల్ చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి జి.జ్యోత్స్న, అదనపు జూనియర్ సివిల్ జడ్జి మధులికతేజ, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలుగు చంద్రయ్య, ఉపాధ్యక్షుడు రంగోజు భిక్షపతి, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యుడు మేకల మహేందర్, బానోత్ స్వామిదాస్ తదితరులు పాల్గొన్నారు. నేటితో దరఖాస్తులకు గడువు ముగింపు ములుగు: హైదరాబాద్‌లోని తెలంగాణ షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ–2027 రెసిడెన్షియల్ కోచింగ్‌కు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు నేటితో గడువు ముగియనున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ అధికారి కొమురయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులకు జూలై 26న ఉదయం 11 గంటలకు హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైనన్స్ కళాశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు గణపురం: ప్రభుత్వ వైద్యశాలలో నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి మధుసూదన్ అన్నారు. శనివారం గణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఆరోగ్యకేంద్రంలోని ల్యాబ్, ఫార్మసీ తదితర విభాగాలను పరిశీలించారు. అనంతరం గణపురం–1 సబ్‌సెంటర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని రకాల వ్యాక్సిన్లు, మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి అనూష తదితరులు పాల్గొన్నారు.ప్రవేశాలకు ఎంపిక పోటీలు భూపాలపల్లి అర్బన్: రాష్ట్రంలోని తెలంగాణ క్రీడా అకాడమీలు, ప్రాంతీయ క్రీడా పాఠశాలలు, స్పోర్ట్స్ హాస్టళ్లలో 2026–27 విద్యా సంవత్సరానికి ఉచిత ప్రవేశాల కోసం బాలబాలికల నుంచి ఎంపిక పోటీలు ఈ నెల 20 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన మరియు క్రీడల అధికారి రఘు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్, ఖమ్మం, సిద్దిపేట, మహబూబ్‌నగర్, గచ్చిబౌలి, హనుమకొండ కేంద్రాల్లో సైక్లింగ్, రెజ్లింగ్, వాలీబాల్, అథ్లెటిక్స్, కబడ్డీ, హ్యాండ్‌బాల్, ఫుట్‌బాల్, హాకీ, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్ విభాగాల్లో ఎంపికలు జరుగుతాయన్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు వయస్సు, స్టడీ సర్టిఫికెట్, జనన ధృవీకరణ పత్రం లేదా పదో తరగతి మెమో, ఆధార్ లేదా నివాస ధృవీకరణ పత్రం, 10 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో హాజరుకావాలని సూచించారు. అర్హత వయస్సు, ఎంపికల తేదీలు, వేదికలు, క్రీడాంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణ భూపాలపల్లి రూరల్: సివిల్ సర్వీసెస్ (ఐఏఎస్/ఐపీఎస్) ఐఎఫ్ఎస్ (ప్రిలిమ్స్ కం మెయిన్స్) ఉద్యోగాలకు 10 నెలలు ఉచిత శిక్షణ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ది అధికారి కస్తూర్తి జైభీమ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణకు నేడు (ఆదివారం) సాయంత్రం వరకు అవకాశం ఉందన్నారు. 27న ఎంపిక పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. -
మామునూరు విమానాశ్రయం కల సాకారం దిశగా కీలక అడుగు
మామునూరు ఎయిర్పోర్ట్ నమూనా (ఏఐ చిత్రం)సాక్షి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మామునూరు విమానాశ్రయం కల సాకారం దిశగా కీలక అడుగు పడింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సుమారు రూ.203.49 కోట్లతో విమానాశ్రయ అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచింది. రన్‌వే ఆధునీకరణ నుంచి టెర్మినల్‌కు అనుసంధాన రహదారులు, విమానాల పార్కింగ్ అప్రాన్, ట్యాక్సీ వేలు, గ్రౌండ్ సపోర్ట్ సదుపాయాల వరకు అన్ని పనులను 15 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు మాస్టర్ ప్లాన్ కూడా విడుదల చేసింది. ఈ ప్లాన్ ప్రకారం విమానాశ్రయానికి ప్రధాన ఎంట్రీ, ఎగ్జిట్‌ను వరంగల్–సూర్యాపేట జాతీయ రహదారి (ఎన్‌హెచ్–563) వైపు ప్రతిపాదించారు. అక్కడి నుంచి ప్రత్యేక యాక్సెస్ రోడ్డు ద్వారా టెర్మినల్ భవనానికి చేరుకునేలా డిజైన్ రూపొందించారు. టెర్మినల్ ఎదుట ఒకేసారి మూడు విమానాలు నిలిపే అప్రాన్, లింక్ ట్యాక్సీవే, గ్రౌండ్ సపోర్ట్ ఎక్విప్మెంట్ (జీఎస్ఈ) ప్రాంతం, పెరిమీటర్ రోడ్లు, అత్యవసర యాక్సెస్ రోడ్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. 1930లోనే నిజాం హయాంలోనే మామూనూరు ఎయిర్‌పోర్టు ఉండగా వివిధ కారణాలతో 1980లో మూతపడిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 7న ఫైనాన్షియల్ బిడ్... ఈ నెల 23న (గురువారం)ప్రీ–బిడ్ సమావేశాన్ని మామునూరు విమానాశ్రయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినట్టు టెండర్ నోట్లో పేర్కొన్నారు. జూలై 29 నుంచి ఆగస్టు 12 వరకూ బిడ్ దాఖలకు అవకాశం కల్పించారు. ఆగస్టు 18న బిడ్ ఓపెన్ చేయనున్నారు. సెప్టెంబరు 7న ఫైనాన్షియల్ బిడ్‌ను తెరవనున్నట్టు టెండర్ నోట్లో పొందుపరిచారు. మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్‌హాల్, ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ సహా మరికొన్ని నిర్మాణాలకు త్వరలో మరో టెండర్‌ను పిలిచేందుకు ఏఏఐ అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. కాకతీయ వైభవం ఉట్టిపడేలా... తెలంగాణకు చారిత్రక వారసత్వంగా నిలిచిన కాకతీయుల కళా సంపదను ప్రతిబింబించేలా మూమునూరు విమానాశ్రయ టెర్మినల్ భవ నం, ప్రవేశ ద్వారాలు, అంతర్గత అలంకరణలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా, అందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది టెర్మినల్ ముఖద్వారంలో కాకతీయ కళాతోరణం శైలిని ప్రతిబింబించే నమూనాలు, లోపలి గోడలపై కాకతీయుల చరిత్రను తెలియజేసే చిత్రాలు, శిల్పాల ప్రతిరూపాలు, తెలంగాణ జానపద సంస్కృతిని చాటిచెప్పే అలంకరణలు ఉండేలా ప్రణాళిక రూపొందించే అవకాశ ముంది. దీంతో వరంగల్‌కు వచ్చే దేశీయ, విదేశీ ప్రయాణికులకు విమానాశ్రయంలోనే కాకతీయుల గొప్పతనం పరిచయం కానుంది.2,800 మీటర్ల పొడవు, 75 మీటర్ల వెడల్పు గల రన్‌వే నిర్మాణంతో ఎయిర్‌బస్–320 వంటి పెద్ద ప్రయాణికుల విమానాలు, భారీ కార్గో విమానాలు కూడా దిగే అవకాశం ఉంటుంది. భవిష్యత్‌లో అంతర్జాతీయ విమానాశ్రయంగా విస్తరించే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని 949.44 ఎకరాల్లో ప్రణాళిక సిద్ధం చేశారు. వెడల్పు : 75 మీటర్లు అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచిన ఏఏఐ టెర్మినల్ ఎదుట ఒకేసారి మూడు విమానాలు నిలిపే అప్రాన్ కాకతీయ కళా వైభవం చాటేలా నిర్మాణాలు ఉండే అవకాశం 2028లో విమానాలు టేకాఫ్ అయ్యేలా కార్యాచరణ ఇక్కడి వ్యాపారవేత్తలు హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు ఒకే రోజులో వెళ్లి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో వ్యాపార సమావేశాలు, పెట్టుబడులు, స్టార్టప్‌లు, కార్పొరేట్ కార్యకలాపాలు మరింత వేగవంతం అవుతాయి. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, ఐటీ, ఫార్మా, లాజిస్టిక్స్ రంగాలకు వేగవంతమైన రవాణా అందుబాటులోకి వస్తుంది. దేశీయ, విదేశీ కంపెనీలు వరంగల్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉంది. వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులను దేశంలోని ఇతర ప్రాంతాలకు త్వరగా తరలించొచ్చు. దీంతో రైతులకు మెరుగైన మార్కెట్లు లభించడంతోపాటు ఎగుమతులకు కూడా మార్గం సుగమం అవుతుంది. రామప్ప ఆలయం, వరంగల్ కోట, వేయి స్తంభాల గుడి, భద్రకాళి ఆలయానికి పర్యాటకుల రాక పెరుగుతుంది. ఎయిర్ అంబులెన్స్, అవయవ మార్పిడి, విపత్తుల సమయంలో సహాయక చర్యలు వేగంగా చేపట్టవచ్చు. రియాల్టీ రంగానికి కూడా రెక్కలు రానున్నాయి. మామునూరు విమానాశ్రయనిర్మాణం నుంచి నిర్వహణ వరకు ప్రత్యక్ష, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. నగరం దేశంలోని ప్రధాన నగరాలతో నేరుగా అనుసంధానమవుతుంది. దీంతో జాతీయస్థాయిలో గుర్తింపు వస్తుంది.రన్‌వే పొడవు : 2,800 మీటర్లు -
కనులపండువగా వరుణయాగం
ఏటూరునాగారం: ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ధూప దీప నైవేద్యం జిల్లా అర్చక సంఘం ఆధ్వర్యంలో వరుణయాగం, గణపతి, గౌరి పూజలు కనులపండువగా శనివారం నిర్వహించారు. మండల కేంద్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో అర్చకులు ఉదయం 9 గంటలకు గణపతి పూజను స్థానిక సర్పంచ్ కాకులమర్రి శ్రీలత, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనర్సింహరావుతో దీపారాదన చేయించారు. అనంతరం వరుడికి పూజలు చేసి వరుణయాగాన్ని వేదపండితులు యల్లాప్రగడ మణికంఠశర్మ, రుత్విక్సాయిశర్మ జరిపించారు. పూర్ణాహుతి కార్యక్రమాన్ని ముగించుకొని వరుణయాగంలో ఏర్పాటు చేసిన జలాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి బొడ్రాయి అమ్మవారికి అభిషేకం చేసి నూతన వస్త్రాలతో అమరేశ్వర్‌శర్మ, హరికిషన్‌లు అలంకరించారు. భక్తులతో అమ్మవారికి పుష్పాభిషేకం చేశారు. తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. అలాగే దేవాదాయ శాఖ నుంచి అర్చకులకు మంజూరైన ఐడీ కార్డులను అందజేశారు. రామాలయాన్ని కూడా ధూప దీప నైవేద్యం స్కీంలో చేర్చాలని ఆలయ చైర్మన్ అలువాల శ్రీనివాస్ విన్నవించగా స్కీంలో పెట్టించే విధంగా కృషి చేస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో యల్లాప్రగడ నాగేశ్వర్‌రావుశర్మ, సూర్యనారాయణశర్మ, ఏఎన్‌శర్మ, వెంకటరమణాచార్యులు, కర్నె సాంబయ్య, జిల్లా అధ్యక్షుడు రాఘునాథచార్యులు, గౌరవ అధ్యక్షుడు పురుషోత్తంచార్యులు, శివసత్యనారాయణ, వివేకానందస్వామి, రామాలయం క మిటీ ప్రధాన కార్యదర్శి కత్తెర శ్రీనివాస్, శివాల యం చైర్మన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఎల్‌నినో’ సవాళ్లను ఎదుర్కోవాలి
● వీసీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ములుగు: ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో, ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ సంపత్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ జిల్లా ఇన్చార్జ్ మంత్రుల ఆధ్వర్యంలో 19న జిల్లా స్థాయిలో ఎల్‌నినో ప్రత్యామ్నాయ ప్రణాళిక సమీక్షాసమావేశం నిర్వహించనున్న సందర్భంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ రంగాలపై పడే ప్రభావాన్ని తగ్గించడానికి క్షేత్రస్థాయిలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. వాతావరణ శాఖ సూచన మేరకు కాలానుగుణ అంచనాలు, వర్షపాత అవుట్‌లుక్ ఆధారంగా జిల్లా ప్రణాళికా అధికారి ఆధ్వర్యంలో రైతులకు, ప్రజలకు ఎప్పటికప్పుడు ముందస్తు సమాచారాన్ని చేరవేయాలన్నారు. ఈ వీసీలో డీఎంహెచ్ఓ గోపాల్ రావు, డీపీఓ వెంకయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
పెన్షన్ పునరుద్ధరించారు
మల్హర్: మండలంలోని కొండంపేట గ్రామ పంచాయతీ పరిధి గట్టుపల్లె గ్రామానికి చెందిన గోరేటి పార్వతి వృద్ధాప్య పింఛన్‌ను పునరుద్ధరించారు. ఫిబ్రవరి నుంచి ఐదు నెలలుగా పార్వతి పింఛన్ నిలిచిపోయింది. జూన్ 30న సాక్షిలో ‘నేను బతికే ఉన్నా..’ శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు జూన్ నెలకు సంబంధించిన వృద్ధాప్య పింఛన్ డబ్బులు రూ.2016 పార్వతి ఖాతాలో వేశారు. ఏఐటీయూసీ పోరాట ఫలితమే భూపాలపల్లి అర్బన్: సింగరేణికి తాడిచర్ల–2 ఓపెన్‌కాస్ట్ బ్లాక్ కేటాయించడం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ చేపట్టిన నిరంతర పోరాట ఫలితమేనని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ అన్నారు. ఏరియాలోని కేటీకే–6వ గనిలో నిర్వహించి విజయోత్సవ గేట్ మీటింగ్‌లో మాట్లాడారు. బ్లాక్‌ను సింగరేణికే కేటాయించాలని తొలి నుంచే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు నిర్వహించడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు. వెంకటాపురం (పీవీఎన్ఆర్) ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టును కూడా సింగరేణికే కేటాయించేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు నూకల చంద్రమౌళి, కృష్ణమూర్తి శ్రీనివాస్, రాజన్న, గణేష్, రాంబాబు, సత్యనారాయణ, వేణు, సిద్ధయ్య, శ్రీధర్, కనకయ్య, మధుకర్, కార్మికులు పాల్గొన్నారు. మంత్రిని కలిసిన దేవస్థానం టెండరుదారులు కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలో పలు దుకాణాల నిర్వహణ టెండరుదారులు మంత్రి శ్రీధర్‌బాబును హైదరాబాద్‌లో శుక్రవారం కలిశారు. తమకు బాలాలయం వద్ద సరైన వసతులు లేక గిరాకీ కావడం లేదని టెండర్ కాలం పొడిగించాలని మంత్రితో వాపోయారు. దీంతో మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈఓ మహేష్‌కు ఫోన్ చేసి సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. రాష్ట్రస్థాయికి ఎంపిక మల్హర్: మండలంలోని ఎడ్లపల్లి మోడల్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినులు కొడారి యశస్విని, తేజస్వి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 14న జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈనెల 18న మెదక్ జిల్లాలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే పోటీల్లో పాల్గొననున్నారు. జూనియర్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ జూనియర్ కాలేజీలో ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్ (ఉర్దూ) పోస్టును కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అభివృద్ధి అధికారి కుమారస్వామి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోస్టుకు పీజీ, బీఎడ్, టీజీ టెట్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత విద్యార్హతల ధ్రువపత్రాల ప్రతులతో దరఖాస్తులను ఈనెల 22న సాయంత్రం నాలుగు గంటల వరకు సమర్పించవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 99891 62064 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. నేడు సీపీఐ(ఎం) నాయకుల పర్యటన కాళేశ్వరం: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ రావు నేడు (శనివారం) కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఉదయం 8 గంటలకు అన్నారం బరాజ్, 10 గంటలకు కన్నేపల్లిలోని లక్ష్మీపంపుహౌస్, మధ్యాహ్నం 12 గంటలకు మేడిగడ్డ బరాజ్‌ను పరిశీలించనున్నారు. అనంతరం మేడిగడ్డ వద్ద విలేకరుల సమావేశంలో పాల్గొననున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
వెదురుసాగుతో ఆర్థిక ప్రగతి!
ఏటూరునాగారం: వెదురు సాగుతో మహిళా లోకానికి కొత్త వెలుగులు నింపుతోంది. తక్కువ పెట్టుబడితో స్థిరమైన ఆదాయాన్ని అందిస్తూ మహిళా సంఘాల సభ్యులను బలోపేతం చేస్తుంది. లక్షల రూపాయల ఆదాయం పొందే ఈ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సంఘాల సభ్యులకు అప్పగించారు. ఒక్కో మండలానికి ఒక్కో వీఓకు అప్పగించారు. మహిళా సంఘంలో సభ్యురాలి అయి ఉండి జాబ్ కార్డు ఉన్న రైతులకు 60 మొక్కలు ఉచితంగా ఇవ్వనున్నారు. మొక్కలు నాటిన మూడేళ్ల నుంచి సదరు రైతులు ఆదాయం పొందవచ్చు. ఈ మేరకు ఏజెన్సీలోని ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం(కె) మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి నర్సరీల పెంచే బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించగా అందులో ఏటూరునాగారం, తాడ్వాయి నుంచి ఇద్దరు సభ్యులు ముందుకు రావడంతో సెర్ప్, ఈజీఎస్ ద్వారా ఒక్క వీఓ సంఘం సభ్యురాలికి 30వేల మొక్కలకు కావాల్సిన విత్తనాలను అందజేశారు. ఈ విత్తనాలను త్రిపుర నుంచి తెప్పించి ప్రత్యేకంగా ఇచ్చారు. రుణ సదుపాయంమండల సమాఖ్య ద్వారా బ్యాంకు నుంచి రూ.1.20 లక్షల పెట్టుబడి రుణం అందజేసి సీడ్‌ను సరఫరా చేశారు. 30వేల మొక్కలను మూడు నెలల పాటు పెంచి సెర్ప్, ఎన్ఆర్ఈజీఎస్కు అప్పగించాల్సి ఉంది. ఒక్కో మొక్కకు రూ.15 చొప్పున ఈజీఎస్ ద్వారా నర్సరీ నిర్వాహకురాలికి చెల్లించి మొక్కలను కొనుగోలు చేస్తారు. అనంతరం ఆ మొక్కలను ఉచితంగా రైతులకు ఇవ్వనున్నారు. ఇలా నర్సరీలు పెంచే మహిళా సంఘం సభ్యులకు ఆర్థిక ఫలాలు పుష్కలంగా రానున్నాయి. మొదలు కానీ నర్సరీలుజిల్లాలో ఆరు మండలాలను పైలట్‌గా గుర్తించి నర్సరీల పెంపునకు శిక్షణ ఇచ్చారు. కానీ ఏటూరునాగారం, తాడ్వాయి నుంచి ఇద్దరు మహిళా సభ్యులు మాత్రమే నర్సరీలను పెంచుతున్నారు. మంగపేట, వాజేడు, వెంకటాపురం(కె), కన్నాయిగూడెం మండలాల నుంచి మహిళలు ముందుకు రాకపోవడంతో అక్కడ ఎలాంటి నర్సరీలను ఏర్పాటు చేయలేదు. సెర్ప్, ఈజీఎస్ అధికారులు మహిళా సంఘం సభ్యులకు శిక్షణ ఇచ్చారు కానీ.. సరైన ప్రోత్సాహం ఇవ్వకపోవడంతోనే మిగతా మండలాల సభ్యులు ముందుకు రావడం లేదని సమాచారం. సీడ్ అప్పగించే వరకు వెంటపడి ఆ తర్వాత మాకేమి తేలియదన్నట్లు వ్యవహరించడంతోనే మహిళలు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.పైలట్ ప్రాజెక్టుగా జిల్లాలోని 6 మండలాలు ఎంపిక మండలానికో నర్సరీ, అందులో 30వేల మొక్కలు రైతులకు ఉచితంగా పంపిణీమొక్కలను పెంచుతున్న.. మండల సమాఖ్య ద్వారా సీడ్ ఇచ్చారు. వాటిని తీసుకొని 30 వేల మొక్కలను పెంచుతున్న. సీడ్ వారు ఇచ్చిన విత్తనాలను మొక్కలు వచ్చే విధంగా చేయడంతో ఆర్థిక ఫలాలు వస్తాయి. జిల్లాలోని ఆరు మండలాల్లోని ఆరుగురి సభ్యులకు శిక్షణ ఇచ్చారు. ఇప్పటి వరకు మొక్కలు బాగానే ఉన్నాయి. –మసాని లావణ్య, లక్ష్మీసరస్వతి సంఘం, ఏటూరునాగారం రెండు మండలాల్లో మొదలు..ప్రస్తుతం తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లోని ఒక్కో సభ్యురాలికి 30వేల సీడ్‌ను అందించి నర్సరీలను పెంచుతున్నాం. మిగతా మండలాల నుంచి సభ్యులెవరూ రా లేదు. వస్తే వారికి కూడా కావాల్సి న ఏర్పా ట్లు చేసి నర్సరీల ఏర్పాటునకు కృషి చేస్తాం. –రాజు, డీపీఎం -
డిగ్రీ అడ్మిషన్లకు స్పెషల్ డ్రైవ్
ములుగు రూరల్: దోస్త్ ద్వారా ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరడానికి స్పెషల్ డ్రైవ్ చేపట్టామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని ఆ కళాశాల ప్రిన్సిపాల్ మల్లేశం తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్పెషల్ ఫేస్ ద్వారా డిగ్రీలో చేరే విద్యార్థులు ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు రూ.400 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. కోర్సుకు సంబంధించిన సందేహాలు ఉంటే జిల్లాలోని డిగ్రీ కళాశాలలో లేదా దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్లో సంప్రదించాలన్నారు. -
ఎంజీఎం సూపరింటెండెంట్‌గా రాంకుమార్‌రెడ్డి
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ కాటం రాంకుమార్‌రెడ్డిని నియమిస్తూ శుక్రవారం కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఉత్తర్వులు జారీ చేశారు. ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెంటెండ్‌గా డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి హైదరాబాద్‌కు బదిలీ అయిన తర్వాత కొత్త సూపరింటెండెంట్ కోసం అందరూ ఎదురుచూశారు. పలువురు సీనియర్ వైద్యుల పేర్లు కూడా పరిగణనలోకి వచ్చాయి. డీఎంఈ నుంచి ఆదేశాలు రాకపోవడంతో ఎవరు సూపరింటెండెంట్‌గా వస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. దాదాపు 45 రోజుల నుంచి ఆస్పత్రిలో నెలకొన్న ఆర్థికపరమైన పలు సమస్యలు, బిల్లుల చెల్లింపులు, ఇతర వైద్యసేవల విషయంలో ఏర్పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ సత్యశారద ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్‌పర్సన్‌గా నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఆస్పత్రిలో ఎలాంటి ఆర్థిక సమస్యలు రాకుండా, పరిపాలనా పరంగా నిబంధనల మేరకు నిర్ణయం తీసుకునే విధంగా డాక్టర్ రాంకుమార్‌రెడ్డి సూపరింటెండెంట్‌గా (ఎఫ్ఏసీ) అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, సూపరింటెండెంట్ ర్యాటిఫికేషన్ కోసం డీఎంఈకి సమాచారం పంపినట్లు తెలుస్తోంది. ఏదేమైనా డీఎంఈ నుంచి కూడా ఉత్తర్వులు రావాల్సి ఉంది. కాగా, సూపరింటెండెంట్‌గా డాక్టర్ రాంకుమార్‌రెడ్డి ఽశనివారం చాంబర్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. మెడికల్ రికార్డు ఆఫీసర్‌గా రవీందర్ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి మెడికల్ రికార్డు ఆఫీసర్ (ఎంఆర్ఓ)గా వంగ రవీందర్‌ను నియమించారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత సంవత్సరం జూన్ 30 వరకు మెడికల్ రికార్డు ఆఫీసర్‌గా పనిచేసిన రామకృష్ణ ఉద్యోగ విరమణ చేశారు. దీంతో ఇదేస్థానంలో రవీందర్ ఇన్చార్జ్గా వ్యహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మెడికల్ రికార్డు టెక్నీషియన్ నుంచి పదోన్నతి పొంది పూర్తిస్థాయి మెడికల్ రికార్డు ఆఫీసర్‌గా రానున్నారు. కాగా, శనివారం ఆయన ఎంఆర్డీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు.కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఉత్తర్వులు జారీ -
ప్రతిభ కనబరిచిన పోలీస్ క్రీడాకారులకు అభినందన
ములుగు రూరల్: మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ మైదానంలో నిర్వహించిన 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గెమ్స్ మీట్ 2026 క్లస్టర్–ఏలోని 14వ క్రీడా విభాగాల పోటీల్లో పతకాలు సాధించిన ములుగు పోలీస్ క్రీడాకారులను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ శుక్రవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జట్టు సమన్వయంతో లోపాలను గుర్తించి సరిదిద్దుకోవటంతోనే విజయాలు సాధించామన్నారు. పోలీసులు విధుల్లో క్రమశిక్షణ, శారీరక ధృడత్వం కీలకమన్నారు. అనంతరం పతకాల విజేతలు ఆర్ఎస్సైలు రాకేష్, అశోక్, హెడ్ కానిస్టేబుల్ అమిత్ కుమార్ సింగ్‌లను ఎస్పీ అభినందించారు. -
నీటిని వృథా చేస్తున్న ప్రభుత్వం
ఏటూరునాగారం/కన్నాయిగూడెం: సమ్మక్క బ్యారేజ్ వద్ద నీటిని నిల్వ చేయకుండా దిగువకు వదిలేస్తూ నీటిని వృథా చేయడం బాధాకరమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు అన్నారు. శుక్రవారం కన్నాయిగూడెం మండలంలోని సమ్మక్క బ్యారేజ్‌ను నాయకులతో కలిసి సందర్శించారు. అక్కడ నీటి నిల్వలు, వాటి వివరాలను డీఈ ప్రవీణ్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవాదుల పంప్‌హౌస్ వద్దకు వెళ్తుండగా పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అడ్డుకొని అనుమతి లేదని వెనకకు పంపించారు. ఈ సందర్భంగా లక్ష్మీనర్సింహరావు విలేకరులతో మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ దూరదృష్టితో నిర్మించిన తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజ్‌లోని మూడు గేట్లు తెరిచి నీటిని వృథాగా కిందికి వదిలివేయటం సరైన పద్ధతికాదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఆలోచించి దేవాదుల నీటిని రైతులకు అందేవిధంగా చేయాలన్నారు. మంత్రి సీతక్క ఎన్నికల ముందు ములుగు నియోజకవర్గ ప్రజలకు దేవాదుల ద్వారా అన్ని మండలాలకు నీళ్లు అందిస్తామన్నారు. ఇప్పటివరకు ఎందుకు అందించలేదని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుగ్గుల సమ్మయ్య, పూజారి కిషోర్, చిన్ని కృష్ణ, తాటి కృష్ణ, తుమ్మ మల్లారెడ్డి, ప్రదీప్‌రావు, కూనూరు అశోక్, కొమురం ధనలక్ష్మీ, తాడూరి రఘు, ఖాజాపాషా, యలవర్తి శ్రీనివాసరావు, కుర్బాన్ అలీ, పులుసం పురుషోత్తం, పొదెం కృష్ణప్రసాద్, కుమ్మరి చంద్రబాబు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారావు -
వారాహిగా భద్రకాళి అమ్మవారు
● కుల్లా, నిత్యక్లిన్నా క్రమాల్లో పూజలుహన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం అమ్మవారికి కుల్లా క్రమంలో, నిత్యక్లిన్నా క్రమంలో పూజలు జరిపి వారాహి అమ్మవారుగా అలంకరించారు. శుక్రవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు ఉదయం నుంచి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, చతుఃస్థానార్చన, అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరానికి కుల్లా క్రమంలో పూజలు నిర్వహించి వారాహి అమ్మవారుగా అలంకరించారు. షోఢశీక్రమాన్ని అనుసరించి స్నపన మందిరంలోని బోగభేరాన్ని నిత్యక్లిన్నాగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఈఓ రాముల సునీత పర్యవేక్షించారు.వారాహి, నిత్యక్లిన్నాగా అమ్మవారు అలంకరణ -
ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తం కావాలి
● కలెక్టర్ రాహుల్ శర్మభూపాలపల్లి అర్బన్: ఎల్‌నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదై నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు వరికి బదులుగా తక్కువ నీటి వినియోగ పంటల సాగు వైపు మొగ్గు చూపేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ రాహుల్‌శర్మ వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు సాంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా సాగులో వైవిధ్యాన్ని పాటించాలని సూచించారు. మిల్లెట్స్, పప్పుధాన్యాలు, కూరగాయలు, పామాయిల్ వంటి తక్కువ నీటి అవసరమున్న పంటల సాగుపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, జిల్లా ఉద్యాన అధికారి తిరుపతి, ఏడీఏలు శ్రీపాల్, రమేశ్, మండలాల ఏఈఓలు, తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల నమోదు పెంచాలి ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల నమోదును పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్‌శర్మ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. చల్లగరిగ పాఠశాలలో తెలంగాణ పబ్లిక్ పాఠశాల ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలను తక్షణమే సిద్ధంచేసి పంపాలని ఆదేశించారు. సమీక్షకు గైర్హాజరైన అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసిన కలెక్టర్ వారికి షోకాజ్ నోటీసులు జారీచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, డీఆర్డీఓ బాలకృష్ణ పాల్గొన్నారు. అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలి జిల్లాలో ప్రజలకు తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. మండలాల వారీగా నీటి సమస్యలను సమీక్షించిన కలెక్టర్, ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం లభించే వరకు ప్రత్యామ్నాయ మార్గాల్లో నీటి సరఫరా చేయాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఇంచార్జీ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఇంట్రా ఈఈ సురేందర్, మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్, మల్లికార్జునరెడ్డి, ఎంపీడీఓలు, ఇంజినీర్లు పాల్గొన్నారు. -
రోడ్డు విస్తరణ పనులు నిలిపేయాలి
ములుగు రూరల్: ఇసుక రవాణా కోసం రోడ్డు విస్తరణ పనులు నిలిపివేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. ఈ మేరకు శుక్రవారం వెంకటాపురం(కె) మండలానికి చెందిన వీరభద్రాపురం, పాత్రపురం, పాలెం గ్రామాలకు చెందిన రైతులతో కలిసి అదనపు కలెక్టర్ మహేందర్‌జీకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల పట్టా భూములకు నష్టం కలిగించే పాలెం సాండ్ బేరింగ్ ఏరియా రహదారి విస్తరణను నిలిపివేయాలన్నారు. గోదావరి ఒడ్డుకు ఇసుక రవాణా కోసం 60 అడుగుల వెడల్పుతో రోడ్డు పనులకు రెవెన్యూ అధికారులు సర్వే చేయడంతో రైతులు నష్టపోతున్నారన్నారు. ఈ నెల 11న రెవెన్యూ అధికారులు ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా సర్వేయర్‌తో కలిసి సర్వే చేస్తున్నారని, ఇసుక లారీల కారణంగా పంటలపై దుమ్ముపడి దిగుబడులు తగ్గి నష్టం వాటిల్లుతుందన్నారు. రైతుల హక్కులను కాలరాస్తు ఇసుక మాఫియాకు సహకరిస్తే రైతుల పక్షాన పోరాటాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రవింద్రాచారి, రైతులు సమ్మయ్య, శ్రీను, బాబు, సర్వేశ్వర్రావు, రామారావు, గిరిప్రసాద్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పోడు భూములకు ‘ఆన్లైన్’ కష్టాలు
ఏటూరునాగారం: అటవీ హక్కుల పథకం కింద పోడు పట్టాలు పొందిన రైతులకు ఆన్లైన్ చేయకపోవడంతో రైతు భరోసా, రైతు బీమా తదితర పథకాలు అందకుండా పోతుంది. బ్యాంకుల్లో రుణాలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ డబ్బులు కూడా రావడం లేదు. 2024 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 3,567 మంది రైతులు పథకాలను కోల్పోతున్నారు. గిరిజన రైతులకు చెందిన ఆధార్ కార్డులు వెరిఫికేషన్ చేసి గిరిజన సంక్షేమశాఖ హైదరాబాద్‌కు సమర్పించాల్సి ఉంది. కానీ ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో రైతు భరోసా పథకం మరుగున పడింది. ఇదేకాకుండా రైతు బీమా కూడా వర్తించకుండా పోతుంది. ఆన్లైన్ కాని పట్టాలు..రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ నుంచి ఆర్ఓఎఫ్ఆర్ ఆన్లైన్లో లాగిన్ ఇచ్చి అర్హులైన రైతుల పట్టాదారు పాసు పుస్తకం (ఆర్ఓఎఫ్ఆర్)ను ఆన్లైన్ చేయించాల్సిన ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయం అధికారులు స్థానికంగా ఉన్న ఐటీడీఏ ఎస్డీసీ, ఆర్ఓఎఫ్ఆర్ విభాగంలోని అధికారులకు లాగిన్ ఇవ్వలేదు. 2024 నుంచి ఇప్పటి వరకు లాగిన్ ఇవ్వకపోవడంతో ఆ పట్టాలు ఆన్లైన్ కాలేదు. వరంగల్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా గిరిజన రైతుల భూములున్నాయి. అందులో పోడు పట్టాలున్న రైతులు అధికంగా ఉన్నప్పటికీ ఆన్లైన్ చేయకపోవడం మూలంగా పీఎం కిసాన్, రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలు వర్తించకుండా పోవడంతోపాటు ఆర్థికంగా రైతులు నష్టపోతున్నారు. మూడేళ్లుగా జరగని ఎఫ్ఆర్సీ కమిటీగిరిజన ప్రాంతాల్లో పోడు చేసుకున్న రైతులకు వారి హక్కు కల్పించేందుకు ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్, ఐటీడీఏ ద్వారా ఫారెస్ట్ రైట్ కమిటీని సమావేశ పర్చాల్సి ఉంది. 2024 నుంచి ఇప్పటి వరకు ఎఫ్ఆర్సీ కమిటీ సమావేశం ఊసలేదు. ప్రతీ ఏడాదిలో రెండు మార్లు ఈ ఎఫ్ఆర్సీ కమిటీ సమావేశమై కొత్తగా పోడు ఉన్నాయా, 2006 పూర్వం ఉన్న పోడు ఎన్ని ఎకరాలు, ఎంత మంది రైతులు, వారు నిజమైన గిరిజనులు, అర్హులేనా అనేక అంశాలను కమిటీ కూర్చొని పరిశీలన చేస్తోంది. కానీ కమిటీ సమావేశాలు జరగకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలిపోయింది. 2024 నుంచి అధికారులకు లాగిన్ ఇవ్వని పరిస్థితి రైతు భరోసా, తదితర పథకాలకు దూరమవుతున్న రైతులు ఉమ్మడి జిల్లాలో 3,567 మంది గిరిజనులు మా భూములు ఆన్లైన్ చేయాలి అల్లంవారిఘణపురం సమీపంలోని గుర్రాలబావిలో పట్టా భూములను ఆన్లైన్ చేయాలి. మా పేరు మీద పట్టాలు ఉన్నప్పటికీ ఆ భూముల్లోకి గిరిజనులను రానివ్వకుండా గొత్తికోయలు అడ్డుకొని ఇబ్బంది పెడుతున్నారు. మా పేరు మీద పట్టాలున్నా..అధికారులు ఆన్లైన్ చేయడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఆన్లైన్లో మా పేర్లు లేకపోవడంతో ఆర్థికంగా నష్టం జరుగుతుంది. –ఆర్కే సమ్మయ్య, అల్లంవారిఘణపురం, ఏటూరునాగారం -
వైద్యులు లేని పల్లె దవాఖాన
వెంకటాపురం(కె): మండలంలోని రంగరాజాపురం కాలనీలోని పల్లె దవాఖానాలో డాక్టర్ లేకపోవడంతో ఆశ వర్కరే అన్ని చూసుకుంటున్నారు. ఉదయం పది గంటలకు ఆశ వర్కర్ వచ్చి సెంటర్ ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ విధులు నిర్వర్తించిన వైద్యులు ఉన్నతచదువుల నిమిత్తం వెళ్లగా మళ్లీ ఎవరినీ కేటాయించలేదు. ఏఎన్ఎం ఉన్నా సమయపాలన పాటించడం లేదు. దీంతో వైద్యశాలకు వచ్చిన రోగులకు తిప్పలు తప్పడం లేదు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఆశ వర్కర్లే మందులు అందజేస్తున్నారు. వైద్యశాలలో సిబ్బంది లేకపోవడంతో ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. -
అందుబాటులో ఉండని వైద్యులు
కన్నాయిగూడెం: మండలంలోని పల్లె దవాఖానలో ఆశ కార్యకర్తలే వైద్యం చేస్తున్నారు. పేరు కు మాత్రమే వైద్యులు, ఏఎన్ఎంలు రికార్డులో డ్యూటీలో ఉన్నట్లు చూ పుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆశ కార్యకర్తలే వైద్యం చేస్టున్నట్లు తెలుస్తుంది. గురువారం ఉదయం 10 గంటలకు పల్లె దవాఖానను సాక్షి విజిట్ చేయగా.. ఆశ కార్యకర్త మాత్రమే డ్యూటీలో ఉ న్నారు. రాజన్నపేట సబ్ సెంటర్‌ను పరిశీలించగా.. డాక్టర్, ఏఎన్ఎం లే రు. ఆశ కార్యకర్త ఉన్నారు. మండల కేంద్రంలోని హెల్త్ సెంటర్లో 10.30గంటకు డాక్టర్ లేకపోవడంతో నర్సు రోగులకు వైద్యం చేస్తున్నారు. -
కపాలినీ, భగమాలినీ క్రమాల్లో భద్రకాళి అమ్మవారు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం అమ్మవారికి కపాలినీ, భగమాలినీ క్రమాల్లో పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు ఉదయం నుంచి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, క్షీరాన్ననివేదన, చతుఃస్థానార్చన తదితర పూజలు నిర్వహించారు. దశమహావిద్యలలోని కాళీక్రమాన్ని అనుసరించి అమ్మవారి స్నపన మూర్తిని కపాలినీగా, షోఢశీ క్రమాన్ని అనుసరించి అమ్మవారి బోగభేరాన్ని భగమాలినీగా అలంకరించి నవరాత్ర విశేష పూజలు జరిపారు. ఆలయ ఈఓ రామల సునీత, సిబ్బంది పర్యవేక్షించారు. -
సిబ్బంది ఉండరు
వైద్యులు రారు..పల్లె దవాఖానాలపై నిర్లక్ష్యం ● సమయపాలన పాటించని వైద్యులు ● వంతుల వారీగా విధులకు హాజరవుతున్న ఏఎన్ఎంలు ● కొన్ని సెంటర్లలో ఆశ కార్యకర్తలే దిక్కు.. ● జిల్లాలోని సబ్ సెంటర్లను విజిట్ చేసిన ‘సాక్షి’ ములుగు: పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందు కు ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన హెల్త్ సబ్ సెంటర్లలో వైద్యులు విధులకు సక్రమంగా హాజరు కాకపోవడం, ఏఎన్ఎంలు వారానికి రెండు రోజు లు మాత్రమే హాజరవుతోండడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. జిల్లాలో 15 ప్రాథమిక ఆ రోగ్య కేంద్రాల పరిధిలో 89 సబ్ సెంటర్లు ఉండగా అందులో 51 సబ్ సెంటర్లను 2022లో పల్లె దవా ఖానాలుగా (ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్) అప్ గ్రేడ్ చేసి ప్రభుత్వం వైద్యులను నియమించింది. ఒక్కొక్క సబ్ సెంటర్లో వైద్యుడితోపాటు ఇద్దరు ఏఎన్ఎంలు విధులు నిర్వహించాల్సి ఉంది. ఇద్దరు ఏఎన్ఎంలు ఉన్నచోట ఒకరు మాత్రమే విధులకు హాజరవుతున్నారు. నేడు నేను.. రేపు నీవు.. అని వంతుల వారీగా ఏఎన్ఎంలు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. వైద్యులు, సిబ్బంది పట్టణానికి పరిమితమై చుట్టపుచూపుగా ఆస్పత్రులకు వస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సమయపాలన పాటించకుండా విధులకు ఆలస్యంగా హాజరవుతూ మధ్యాహ్నమే వెళ్లిపోతున్నట్లు తెలిసింది. సబ్ సెంటర్లలో ఆశ వర్కర్లే ప్రజలకు మందు ఇస్తున్నారు. అయితే ఉన్నతాధికారుల పర్యవేక్షణ, తనిఖీల వంటివి లేకపోవడంతోనే వైద్యశాఖలో ఇష్టారాజ్యం కొనసాగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని 10 మండలాల పరిధిలో 20 సబ్ సెంటర్లను గురువారం ‘సాక్షి’ విజిట్ చేయగా.. ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. గంగారంలో రోగులకు నిరాశే..ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండలంలోని గంగారం పల్లెదవాఖానను గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సాక్షి విజిట్ చేయగా వైద్యాధికారితోపాటు ఏఎన్ఎం కనిపించలేదు. ఆస్పత్రి తలుపులు మాత్రం తెరిచి ఉండగా, ఆశ వర్కర్ ఇంటికి వెళ్లిందని స్థానికులు తెలిపారు. చికిత్స కోసం వచ్చిన వారు సిబ్బంది కోసం వేచి చూసి నిరాశతో వెనుదిరిగినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. విధి నిర్వహణ సమయంలో ఆస్పత్రిని గాలికొదిలేయడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాజేడు: వాజేడు మండలంలోని పెనుగోలు కాలనీ, జగన్నాథపురం సబ్ సెంటర్(ఆయుస్మాన్ ఆరోగ్య మందిర్)లను గురువారం సాక్షి పరిశీలించింది. ఉదయం పదిన్నర వరకు జగన్నాథపురం సబ్ సెంటర్ తెరువ లేదు. పెనుగోలు గ్రామానికి మంజూ రైన సబ్ సెంటర్‌ను గుట్టలపై నిర్మించడం వీలుకాక పెనుగోలు కాలనీలో ఏర్పాటు చేశారు. కానీ భవనం నిర్మించ లేదు. అంగన్ వాడీ కేంద్రంలో నిర్వహణ కొనసాగిస్తున్నప్పటికి ప్రతీ బుధవారం ఏఎన్ఎం వచ్చి పరీక్షలను చేసి మందులను ఇస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ రెండు సెంటర్లలో వైద్యులు మాత్రం రావడం లేదని స్థానికులు తెలిపారు.10.30గంటలకు కూడా తెరుచుకోని జగన్నాథపురం సబ్ సెంటర్ -
ఇలా చేస్తేనే ఫలితం
ఏఐ నుంచి కచ్చితమైన, ఉపయోగకరమైన ఫలితాలు పొందాలంటే అధికారులు నాలుగు దశల ప్రాంప్ట్ ఫ్రేమ్‌వర్క్ పాటించాలి. ముందుగా మీ పాత్రను స్పష్టంగా పేర్కొనాలి. తర్వాత ఏ పనిచేయాలో టాస్క్ రూపంలో వివరించాలి. ఆపై సంబంధిత గణాంకాలు, తేదీలు, అవసరమైన సమాచారం వంటి వివరాలు ఇవ్వాలి. చివరగా సమాధానం ఏ రూపంలో కావాలో ఫార్మాట్‌ను సూచించాలి. ఈ నాలుగు అంశాలను స్పష్టంగా ఇవ్వడం ద్వారా ఏఐ మరింత కచ్చితమైన, అవసరానికి అనుగుణమైన సమాధానాలు అధికారులకు అందిస్తుంది. – వాసుదేవ నటరాజ్, ఏఐ ట్రైనర్, టీఫైబర్అంశం పనిభారం తగ్గే శాతం80%పవర్‌పాయింట్/రిపోర్టులు ప్రజా ఫిర్యాదులు డేటా విశ్లేషణ తెలుగు అనువాదం మీటింగ్ మినిట్స్ డాక్యుమెంట్ సారాంశం లెటర్ల తయారీ82%85%88%90%92%95%ఏఐతో శాఖల వారీగా ప్రయోజనాలు ఇలా..ఏఐతో ప్రభుత్వ కార్యాలయాల్లో మార్పులు.. -
కనీస వైద్యం కరువు
మంగపేట: పల్లె దవాఖానాల్లో ప్రజలకు కనీస వైద్యం అందడంలేదు. మంగపేట పీహెచ్సీ పరిధిలోని చెరుల్లి, బ్రాహ్మణపల్లి పీహెచ్సీ పరిధిలోని దోమెడ పల్లె దవాఖానలను గురువారం సాక్షి విజిట్ చేసింది. చెరుపల్లిలోని పల్లె దవాఖానాలో వైద్యాధికా రి, ఏఎన్ఎం హాజరుకాలేదు. ఆశాకార్యకర్త చంద్రవాణి మాత్రమే ఉన్నా రు. దోమెడ పల్లె దవాఖానకు తాళం వేసి ఉంది. దోమెడలో మూడేళ్లుగా వైద్యాధికారిని నియమించలేదని.. దీంతో వారంలో రెండు సార్లు ఏఎన్ఎం వస్తుందని, ఆశాకర్యకర్తలు తాళం తీస్తారని గ్రామస్తులు తెలిపారు. -
సిబ్బంది కొరత
ములుగు రూరల్: మండలంలోని రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫార్మసిస్టు లేక స్టాఫ్ నర్సు విధులు నిర్వహిస్తున్నారు. పీహెచ్సీ పరిధిలో 13 సబ్ సెంటర్లు ఉండగా ఫార్మసిస్టు కొరత కారణంగా సకాలంలో సబ్ సెంటర్లకు మందులు పంపిణీ చేయడం ఇబ్బందిగా మారుతుంది. పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు ఉండాలి.. కానీ ఒకరు పీజీ కోర్సు చదవడానికి వెళ్లగా మరొకరు జిల్లా ఇమ్యునేషన్ ప్రోగ్రాం అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో మల్లంపల్లి పల్లె దవాఖాన వైద్యుడికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక ఇద్దరు స్టాఫ్ నర్సుల్లో ఒకరు సెలవులో ఉన్నారు. జంగాలపల్లి పల్లె దవాఖానలో వైద్యురాలు విధులకు గైర్హాజరు కావడంతో ఏఎన్ఎం రోగులకు మందులు ఇచ్చి పంపించారు. సాక్షి విజిట్ చేయగా.. గురువారం 15 మంది అవుట్ పేషెంట్లు ఆస్పత్రికి వచ్చినట్లు తెలిపారు. -
హేమాచల క్షేత్రంలో వేలం
మంగపేట : మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 17 నుంచి 2026 ఏప్రిల్ 16 వరకు ఫొటోలు తీసుకునేందుకు, చెప్పుల స్టాండ్, కొబ్బరి ముక్కలు పోగుచేసుకునేందుకు, పాత ఇనుప సామగ్రికి ఆలయ ఇన్చార్జ్ కార్యనిర్వాహణ అధికారి ఎం.వీరస్వామి ఆధ్వర్యంలో గురువారం బహిరంగ వేలం నిర్వహించారు. ఫొటోలు తీసుకునేందుకు మల్లూరుకు చెందిన అటిక ముత్తయ్య రూ.22,500, చెప్పుల స్టాండ్ వై.నర్సింహారావు రూ.34,500, కొబ్బరి చిప్పలు రూ.91,000, పాత ఇనుప సామగ్రి రూ.8,000కు వనపర్తి భిక్షపతి వేలం ద్వారా దక్కించుకున్నట్లు వీరస్వామి తెలిపారు. వేలం పరిశీలకులుగా కొమ్మాల లక్ష్మీనర్సింహాస్వామి దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి ప్రసాద్, ఆలయ అర్చకులు ముక్కామల రాజశేఖర్‌శర్మ, పవన్‌కుమార్ ఆచార్యులు, సిబ్బంది గోనె లలక్ష్మీనారాయణ, శేషు పాల్గొన్నారు. కన్నవారిని పట్టించుకోకపోతే చర్యలు ములుగు : వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం ప్రకారం కన్నవారిని కొడుకులు పట్టించుకోకుంటే చర్యలు తప్పవని 2007 చట్టాన్ని కచ్ఛితంగా అమలు చేస్తామని సీనియర్ సిటిజన్ పోషణ సంక్షేమ ట్రిబ్యునల్ అధికారి, ఆర్డిఓ కృష్ణవేణి గురువారం తెలిపారు. ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామానికి చెందిన గాదె నక్షత్రారెడ్డి, జేసితమ్మలు తాము సంపాదించిన ఆరు గుంటల స్థలాన్ని తమ కుమారులు గాదె అశోక్‌రెడ్డి, గాదె అబ్రహంరెడ్డికి సమానంగా పంచిన అనంతరం తమను పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ క్రమంలో నక్షత్రారెడ్డి కుమారులకు 2007 చట్టం సెక్షన్ 5(1) ప్రకారం నోటీసులు జారీ చేసి జూన్ 30వ తేదీన విచారణ చేసిననట్లు తెలిపారు. విచారణలో తల్లిదండ్రులను పట్టించుకోవడంలేదని తేలడంతో 2007 చట్టం సెక్షన్ 9(1) సెక్షన్ 4 ప్రకారం వారు సంపాదించిన ఆస్తిలో కొడుకులు జోక్యం చేసుకోవద్దని, తమ ఉత్తర్వులు పాటించకుంటే చట్ట ప్రకారం కేసునమోదు చేస్తామని తెలిపారు. ఎక్స్‌ప్రెస్ బస్సులు తగ్గించలేదు హన్మకొండ: హైదరాబాద్ రూట్లో ఎక్స్‌ప్రెస్ బస్సులు తగ్గించారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ భవానిప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరంగల్–హైదరాబాద్ (ఉప్పల్, జేబీఎస్, జగద్గిరిగుట్ట, కూకట్పల్లి, బీహెచ్ఎల్) మార్గంలో ప్రస్తుతం మహాలక్ష్మి ఎ క్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సులు ప్రతీ 20 నిమి షాలకు ఒక సర్వీస్ చొప్పున నడుస్తున్నట్లు వివరించారు. హనుమకొండ బస్ స్టేషన్ నుంచి మొ దటి బస్సు ఉదయం 04:30 గంటలకు, చివరి బస్సు రాత్రి 08:30 గంటలకు బయల్దేరుతుంద ని, రోజుకు మొత్తం 49 ట్రిప్పులు నడుస్తున్నట్లు తెలిపారు. హనుమకొండ నుంచి జనగామకు ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు చొప్పున 53 ట్రిప్పులు.. జనగామ నుంచి ఉప్పల్‌కు ప్రతి 16 నిమిషాలకు ఒక బస్సు చొప్పున మొత్తం 60 ట్రిప్పులు నడుపుతున్నట్లు వివరించారు. మహాలక్ష్మి పథకం దృష్టిలో పెట్టుకొని కరీంనగర్, కాళేశ్వరం, ఖమ్మం, సిద్దిపేట రూట్లలో అదనంగా బస్సు ట్రిప్పులు పెంచినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు ఇచ్చిన వినతుల మేరకు మహాలక్ష్మి పథకం సౌకర్యాన్ని కల్పించేందుకు వివిధ రూట్లలో 77 సర్వీస్‌లు నడుపుతుట్లు పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలుకు ఆర్టీసీ వరంగల్ రీజియన్ చిత్తశుద్ధితో ముందుకు వెళ్తోందని ఆర్ఎం తెలిపారు. -
అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి
ఏటూరునాగారం: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్‌లు, అధికారులు సమస్యలపై దృష్టిసారించి పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, సీ్త్ర శిశు సంక్షేమశాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధ్యక్షతన గురువారం నిర్వహించిన అధికారులు, సర్పంచ్ల సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో అనేక సమస్యలుంటాయని, వాటిని సకాలంలో గుర్తించి ప్రజల ఇబ్బందులు తొలగించాల్సిన అవసరం మనపై ఉందన్నారు. అటవీ ప్రాంతాల్లో అటవీశాఖ అనుమతులు లేకుండా లింకు రోడ్ల అభివృద్ధికి వివరాలను ఐటీడీఏ పీఓకు అందజేయాలని సర్పంచ్‌లను కోరారు. ‘ఇందిరమ్మ’ నిర్మాణాల్లో వేగం పెంచాలి ఏజెన్సీ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని, ఆగస్టు 15వ తేదీన ఒంటరి మహిళలకు నూతన పింఛన్ అందించనున్నట్లు సీతక్క తెలిపారు. జాప్యం లేకుండా ఇళ్ల నిర్మాణాల టార్గెట్‌ను పూర్తి చేసుకుంటే మరో 5 వేల ఇళ్లను మంజూరు చేయిస్తానని సీతక్క తెలిపారు. ఒంటరి మహిళలు, ఇతర పింఛన్ల విషయంలో ఎంపీడీఓలు కార్యదర్శులతో మాట్లాడి అర్హులైన వారికి పింఛన్ రాకుంటే వివరాలను డీఆర్డీఏకు పంపించాలని ఆదేశించారు. అంతేకాకుండా విద్య, వైద్యం పై అధికారులు దృష్టిసారించాలన్నారు. రోగులకు వైద్యులు అందుబాటులో ఉంటూ పాము, తేలు, కాటు మందులను అందుబాటులో పెట్టుకోవాలని ఆదేశించారు. ఐటీడీఏకు రూ.1.50 కోట్లతో నూతన భవనం కోసం స్థలపరిశీలన చేయాలని ఐటీడీఏ ఇంజనీరింగ్ డీఈ ప్రశాంత్‌రెడ్డిని మంత్రి ఆదేశించారు. కరెంటు లేని గ్రామాలను గుర్తించాలని, గిరిజన గూడేలకు సొలార్ వెలుగు రాబోతున్నాయని మంత్రి తెలిపారు. అంగన్వాడీ భవనాలు, ప్రభుత్వ పాఠశాలలకు నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని డీఈ పురుషోత్తంను మంత్రి ఆదేశించారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో మహిళా సంఘాల అభివృద్ధి కోసం మహిళా శక్తి క్యాంటిన్లు, స్వయం ఉపాధి కోసం పసుపు, కారం, తదితర పరిశ్రమలను ఏర్పాటు చేసి ఆర్థికంగా ఎదిగేలా చూడాలన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు, సఫాయిలు, సర్పంచ్‌లకు ఒకటో తేదీన వేతనాలు పడుతాయని, ఆ విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ కాకులమర్రి శ్రీలత, డీఎఫ్ఓ వికాస్ మీనా, అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు, గ్రంథాలయ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, ఆర్డీఓ కృష్ణవేణి పాల్గొన్నారు. సర్పంచ్‌లు, అధికారులు సమస్యలపై దృష్టి పెట్టాలి ఆగస్టు 15 నుంచి ఒంటరి మహిళలకు పింఛన్ సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క -
డిజిటలైజేషన్‌పై దృష్టి సారించాలి
● జిల్లా ఎన్నికల నమోదు అధికారి, ఆర్డీఓ కృష్ణవేణిములుగు: ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయడంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు కీలక పాత్ర పోషించాలని జిల్లా ఎన్నికల నమోదు అధికారి, ములుగు ఆర్డీఓ కృష్ణవేణి పేర్కొన్నారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ–2026 కార్యక్రమంలో భాగంగా గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం జిల్లా కేంద్రంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కృష్ణవేణి మాట్లాడుతూ జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేసేందుకు బీఎల్ఓలు ప్రజలను చైతన్యపర్చాలని సూచించారు. వార్డుల వారీగా బీఎల్ఏలు, బీఎల్వోలు సమన్వయంతో పనిచేసి ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం ములుగు మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను ఆర్డీఓ కృష్ణవేణి పరిశీలించారు. సంబంధిత అధికారులకు, బీఎల్ఓలకు సూచనలు చేశారు కార్యక్రమంలో తహసీల్దార్ విజయభాస్కర్, డిప్యూటీ తహసీల్దార్ సతీష్, ఎన్నికల డీటీ సతీష్, మెప్మా ఏడీఎంసీ వహీదా పాల్గొన్నారు. -
రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు
వరంగల్ ఆర్ఓ: రూ.84,651 భూపాలపల్లి: రూ.17,004 నర్సంపేట: రూ.6,550 భీమదేవరపల్లి: రూ.6,147 కొడకండ్ల: రూ.3,294 స్టేషన్ ఘన్పూర్: రూ.3,754 ములుగు: రూ.18,000 వర్ధన్నపేట: రూ.6,550 డీఐజీ కార్యాలయం: రూ.24,989కాజీపేట అర్బన్: సర్కారుకు ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తున్న రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ కార్యాలయాలకు శాశ్వత భవనాలను నిర్మించాలనే సంకల్పంతో ఈనెల 7న జీఓ ఆర్టీ నంబర్ 414ను ప్రభుత్వం విడుదల చేసింది. అద్దె భవనాల్లో కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తే అద్దె మిగులుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎనిమిదితో పాటు డీఐజీ కార్యాలయం కూడా అద్దె భవనాల్లోనే కొనసాగుతుండగా కొడకండ్లలో నిర్మాణంలో ఉంది. కాగా, ఏడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు డీఐజీ కార్యాలయం అద్దెలో కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో పూర్తిస్థాయిలో శాశ్వత భవనాలు నిర్మాణంలోకి వస్తే మెరుగైన సౌకర్యాలు లభించే అవకాశం ఉంటుంది. స్థల సేకరణకు కలెక్టర్లకు వినతులు ఉమ్మడి జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నర్సంపేట, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్పూర్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ ఆర్‌ఓలో డీఐజీ, జిల్లా రిజిస్ట్రార్ ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలకు భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సోమ, మంగళవారాల్లో వినతులు అందజేశారు. ఒక్కో కార్యాలయానికి ఒక్కో ఎకరం భూమి అందుబాటులోకి తెచ్చుకోవాలని, స్థల సేకరణ పూర్తి కాగానే ప్రభుత్వమే స్వయంగా శాశ్వత భవనాలను నిర్మించనున్నట్లు జీఓలో పేర్కొన్నారు. ప్రతీ నెల మిగలనున్న రూ.1,88,852 అద్దె ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని ఎనిమిది కార్యాలయాలు, డీఐజీ కార్యాలయం అద్దె భవనాల్లో కొనసాగుతుండడంతో ప్రతి నెల1,88,852 రూపాయలను అద్దె రూపంలో చెల్లిస్తున్నారు. ప్రభుత్వం శాశ్వత భవనాలను నిర్మిస్తే ఈ మొత్తం నగదు మిగలనుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల అద్దెలు ఇలా.. స్థలం సేకరించాలని ప్రభుత్వం ఆదేశాలు కలెక్టర్లకు వినతుల అందజేత అద్దెలకు చెక్.. ఖజానాకు మిగలనున్న ఆదాయం -
ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలి
ములుగు: ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు వ్యవసాయం, ఉద్యానశాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్‌జీ పిలుపునిచ్చారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నీటి పారుదల, వ్యవసాయ, ఉద్యాన, భూగర్భ జల వనరుల శాఖల అధికారులతో బుధవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల గురించి రైతులకు వ్యవసాయ విస్తరణ అధికారులు వివరించి చెప్పాలన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో సాగు చేసిన పంటల వివరాల నివేదికను తయారు చేసుకోవాలన్నారు. జిల్లాలో ఉన్న సాగునీటి వనరుల ద్వారా గతేడాది ఎన్ని ఎకరాల్లో వరి సాగు చేశారు.. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పంట పొలాలకు సాగునీరు అందుతుందా.. లేదా అని అంచనా వేసుకొని రైతులకు తెలపాలని సూచించారు. ఇప్పటికే భూగర్భ జల వనరుల శాఖ ఇచ్చిన నివేదికలు ఆశించిన స్థాయిలో లేవని, పంటల మార్పిడి ఆవశ్యకత ఉందని వివరించాలన్నారు. ఆయిల్‌పామ్ కేవలం ఉద్యానశాఖకు సంబంధించినదేనని ఏఈవోలు నిర్లక్ష్యం చేయకుండా ఉద్యానశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని ఆయిల్‌పామ్ సాగు లక్ష్యాన్ని చేరుకోవాలని స్పష్టం చేశారు. ఇక నుంచి ప్రతీవారం అధికారుల డ్యూటీ చార్ట్ నివేదికను తనకు పంపించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంపత్‌రావు, విద్యుత్ శాఖ ఎస్ఈ భిక్షపతి, డీఏఓ సురేశ్ కుమార్ పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ మహేందర్‌జీ -
ఇసుక పేరుతో రూ. వేల కోట్ల దోపిడీ
ములుగు: రాష్ట్ర ప్రభుత్వం రెండున్నర ఏళ్ల పాలనలో ప్రజల సమస్యలను గాలికొదిలేసి ఇసుక పేరుతో వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతుందని రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీశ్‌రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో డీసిల్టేషన్ పేరుతో అక్రమంగా ఇసుకను తరలించి నాలుగు వేల కోట్ల రూపాయలను కాజేసేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుందని తెలిపారు. ఇప్పటికే ఒక కోటి క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ ఇసుక అక్రమ తవ్వకాలపై కలెక్టర్‌కు ఇటీవల వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని, అక్రమంగా తవ్విన ఇసుక విక్రయాలను నిలిపివేసే ఉత్తర్వులు తొందరలోనే వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తాము ఫిర్యాదు చేసిన వెంటనే మైనింగ్ నిలిచిపోయిందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై చర్చించాల్సిన ప్రభుత్వం ఇసుక కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం పనిచేస్తోందని విమర్శించారు. ఇప్పటివరకు ఇసుక లారీల ప్రమాదాల్లో 40 నుంచి 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. గోవిందరావుపేట మండలంలో బీసీ లోన్ మంజూరుకు తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసిన తహసీల్దార్, ఆర్ఐను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. కాంగ్రెస్ నేతల మెప్పుకోసం అమాయకులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి వారిని మొద్దుకు వేసిన ఫొటోలను సైతం కాంగ్రెస్ నేతలకు పంపుతున్న పోలీసులు తమ వైఖరి మార్చుకోవాలన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండలాద్యక్షుడు సానికోమ్ము రమేశ్‌రెడ్డి, నాయకులు మల్క రమేశ్, చెన్న విజయ్, నూనవత్ మహేశ్, బైకాని సాగర్, గొర్రె సమ్మయ్య, గరిగె రఘు, అమర్‌సింగ్, ఓదేలు, భిక్షపతి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. రెడ్కో మాజీ చైర్మన్ సతీశ్‌రెడ్డి -
ప్రతిభతోనే గుర్తింపు
● స్వయం ఉపాధిపై దృష్టి సారించాలి ● ీపీఓ లెనిన్ వత్సల్ టొప్పోఏటూరునాగారం: ఏ రంగంలోనైనా ప్రతిభ కనబర్చినప్పుడే తగిన గుర్తింపు వస్తుందని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. మండల కేంద్రంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో ప్రపంచ యువత నైపుణ్యోత్సవ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు వివిధ రంగాల్లో శిక్షణ పొందిన నిరుద్యోగులకు పీఓ అవగాహన కల్పించారు. చదువుకున్న యువత ఏపనిచేసినా ఇష్టంతో చేస్తేనే లక్ష్యాన్ని చేరుకుంటారని సూచించారు. ఐటీడీఏ పరిధిలోని ఐదు వైటీసీలలో బ్యూటీషియన్, టైలరింగ్, హోటల్ మేనేజ్మెంట్లో శిక్షణ పొందిన 558 మంది నిరుద్యోగులు స్వయం ఉపాధిపై దృష్టిసారించి రాణించాలన్నారు. నేర్చుకున్న శిక్షణపై దృష్టి సారించి ఆ దిశగా రాణించాలని సూచించారు. గిరిజన నిరుద్యోగులకు, విద్యార్థులకు శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి, బుక్స్, మెటీరియల్, యూనిఫాంలు అందజేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జేడీఎం కొండల్రావు, శిక్షణ సంస్థ ప్రతినిధులు, యువతీ యువకులు పాల్గొన్నారు. -
శిక్షణ ఫలాలు విద్యార్థులకు చేర్చాలి
● జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి ములుగు/ములుగు రూరల్: శిక్షణ తరగతుల్లో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి పాఠశాలల్లో అమలు చేయాలని, విద్యార్థులకు శిక్షణ ఫలాలు అందేలా కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బండారుపల్లి మోడల్ స్కూల్లో మూడు రోజులుగా హిందీ, ఫిజికల్సైన్స్, ఇంగ్లిష్ ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. ఈ ముగింపు సమావేశానికి డీఈఓ సిద్ధార్థరెడ్డి హాజరై మాట్లాడారు. ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో ప్రతీ విద్యార్థి అమ్మ పేరుపై ఒక మొక్క నాటేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. క్రమం తప్పకుండా పాఠశాలలకు విద్యార్థులు హాజరయ్యేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలన్నారు. -
అధికార పక్షానికే
గురువారం శ్రీ 16 శ్రీ జూలై శ్రీ 2026మెరుగైన వైద్యసేవలు అందించాలిములుగు: సహకార పదవుల భర్తీ విషయంలో ఉత్కంఠకు తెరపడింది. నామినేటెడ్ పద్ధతిలోనా.. లేక ఎన్నికలా... అనే అంశంపై గత కొంతకాలంగా సందిగ్ధత నెలకొంది. నామినేటెడ్ పద్ధతిలోనే సహకార పదవుల భర్తీ జరుగుతుందని ప్రభుత్వం తేల్చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాలు ఏర్పాటు నామినేటెడ్ విధానంలో ఎంపిక కావడంతో ఈనెలాఖరులోగా మిగిలిన జిల్లాల్లో పీఏసీఎస్ పాలకవర్గాలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆశావహుల జాబితా అదిష్టానానికి చేరగా చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల ఎంపికపై కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది. నామినేటెడ్ పద్ధతిలో పదవులను భర్తీ చేస్తుండడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. జిల్లాలోని 12 పీఏసీఎస్‌లకు 12 మంది చైర్మన్లు, 12 మంది వైస్ చైర్మన్లతో పాటు 132 మంది డైరెక్టర్లు నామినేటెడ్ పద్ధతిలో ఎంపిక కానున్నారు. ఈ నెలాఖరులోగా జిల్లాలో నూతన పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. తొలిసారిగా నామినేటెడ్ పద్ధతిలో..సహకార వ్యవస్థలో పీఏసీఎస్ పదవులు తొలిసారిగా నామినేటెడ్ పద్ధతిలో భర్తీ కానున్నాయి. పీఏసీఎస్‌లకు 2020 ఫిబ్రవరి 15న ఎన్నికలు నిర్వహించారు. ఫిబ్రవరి 16న చైర్మన్లను ఎన్నుకోగా 2025 ఫిబ్రవరి 16తో పాలకవర్గాల గడువు ముగిసింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా ఆరు నెలల పదవీ కాలాన్ని పొడగించింది. పొడగించిన పదవీకాలం ఆగస్టు 15తో ముగియనుంది. మరో ఆరు నెలల పాటు పదవీకాలాన్ని ప్రభుత్వం పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ పాలకవర్గాల పనితీరు బాగున్న సంఘాలను మాత్రమే పొడగించాలని, సొసైటీ అభివృద్ధికి పాటుపడాలని పాలకవర్గాలను రద్దు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొనడంతో జిల్లాలోని 12 పాలకవర్గాల్లో 3 సొసైటీలు రద్దయ్యాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లకుండా నామినేటెడ్ పద్ధతిలో పాలకవర్గాలను నియమిస్తుండడంతో కాంగ్రెస్ నేతల్లో సంబురాలు నెలకొన్నాయి.వెంకటాపురం(ఎం) పీఏసీఎస్ కార్యాలయంకాంగ్రెస్ నేతల్లో జోష్.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా పదవులు లేవని కాంగ్రెస్ నేతలు అసంతృప్తిలో ఉన్నారు. జిల్లాలో పీఏసీఎస్‌లకు నామినేటెడ్ పద్ధతిలో పాలకవర్గాలను ప్రభుత్వం నియమిస్తుందనే సమాచారంతో ఆశావహుల్లో ఒక్కసారిగా ఆశలు రెకేత్తాయి. సహకార పదవులను నామినేటెడ్ పద్ధతిలో కాంగ్రెస్ నేతలకు ఇవ్వడం మూలంగా కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొన్న నిరాశను తొలగించవచ్చని ప్రభుత్వం భావించి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు తెలిసింది. పీఏసీఎస్ కమిటీ పదవులను ఆశిస్తున్న వారి జాబితా ఇప్పటికే అధిష్టానానికి చేరినట్లు సమాచారం. మండలాల వారీగా నాయకులు, కార్యకర్తల అభిప్రాయాన్ని సేకరించిన తర్వాతనే పీఏసీ ఎస్ పాలకవర్గాలను మంత్రి సీతక్క ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. గతంలో జరిగిన జీపీ ఎన్నికలు, రాబోయే పరిషత్ ఎ న్నికలను దృష్టిలో పెట్టుకొని పీఏసీఎస్ పాలకవర్గాల కమిటీలను ప్రకటించనున్నట్లు సమాచారం. డీఎంహెచ్ఓ గోపాల్‌రావు సహకార సంఘాలకు పాలకవర్గాలు నామినేటెడ్ పద్ధతిలో నియామకాలు నెలాఖరులోగా పాలకవర్గాలను ప్రకటించే అవకాశం -
పోడు భూముల సాగును అడ్డుకోవద్దు
ఏటూరునాగారం: పోడు భూముల సాగును ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం సరికాదని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దావూద్ అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం, అటవీశాఖ రేంజ్ కార్యాలయం ఎదుట రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను ఐటీడీఏ ఎస్డీసీ గంట ప్రతాప్, అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ అశోక్‌కు అందజేశారు. ఈ సందర్భంగా దావూద్, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కోరం చిరంజీవి మాట్లాడుతూ కన్నాయిగూడెం మండల పరిధిలోని మలకపల్లి గ్రామంలోని ఆదివాసీ కుటుంబాలు దాదాపు 25 ఏళ్లుగా భూములను ట్రాక్టర్లతో సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాయని తెలిపారు. గతంలో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయని ఫారెస్ట్ అధికారులు ఈ ఏడాది ట్రాక్టర్లతో దున్నుకోవద్దని చెప్పడంతో ఆదివాసీలు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. వ్యవసాయ పనులు ప్రారంభమైన ఈ సమయంలో సాగు పనులు ఆలస్యమైతే పంటలు దెబ్బతిని ఆదివాసీ రైతు కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను తక్షణమే పరిష్కరించి ఆదివాసులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కృష్ణ బాబు, దేవయ్య, టీఎల్ రవి, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు తోలం కృష్ణయ్య, రైతులు భద్రయ్య, పవన్, చుక్కయ్య, రాజు, భీమయ్య, రమేశ్ పాల్గొన్నారు. ఐటీడీఏ ఎదుట ధర్నాలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దావూద్ -
పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి
ములుగు: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని టీపీయూఎస్ జిల్లా అధ్యక్షురాలు వాంకుడోతు జ్యోతి, ప్రధాన కార్యదర్శి గోనె రవీందర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యారంగంలో పెండింగ్‌లో ఉన్న పలు కీలక అంశాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. పీఆర్సీ రిపోర్టును తక్షణమే విడుదల చేసి 51శాతం ఫిట్మెంట్ ప్రకటించాలని కోరారు. అలాగే పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల ఏర్పాటునకు అవసరమైన మౌలిక వసతుల కోసం గ్రాంట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీల క్యాలెండర్ ప్రకటించాలని కోరారు. సమస్యలు పరిష్కారం కాకపోతే వచ్చేనెల 1న రాష్ట్ర స్థాయిలో చేపట్టనున్న మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు హెచ్చరించారు. ధర్నాలో సంఘం నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణకు మణికిరీటం ‘తాడిచర్ల–2’
మల్హర్: తాడిచర్ల–2 కోల్‌బ్లాక్ తెలంగాణకు మణికిరీటంగా నిలుస్తుందని, తాడిచర్ల–2 కోల్‌బ్లాక్‌ను సింగరేణికి అప్పగించడం సంతోషకరమైన విషయమని కేంద్రమంత్రి బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. సింగరేణి భరోసాయాత్రలో భాగంగా మంగళవారం మండల కేంద్రం తాడిచర్లలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. తాడిచర్ల–2 నుంచి త్వరలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కానుందన్నారు. ఈ గని ద్వారా సుమారు 2,000 శాశ్వత ఉద్యోగాలు, మరో 5,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఈ ప్రాంతంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. గని కార్యకలాపాలతో వేలాది వాహనాల రాకపోకలు పెరిగి స్థానికంగా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ బ్లాక్ద్వారా సుమారు రూ.1.20 లక్షల కోట్ల టర్నోవర్ జరిగే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. భారతదేశంలోలోనే అతిపెద్ద కోల్బ్లాక్గా తాడిచర్ల–2 నిలుస్తుందని, ఇది ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న అద్భుత నిర్ణయమని కొనియాడారు. గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలు, సింగరేణి సంస్థ, తెలంగాణ ప్రజల తరఫున ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అవసరమైన అన్ని అనుమతులు, క్లియరెన్స్‌లు త్వరగా పొందిన అనంతరం సింగరేణి పనులు ప్రారంభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, రాష్ట్ర నాయకులు సునీల్‌రెడ్డి, నారాయణరెడ్డి, కీర్తిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నిషిధర్‌రెడ్డి, మల్క మోహన్‌రావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కోల్‌బ్లాక్ ద్వారా రూ.1.20 లక్షల కోట్ల టర్నోవర్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి -
క్షయ రోగుల వ్యయంపై సర్వే
వాజేడు: మండల పరిధిలోని పెదగంగారం సబ్ సెంటర్లో మంగళవారం క్షయ రోగుల వ్యయంపై సర్వేను డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్, ఎన్టీఈటీ తెలంగాణ ఆధ్వర్యంలో డాక్టర్ బెస్సీ నిర్వహించారు. చికిత్స సమయంలో క్షయ రోగుల నుంచి కుటుంబంపై పడుతున్న ఆర్ధిక భారం వివరాలను సేకరించారు. అదే సమయంలో వైద్య, ప్రయాణ, పోషకాహార, ఖర్చులతో పాటు ఉపాధిని కోల్పోయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బెస్సీ మాట్లాడుతూ సర్వే ద్వారా సేకరించే సమాచారంతో క్షయ రోగులకు భవిష్యత్తులో మెరుగైన సేవలతో పాటు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడటానికి ఉపయోగ పడుతుందన్నారు. ఆమె వెంట హెచ్ఈఓ వేణుగోపాల కృష్ణ, వెంకటేశ్వరరావు, తిరుపతి, శ్రీను సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ డీడీగా జనార్దన్ బాధ్యతల స్వీకరణ ఏటూరునాగారం: ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ (ట్రైబల్ వెల్ఫేర్)గా దబ్బగట్ల జనార్దన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నాగర్‌కర్నూల్ జిల్లా ట్రైబల్ డెవలప్మెంట్ అధికారిగా పనిచేస్తున్న ఫిరంగి ఉద్యోగోన్నతిపై ఇటీవల ఏటూరునాగారం ఐటీడీఏ డీడీ(టీడబ్ల్యూ)గా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో గతంలో ఓడీ (ఆన్‌డ్యూటీ డిప్యూటేషన్) ప్రాతిపదికన మంచిర్యాల జిల్లా ట్రైబల్ డెవలప్మెంట్ అధికారిగా పనిచేస్తున్న జనార్దన్ నియామక ఉత్తర్వులు రద్దు అయ్యాయి. అదే విధంగా తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ నుంచి అందిన ఆదేశాల మేరకు జనార్దన్ ఏటూరునాగారం ఐటీడీఏ డీడీ(ట్రైబల్ వెల్ఫేర్)గా వచ్చిన జాయినింగ్ రిపోర్టును పీఓ లెనిన్ వత్సల్ టొప్పోకు అందజేసి విధుల్లో చేరారు. అనంతరం పీఓకు మర్యాదపూర్వకంగా మొక్కను అందజేశారు. నేటి నుంచి శాకంబరీ ఉత్సవాలు హన్మకొండ కల్చరల్: వరంగల్ భద్రకాళి దేవాలయంలో బుధవారం శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం భద్రకాళి అమ్మవారికి సహస్ర కలశాభిషేకం నిర్వహించి ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు సహస్ర కలశాభిషేకంలో ఉపయోగించే వేయి మృత్తికా ఘటాలకు సూత్ర వేష్ఠనం (కుండలకు దారాలు చుట్టడం) జరిపారు. రాత్రి 7 గంటలకు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, తెలుపు రంగులలో సర్వాంగసుందరంగా మండల రచన చేశారు. చంద్రోదయం అనంతరం రాత్రి అంకురార్పణ జరిపారు. ఉత్సవానుజ్ఞ ప్రార్థనతో ప్రారంభం.. ఉదయం 5 గంటలకు నిర్మాల్య సేవలు, నిత్యాహ్నికం, ఉత్సవానుజ్ఞ ప్రార్థనతో అమ్మవారికి పూజలు ప్రారంభమవుతాయి. గౌరీగణపతి పూజ, చతుఃస్థానార్చన పూజలు, ఉదయం 10 గంటలకు అమ్మవారి సహస్ర కలశాభిషేకం చేయనున్నారు. ఉదయం, సాయంత్రం పూజలు శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అమ్మవారిని వివిధ కాళీక్రమాల్లో ఆరాధిస్తారు. ప్రతి క్రమానికి ప్రత్యేకత ఉండడం విశేషం. జూలై 29 వరకు జరిగే శాకంబరీ పూజల్లో భాగంగా బుధవారం ఉదయం కాళీ క్రమం, కామేశ్వరీ నిత్యాక్రమంలో పూజలు చేస్తారు. 16న కపాలినీ క్రమం, భగమాలినీ క్రమం, 17న కుల్లా క్రమం, నిత్యక్లిన్నా క్రమం, 18న కురుకుల్లా క్రమం, భేరుండా క్రమం, 19న విరోధిని క్రమం, వహ్నివాసినీ క్రమం, 20న విప్రచిత్తా క్రమం, మహావజ్రేశ్వరి క్రమం, 21న ఉగ్రా క్రమం, శివదూతీ క్రమం, 22న ఉగ్రాప్రభా క్రమం, త్వరితా క్రమం, 23న దీప్తా క్రమం, కులసుందరీ క్రమం, 24న నీలా క్రమం, 25న ఘనా క్రమం, నీలపతాకా, 26న బలాకా , విజయా క్రమం, 27న మాత్రా క్రమం, సర్వమంగళా క్రమం, 28న ముద్రా క్రమం, జ్వాలామాలినీ క్రమం, 29న మితాక్రమం, చిత్రానిత్యా క్రమాలలో పూజలు నిర్వహించనున్నారు. -
మగవారే అధికం!
● పుట్టుక.. చావులో పురుషులే ఎక్కువ ● సీఆర్ఎస్–24లో నివేదికలో ఉమ్మడి వరంగల్ ముఖచిత్రంమొత్తం జననాలు: 57,156మగ శిశువులు: 30,421, ఆడ శిశువులు: 26,735మొత్తం మరణాలు: 28,649(పురుషులు: 17,441, మహిళలు: 11,208) అత్యధిక జననాలు, మరణాలు: హనుమకొండ అత్యల్ప జననాలు: ములుగు అత్యల్ప మరణాలు: వరంగల్సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పుట్టుకై నా.. చావైనా.. మగవారిదే పైచేయి ఉంటోంది. అదే సమయంలో ఆడబిడ్డల జననాలు తగ్గడం కాస్త ఆందోళన కలిగే అంశంగా ఉంది. కేంద్ర జనగణన విభాగం ఇటీవల విడుదల చేసిన సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్) 2024 నివేదిక ప్రకారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో నమోదైన 57,156 జననాల్లో 30,421 మంది మగ శిశువులు, 26,735 మంది ఆడ శిశువులు ఉన్నారు. అంటే 3,686 మంది మగ శిశువులు ఎక్కువగా జన్మించారు. ప్రతి వెయ్యి మంది మగ శిశువులకు కేవలం 879 మంది ఆడ శిశువులే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. చిన్న కుటుంబాలవ్వడం, సంతానోత్పత్తి రేటు క్షీణించడం, కొన్ని ప్రాంతాల్లో సామాజిక అంశాలు ఆడపిల్లల జననాలపై ప్రభావం చూపుతున్నాయని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అలాగే, ఉమ్మడి జిల్లాలో నమోదైన 28,649 మరణాల్లో 17,441 మంది పురుషులు, 11,208 మంది మహిళలు ఉన్నారు. అంటే 6,233 మంది పురుషులు ఎక్కువగా మరణించారు. మహిళలతో పోలిస్తే పురుషులు వ్యవసాయం, నిర్మాణం, రవాణా, పరిశ్రమలు వంటి ప్రమాదకర వృత్తుల్లో ఎక్కువగా ఉండడం, రోడ్డు ప్రమాదాలు, గుండెజబ్బులు, మధుమేహం, రక్తపోటు, మద్యం, పొగాకు వినియోగం వంటి జీవనశైలి వల్ల మరణాలు ఎక్కువగా ఉండొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. జననాలు, మరణాలు హనుమకొండలోనే ఎక్కువ హనుమకొండ జిల్లాలో జననాలు, మరణాలు రెండూ అత్యధికంగా నమోదవగా, వరంగల్‌లో అత్యల్ప మరణాలు, ములుగులో అత్యల్ప జననాలు నమోదయ్యాయి. జననాల్లో ములుగు జిల్లాలో ప్రతి వెయ్యి మంది మగ శిశువులకు 991 మంది ఆడ శిశువులు ఉండడం సానుకూల సంకేతంగా కనిపిస్తోంది. మహబూబాబాద్ జిల్లాలో ఈ నిష్పత్తి 805కే పరిమితం కావడం ఆందోళన కలిగిస్తోంది. జననాల్లో ఆడబిడ్డల నిష్పత్తి పెరగడం, పురుషుల్లో జీవనశైలి వ్యాధులు, ప్రమాదాలను తగ్గించడం వంటి అంశాలపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాల్సిన అవసరముందని ఈ సీఆర్ఎస్ గణాంకాలు సూచిస్తున్నాయి.జిల్లా జననం మరణం మగ ఆడ మగ ఆడహనుమకొండ 13,464 11,920 8032 4,800 మహబూబాబాద్ 6,568 5,286 3185 2139 జనగామ 3,682 3,383 2,896 1,977 జయశంకర్ 3,189 2,875 1,198 740 వరంగల్ 2,056 1,822 774 447 ములుగు 1,462 1,449 1,356 1,105ఆడపిల్లల జననాలను ప్రోత్సహించాలి సీఆర్ఎస్–24 గణాంకాల ప్రకారం ఉమ్మడి వరంగల్‌లో ప్రతీ వెయ్యి మంది మగ శిశువులకు 879 మంది ఆడ శిశువులు నమోదవడం ఆందోళన కలిగించే అంశమే. బాలికల పుట్టుకను ప్రోత్సహించే పథకాలతో పాటు చట్టవిరుద్ధ లింగ నిర్ధారణపై కఠిన చర్యలు, సామాజిక అవగాహన కార్యక్రమాలు, బాలికల విద్య సంక్షేమానికి ప్రోత్సాహకాలు ప్రభుత్వాలు మరింత బలోపేతం చే యాలి. అప్పుడే లింగ నిష్పత్తి మెరుగుపడే అవకాశం ఉంటుంది. – మండల పరశురాములు, సామాజికవేత్త, వరంగల్ -
ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ పూర్తిచేయాలి
● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుములుగు: జిల్లాలో 61.86శాతం డిజిటలైజేషన్ పూర్తి అయిందని, ఫారాల సేకరణతో పాటు డిజిటలైజేషన్ గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం కలెక్టరేట్లో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రజలందరి సహకారంతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ఇంకా 82,994 ఫారాల సేకరణతో పాటు 38.14 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేయాల్సి ఉందన్నారు. గడువులోపు వందశాతం లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్నికల అధికారులు, బీఎల్ఓలు, బీఎల్ఏలు, రాజకీయ పార్టీలు, ప్రజలు సమష్టిగా కృషి చేయాలన్నారు. ప్రతీ ఇంటిని బీఎల్ఓలు తప్పనిసరిగా సందర్శించి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయడంతో పాటు, పూర్తిగా నింపిన ఫారాలను తిరిగి సేకరించాలని సూచించారు. తప్పుడు సమాచారం ఇవ్వకుండా, ఓటరు జాబితా ఖచ్చితత్వాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ఓటరు జాబితాలో పేర్లు ఉండేలా ప్రజలందరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు. పైలాన్ పనుల్లో వేగం పెంచాలి ములుగు రూరల్: జిల్లా అభివృద్ధి పనులను ప్రతిభింభించేలా ఉన్న పైలాన్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం పైలాన్ నిర్మాణ పనులు, సమీకృత కలెక్టరేట్ ఆవరణలో చేపడుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పైలాన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, జిల్లా ప్రగతి ప్రతిభింభించేలా పైలాన్ నిర్మాణం సాగుతుందని వివరించారు. నిర్మాణ పనుల పురోగతి గురించి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలు తప్పని సరిగా పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ఎదుట చేపట్టిన ల్యాండ్ స్కేపింగ్ పనులను పరిశీలించారు. పచ్చదనానికి ప్రాధాన్యత ఇస్తూ మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ అజయ్‌కుమార్, హర్టికల్చర్ అధికారి సంజీవరావు, మున్సిపల్ కమిషనర్ సంపత్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కరకట్టకు ఇసుక బస్తాలు
ఏటూరునాగారం: వర్షాకాలం వచ్చిందంటే కరకట్టకు ఇసుక బస్తాలను అడ్డుకట్ట వేయాల్సిందే. గత ఐదేళ్లుగా రామన్నగూడెం నుంచి ఏటూరునాగారం వరకు ఉన్న గోదావరి కరకట్ట పలు చోట్ల గండ్లు పడి మట్టి కోతకు గురవుతుంది. ఇటీవల జియో ట్యూబ్స్‌తో కొంతమేర అడ్డుకట్ట వేసినా ఇటీవల వచ్చిన వరదలతో మరో రెండు చోట్ల కరకట్ట మట్టి ఒర్లిపోయింది. దీంతో వర్షాల తీవ్రతతో గోదావరి ఉధృతిగా వస్తే కరకట్ట కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. గమనించిన ఇరిగేషన్ అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా మంగళవారం రెండు చోట్ల ఇసుక బస్తాలను వేయించారు. ఉన్నతాధికారులు స్పందించి శాశ్వత నిర్మాణానికి కాంక్రీట్ వాల్ నిర్మించాలని రైతులు వాపోతున్నారు. -
నేరాల నియంత్రణలో రాజీవద్దు
● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ములుగు రూరల్: పోలీస్ అధికారులు నేర నియంత్రణలో రాజీపడవద్దని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్హాల్లో అర్ధ వార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దొంగతనాలు, గంజాయి అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల వినియోగ నిర్మూలన, రోడ్డు ప్రమాదాల నివారణపై చర్చించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ దొంగతనాల నివారణకు గస్తీ విధులు పెంచాలని అధికారులను ఆదేశించారు. నేర నియంత్రణకు గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు గ్రామస్థాయిలో బలమైన సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణ అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. మైనర్లకు వాహనాలు నడపకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కల్తీ మద్యం, గుడుంబా తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాలను గుడుంబా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని తెలిపారు. కోర్టు విచారణలో ఉన్న కేసుల పురోగతిపై దృష్టి సారించాలన్నారు. కోర్టు కానిస్టేబుళ్ల పనితీరును పరిశీలించాలని పేర్కొన్నారు. కోర్టు కేసుల్లో సరైన సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టి నేరస్తులకు శిక్షపడే విధంగా చూడాలన్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి పారదర్శకంగా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పీ మమన్ భట్, అదనపు ఎస్పీ సదానందం, డీసీఆర్బీ డీఎస్పీ కిశోర్‌కుమార్, డీఎస్పీ రవీందర్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
నాటిన మొక్కలను సంరక్షించాలి
● డీపీఓ వెంకయ్య ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో రోడ్ల వెంట నాటిన మొక్కలను సంరక్షించాలని డీపీఓ కొండా వెంకయ్య సూచించారు. వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మేడారంలో రోడ్ల వెంట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నాటిన మొక్కలను మంగళవారం ఆయన పరిశీలించారు. మొక్కల చుట్టూ ట్రీ గార్డులు ఏర్పాటు చేసి, పశువులు, ఇతర కారణాలతో మొక్కలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించి, వాటి ఎదుగుదలకు అవసరమైన సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. మేడారం మహాజాతర సందర్భంగా రోడ్ల విస్తర్ణణ పనులు చేపట్టడంతో పాటు కలెక్టర్ అదేశాల మేరకు మొక్కలు నాటుతున్నట్లు తెలి పారు. నాటిన ప్రతీ మొక్కను సంరక్షించి పెద్ద చెట్టుగా తీర్చిదిద్దాలని సూచించారు. -
వనదేవతలకు మొక్కులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని మేడారం సమ్మక్క– సారలమ్మల సన్నిధిలో సోమవారం భక్తుల సందడి నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి వివిధ వాహనాల్లో తరలివచ్చి జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకుని పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు సమర్పించారు. ఎత్తు బంగారం, యాటలతో మొక్కులు చెల్లించుకున్నారు. రంగారెడ్డి జిల్లా మహాత్మాజ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల రీజియన్ సంయుక్త అధికారి బొంగిని రాజేశ్‌గౌడ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేశ్‌లు కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. -
సోలార్ టెక్నీషియన్ శిక్షణ ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో సోమవారం సోలార్ టెక్నీషియన్ శిక్షణ కార్యక్రమాన్ని ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో పునరుత్పాదక ఇంధన రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సోలార్ ఎనర్జీ రంగంలో నైపుణ్యం కలిగిన టెక్నీషియన్లకు విస్తృత ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. శిక్షణ పొందుతున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. సోలార్ ప్యానెళ్ల అమరిక, నిర్వహణ, లోపాల గుర్తింపు, మరమ్మతులు, ఇన్వర్టర్ వ్యవస్థలు, విద్యుత్ భద్రతా ప్రమాణాలు తదితర అంశాలపై శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యువతను తీర్చిదిద్ది ఉపాధి అవకాశాలను విస్తరించడమే సింగరేణి లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం కృష్ణప్రసాద్, వీటీసీ మేనేజర్ నజీర్ తదితరులు పాల్గొన్నారు. -
సందర్శన.. సమీక్ష
ములుగు/కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామ పంచాయతీ పరిధి గుట్టగంగారంలో ఉన్న దేవాదుల జె.చొక్కారావు ఎత్తిపోతల పథకాన్ని సోమవారం రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సందర్శించారు. ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. మంత్రులు హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా తుపాకులగూడెంలోని సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద ఉన్న హెలిపాడ్ వద్దకు ఉదయం 11 గంటలకు చేరుకున్నారు. వారికి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ రామ్‌నాథ్ కేకన్, పీఓ లెనిన్ వత్సల్ టొప్పో పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అక్కడినుంచి ప్రత్యేక కాన్వాయి ద్వారా మంత్రులు సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. బ్యారేజీని పరిశీలించారు. నీటి స్టోరేజీ, సామర్థ్యం, గేట్ల పనితీరు, ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడినుంచి గట్టలగంగారం పరిధి దేవాదుల జె.చొక్కారావు ఎత్తిపోతల వద్దకు చేరుకొని పంపింగ్ స్టార్టింగ్ పాయింట్‌ను పరిశీలించారు. మోటార్ల పనితీరు, మూడు ఫేజ్‌లలో ఎన్ని మోటార్లు ఉన్నాయి.. ప్రస్తుతం ఎన్నింటి ద్వారా నీటిని దిగువకు ఎత్తిపోస్తున్నారని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవాదుల వద్ద ఏర్పాటు చేసిన సమావేశం వద్దకు చేరుకొని ఇంజనీరింగ్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అధికారులు వారికి ప్రాజెక్టు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి మాట్లాడారు. దేవాదుల వద్ద ఉన్న పది మోటార్లు నిరంతరం పంపింగ్ చేయాలని ఆదేశించారు. దీని పరిధిలోని 22 రిజర్వాయర్లను నింపుతామన్నారు. ఈ నీటితో రైతులకు సాగు, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రాజెక్టును సందర్శించి, ఏడాది వ్యవధిలోనే పూర్తిచేయాలని స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారని తెలిపారు. లక్ష్య సాధన కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. మధ్యాహ్నం 1.31గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్‌కు తిరిగివెళ్లిపోయారు. ఎస్పీ రామ్‌నాథ్ కేకన్ ఐపీఎస్ ఆధ్వర్యంలో పోలీస్ భద్రత వలయంలో మంత్రుల పర్యటన సాగింది. కార్యక్రమంలో స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, పాలకుర్తి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, యశస్వినిరెడ్డి, అదనపు కలెక్టర్లు మహేందర్ జి.సంపత్‌రావు, ములుగు డీఎస్పీ రవీందర్, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ బట్టు, ములుగు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, ఈఎన్సీ జనరల్ రమేశ్ బాబు, ఇంజనీరింగ్ అధికారులు ధర్మ, మోహన్‌రావు, శరత్‌బాబు, ప్రవీణ్ కుమార్, స్థానిక తహసీల్దార్ సయ్యద్ సర్వర్ తదితరులు పాల్గొన్నారు. దేవాదుల నీటితో 22 రిజర్వాయర్లను పూర్తిగా నింపుతాం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి సమ్మక్క సాగర్ బ్యారేజీ, దేవాదుల ప్రాజెక్టు పరిశీలన సమీక్ష, నీటి సామర్థ్యం, మోటార్ల పనితీరుపై ఆరా సాగునీరందిస్తామని రైతులకు హామీ -
శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలి
ములుగు /ములుగు రూరల్: బోధనలో సాంకేతిక అంశాలతో విద్యార్థులకు ఆసక్తిని రేకెత్తించేలా, ఆహ్లాదకరంగా తరగతి గది వాతావరణం పెంపొందించే విధంగా ఎటువంటి చర్యలు చేపట్టాలనే అంశంపై నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ సిద్ధార్థరెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భౌతిక రసాయన శాస్త్రం ఉపాధ్యాయులకు, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయులకు, బండారుపల్లి మోడల్ స్కూల్లో ఇంగ్లిష్ సబ్జెక్టు టీచర్లకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమాన్ని డీఈఓ సోమవారం ప్రారంభించి మాట్లాడారు. శిక్షణ కేంద్రం వద్ద సమయపాలన పాటిస్తూ సకాలంలో హాజరై తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ట్రైనింగ్‌లో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో విద్యార్థులకు చేరవేసేలా కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా శిక్షణకు సంబంధించిన పోస్టర్లను డీఈఓ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ కోర్స్ కోఆర్డినేటర్ శ్యామ్‌సుందర్ రెడ్డి, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు సైకం శ్రీనివాస్ రెడ్డి, గుల్లపెల్లి సాంబయ్య, సంబంధిత సెంటర్ ఇన్‌చార్జ్‌లు కన్నం వినోద్ కుమార్, గందె రమేశ్, సింగారపు దేవకి పాల్గొన్నారు. విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం బండారుపల్లి పీఎం శ్రీ మోడల్ పాఠశాల విద్యార్థి బాచి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో కాంస్య పతకం సాధించడంతో బాచిని అభినందించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాలలో ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ దేవకి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి -
పోలింగ్ కేంద్రాల పరిశీలన
వెంకటాపురం(ఎం): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల పరిధిలోని లక్ష్మీదేవిపేట, బుర్గుపేట గ్రామాలలో గల పోలింగ్ కేంద్రాలను ఎన్నికల నమోదు అధికారి, ఆర్డీఓ కృష్ణవేణి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ, యాప్‌లో డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత బీఎల్ఓలకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గిరిబాబు, డిప్యూటీ తహసీల్దార్ భవాని ప్రసాద్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ నితీష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: తెలంగాణలోని తొమ్మిది యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ఈవిద్యాసంవత్సరం 2026–27లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న టీజీసీపీగెట్–26 ఆరో రోజు సోమవారం నిర్వహించినట్లు సీపీ గెట్ కన్వీనర్, కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రొఫెసర్ కె.రాజేందర్ తెలిపారు. ఉదయం సెషన్లో నిర్వహించిన ఎంఏ ఇంగ్లిష్ కోర్సుకు 2,942, మధ్యాహ్నం సెషన్లో ఎమ్మెస్సీ ఫిజిక్స్ కోర్సుకు 902, సాయంత్రం సెషన్లో ఎంఈడీ, ఎంఏ లింగ్విస్టిక్స్ కోర్సుకు 1,241 మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలిపారు. విద్యారణ్యపురి: కాకతీయ పద్య కవితా వేదిక ఆధ్వర్యంలో హనుమకొండలో విశ్రాంత తెలుగు భాషోపాధ్యాయులు కవి చంద్ర నర్సింగోజు లక్ష్మయ్య రచించిన శ్రీ లక్ష్మీనర్సింహ శతకం పుస్తకావిష్కరణను సోమవారం నిర్వహించారు. కాకతీయ పద్యకవిత వేదిక అధ్యక్షుడు సమస్యా పృచ్ఛక చక్రవర్తి కందిశంకరయ్య ఈ శతకాన్ని ఆవిష్కరించారు. పద్య కవితా వేదిక బాధ్యులు అన్నావజ్జుల సోంబాబు అధ్యక్షతన జరిగిన ఈ పుస్తకావిష్కరణలో సహృదయ సాంస్కృతిక కార్యదర్శి వనం లక్ష్మీకాంతారావు, విశ్రాంత విద్యాశాఖ అధికారి నన్నపనేని రామేశ్వర్రావు, వజ్జల రంగాచార్యులు, శతావధాని చేపూరి శ్రీరామ్, డాక్టర్ ఎన్వీఎన్ చారి, కె.రమేశ్, జీడికంటి శ్రీనివాసమూర్తి, పల్లేరు వీరస్వామి, అక్కర కరుణాసాగర్, గుంటి విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కేయూలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టడీ సెంటర్ ఇన్చార్జ్ జాయింట్ డైరెక్టర్‌గా బయోటెక్నాలజీ విభాగం ల్యాబ్ అసిస్టెంట్ డాక్టర్ పుల్లా శ్రీనివాస్‌ను నియమిస్తూ సోమవారం కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచందం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన కేయూ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా, కేయూ టెక్నికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, అఖిల భారత విశ్వవిద్యాలయాల ఉద్యోగుల సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. సోమవారం సాయంత్రం ఈ ఉత్తర్వుల కాపీని డాక్టర్ పుల్లా శ్రీనివాస్‌కు వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి అందజేశారు. ఓఎస్డీ ఆచార్య బి.వెంకట్రామ్రెడ్డి, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్, కేయూ ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ ఆచార్య ఈసం నారాయణ పాల్గొన్నారు. ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు పెంపు విద్యారణ్యపురి: హైదరాబాద్‌లోని షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ–27) ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్‌కు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేందుకు ఈనెల 19వరకు గడువు పొడిగించినట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ కె.జగన్మోహన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగ అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు ఆన్లైన్లో ఈనెల 19 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 26న హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు హెచ్‌టీటీపీ//టీఎస్‌స్టడీసర్కిల్.కో.ఇన్‌లో చూడాలని ఆయన కోరారు. -
నులిపురుగుల నివారణకు కృషి
● డీఎంహెచ్ఓ గోపాల్ రావు ములుగు రూరల్: నులి పురుగుల నివారణకు వైద్యారోగ్యశాఖ కృషి చేస్తుందని డీఎంహెచ్ఓ గోపాల్‌రావు అన్నారు. ఈ మేరకు సోమవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాకేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు ఆల్బెండజోల్ మాత్రలను వేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. నులి పురుగుల కారణంగా పిల్లలు పౌష్టికాహారం తీసుకున్నా రక్తహీనత, శారీరక ఎదుగుదల ఉండదని తెలిపారు. పిల్లలు వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 73,444 మంది పిల్లలు ఉన్నారని తెలిపారు. సోమవారం అనివార్య కారణాలతో పాఠశాలలకు హాజరుకాని విద్యార్థులకు ఈ నెల 20వ తేదీన మాత్రలను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునేషన్ ప్రోగ్రాం అధికారి నాగఅన్వేష్, మాస్ మీడియా అధికారి సంపత్, పాఠశాల ప్రిన్సిపల్ నర్మదాభాయి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ దుర్గారావు, ఆర్బీఎస్కే వైద్యులు మల్లికార్జున్, శ్రీలత, తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తాం..
ఏటూరునాగారం: గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఐటీడీఏ ఇన్చార్జ్ ఏపీఓ, ఎస్డీసీ(స్పెషల్ డిప్యూటీ కలెక్టర్) ప్రతాప్ అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గిరిజనదర్బార్‌లో 12 దరఖాస్తులను ఎస్డీసీ ప్రతాప్ స్వీకరించారు. ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలం నర్సాపురానికి చెందిన గిరిజనులు తాగునీటి కోసం బోరు నిర్మించాలని కోరారు. మల్లంపల్లి మండలం రామచంద్రపురం బోరు వెల్ మంజూరు చేయాలని వేడుకున్నారు. తాడ్వాయి మండలం నర్సాపూర్‌లో వ్యవసాయ సాగు కోసం గిరివికాస్ కింద బోరు, మోటారు నిర్మించాలని కోరారు. కొత్తగూడ మండలం సాదిరెడ్డి గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. పాలకుర్తి మండలం దస్రుతండాకు చెందిన గిరిజన విద్యార్థి ఐఐటీలో సీటు వచ్చిందని, ల్యాప్‌టాప్ ఇప్పించాలని కోరారు. పట్వారీపల్లె గ్రామానికి చెందిన గిరిజనుడు ములుగు గురుకుల పాఠశాలలో పీఈటీ కాంట్రాక్టు పోస్టు ఇప్పించాలని విన్నవించారు. ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లిలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాను ఆన్లైన్లో ఎక్కించాలని ఓ గిరిజన రైతు కోరారు. వెంకటాపురం(కె) మండలంలోని లక్ష్మీపురంలో బోరు పాయింట్, కరెంటు ఇప్పించాలని గిరిజనుడు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ హెచ్డీ సురేశ్ కుమార్, డీడీ ఫిరంగి, జీసీసీ డీఎం వాణి, మహేందర్, కిశోర్, జగన్, శంకర్, ప్రభాకర్ పాల్గొన్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రతాప్ గిరిజన దర్బార్‌లో 12 దరఖాస్తుల స్వీకరణ -
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాంములుగు రూరల్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్షు డు సిరికొండ బలరాం అన్నారు. ఈ మేరకు ఆది వారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు రాయంచు నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బూత్‌స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు పాటుపడాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేఖ విధానాలను పార్టీ శ్రేణులు ప్రజలకు వివరించాలని సూచించారు. గ్రామాలలో ప్రజాసమస్యల పరిష్కారంలో కార్యకర్తలు ముందుండాలని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణాకర్, దొంతిరెడ్డి రవిరెడ్డి, హేమాద్రి, రాజ్‌కుమార్, పవన్ కల్యాణ్, శ్రీహరి, రఘువీర్, లక్ష్మి, ఓదెలు, అశోక్, రాజేందర్, సురేశ్ వంశీ తదితరులు పాల్గొన్నారు. -
సమయం లేదు ‘సర్’
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రత్యేక ఓటరు జాబితా (ఎస్ఐఆర్) సవరణ ప్రక్రియ ముగియడానికి ఇంకా 11 రోజులే గడువు ఉండగా ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో డిజిటలైజేషన్ పనులు ఆశించిన వేగంతో సాగడం లేదు. ఇంటింటికీ వెళ్లి ఫారాల పంపిణీ దాదాపు పూర్తయ్యింది. వాటిని ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ మాత్రం ఇంకా సగానికి కూడా చేరుకోలేదు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం నిత్యం కాన్ఫరెన్స్‌ల ద్వారా అలర్ట్ చేస్తోంది. జిల్లాల్లో కలెక్టర్లు, అధికారులు నిత్యం ఫాలోఅప్ చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం రాత్రి 8.01 గంటలకు విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఉమ్మడి ఆరు జిల్లాల్లో కలిపి 45.57 శాతం ఫారాలే డిజిటలైజ్ అయ్యాయి. ఫారాల పంపిణీలో భేష్.. జూన్ 25న మొదలైన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, బీఎల్ఓల ఇంటింటి సందర్శన, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ ఈ నెల 24న ముగియనుంది. వీటికి ఇంకా 11 రోజులే సమయం ఉండగా, 31న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురణ చేయాల్సి ఉంది. మొత్తం 30,53,238 మంది ఓటర్లకు సంబంధించి 30,53,231 ఫారాలు (100 శాతం) పంపిణీ చేశారు. అయితే, వాటిలో 13,91,440 (45.57 శాతం) ఫారాలు మాత్రమే డిజిటలైజేషన్ పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మిగిలిన లక్షలాది ఫారాలను గడువులోగా నమోదు చేయడం అధికారులకు సవాల్‌గా మారింది. విద్యావంతులు, పట్టణ ఓటర్లు అధికంగా ఉన్న హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోనే నింపిన ఫారాల అందజేత, డిజిటలైజేషన్ వేగం మందగించింది. హనుమకొండలో 42.97 శాతం, వరంగల్‌లో 40.39 శాతం , మహబూబాబాద్‌లోనూ 42.62 శాతం మాత్రమే పూర్తయ్యింది. 53.66 శాతంతో ముందంజలో ములుగు.. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా డిజిటలైజేషన్ ప్రక్రియ మొత్తంగా చూస్తే 50 శాతం దాటలేదు. ఇక గిరిజన, అటవీ ప్రాంతాలు అధికంగా ఉన్న ములుగు జిల్లా మాత్రం 53.66 శాతంతో ఉమ్మడి జిల్లాలో ముందంజలో నిలిచింది. జయశంకర్ భూపాలపల్లి (50.36 శాతం), జనగామ (50.18 శాతం) జిల్లాలు కూడా కొంత మెరుగైన పురోగతి నమోదు చేశాయి. ఫారాల పంపిణీ దాదాపు పూర్తి కావడంతో ఇప్పుడు అధికారుల దృష్టి డిజిటలైజేషన్‌పైనే ఉంది. ప్రతిరోజూ భారీ సంఖ్యలో ఫారాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్లు, ఉన్నతాధికారులు ‘సర్’ డిజిటలైజేషన్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు ముమ్మరం చేసిన అధికారులు సోమవారం నుంచి వేగం పెరుగుతుందని, ఇన్‌టైంలో డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తవుతుందని చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రగతి.. ( ఆదివారం రాత్రి 8.01 గంటల వరకు) మొత్తం ఓటర్లు ఫారాలు పంపిణీ పంపిణీ శాతం డిజిటలైజేషన్ డిజిటలైజేషన్ శాతం100%50.36%50.18%53.66%40.39%42.97%1,39,955 7,67,4837,76,9535,09,01442.62%4,84,9321,27,167 3,85,1524,84,9357,67,4842,77,8822,36,9703,13,806 2,18,6992,77,8792,06,661 జేఎస్భూపాలపల్లిహనుమకొండజనగామవరంగల్ములుగుఎన్యూమరేషన్ ప్రక్రియకు 11 రోజులే గడువు ఉమ్మడి జిల్లాలో ఇంకా 45.57 శాతమే డిజిటలైజేషన్ ముందున్న ములుగు.. అదే వరుసలో జనగామ, జేఎస్ భూపాలపల్లి 40–43 శాతంలో హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలు ఆగుతూ సాగుతున్న డిజిటలైజేషన్... సీరియస్‌గా కలెక్టర్లు, అధికారుల ఫాలోఅప్ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ (ఎస్ఐఆర్)లో నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారుల పర్యవేక్షణలో పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. బీఎల్ఓలు, అన్ని శాఖల సిబ్బంది ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, ధ్రువీకరణ, డిజిటలైజేషన్ ఇన్‌టైంలో పూర్తికి ఎప్పటికప్పుడు సూచిస్తున్నాం. – చాహత్ బాజ్‌పాయ్, కలెక్టర్, హనుమకొండ -
నేటి ప్రజావాణి రద్దు
ములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించనున్న నేటి ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలి పారు. నేడు జిల్లాలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు కన్నాయిగూడెం మండలం దేవాదుల ప్రాజెక్టు సందర్శన నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమం రద్దుచేసినట్లు తెలి పారు. జిల్లా ప్రజలు గమనించాలని కోరారు. ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలి ములుగు రూరల్: రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని ములుగు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ సూచనల మేరకు రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయడం మేలని తెలిపారు. వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేస్తేనే రైతులకు మేలు జరుగుతుందని వివరించారు. జిల్లాలో ఇప్పటికే లోటు వర్షపాతం నమోదు అయిందని వెల్లడించారు. రైతులు అపరాల సాగు వైపు మొగ్గు చూపాలని సూచించారు. భీమయ్యకు బంగారు పతకం ఏటూరునాగారం: 12వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్స్, అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్–2026లో మండల కేంద్రానికి చెందిన క్రీడాకారుడు భీమయ్య లాంగ్ జంప్‌లో బంగారు పతకం సాధించినట్లు కోచ్ పర్వతాల కుమారస్వామి తెలిపారు. కొల్లూరులోని గౌడియం స్కూల్లో ఆదివారం నిర్వహించిన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి పతకం సాధించినట్లు వివరించారు. 108 అంబులెన్స్‌లో ప్రసవం వాజేడు: మండల పరిధిలోని ములుకన పల్లి గ్రామ సమీపంలో 108 అంబులెన్స్‌లో తెల్లం మంజు కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈఎంటి మానస, పైలెట్ దశరథ్ కథనం ప్రకారం.. ములుకనపల్లికి చెందిన తెల్లం మంజుకు ఆదివారం పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. 108 సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు అక్కడికి వచ్చి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో నొప్పులు ఎక్కువ కాగా ఆమె ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. వారిని వెంటనే మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్య శాలలో చేర్పించారు. ప్రస్తుతం తల్లి పిల్లలు క్షేమంగా ఉన్నారు. ఈ సందర్భంగా ఈఎంటీ మానస, పైలెట్ ధశరథ్‌ను స్థానికులు కొనియాడారు. -
హేమాచలక్షేత్రంలో కోలాహలం
మంగపేట: రెండోయాదగిరి గుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. ఆలయంలో స్వయంభుగా వెలిసిన లక్ష్మీనర్సింహస్వామి దర్శించుకునేందుకు వచ్చిన వేలాది మంది భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఆదివారం సెలవు రోజు కావడంతో పలు ప్రాంతాల నుంచి స్వామిని వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకుని పవిత్ర చింతామణి జలపాతం వద్ద స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని తిలతైలాభిషేకం పూజలో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని పరవశించారు. ఆలయ అర్చకులు రాజీవ్‌శర్మ, ఈశ్వర్‌చంద్ శర్మ భక్తుల గోత్ర నామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. -
సోమవారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2026
ఎస్.జానకి మృతికి జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షుడు జడల శివ ఆధ్వర్యంలో వరంగల్ కళాకారులు నివాళులు అర్పించారు. ఈమేరకు వరంగల్ గోపాలస్వామి గుడి కొత్తవాడ జంక్షన్లో జానకమ్మ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జానకి పాడిన పాటను ఆలపించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జనగాం రాము, రమేశ్, శ్రీధరస్వామి, రాంనర్సింహస్వామి, భుజంగరావు, ఇమ్యానియల్ రంగనాఽథ్, చంద్రశేఖర్, సృజన్‌రావు, నజీర్, యాకూబ్, అనిల్, చందన, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. నందీశ్వరుడితో ఎస్.జానకి (ఫైల్)ప్రజాకవి కాళోజీ నారాయణరావు, గాయని ఎస్.జానకి వాళ్ల మామ మంచి మిత్రులు. 1995లో కాళోజీ వారిని కలవడానికి చైన్నెలోని జానకి నివాసానికి వెళ్లారు. వారితో పాటు నేను వెళ్లాను. ఈ సందర్భంగా ఆమెతో ఫొటో తీసుకున్నాను. జానకమ్మ తనకు లభించిన అవార్డులను, బహుమతులను, షీల్డులను చూపించారు. అలాగే ఆమె భర్త రామప్రసాద్, మామ రామన్, కాళోజీ, కాళోజీ కుమారుడు రవికుమార్ కలిసి గ్రూప్ ఫొటో తీసుకున్నాం. అందరితో ఆప్యాయంగా మాట్లాడే జానకమ్మ మృతి బాధను కలిగిస్తోంది. – మట్టెవాడ అజయ్, మైక్రోఆర్టిస్ట్, గిర్మాజీపేట వరంగల్గాయని జానకమ్మ మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు.. ఆమె 2014లో రుద్రేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వరంగల్‌కు వచ్చారు. దాదాపు గంట పాటు ఆమె రుద్రేశ్వరుడి సన్నిధిలో గడిపారు, ఆలయ పరిక్రమ చుట్టూ తిరుగుతూ శిల్పకళను, నందీశ్వరుడిపై చెక్కిన అలంకరణను పరిశీలించారు. – గంగు ఉపేంద్రశర్మ, వేయిస్తంభాల ఆలయ ప్రధానార్చకుడు, హనుమకొండహన్మకొండ కల్చరల్: ప్రముఖ సినీ నేపథ్యగాయని, గాన కోకిల ఎస్.జానకి మరణంతో ఓరుగల్లు సంగీతకారులు, ఆమె అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమెకు ఓరుగల్లుతో విడదీయలేని అనుబంధం ఉంది. శివభక్తురాలైన జానకి 2014 మార్చి 20న వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శించారు. రుద్రేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ప్రత్యేకంగా ఆమె వరంగల్‌కు రావడం విశేషం. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం భద్రకాళి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. 2014లో రుద్రేశ్వరుడిని దర్శించుకునేందుకు వరంగల్‌కు వచ్చిన గాయని జానకి ఆమె మృతితో ఉమ్మడి జిల్లావాసుల దిగ్భ్రాంతి నివాళులర్పించిన అభిమానులు -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు వర్షిత
ఏటూరునాగారం: మండల కేంద్రానికి చెందిన కె.వర్షిత అండర్ 8 విభాగంలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు కోచ్ పర్వతాల కుమారస్వామి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 5న బండారుపల్లి గురుకుల పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో స్టాండింగ్ జంప్, 60 మీటర్ల పరుగు పందెం విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ందని పేర్కొన్నారు. నేడు హైదరాబాద్‌లో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో వర్షిత పాల్గొననున్నట్లు కుమారస్వామి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని వర్షితను ఏటూరునాగారం వాకర్స్ యూనియన్ సభ్యులు అభినందించారు. -
సహజ వనరుల పరిరక్షణకు ఉద్యమించాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: సహజ వనరుల పరిరక్షణకు ఆదివాసీలందరూ ఉద్యమించాలని ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు కోవా దౌలత్‌రావు మోకాశి పిలుపునిచ్చారు. మండల పరిధిలోని ఆదివాసీ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడి సాయిబాబు అధ్యక్షతన శనివారం ఏర్పాటు చేసిన సంఘం విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లోని ఆదివాసీలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా భూమి, అడవి, సహజ వనరుల దోపిడీ ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులను ప్రభుత్వ సంక్షేమ పథకాలలో భాగస్వామ్యం చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూ బదలాయింపు నిరోధక(ఎల్టీఆర్) చట్టం, అటవీ హక్కుల చట్టం–2006, పెసా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. ఈ చట్టాల అమలుకు ఆదివాసీ సేన కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సన్నద్ధం కావాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు గుండు శరత్, సోడే వెంకటేశ్వర్లు, పొడెం సమ్మయ్య, జంగూ పటేల్, చింత అరుణ, వజ్జ జ్యోతిబసు, ఊకె రవి, ఆలం శ్రీను, కోర్సా నరేశ్, కల్తి నరేశ్ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు దౌలత్‌రావు మోకాశి -
తాడిచర్ల ఓసీపీ–2 సింగరేణికి కీలకం
● నిర్ణీత గడువులోగా పనులు ప్రారంభించాలి ● పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణమల్హర్: తాడిచర్ల ఓసీపీ–2 గని సింగరేణి సంస్థకు ఎంతో కీలకమైన ప్రాజెక్టు అని, ఈ గనిని వీలైనంత త్వరగా ఉత్పత్తిలోకి తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలను వేగవంతం చేయాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఇటీవల సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)కు కేటాయించిన తాడిచర్ల ఓసీపీ–2 ఉపరితల బొగ్గు గనిని శనివారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకష్ణ, సింగరేణి భూపాలపల్లి జీఎం ఏనుగు రాజేశ్వర్‌రెడ్డితో కలిసి సందర్శించి ప్రాజెక్టు ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. గని ప్రారంభానికి అవసరమైన మెటీరియల్, భారీ యంత్రాలు (మిషనరీ), రహదారులు, విద్యుత్, నీటి సరఫరా, కార్యాలయాలు, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గని అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. నిర్ణయించిన గడువులోగా పనులను పూర్తిచేసి ఓసీపీ–2 గనిని ప్రారంభించేందుకు కృషి చేయాలని సూచించారు. గని ప్రారంభం ద్వారా సింగరేణి బొగ్గు ఉత్పత్తి పెరగడమే కాకుండా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించడం, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఊతం లభిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి ఎంపీ గడ్డం వంశీకష్ణను శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం గని ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎంపీకి వివరించి, చేపట్టాల్సిన పనులు, భవిష్యత్ కార్యాచరణను వివరించారు. కార్యక్రమంలో ఏరియా ఇన్చార్జ్ ఎస్ఓటు జీఎం కృష్ణ ప్రసాద్, సర్వే అధికారి శైలేంద్రకుమార్, పాల్గొన్నారు. -
సార్ లేకపాయె.. బోర్డు మారకపాయె!
ఏటూరునాగారం: గిరిజనులు ఐటీడీఏకు వస్తే ఏ అధికారి.. ఏ హోదాలో పనిచేస్తున్నారనే విషయం తెలిసేలా ఏర్పాటు చేసిన బోర్డులు ఇంకా మారలేదు. ఐటీడీఏలో పలు హోదాల్లో పనిచేసిన అధికారులు బదిలీపై వెళ్లినప్పటికీ వారి పేర్లు ఇంకా దర్శనమిస్తున్నాయి. సార్ లేకున్నా బోర్డు పాతదే ఉండడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. కార్యాలయంలో ఏపీఓ నాగోరావు ఇటీవల బదిలీ కాగా ఆయన పేరును బోర్డుపై నుంచి తొలగించలేదు. ఎస్ఓ రాజ్‌కుమార్, డీడీ పోచం బదిలీ కాగా ఈఈ వీరభద్రం పదవీవిరమణ పొందారు. కానీ ఇంకా ఇక్కడే పనిచేస్తునట్లుగా ఈ బోర్డులో ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఐటీడీఏలో కీలక పోస్టులు ఖాళీగా ఉండడంతో పాలన అస్తవ్యస్తంగా మారింది.దేవునిగుట్టపై వరదపాశం ములుగు రూరల్: మండల పరిధిలోని కొత్తూరు పంచాయతీ పరిధిలో గల దేవునిగుట్టపై కొలువైన లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో గ్రామస్తులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు శనివారం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారం మేరకు గుట్టపై వరదపాశం కార్యక్రమం ఆలయ కమిటీ చైర్మన్ కిషన్‌రావు ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా కిషన్‌రావు మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రతీ ఏడాది వర్షాకాల ప్రారంభంలో దేవునిగుట్టపై పాయసం తయారు చేసి బండరాళ్లపై పోసి నాలుకతో సేవించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. 15 నుంచి శాకంబరీ ఉత్సవాలు హన్మకొండ కల్చరల్: శాకంబరీ నవరాత్రోత్సవాలను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ అమ్మవారి అనుగ్రహం పొందాలని భద్రకాళి దేవాలయ ఈఓ, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత అన్నారు. ఆలయ ప్రాంగణంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో రామల సునీత, ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, సిబ్బంది పాల్గొని శాకంబరీ ఉత్సవాల వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం రామల సునీత మాట్లాడుతూ.. ఈ నెల 15 బుధవారం నుంచి జూలై 29 బుధవారం వరకు 15రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు, అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు మాట్లాడుతూ.. ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం అమ్మవారికి ఒక్కో క్రమాలలో పూజలు నిర్వహించనున్నట్లు, జూలై 29న మహా శాకంబరీగా అమ్మవారు దర్శనమిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ముఖ్యార్చకులు చెప్పెల నాగరాజుశర్మ, సిబ్బంది కూచన హరినాఽథ్, అలుగు కృష్ణ, చింత శ్యామ్‌సుందర్ తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న టీజీసీపీగెట్ కేయూ క్యాంపస్: తెలంగాణలోని తొమ్మిది యూనివర్సిటీల్లో ఈ విద్యాసంవత్సరం 2026–27లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకుగాను తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీసీపీగెట్–26) ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ప్రవేశ పరీక్షలు శనివారం నాలుగో రోజు కొనసాగాయని కన్వీనర్ కేయూ కామర్స్అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రొఫెసర్ కె.రాజేందర్ తెలిపారు. ఈ ప్రవేశపరీక్షలో ఉదయం సెషన్లో ఎంఏ పొలిటికల్ సైన్స్ కోర్సుకు 2,681 మంది అభ్యర్థులకుగాను 2,323 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. మధ్యాహ్నం సెషన్లో ఎంఎల్ఐఎస్సీ/బీఎల్ఐఎస్సీ కోర్సుకుగాను 736 మంది అభ్యర్థులకుగాను 600 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సాయంత్రం సెషన్లో నిర్వహించిన జియోగ్రఫీ ప్రవేశపరీక్షకు 165 మంది అభ్యర్థులకుగాను 145 మంది అభ్యర్థులు హాజరైనట్లు రాజేందర్ తెలిపారు. -
15 రోజుల్లో అఫిలియేషన్స్ అందించాలి
● ఉమ్మడి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు అజీజ్ఖాన్వరంగల్ స్పోర్ట్స్: నేటి నుంచి 15 రోజుల్లోపల జిల్లాలోని అన్ని క్రీడా సంఘాలు అఫిలియేషన్స్ అందించాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు అజీజ్‌ఖాన్ తెలిపారు. శనివారం హనుమకొండలోని జిల్లా గ్రంథాలయంలో ఒలింపిక్స్ సంఘం జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కై లాస్ యాదవ్ క్రీడా వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా సైక్లింగ్, కిక్‌బాక్సింగ్, నెట్‌బాల్, బాస్కెట్‌బాల్ అసోసియేషన్‌లో ఏకగ్రీవ ఎన్నికలు చెల్లవని, హైదరాబాద్ స్టేట్ సెక్రటరీ ఇచ్చిన ఆదేశాల మేరకు అతడిని తొలగిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఎవరు ఎన్నికలు నిర్వహించినా రాష్ట్ర అసోసియేషన్ నుంచి అబ్జర్వర్, డీఎస్ఏ నుంచి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ నుంచి అబ్జర్వర్లు ఉండాలని, ఈసీలో తీర్మానం, 21 రోజుల తర్వాత బైలా ప్రకారం జిల్లా, మండల ఎన్నికలు నిర్వహించుకోవాల్సి ఉంటుందన్నారు. అనంతరం జాయింట్ సెక్రటరీ కృష్ణారెడ్డిని ఇన్చార్జ్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, కోశాధికారి టి.శ్యాం ప్రసాద్, ఉపాధ్యక్షుడు డాక్టర్ రమేశ్‌రెడ్డి, సారంగపాణి, సారయ్య, అశోక్, అసోసియేట్ వైఎస్ ప్రెసిడెంట్లు నలబోల సతీశ్, శ్యామల, పవన్‌కుమార్ పాల్గొన్నారు. -
స్నేహపూర్వక వాతావరణం..
చాలామంది విద్యార్థులు భయం, బెరుకు, స్పీకింగ్ ఫియర్ వల్ల క్లాస్‌రూమ్‌లో టీచర్‌ను సందేహాలు అడగకుండానే ఉండిపోతారు. అన్నాఅక్క మెంటార్షిప్లో భాగంగా విద్యార్థులకు, మెంటార్లకు మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. భయంలేకుండా సందేహాలు అడగడానికి అవకాశం ఏర్పడుతుంది. త్వరగా అర్థమయ్యే అవకాశం ఉంది. భవిష్యత్ మొత్తం ఏఐదే కాబట్టి బేసిక్ లెవెల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుందని అంచనా. సాంకేతిక విద్యనందించాలని.. ప్రభుత్వ యూపీఎస్, హైస్కూల్ విద్యార్థులకు సాంకేతక విద్యను అందించాలని ‘అన్నాఅక్క మెంటార్షిప్, టీచింగ్ ఇంటర్న్‌షిప్’ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఐదో సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులతో ప్రభుత్వ పాఠశాలల్లోని 6, 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ లెర్నింగ్, కంప్యూటింగ్, కోడింగ్, ఫైథాన్, జావా, గేమ్ డిజైన్ వంటి అనేక అంశాలపై బోధిస్తున్నారు.డిగ్రీ విద్యార్థులకు క్రెడిట్ డిగ్రీ విద్యార్థులు మెంటార్లుగా తెలంగాణ కోడ్మిత్ర పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సర్టిఫికెట్ పొందారు. వీరికి శిక్షణ ఇచ్చారు. బోధన వల్ల వీరికి కమ్యూనికేషన్, టీచింగ్ స్కిల్స్ ఇంప్రూవ్‌తోపాటు మెంటార్షిప్ 30 గంటల పూర్తి చేసిన విద్యార్థులకు ఐదో సెమిస్టర్ ఫలితాల్లో ఒకటి లేదా రెండు క్రెడిట్ పాయింట్స్ కేటాయిస్తారు. ఇది వారికి ఒక ప్రాజెక్టుగా భావిస్తున్నారు. డిగ్రీ కళాశాల వారీగా ఎంపికైన మెంటార్లు, స్కూళ్లు ఇలా.. మెంటార్లు స్కూళ్లుహనుమకొండమహబూబాబాద్ ప్రభుత్వజనగామ ఏబీవీపరకాల ప్రభుత్వనర్సంపేట ప్రభుత్వపింగిళి మహిళాకాకతీయ మెంటార్లుగా డిగ్రీ విద్యార్థులు.. వీరికి ప్రత్యేక శిక్షణ అభ్యాసకులు ప్రభుత్వ యూపీఎస్, హైస్కూళ్ల పిల్లలు కృత్రిమ మేథ, డిజిటల్ లెర్నింగ్, కోడింగ్ అంశాలపై అవగాహన పిల్లల్లో స్నేహపూర్వక వాతావరణం పెంపొందించేలా చర్యలు -
అనుమతిలేని జలపాతాలకు రావద్దు
● డీఎఫ్ఓ వికాస్ మీనావాజేడు: రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉన్న అనుమతులు లేని జలపాతాలకు పర్యాటకులు రావద్దని డీఎఫ్ఓ వికాస్ మీనా అన్నారు. మండల పరిధిలోని దూలాపురం సమీప గుట్టల్లో ఉన్న మాసన్లొద్ది జలపాతంలో యాద వైభవ్ కుమార్(18) మునిగి మృత్యువాత పడటంతో గురువారం ఆయన అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎఫ్ఓ మాట్లాడుతూ వాజేడు మండలంలో వర్షం కురువగానే గుట్టల వెంట జలపాతాలు జాలువారుతున్నాయని వివరించారు. అవి దట్టమైన అడవిలో ఉండటంతో వాటి సందర్శనకు అనుమతులు లేవన్నారు. గ్రామాల వద్ద చాలా దారులు ఉండటంతో ఏదో ఒక దారిలో పర్యాటకులు అక్కడికి వెళ్తున్నారని వివరించారు. శత్రువు అవుతున్నారని, అనుమతులు లేని జలపాతాలకు వెళ్లడం చట్ట ప్రకారం నేరమని పర్యాటకులు దృష్టిలో ఉంచుకోవాలన్నారు. వాజేడు మండలంలో కేవలం బొగత జలపాతానికి మాత్రమే అనుమతులు ఉన్నాయని పర్యాటకులు అక్కడికి మాత్రమే రావాలని కోరారు. అనుమతులు లేని జలపాతాలకు వెళ్లే దారిలో బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు మరికొన్ని చోట్ల వాల్ పోస్టర్లను వేయనున్నట్లు తెలిపారు. -
పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి
ములుగు: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క పిలుపునిచ్చారు. వనమహోత్సవంలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ ఆధ్వర్యంలో బండారుపల్లి క్రాస్ నుంచి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వరకు గురువారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరై తన పేరుమీద ఒక మొక్కనాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలన్నారు. ప్రతిఒక్కరూ ఒక మొక్క నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, పచ్చని వాతావరణాన్ని అందించాలంటే మొక్కల పెంపకం అత్యంత అవసరమని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ చింతలనిప్పుల చంద్రకళ మాట్లాడుతూ ములుగును మరింత పచ్చదనంతో నింపేందుకు మున్సిపాలిటీ ప్రత్యేక చర్యలు చేపడుతోందని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్, కౌన్సిలర్లు, కో–ఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. గ్రామాలాభివృద్ధిలో సర్పంచులే కీలకంగ్రామాలాభివృద్ధిలో సర్పంచులే కీలకపాత్ర పోషించాలని, 16వ ఆర్థిక సంఘం నిధులను నిబంధనల ప్రకారమే వినియోగించాలని మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్లో గురువారం నిర్వహించిన సర్పంచ్ల శిక్షణ కార్యక్రమానికి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇటీవల ఎన్నికై న సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు గ్రామ పాలన, చట్టాలు, విధివిధానాలు, గ్రామాభివృద్ధి ప్రణాళికల రూపకల్పనతో పాటు తదితర అంశాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క -
ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలి
ములుగు: తక్కువ నీటితో సాగు చేసే ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలని, ఈ నెల 15 తర్వాత జలాశయాల నీటి నిల్వల ఆధారంగా పంటలపై రైతులకు మార్గదర్శకాలు జారీ చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి గురువారం వ్యవసాయం, సాగునీరు, వర్షపాతం, ఎల్‌నినో ప్రభావం, నివారణ చర్యలపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 15శాతం లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. గతేడాదితో పోలిస్తే నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయని, ఇప్పటివరకు ఎగువ రాష్ట్రాల నుంచి నీటి ప్రవాహం రావడం లేదన్నారు. మంత్రులు నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు మాట్లాడుతూ వాతావరణం, వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజాప్రతినిధులు రైతులకు సమాచారం అందించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సంబంధిత అధికారులతో జిల్లాలోని నీటి లభ్యత, పంటల సాగు పరిస్థితులను సమీక్షించారు. వీసీలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి -
భూముల రీసర్వే పకడ్బందీగా నిర్వహించాలి
ములుగు: భూముల రీ సర్వేను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పారదర్శకంగా నిర్వహించాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్.లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. భూముల రీ సర్వే, నక్ష భూముల అంశాలపై ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌గాంధీ హనుమంతుతో కలిసి గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో లోకేష్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి అదనపు కలెక్టర్ మహేందర్‌జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూముల రీ సర్వేను దశలవారీగా చేపడుతోందని తెలిపారు. తొలి దశలో ప్రతీ జిల్లాలో 70 గ్రామాల్లో రీ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సర్వేతో స్పష్టమైన యాజమాన్య హక్కులు నిర్ధారించడంతో పాటు ప్రతీ భూమికి ప్రత్యేక భూధార్ యూనిక్ నంబర్ కేటాయించనున్నట్లు తెలిపారు. జీఐఎస్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రీ సర్వే చేపట్టాలని ఆదేశించారు. వీసీలో రెవెన్యూశాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్ -
నిషేధించినా ఆగరాయె!
వాజేడు: ప్రకృతి అందాలను ఆస్వాధించేందుకు పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు విహార యాత్రలను చేస్తున్నారు. కాని అదే విహార యాత్ర కొందరి కుటుంబాల్లో విషాధాన్ని నింపుతుంది. పర్యాటకుల సందడితో ప్రతీనిత్యం కళకళలాడుతున్న బొగత జలపాతం తప్ప మండల పరిధిలోని మిగతా జలపాతాల సందర్శనను అధికారులు నిషేధించారు. కొన్ని జలపాతాలు పూర్తిగా రిజర్వ్ ఫారెస్టులో ఉండటంతో భద్రత కూడా కష్టంగా ఉంటుంది. దీంతో విహారయాత్ర కాస్త విషాద యాత్రగా మారుతుంది. పోలీసులు, అటవీ శాఖాధికారులు ఎన్నో ఆంక్షలను పెట్టి కట్టుదిట్టమైన రక్షణ చర్యలను ఏర్పాటు చేసినప్పటికీ పర్యాటకుల అత్యుత్సాహం ప్రాణాలను బలిగొంటుంది. ఇప్పటి వరకు బొగత జలపాతంలో పడి సుమారుగా 24 మంది, దూసపాటి లొద్దిలో 9 మంది, మాసన్ లొద్దిలో ఒకరు మృతువాత పడ్డారు. బొగత జలపాతం వద్ద ప్రతీ ఏడాది వర్షాకాలంలో పర్యాటకులతో సందడిగా ఉంటుంది. గోదావరిపై బ్రిడ్జిని నిర్మించడంతో నాలుగేళ్లుగా పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో బొగత అందాలను వీక్షించడానికి తరలివస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే యువత సరదా కోసం చేసే పనులతో ప్రాణాల మీదకు వస్తుంది. సెల్ఫీలతో విషాదం పర్యాటక ప్రాంతాల్లో సరదాగా గడిపేందుకు వస్తున్న పర్యాటకులు ప్రకృతి అందాలను వీక్షిస్తే పర్వాలేదు. కాని కొందరు పర్యాటకులు ఫొటోలు తీసుకోవడంతో పాటు నీటిలో దిగి సెల్ఫీల కోసం సందడి చేస్తున్నారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృత్యువాత పడుతున్నారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంటుంది. ప్రకృతి అందాలను వీక్షిస్తూ సేద తీరి క్షేమంగా ఇంటికి చేరే వరకు తల్లిదండ్రులు కంటి మీద కునుకు లేకుండా ఉంటారనే విషయం పర్యాటక ప్రాంతాలకు వచ్చిన వారు గుర్తుంచుకుంటే ప్రాణనష్టం సంభవించదు. కొందరు రీల్స్ కోసం చేసే ప్రయత్నాలు వికటించి ప్రాణాలు పోతుండటంతో సదరు కుటుంబాల్లో విషాదఛాయలు నింపుతున్నాయి. నిషేధించిన జలపాతాలివే.. వాజేడులోని కర్రె గుట్టల వెంట పలు జలపాతాలు ఉన్నాయి. మాసన్ లొద్ది, దూసపాటి లొద్ది, గుండం, భామన సిరి మరో రెండు మూడు జలపాతాలు ఉన్నాయి. ఇవి అన్ని రిజర్వ్ ఫారెస్టులో ఉండటంతో జిల్లా, మండల స్థాయి అధికారులు వాటిని చూడడం నిషేధించారు. అక్కడికి పర్యాటకులు వెళ్ల కుండా ఫ్లెక్సీలను కట్టి కొన్ని చోట్ల సిబ్బందిని కాపలా పెట్టారు. మరి కొన్ని చోట్ల కాపలా ఉండటం లేదు. దీంతో కొందరు పర్యాటకులు గూగుల్ మ్యాప్ ఆధారంగా దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న జలపాతాలకు దొంగదారిలో వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చు కుంటున్నారు. విషాదంగా మారుతున్న విహారం జలపాతాల్లో ఇప్పటికి 44 మంది మృతి -
రూ.91.03 కోట్లు
రైతు భరోసా..ములుగు: వానాకాలం సాగు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. పంటల సాగు కోసం ఎకరానికి రూ.6వేల చొప్పున జిల్లాలోని 79,389 మంది రైతులకు రూ.91.03 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేసింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభ సమయంలోనే పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 9 ఎకరాల వరకు ఉన్న రైతాంగానికి ప్రభుత్వం గురువారం వరకు రైతుభరోసా డబ్బులు జమచేసింది. జిల్లాలో 10 ఎకరాల వరకు ఉన్న మరో వెయ్యిమంది రైతులకు మరో రూ.9 కోట్లను శుక్రవారం వరకు ప్రభుత్వం జమ చేయనున్నట్లు వ్యవసాయ అధికారులు వెల్లడించారు. 1.70 లక్షల ఎకరాల్లో పంటల సాగు జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్లో 1.70 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనాలు వేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జిల్లాలోని 10 మండలాల పరిధిలో రైతుభరోసా కింద 88,450 మంది రైతులకు ఎకరాకు రూ.6 వేల చొప్పున సుమారు రూ.106 కోట్లకు పైగా అందించేందుకు ప్రభుత్వానికి నివేధించారు. గురువారం వరకు జిల్లాలోని 79,389 మంది రైతులకు రూ.91.03 కోట్ల పెట్టుబడి సాయం అందింది. రైతుల వివరాలురూ. 11.78 కోట్లు రూ. 11.90 కోట్లురూ. 8.60 కోట్లురూ. 14.21 కోట్లురూ. 7.31 కోట్లురూ. 8.67 కోట్లురూ. 10.41 కోట్లురూ.7.23 కోట్లురూ. 5.72 కోట్లురూ. 5.20 కోట్లువెంకటాపురం(ఎం)వెంకటాపురం(కె)వాజేడుములుగుతాడ్వాయిమల్లంపల్లి ఏటూరునాగారంగోవిందరావుపేటకన్నాయిగూడెంమంగపేట6,6556,30010,95911,7458,3557,3867,8115,5734,7349,871 వానాకాలం సాగుకు అందిన పెట్టుబడి సాయం ఆనందం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు వానకాలం సీజన్‌కు సంబంధించి ఇప్పటివరకు 9 ఎకరాల భూమి ఉన్న రైతులందరికీ పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ అయింది. శుక్రవారం సాయంత్రం వరకు మరో వెయ్యి మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమకానున్నాయి. కొత్త పట్టాదారు పాస్‌బుక్కులు పొందిన రైతులకు సైతం ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందిస్తుంది. – సురేశ్‌కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి -
బయ్యారంలో ఉక్కుపరిశ్రమ కోసం ఉద్యమం
బయ్యారం: బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఉద్యమిస్తామని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం బయ్యారం సమీపంలోని ఇనుపరాతిగుట్టను సందర్శించారు. అనంతరం మండలంలోని చర్లపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. బయ్యారం గనులను ప్రభుత్వరంగ సంస్థ సింగరేణికి అప్పగించాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని నినదించి ఆంధ్రపాలకుల నుంచి తెలంగాణ సంపదను కాపాడామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఇనుపరాయిగనులున్నాయని, వీటి ఆధారంగా బయ్యారంలో సింగరేణి సంస్థతో ఉక్కు పరిశ్రమను ఏర్పా టు చేయాలన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పది సంవత్సరాల్లో ఒకటి రెండుసార్లు విభజన చట్టంలో పొందుపర్చిన బయ్యారం ఉక్కు పరిశ్రమ గురించి ప్రస్తావనకు తెచ్చినా పూర్తి స్థాయిలో పరిశ్రమ ఏర్పాటు ప్రయత్నాలు చేయలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు గడిచినా ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మిస్తే ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. సింగరేణిలో 35 వేల డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని ఈ నెల 20 నుంచి అన్నం, నీరు ముట్టకుండా దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. ఎన్నికల ముందు మహిళలకు నెలకు రూ.2,500, కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ. లక్షతోపాటు తులం బంగారం, పింఛన్ల పెంపు తదితర మాయమాటలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి హామీలను అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో పేదపిల్లలతోపాటు ఆడపిల్లలు చదువుకు దూరం కావాల్సి వస్తోందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా తాను తెలంగాణ సేనను ఏర్పాటు చేశామన్నారు. ఆడబిడ్డలకు రాజకీయంగా హక్కు ఉండాలని, ఆదివాసీల అభివృద్ధికి తమ పార్టీ ప్రత్యేకంగా రెండు గిరిజన విభాగాలను ఏర్పాటు చేసిందన్నారు. పార్టీ నాయకులు బోడ జనార్దన్, రామకృష్ణదొర, రియాజ్ అహ్మద్, నవీన్ ఆచారి, వీరన్న ఉన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఉక్కుపరిశ్రమపై చిన్నచూపు టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత -
పథకాలు అర్హులకు చేరాలి
హన్మకొండ అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రయోజనాలు చివరి లబ్ధిదారుడి వరకు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూచించారు. హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్ జిల్లాల అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. టీబీ నిర్మూలన, పల్స్‌పోలియో, ఇందిరమ్మ ఇళ్లు, వైద్య సేవలు, వ్యవసాయం, మౌలిక వసతుల కల్పనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పాలనలో నాణ్యత, పారదర్శకత, సాంకేతికతకు ప్రాధాన్యం ఇవ్వాలని, విద్య, ఆ రోగ్యం, వ్యవసాయ రంగాలను బలోపేతం చేయాలని సూచించారు. రైతులను విలువ ఆధారిత పంటల సాగు వైపు ప్రోత్సహించాలని సూచించారు. హాస్టళ్ల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ: మంత్రి అడ్లూరి వర్షాకాలంలో సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. అత్యవసర మరమ్మతుల కోసం ప్రతీ జిల్లాకు రూ.కోటి వరకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామన్నారు. ఆరోగ్య పరీక్షలు, స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్యం, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఎమ్మెల్యేలు, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, డాక్టర్ సత్యశారద, పోలీస్ కమిషనర్ శ్వేత, అదనపు కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. మహిళల కృషిని ప్రశంసించిన గవర్నర్ హన్మకొండ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన స్టాళ్లను రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గురువారం సందర్శించి మహిళల కృషిని అభినందించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, వ్యవసాయ, ఉద్యాన శాఖల స్టాళ్లలో ప్రదర్శించిన ఉత్పత్తులను పరిశీలించి తయారీ విధానం, నాణ్యత, మార్కెటింగ్ అవకాశాలపై మహిళలతో మాట్లాడారు. వరంగల్ దరీ స్టాల్‌ను సందర్శించి దరీల ప్రత్యేకత, మార్కెట్ అవకాశాలపై వివరాలు తెలుసుకుని వాటిని కొన్నారు. అనంతరం మహిళలను ప్రోత్సహిస్తూ పలు స్టాళ్లలోని ఉత్పత్తులను కొన్నారు. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అధికారులతో సమీక్ష -
రామప్పలో తైవాన్ దేశస్తుడు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని గురువారం తైవాన్ దేశానికి చెందిన అగ్రికల్చర్ రీసెర్చర్ బోయాన్ లిన్ సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని ఆయన దర్శించుకోగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని బోయాన్ లిన్ కొనియాడారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించి సరస్సు అందాలను తిలకించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలి కన్నాయిగూడెం: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం వనసతులు, నాన్యమైన విద్యను అందించాలని ఐటీడీఏ డీడీ ఫిరంగి అన్నారు. మండల కేంద్రంలోని ఐలాపూర్‌లో ఉన్న గిరిజన ఆశ్రమ వసతి గృహాన్ని ఐటీడీఏ డీడీ ఫిరంగి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడారు. పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం నుంచి అందిస్తున్న వసతులు, విద్యాబోధనపై ఆరా తీశారు. విద్యార్థులకు శుద్ధ జలం అందించాలని ఏర్పాటు చేసిన నీటి శుద్ధజలాన్ని పరిశీలించారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో విద్యార్థులకు సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వసతులను మెనూ ప్రకారం ఇవ్వాలన్నారు. అనుమతి లేకుండా విఽధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓసీ–3లో తప్పిన ప్రమాదంగణపురం: గణపురం మండలం పరుశరాంపల్లి శివారులోని ఓసీ–3లో గురువారం పెను ప్రమాదం తప్పింది. ఓసీ–3లో బాంబ్ బ్లాస్టింగ్ కార్మికులు ఉన్నప్పుడే అధికారులు హెచ్చరిక లేకుండా వేరే వ్యక్తులతో బాంబ్ బ్లాస్టింగ్ చేశారు. కార్మికుల కథనం ప్రకారం.. ఓపెన్ కాస్టు గనిలో 82 మంది బాంబ్‌బ్లాస్టింగ్ కార్మికులుగా పని చేస్తున్నారు. రోజు 56మంది వచ్చి విధుల్లో పాల్గొంటారు. ఈ క్రమంలో ప్రతీ నెల తమకు 26 రోజులు మస్టర్లు వేయాలని కార్మికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు వారం రోజుల గడువు పెట్టారు. ఇది బుధవారానికి ముగిసింది. దీంతో గురువారం పనులు అడ్డుకోవడానికి బ్లాస్టింగ్ రెగ్యులర్ కార్మికులు రాగా అప్పటికే నూతన వ్యక్తులను తీసుకొచ్చిన అధికారులు హెచ్చరిక లేకుండానే గనిలో బాంబ్ బ్లాస్లింగ్ చేయించారు. దీంతో కార్మికులు చెల్లా చెదురయ్యారు. ఓసీ–3 మేనేజర్ కావాలనే బ్లాస్టింగ్ చేశారని ఆందోళనకు దిగారు. ఓసీ–3లో కార్మికులు ఉండగానే బాంబ్ బ్లాస్టింగ్ చేయడం తప్పేనని ఇన్చార్జ్ ఓసీ–3 మేనేజర్ శ్యాంసుందర్ అన్నారు. ఈ ఘటన అనుకోకుండా జరిగిందన్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు తాము, పోలీసు సిబ్బంది కూడా అక్కడే ఉన్నామన్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తామని చెప్పారు. 14న జాబ్ మేళా భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 14న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమణారావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాల ప్లేస్మెంట్ అండ్ కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో ఈ జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జువెలరీ రంగంలో ప్రముఖ సంస్థ అయిన జోయాలుక్కాస్‌కు చెందిన వివిధ శాఖల్లో ఉన్న 300లకు పైగా ఖాళీల భర్తీ కోసం ఈ నియామక ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగిన ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యా, ఇతర సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 10 గంటలకు కళాశాలలో హాజరు కావాలని సూచించారు. ఎంపికై న అభ్యర్థులకు నెలకు సుమారు రూ.23వేల వేతనంతో పాటు ఇతర ప్రోత్సాహకాలు అందజేయనున్నట్లు తెలిపారు. అప్రెంటిస్‌షిప్ మేళా.. ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్ మేళాను ఈ నెల 13న స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ జుమ్లానాయక్ పేర్కొన్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు అప్రెంటిషిప్.ఇండియా వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. -
ఓటరు సవరణను విజయవంతం చేయాలి
ములుగు: గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధుల సహకారంతో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై కలెక్టర్ బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు 98.96 శాతం ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి కాగా 25.79 శాతం ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని వెల్లడించారు. ఫారాల పంపిణీ, వివరాలు నింపే ప్రక్రియలో, తిరిగి ఫారాలను స్వీకరించడంలో బీఎల్వోలకు రాజకీయ పార్టీల బీఎల్ఏలు సహకరించాలని సూచించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో సమస్యలు ఎదురైతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. బీఎల్వోలు ప్రతీ ఇంటిని సందర్శిస్తూ ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తున్నారని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా 24న పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరు జాబితా కీలకమైందని వివరించారు. అర్హులైన ఓటర్ల పేరు జాబితాలో నమోదు అయ్యేలా, అనర్హుల పేర్లు తొలగించేలా రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు, బీఎల్వోలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదాంను గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నెలవారి తనిఖీ చేసి గోదాం సీల్‌ను పరిశీలించారు. గోదాంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, అగ్నిప్రమాదాల నివారణకు ఏర్పాటు చేసిన ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఇతర భద్రతా పరికరాలను తనిఖీ చేశారు. అత్యవసర పరిస్థితులు తలెత్తిన సందర్భంలో అనుసరించాల్సిన భద్రతా చర్యలపై సంబంధిత సిబ్బందికి సూచనలు చేశారు. గోదాం వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు, సందర్శకుల నమోదు పుస్తకాలను పరిశీలించారు. ఈవీఎంల భద్రత విషయంలో అలసత్వం వహించొద్దని సిబ్బందిని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, ఆర్డీఓ కృష్ణవేణి, ఎన్నికల సూపరింటెండెంట్ సలీం, డీటీ నితీష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు -
పోలీస్ శాఖలో కొలువుల జాతర
సాక్షిప్రతినిధి, వరంగల్: పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసుశాఖలో సుమారు ఏడు వేల పోస్టుల భర్తీ తక్షణ అవసరంగా గుర్తించింది. ఈ మేరకు 5,000 ఖాళీలను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు జీఓలో స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత కొంతకాలంగా నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అ భ్యర్థుల్లో కొత్త ఆశలు చిగురించాయి. వేలాది మంది నిరుద్యోగ యువత పోలీసు ఉద్యోగాల కోసం పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలకు ముందు నుంచే పోలీస్ అకాడమీ, కోచింగ్ సెంటర్లలో సందడి మొదలైంది. ఉమ్మడి జిల్లాకు గణనీయమైన పోస్టులు హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లో పోలీసు ఉద్యోగాలు ఆశిస్తున్న వారికి నిజంగా ఇది శుభవార్తే. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ కోసం ఉమ్మడి జిల్లా అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఆయా జిల్లాల్లో ప్రతి సంవత్సరం పోలీసు ఉద్యోగాలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతుంటారు. స్థానికత (లోకల్ కేడర్) ప్రకారం ఖాళీల వివరాలను సంబంధిత శాఖలు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఇప్పటికే పంపినట్లు అధికారులు ప్రకటించారు. స్థానిక కేడర్ ఆధారంగా పోస్టుల పంపిణీ జరగనున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు కూడా గణనీయమైన పోస్టులు వచ్చే అవకాశాలున్నాయని నిరుద్యోగులు భావిస్తున్నారు. రిక్రూట్మెంట్ బోర్డుకు కీలక బాధ్యత.. స్థానిక కేడర్ వారీగా ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, అర్హతల వివరాలను సంబంధిత శాఖలు అందించిన వెంటనే తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పూర్తి షెడ్యూల్‌తో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నియామకాన్ని వేగంగా పూర్తి చే యాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఉమ్మడి జిల్లాలో ప్రతి నియామకంలో పోలీసు ఉద్యోగాలకు వేలాది మంది పోటీ పడుతుంటారు. ఈసారి కూడా భారీ సంఖ్యలో అభ్యర్థులు సిద్ధమవుతుండగా, పోలీసు శాఖలో కొలువుల జాతర ప్రారంభమైనట్టేనని నిరుద్యోగులు అభిప్రాయపడుతున్నారు. స్థా నిక కేడర్‌లో ఎక్కువ పోస్టులు దక్కితే ఉమ్మడి జిల్లాకు చెందిన వందలాది మంది కి ప్రభుత్వఉద్యోగాల కల నెరవేరే అవకాశం ఉంది. భర్తీ చేయనున్న పోస్టులు ఇవే... ఎస్ఐ (సివిల్) 148 ఎస్ఐ (ఏఆర్) 14 రిజర్వ్ ఎస్ఐ (టీజీఎస్పీ) 12 ఎస్ఐ (ఎస్ఏఆర్ సీపీఎల్) 3 అసిస్టెంట్ ఎస్ఐ (ఎఫ్‌పీబీ) 23 కానిస్టేబుల్ (సివిల్) 3,697 కానిస్టేబుల్ (ఏఆర్) 1,052 కానిస్టేబుల్ (ఎస్ఏఆర్ సీపీఎల్) 24 కానిస్టేబుల్ (డ్రైవర్) 20 కానిస్టేబుల్ (మెకానిక్) 7 మొత్తం పోస్టులు 5,000కమిషనరేట్ / మంజూరైన పనిచేస్తున్న మొత్తం ఖాళీల జిల్లా పోస్టులు వారు ఖాళీలు శాతం వరంగల్ పోలీస్ కమిషనరేట్ 8,828 7,181 1,647 18.66 మహబూబాబాద్ 2,132 1,983 149 6.99 ములుగు 1,562 1,375 187 11.97 జయశంకర్ భూపాలపల్లి 1,605 1,450 155 9.66 మొత్తం 14,127 11,989 2,138 15.13ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2,138 పోస్టులు ఖాళీ త్వరలో నోటిఫికేషన్.. నిరుద్యోగుల్లో కొత్త ఆశలు కోచింగ్ సెంటర్లలో మొదలైన సందడి -
‘మీసేవ’ల్లో యూరియా బుకింగ్
ములుగు: రైతులకు అవసరమైన యూరియా, ఎరువుల బుకింగ్ సేవలను మీ సేవల ద్వారా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే పలువురు రైతులు ఫర్టిలైజర్ మొబైల్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకుంటున్నారని తెలిపారు. యాప్ ద్వారా బుకింగ్ చేసే విధానం తెలియని రైతులు తమ సమీపంలోని మీసేవ కేంద్రాన్ని సందర్శించి సులభంగా యూరియా బస్తాలను బుక్ చేసుకోవచ్చన్నారు. యూరియా బుకింగ్ కోసం రైతులు పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ ప్రతితో పాటు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ వివరాలను మీసేవ కేంద్రంలో సమర్పించాలన్నారు. వివరాలను నమోదు చేసిన అనంతరం ప్రభుత్వం నిర్ణయించిన మేరకు యూరియా బస్తాలను బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని, బుకింగ్ పూర్తయ్యాక యూరియా బుకింగ్ ఐడీతో కూడిన రసీదును రైతులకు అందజేస్తారని వివరించారు. ప్రభుత్వం ఈ సేవకు రూ.10 రుసుము నిర్ణయించినందున రైతులు నిర్ణీత రుసుము చెల్లించి సేవలను వినియోగించుకోవాలని కోరారు. డిజిటల్ సంతకం పూర్తికాని భూములు కలిగిన పట్టాదారు రైతులు తమ ఆధార్ నంబర్ ఆధారంగా యూరియా బుకింగ్ చేసుకునే అవకాశం ఉందని దేవేందర్ వెల్లడించారు. ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ -
కుటుంబానికి అండగా ఉండాలని..
ఖిలా వరంగల్: పాఠశాల స్థాయి నుంచే ఎన్సీసీ ట్రైనింగ్ పొందినా. నాటి నుంచి పోలీసు అంటే నాకు మక్కువ. ఆరేళ్ల క్రితం డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం శ్రమిస్తున్నా. పోలీసు ఉద్యోగం సాఽధించి కుటుంబానికి అండగా ఉండాలనే లక్ష్యంతో రోజూ క్రీడామైదానంలో నాలుగు గంటలు పరుగు, ఫిట్నెస్ అంశంలో సాధన చేస్తున్నా. – పూజ నాగరాజు, కరీమాబాద్ వరంగల్కానిస్టేబుల్ ఉద్యోగమే లక్ష్యంఖిలా వరంగల్: డిగ్రీ పూర్తయ్యింది. కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలన్నదే నాలక్ష్యంగా పెట్టుకున్నా. ఫిట్నెస్ కోసం హనుమకొండ జేఎన్ స్టేడియంలో ప్రతిరోజూ ప్రాక్టీస్ చేస్తున్నా. ఇంటి వద్ద ఉంటూ సంబంధిత సబ్జెక్ట్‌లు చదువుతున్నా. ఇటీవల ఆర్మీ ఉద్యోగం పరీక్ష రాశాను. ఇంకా ఫలితాలు ప్రకటించలేదు. మొదటి ప్రయత్నంలోనే కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలన్నదే నా కల. ఇందుకు కోచింగ్ సెంటర్లో తీవ్రంగా శ్రమిస్తున్నా. – పిట్టల సాయి, కాశికుంట వరంగల్ -
రాసేదెలా?
ఏటూరునాగారం:పాఠశాలలు పునఃప్రారంభమై నెల రోజులు కావస్తున్నా.. ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, కళాశాలల విద్యార్థుల గురించి గిరిజన సంక్షేమశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. విద్యార్థులకు ఇప్పటికీ నోట్‌బుక్స్ అందకపోవడంతో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు రాసుకునేదెలా అని ప్రశ్నిస్తున్నారు. ఐటీడీఏ పరిధిలోని గిరిజన విద్యా సంస్థలు 149 ఉన్నాయి. 8,528 విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఉపాధ్యాయులు చెప్పిన హోం, క్లాస్ వర్క్ ఎందులో రాయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలల్లోని ఉపాధ్యాయులు మాత్రం పాఠాలు చెబుతున్నాము.. నోట్స్ రాయాలి కాపీలు రాకుంటే మేము ఏం చేయాలని చేతులు దులుపుకుంటున్నారు. నిరుపేద కుటుంబాలకు చెందినవారే.. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులే ఉన్నారు. అలాంటి విద్యార్థుల తల్లిదండ్రులకు నోట్‌బుక్స్ కొనుగోలు చేసి ఇవ్వలేని ఆర్థిక పరిస్థితి ఉంది. నెలరోజులు కావస్తున్నా నోట్ బుక్కులు అందకపోవడంతో హోం వర్క్ ఒకేసారి చేయాలంటే ఎలా రాస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఐటీడీఏ పీఓ, గిరిజన సంక్షేమశాఖ అధికారులు తక్షణమే స్పందించి విద్యార్థులకు నోట్‌బుక్స్ అందేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. గిరిజన విద్యార్థులకు రెండు రోజుల్లో నోట్‌బుక్స్ పంపిణీ చేస్తాం. రావడం ఆలస్యమైంది. తక్షణమే తెప్పించి విద్యార్థులందరికీ నోట్‌బుక్స్ అందేలా చూస్తాం. విద్యార్థులు హోం వర్క్, క్లాస్ వర్క్‌కు ఇబ్బంది రాకుండా చూస్తాం. – ఫిరంగి, ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ విద్యాసంవత్సరం ప్రారంభమై నెలకావస్తున్నా పంపిణీలో జాప్యం పాత కాపీల్లోనే నోట్స్ రాసుకుంటున్న విద్యార్థులు చోద్యం చూస్తున్న గిరిజన సంక్షేమశాఖ అధికారులు -
వైఎస్సార్ సేవలు మరువలేనివి
ములుగు: పేద ప్రజల అభ్యున్నతికి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అందించిన సేవలు మరువలేనివని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. ఈ మేరకు వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ముసినపల్లి కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ హాజరై మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. నాడు వైఎస్సార్ అమలు చేసిన పథకాలు కొన్ని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, డీసీసీ ఉపాధ్యక్షుడు పల్లె జయపాల్‌రెడ్డి, నాయకులు వంగ రవియాదవ్, చింతనిప్పుల భిక్షపతి, మట్టెవాడ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
పనులు త్వరగా పూర్తిచేయాలి
ములుగు: జిల్లా పరిధిలోని గట్టమ్మ వద్ద నిర్మిస్తున్న కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు మంత్రి నూతనంంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను బుధవారం పరిశీలించారు. భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు. కలెక్టరేట్ భవనాన్ని సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభం చేయించనున్నట్లు సీతక్క వెల్ల డించారు. అదేవిధంగా గట్టమ్మ వద్ద నిర్మిస్తున్న పైలాన్ ప్రాజెక్టు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క -
సీపీని కలిసిన ములుగు డీఎస్పీ
వరంగల్ క్రైం : ఇటీవల వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఎన్.శ్వేతను ములుగు డీఎస్పీ రవీందర్ బుధవారం వరంగల్ కమిషనర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని మొక్కను అందజేశారు. అనంతరం ఇరువురు అధికారులు శాఖపరమైన అంశాలపై ముచ్చటించుకున్నారు. వసతిగృహాల్లో డీపీఓ తనిఖీ మంగపేట: మండల పరిధిలోని మంగపేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, తిమ్మంపేటలోని ఎస్టీ బాలుర సంక్షేమ వసతి గృహాన్ని జిల్లా పంచాయతీ అధికారి, మండల స్పెషలాఫీసర్ కొండ వెంకయ్య బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టళ్లలోని పరిసరాలు, పరిశుభ్రతను పరిశీలించారు. సరుకుల స్టాక్ వివరాలు తెలుసుకుని పరిశీలించారు. కస్తూర్బా విద్యార్థినులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసి మెనూ ప్రకారం పౌష్టికాహారం అందుతుందా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎస్టీ వసతి గృహం వార్డెన్ నర్సయ్య, కేజీబీవీ స్పెషలాఫీసర్ భాగ్యలక్ష్మిని ఆదేశించారు. హాస్టళ్లలో పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ భద్రునాయక్, టీఎస్‌ఈజీసీ సభ్యుడు గుమ్మడి సోమయ్య ఉన్నారు. ‘ప్రిన్సిపాల్‌పై చర్య తీసుకోవాలి’ ములుగు రూరల్: మల్లంపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌పై చర్య తీసుకో వాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రవితేజ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం గురుకుల పాఠశాలను ఎస్ఎఫ్ఐ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ గురుకుల పాఠశాల విద్యార్థులతో గ్యాస్ సిలిండర్లు మోయించడం సరికాదన్నారు. విద్యార్థులతో పని చేయించడం తప్పని తెలిపారు. అందుకు బాధ్యులైన వారిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. అమ్మ పేరుతో మొక్క నాటాలి ములుగు: పర్యావరణ పరిరక్షణకు విద్యాశాఖ ఆధ్వర్యంలో అమ్మ పేరుతో ఓ మొక్క నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సిద్ధార్థరెడ్డి తెలిపారు. ఈ మేరకు డీఈఓ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రతీ ఉపాధ్యాయుడు, విద్యార్థి తమ తల్లి జ్ఞాపకార్థం ఒక మొక్క నాటి ప్రకృతికి సేవ చేయాలన్నారు. ప్రతీ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఈ నెల 15 నుంచి అన్ని పాఠశాలల్లో శ్రీసోయింగ్ టు గ్రోయింగ్శ్రీ థీమ్‌తో మొక్కల నాటడం ప్రారంభమవుతుందన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. విద్యార్థులకు సెప్టెంబర్ 20న రాష్ట్ర స్థాయి సమీక్ష, అక్టోబర్‌లో జాతీయ స్థాయి పర్యావరణ పోటీలు ఉంటాయని డీఈఓ పేర్కొన్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి ములుగు: గ్రామ పంచాయతీలను మరింత బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక శిక్షణ కార్యక్రమాన్ని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. నేడు జిల్లా కేంద్రంలోని లీలా గార్డెనన్లో గురువారం ఉదయం 10గంటలకు ప్రారంభమయ్యే శిక్షణ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క హాజరవుతారని వెల్లడించారు. శిక్షణ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. -
చకచకా పనులు
ద్వారం దిమ్మైపె ఏర్పాటు చేయని కొమ్ము దిమ్మెలుఎస్ఎస్తాడ్వాయి: జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి త్వరలోనే పర్యటించనున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మేడారం ఆలయ పునరుద్ధరణ పనులు చకచకా సాగుతున్నాయి. రూ. 100 కోట్లతో గద్దెల ప్రాంగణం పునరుద్ధరణ పనులను చేపట్టగా జాతర సమమంలో కొంత మేరకు పనులను కాంట్రాక్టర్ పూర్తి చేశారు. అనంతరం పనులను మళ్లీ చేపట్టారు. త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటనకు రానుండడంతో నిర్ణీత గడువులోగా పనులన్నీ పూర్తిచేయాలనే లక్ష్యంతో సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు ముమ్మరం చేశారు. ఇటీవల మంత్రి సీతక్క జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పనుల పురోగతిపై జాప్యం చేయొద్దని గడువులోగా పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు పనుల్లో వేగాన్ని మరింత పెంచారు. కొనసాగుతున్న పనులు.. గద్దెల ప్రాంగణంలో గ్రౌండింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. వర్షపు నీరు నిల్వ లేకుండా డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచేలా ఆలయం చుట్టూ ఉన్న ద్వారాలపై ఏర్పాటు చేసిన దిమ్మాలపై చెక్కిన కొమ్ములు, బొమ్మల ఏర్పాటు పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం 8 ద్వారాలకు గాను రెండు ద్వారాలపై కొమ్ములతో చెక్కిన రాతి స్తంభాలను ఏర్పాటు చేశారు. ఇంకా ఆరు ద్వారాల దిమ్మెలపైన రాతి బొమ్మల స్తంభాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రాంగణం సుందరీకరణ, విద్యుత్, వసతుల కల్పన పనులను చేపడుతున్నారు. మంత్రి సీతక్క సమీక్ష అనంతరం పనుల పురోగతిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. రోజువారీగా పర్యవేక్షణ అవసరమైన చోట అదనపు సిబ్బందిని నియమించడంతో పాటు యంత్రాల సంఖ్యను పెంచి పనులను యుద్ధప్రాతిపదికన కొనసాగిస్తున్నారు. ప్రతీ పనికి గడువు నిర్ణయించారు. రోజువారీగా పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. పనుల నాణ్యతలో రాజీ పడకుండా నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా సంబంధిత శాఖల మధ్య సమన్వయం పెంచారు. సీఎం పర్యటనకు ముందే ఆలయ పునరుద్ధరణ పనులను పూర్తిచేసి, భక్తులకు మెరుగైన వసతులు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులను దశలవారీగా నిర్వహిస్తున్నారు. మిగిలిన పనులు సైతం నిర్ణీత గడువులోగా పూర్తవుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సీఎం పర్యటన నాటికి పూర్తి చేసేలా అధికారుల కసరత్తు జోరుగా మేడారం ఆలయ పునరుద్ధరణ పనులు మంత్రి సీతక్క ఆదేశాలతో పుంజుకున్న వేగం -
స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి
ములుగు: ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో జీఎం ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో తేజస్ వర్క్‌షాప్ మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి జీఎం ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ సిద్ధార్థ రెడ్డి అధ్యక్షత వహించగా బాదం ప్రవీణ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నూతన ఆవిష్కరణలు, సాంకేతికత వినియోగం, యువతలో వినూత్న ఆలోచనలను ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో విలువ ఆధారిత ఉత్పత్తులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, యువ పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం పెరగడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ ఏపీడీ శ్రీనివాస్, డీపీఎం దేవానందం, ఎంఎస్ఎంఈ నుంచి ధనుంజయ్, టీజీఐసీ నుంచి రమేష్, ఆర్ఐసీహెచ్ నుంచి చరణ్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కోశాధికారి మోహన్ పాల్గొన్నారు. ‘ఇసుక లారీలను అడ్డుకుంటాం’ వెంకటాపురం(కె): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వెంకటాపురం మండల కేంద్రం మీదుగా వెళ్లే ఇసుక లారీలను అడ్డుకుంటామని సీపీఎం జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ అన్నారు. మండల పరిధిలోని ఆలుబాకలో మంగళవారం సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటాపురం మండల కేంద్రం నుంచి ఎదిర వరకు ఇసుక లారీల రాకపోకలతో రోడ్లు గుంతల మయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మరమ్మతులు ఎప్పుడు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చే ఇసుక లారీలు వెంకటాపురం మీదుగా వస్తే మాత్రం అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గ్యానం వాసు, ఆదినారాయణ, రాంబాబు, కట్ల నర్సింహాచారి, వీరవేణి తదితరులు పాల్గొన్నారు. కందకాలు తవ్వితే ఉద్యమిస్తాంఏటూరునాగారం: ఏజెన్సీలోని గిరిజనులు సాగుచేసుకుంటున్న భూముల్లో అటవీశాఖ అధికారులు కందకాలు తీస్తే ఉద్యమిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు తుమ్మల వెంకటరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఈ మేరకు ఐటీడీఏ కార్యాలయం ఎదుట సీపీఎం నాయకులు, రైతులు, గిరిజనులు మంగళవా రం ధర్నా చేపట్టారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఐటీడీఏ ఇన్చార్జ్ ఏపీఓ ప్రతాప్‌కు నాయకులు అందజేశారు. అనంతరం వెంకటరెడ్డి మాట్లాడుతూ మండలంలోని గంటలకుంట గ్రామానికి చెందిన గిరిజనులు 25 ఏళ్లుగా భూములు సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని తెలిపా రు. ఆ భూముల్లో ఫారెస్టు అధికారులు కందకాలు తీయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పంటల సాగుకు ఎలాంటి ఆటంకాలు కలిగించినా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు తొలెం కృష్ణయ్య, బాడిష సమ్మయ్య, నగేశ్, సురేశ్ పాల్గొన్నారు. స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్లు పూర్తి వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని జిల్లా యువజన, క్రీడల అధికారి కార్యాలయంలో స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాల ఎంపిక ప్రక్రియ మంగళవారం ముగిసింది. స్పోర్ట్స్ స్కూల్‌కు ఎంపికైన బాలుర ధ్రువపత్రాలను డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ ఆధ్వర్యంలో పరిశీలించారు. క్రీడాకారులు, వారి తల్లిదండ్రులకు డీవైఎస్ఓ స్వాగతం పలికారు. అడ్మిషన్ ప్రక్రియ, హాస్టల్ వసతి, నాణ్యమైన క్రీడా శిక్షణ, సౌకర్యాల గురించి వివరించారు. ఎంపికై న వారికి క్రీడా శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారులు, కోచ్‌లు పాల్గొన్నారు. -
రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రారంభించాం..
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ప్రారంభించాం. సాధారణంగా ప్రజలు జిల్లా కేంద్రానికి లేదా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి సమస్యలు వినిపించే విధానానికి భిన్నంగా ప్రభుత్వ యంత్రాంగమే గ్రామాలకు వెళ్తుంది. అక్కడ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరిస్తాం. ఈ కార్యక్రమంతో మారుమూల, గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రజలు ప్రజాదర్బార్ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి. – ధనసరి సీతక్క, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి -
వాగుదాటి.. వైద్య పరీక్షలు
● 45 మందికి మందుల పంపిణీ ఏటూరునాగారం: మండల పరిధిలోని ఎలిశెట్టిపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మండలంలోని చెల్పాక(రొయ్యూర్) ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు చాముండేశ్వరి, ఏఎన్ఎం ఆదిలక్ష్మి, ఆశ కార్యకర్త ధనలక్ష్మిలు వాగు దాటి వెళ్లి వైద్యం అందించారు. ఈ మేరకు మంగళవారం ఎలిశెట్టిపల్లిలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి 45 మంది రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ సందర్భంగా పీహెచ్సీ వైద్యురాలు చాముండేశ్వరి మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు సూచనలు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా లోతట్టు గ్రామాల ప్రజలకు కావాల్సిన మందులు మూడు నెలలకు సరిపడా నిల్వ చేసినట్లు వివరించారు. అలాగే ఎలిశెట్టిపల్లికి చెందిన గర్బిణి సౌజన్యను ముందస్తుగా ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి 108లో తరలించినట్లు వెల్లడించారు. వర్షాకాలంలో వాగు ఉప్పొంగితే చికిత్స అందించడం ఇబ్బంది అవుతుందని ఆమె ప్రసవానికి రెండు వారాల సమయం ఉన్నా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆస్పత్రికి తరలించి ప్రసవం పొందేవరకు యోగ క్షేమాలు చూస్తామని వివరించారు. -
జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యంపై మంత్రి కొండా సురేఖ అభ్యంతరం
● ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు ● ఇరువర్గాల మధ్య కుదురుతోందనుకున్న సయోధ్యకు బ్రేక్ ● ఉమ్మడి వరంగల్ జిల్లా హస్తం పార్టీలో తెరపైకి మరోసారి వర్గపోరు సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ మంత్రి కొండా సురేఖ నేరుగా ఏఐసీసీ (ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాసినట్లు మంగళవారం వెలుగులోకి వచ్చింది. కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య సయోధ్య కుదురుతోందనే సంకేతాలు కనిపించినప్పటికీ, తాజా పరిణామాలతో ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సయోధ్య సంకేతాలు.. తాత్కాలికమే! ఇటీవల ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడం, పరస్పరం విమర్శలు తగ్గించడం, పార్టీ కార్యక్రమాల్లో కలిసి పాల్గొనడం వంటి పరిణామాలతో విభేదాలు ముగిశాయనే ప్రచారం జరిగింది. కడియం శ్రీహరి ఇటీవల నిర్వహించిన ఓ ఫంక్షన్‌కు కొండా దంపతులు హాజరు కూడా అయ్యారు. దీంతో జిల్లా కాంగ్రెస్‌లో కూడా ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, తాజా లేఖ వ్యవహారంతో ఆ సయోధ్య తాత్కాలికమేనని తేలిపోయిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉండగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక నేతలుగా ఉన్న కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య మరోసారి విభేదాలు బయటపడడం పార్టీపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది? ఇరువర్గాల మధ్య మరోసారి రాజీ ప్రయత్నాలు జరుగుతాయా? లేదా? అన్నది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తాజా వివాదానికి కారణాలివే.. కడియం శ్రీహరి స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంపై ఇటీవల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆసమావేశంలో ఉమ్మడి వరంగల్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సమగ్ర మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని అధికారులకు సూచించినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఈ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. జిల్లా వ్యవహారాల్లో ప్రభుత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంత్రిని పక్కనబెట్టి కడియం శ్రీహరి అధికారులతో సమీక్షలు నిర్వహించడం, ఆదేశాలివ్వడం సరైన పద్ధతి కాదని ఆమె అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే కడియం శ్రీహరి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాసినట్లు పార్టీ వర్గాల సమాచారం. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించడం, ప్రభుత్వ పరి పాలనలో అనవసర జోక్యం చేసుకోవడం వంటి అంశాలను ఆమె లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత నుంచే కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. నియోజకవర్గాల పరిధి, పార్టీ వ్యవహారాలు, అధికారుల సమావేశాలు, రాజకీయ కార్యక్రమాల విషయంలో ఇద్దరూ పలుమార్లు బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదులు కూడా చేశారు. ఈ విభేదాలు రాష్ట్ర నాయకత్వం దృష్టికి వెళ్లడంతో పలుమార్లు సర్దుబాటు ప్రయత్నాలు జరిగాయి. -
‘బొగత’ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి
● కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ములుగు: జిల్లాలోని బొగత జలపాతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లోని తన చాంబర్లో మంగళవారం బొగత జలపాతం వద్ద చేపట్టనున్న అభివృద్ధి పనులపై సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడారు. బొగత పరిసరాలను పర్యాటకులు ఆకర్షించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. స్థానిక వంటకాలను పర్యాటకులకు అందుబాటులో ఉంచే విధంగా ఇందిరా మహిళా శక్తి ఫుడ్కోర్ట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, పార్కింగ్, విశ్రాంతి సౌకర్యాలు, భద్రత, దిశా నిర్ధేశక బోర్డులతో పాటు మౌలిక వసతులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. స్థానిక మహిళా స్వయం సహాయక సంఘాలకు కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉపాధితో పాటు ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. పర్యాటక ప్రాంతంలో స్థానిక ప్రత్యేకతను ప్రతిబింబించే ఆహార పదార్థాలకు ప్రాధాన్యం కల్పిస్తూ, వచ్చే ప్రతి పర్యాటకుడికి నాణ్యమైన సేవలు అందించాలన్నారు. బొగత జలపాతాన్ని రాష్ట్ర స్థాయిలో ఆదర్శ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, డీఎఫ్ఓ వికాస్ మీనా, టూరిజం అధికారి శివాజీ, అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
జీపీల బలోపేతమే లక్ష్యం
ములుగు: గ్రామ పంచాయతీలను ఆర్థికంగా, పరిపాలనాపరంగా బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ నుంచి గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అమలు, 16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం, గ్రామాల్లో అభివృద్ది కార్యక్రమాలపై మంత్రి సీతక్క రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి అదనపు కలెక్టర్ సంపత్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గ్రామస్థాయిలో ఖర్చు చేసే ప్రతీ రూపాయి ప్రజల అభ్యున్నతికే ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని ఆదేశించారు. 16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై ప్రతీ సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శికి పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని సూచించారు. నేటి నుంచి జిల్లాల వారీగా మూడు రోజుల పాటు సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులకు సమగ్ర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి తెలిపారు. వీబీజీరామ్‌జీ చట్టంపై ప్రతీ సర్పంచ్, కార్యదర్శికి పూర్తిస్థాయి అవగాహన కల్పించాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్ధాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ వెంకయ్య, మిషన్ భగీరథ ఎస్ఈ చల్లారెడ్డి, ఈఈ సురేందర్, పంచాయతీరాజ్ ఈఈ అజయ్ కుమార్, మిషన్ భగీరథ డీఈ సునీత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వీసీలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క -
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
ములుగు: టౌన్ ప్లానింగ్, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మున్సిపల్ కమిషనర్ సంపత్‌రెడ్డి తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో సిబ్బందితో కలిసి మంగళవారం పర్యటించి పట్టణ ప్రణాళిక, పారిశుద్ధ్య అంశాలను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డులో కొనసాగుతున్న నిర్మాణ పనులు, భవన అనుమతులు, రహదారుల పరిస్థితి, డ్రెయినేజీ వ్యవస్థ, చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపర్చాలని, చెత్తను ప్రతిరోజూ సకాలంలో సేకరించి వార్డును పరిశుభ్రంగా ఉంచాలని పారిశుద్ధ్య సిబ్బందికి సూచించారు. అలాగే డ్రెయినేజీలను నిరంతరం శుభ్రం చేయాలని సూచించారు. స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు. పరిశుభ్రమైన ములుగు పట్టణ నిర్మాణానికి ప్రజలు సహకరించాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ సంపత్‌రెడ్డి -
ప్రమోషన్లు ఇవ్వాలని వినతి
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో ఐదు సంవత్సరాల సేవ పూర్తి చేసిన సీనియర్ మైనింగ్ సర్దార్లకు వెంటనే ఓవర్‌మెన్ గ్రేడ్–బీ ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం భూపాలపల్లి ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి జీఎం ఏనుగు రాజేశ్వర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ మాట్లాడుతూ.. ఓవర్‌మెన్ పోస్టులు ఖాళీ లేవని చెప్పి ప్రమోషన్లు నిలిపివేస్తూనే యాక్టింగ్ ఓవర్‌మెన్ విధులు చేయించడం అన్యాయమన్నారు. 2016–17 బ్యాచ్ అర్హులైన సీనియర్ మైనింగ్ సర్దార్లకు తక్షణమే ప్రమోషన్లు ఇవ్వాలని, జేఎంఈటీ సిబ్బందికి కూడా శిక్షణ పూర్తయిన వెంటనే షార్ట్ ఫైరర్ లేదా సర్దార్ ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, మైనింగ్ సిబ్బంది ఆసిఫ్‌పాషా, రామచందర్, సికిందర్‌సింగ్ పాల్గొన్నారు. -
ఇలాగైతే ఎలా సర్..!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో క్షేత్రస్థాయి పని ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో దాదాపు పూర్తయినా.. కీలకమైన డిజిటైజేషన్ మాత్రం ముందుకు కదలడం లేదు. సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించిన గణాంకాల ప్రకారం 30.53 లక్షల ఓటర్లలో 98.22 శాతం ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసిన అధికారులు.. వాటిలో కేవలం 8.91 శాతాన్నే డిజిటల్ వ్యవస్థలో నమోదు చేయగలిగారు. అన్ని జిల్లాల్లోనూ 96 నుంచి 99.22 శాతం వరకు ఈఎఫ్‌ల పంపిణీ పూర్తయిందని రికార్డులు చెబుతుండగా, పంపిణీ చేసిన ఫారాలను డిజిటల్ రూపంలో నమోదు చేసే ప్రక్రియ మాత్రం ఏ జిల్లాలోనూ సంతృప్తికర స్థాయికి చేరుకోలేదు. ఈఎఫ్‌ల పంపిణీలో వేగం.. డిజిటైజేషనే నత్తనడకన.. ఎన్యూమరేషన్ ఫారం (ఈఎఫ్)ల పంపిణీ మొదట కొంత మందగించిన తర్వాత వేగం పెరిగింది. అన్ని జిల్లాల్లోనూ ఈ ప్రక్రియ బూత్ లెవెల్ ఆఫీసర్లు సకాలంలో పూర్తి చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ ఫారాలను తిరిగి తెప్పించడం, డిజిటైజేషన్ చేయడంలో కాలయాపన చోటు చేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2,75,468 (99.21 శాతం) ఈఎఫ్‌లు పంపిణీ చేసినట్లు అధికారులు నమోదు చేశారు. అయితే అదే జిల్లాలో డిజిటైజేషన్ కేవలం 47,543 (10.25 శాతమే) పూర్తైంది. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోనే అత్యధికం కావడం గమనార్హం. పంపిణీ చేసిన ఫారాల్లో అత్యధిక భాగం ఇంకా డిజిటల్ వ్యవస్థలో నమోదు కావాల్సి ఉంది. మహబూబాబాద్ జిల్లాలో 99.41 శాతం పంపిణీ చేసినా డిజిటైజేషన్ 7.80 శాతం మాత్రమే. ములుగులో 98.48 శాతం పంపిణీకి 13.88 శాతం, జనగామలో 99.65 శాతం పంపిణీకి 11.38 శాతం, వరంగల్‌లో 96.17 శాతం పంపిణీకి 5.40 శాతం, హనుమకొండలో 97.47 శాతం పంపిణీకి కేవలం 4.79 శాతం మాత్రమే డిజిటైజేషన్ అయ్యింది. ఫీల్డ్‌లో పనిచేసినా శ్రమ వృథా అవుతోందా..? బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఫారాలు పంపిణీ చేసి వివరాలు సేకరిస్తున్నారు. కొన్నిచోట్ల నిరక్షరాస్యత కారణంగా ఫారాలు తిరిగి సకాలంలో అందడం లేదు. వీటికి తోడు అందిన వివరాలను సకాలంలో డిజిటల్ వ్యవస్థలో నమోదు చేయకపోతే మొత్తం ప్రక్రియ ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని ఎన్నికల వ్యవహారాలపై అవగాహన ఉన్న అధికారులు చెబుతున్నారు. పూర్తయిన తర్వాతే వివరాల పరిశీలన, అభ్యంతరాలు, తుది ఓటర్ల జాబితా తయారీ వంటి తదుపరి ప్రక్రియలు వేగం అందుకునే అవకాశం ఉంది. ఈ నెల 31న ఓటర్ల తుది జాబితా ప్రకటించాల్సిన నేపథ్యంలో డిజిటైజేషన్ ప్రక్రియలో వేగం పెరగాల్సి ఉంది. ‘సర్’పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగంతో .. జిల్లాల కలెక్టర్లు కిందిస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ పురోగతిని సమీక్షిస్తున్నారు. అయితే ఈ నెల 31న తుది ఓటర్ల జాబితా ప్రకటించాల్సి ఉండగా..మరో 23 రోజులే మిగిలి ఉండటంతో డిజిటైజేషన్ వేగం పెంచాల్సిన అవసరం ఏర్పడింది. 47,54341,93387,31732,90024,3642,77,882 2,75,46837,8302,36,970 2,33,3697,76,953 7,47,1577,67,484 7,64,7974,84,935 4,82,070 5,09,0144,96,160ములుగుహనుమకొండజనగామవరంగల్మహబూబాబాద్జేఎస్భూపాలపల్లిమొత్తం ఓటర్లు ఈఎఫ్‌లు డిజిటలైజ్ చేసినవి ‘ఫారం’ ఇంటికొచ్చింది.. సిస్టంలోకి చేరలేదు 98.22 శాతం ఫారాల పంపిణీ.. డిజిటైజేషన్ మాత్రం 8.91 శాతం పంపిణీలో దూకుడు.. నమోదు మాత్రం నత్తనడక ఫైనల్ పబ్లికేషన్‌కు మరో 23 రోజులే గడువు జిల్లాలో మొత్తం ఓటర్లు, ఈఎఫ్‌లు మరియు డిజిటలైజ్ చేసిన ఫారాలుచదువు రాదు.. ఫారం ఎలా నింపాలి ఓటర్ల ఫారాన్ని నింపడం కోసం నాలాంటి చదువురాని వాళ్లు, వృద్ధులు ఇబ్బ ంది పడుతున్నారు. ఫారం ఇచ్చి నింపి మళ్లీ ఇవ్వమన్నారు. చదువురాని నాలా ంటి వాళ్లు ఫారాన్ని ఎలా నింపుతాం. చదువుకున్న వాళ్లను బతిమలాడాల్సి వస్తున్నది. ఓటర్లు బతికున్నారా లేదా చనిపోయారా తెలుసుకుంటే సరిపోతుంది. కానీ మళ్లీ కొత్తగా ఓట్ల కోసం దరఖాస్తులు, ఫొటోలు ఇవ్వమంటున్నారు. – బొజ్జు ఐలయ్య, జఫర్గడ్ శివారు వడ్డెగూడెం -
ఇసుక దోపిడీకి పాల్పడుతున్న ప్రభుత్వం
ఏటూరునాగారం: కాళేశ్వరం బ్యారేజ్ ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, సుందిళ్ల, కన్నెపల్లి ఇతర పంపుహౌజ్‌లలో నీటిని నింపకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇసుక దోపిడీకి పాల్పడుతుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు అన్నారు. మండల కేంద్రంలోని తన ఇంటి వద్ద బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సునీల్‌కుమార్ అధ్యక్షతన సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం కన్నెపల్లి వద్ద లక్ష క్యూసెక్కుల నీటిని వృఽథాగా దిగువకు వదులుతుందన్నారు. మేడిగడ్డ వద్ద పగుళ్లు వచ్చిన పిల్లర్లకు మరమ్మతులు చేసుకోవాలని నేషనల్ సేఫ్టీ అథారిటీ కమిటీ ఏడాదిన్నర క్రితమే చెప్పినా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్కకు పనులు చేయించేందుకు కంకర, సిమెంట్ దొరకడం లేదా అని ఎద్దేవా చేశారు. కేవలం బ్యారేజ్‌లలో నీరు నింపితే ఇసుకను తోడుకునే అవకాశం ఉండదని భావించిన ప్రభుత్వం నీరు నింపకుండా ఇసుకను తోడుకుంటుందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నం చేసి కాళేశ్వరాన్ని కడితే కూలేశ్వరమని మంత్రి సీతక్క మాట్లాడడం బాధాకరమన్నారు. సీతమ్మ సాగర్ కింద బ్యాక్ వాటర్‌లో ఇసుక కలిసిపోతుందని తప్పుడు నివేదికలతో చేపట్టిన డిసిల్టేషన్‌ను అడ్డుకొని తీరుతామన్నారు. మంగపేట మండలం కత్తిగూడెం వద్ద శివగంగ ప్రాజెక్టు నిర్మించకుండా ఇసుకను తోడుకునేందుకు సీతమ్మ సాగర్‌ను తెరపైకి తెచ్చారని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు తాటి కృష్ణ, తుమ్మ మల్లారెడ్డి, వలిబాబా, ప్రదీప్‌రావు, అశోక్ గౌడ్, ధనలక్ష్మి, నాగ రమేశ్, లక్ష్మణరావు, ఎండి కుర్బాన్ అలి, రఘు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు -
అంకితభావంతో విధులు నిర్వర్తించాలి
ములుగు రూరల్: పోలీసులు అంకితభావంతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సిబ్బందికి రెయిన్ కోట్లు అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ వర్షాకాలంలో విధులకు ఆటంకం కలగకుండా పోలీసులు విధులు నిర్వహించే విధంగా రెయిన్ కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. విధి నిర్వహణలో ఆటంకాలు ఎదురైతే ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు. అవసరమైతే నేరుగా తనను కలువచ్చని తెలిపారు. కింది స్థాయి సిబ్బందికి అండగా ఉంటామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సదానందం, ఆర్ఐ స్వామి, సిబ్బంది పాల్గొన్నారు. పోగొట్టుకున్న సెల్ఫోన్ల అందజేత జిల్లా కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ పరిధిలో సెల్ఫోన్లు పోగొట్టుకున్న 15 మంది బాధితులకు సోమవారం ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తిరిగి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బంది మిస్సింగ్ మొబైల్స్ రికవరీపై వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదులపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రజలు తమ వ్యక్తిగత వస్తువులపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఫోన్లు కోల్పోయిన వారు వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేసి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆర్థిక అక్షరాస్యతపై అవగాహనవెంకటాపురం(ఎం): మండల పరిధిలోని నల్లగుంటలో సోమవారం వరంగల్ డీసీసీ బ్యాంక్ ములుగు శాఖ, వెంకటాపూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై సోమవారం అవగాహన కల్పించినట్లు బ్రాంచ్ ఫీల్ట్ ఆఫీసర్ కార్తీక్‌రెడ్డి తెలిపారు. ప్రజలకు బ్యాంక్ ఖాతా, పొదుపు, ఫిక్సిడ్ డిపాజిట్ ప్రాముఖ్యత, పీఎంజేజేబీవై(ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన), పీఎంఎస్బీవై(ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన), కేవైసీ, రీకేవైసీ, అలాగే బ్యాంకు ద్వారా అందిస్తున్న వివిధ రకాల రుణ సౌకర్యాల గురించి వివరంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ సిబ్బంది యాట లింగయ్య, రమేశ్, కోటి తదితరులు పాల్గొన్నారు. ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయాలి ములుగు: ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ నేటి వరకు వందశాతం పూర్తి చేసి డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎస్ఐఆర్ కార్యక్రమం పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు జిల్లా నుంచి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు వీసీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ దాదాపుగా పూర్తయిందని తెలిపారు. ఇళ్లకు వెళ్లిన సమయంలో తాళం వేసి ఉంటే వాటిని అబ్సెంట్‌గా నమోదు చేయాలన్నారు. అవసరమైతే తర్వాత మరోసారి సందర్శించి ఫారాలను అందజేయాలని సూచించారు. పంపిణీ చేసిన ప్రతి ఎన్యుమరేషన్ ఫారాన్ని బూత్ లెవల్ అధికారులు తిరిగి సేకరించి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేలా డిజిటలైజేషన్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ఆనంతరం కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ జిల్లాలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ 98 శాతం పూర్తయిందని తెలిపారు. నేటి(మంగళవారం) వరకు 100శాతం పూర్తి చేస్తామని వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు 13.88 శాతం ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. ఫారాల పంపిణీ పూర్తవుతున్న నేపథ్యంలో డిజిటలైజేషన్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. -
పనులు త్వరగా పూర్తి చేయాలి
ములుగు: నూతన సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణానికి సంబంధించిన తుదిదశ పనులు త్వరగా పూర్తిచేయాలని, నాణ్యతలో రాజీపడకుండా అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో చేపట్టిన నూతన సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను కలెక్టర్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా భవనంలోని వివిధ విభాగాలు, కార్యాలయ గదులు, సమావేశ మందిరాలు, విద్యుత్, తాగునీరు తదితర మౌలిక సదుపాయాల ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భవన నిర్మాణ పనులు నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలన్నారు. పనులు సకాలంలో పూర్తి చేయడంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. తుది దశ పనులను త్వరితగతిన పూర్తి చేసి కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, తహసీల్దార్ విజయభాస్కర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు -
నేడు కన్నెపల్లికి కేటీఆర్
కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన లక్ష్మీపంప్‌హౌస్(కన్నెపల్లి)ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేడు (ఆదివారం) సందర్శించనున్నారు. ఉదయం 8గంటలకు హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరుతారు. వరంగల్, పరకాల, భూపాలపల్లి, కాటారం మీదుగా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం సమీపంలోని కన్నెపల్లికి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చేరుకుంటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతారని పార్టీ వర్గాలు తెలిపారు. ఆయనవెంట పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు రానున్నారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్ధితులు, మేడిగడ్డ బరాజ్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో కన్నెపల్లి వద్ద గోదావరికి అడ్డంగా కట్ట నిర్మాణం చేసి నీటిని నిలిపి పంపులు ద్వారా ఎత్తిపోయాలనే డిమాండ్‌తో బీఆర్ఎస్ బృందంతో కలిసి కేటీఆర్ టూర్ ప్లాన్ చేసినట్లు చేశారని పార్టీనాయకులు పేర్కొంటున్నారు. కాగా, శనివారం కన్నెపల్లి పంపుహౌస్, పరిసరాలను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సందర్శించి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు ఆయనతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు లక్ష్మీపంప్‌హౌస్ పంపులు లిప్ట్ చేయాలనే లక్ష్యంతో పర్యటన -
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
ఏటూరునాగారం: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ రాంనాథ్ కేకన్ అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక సర్కిల్ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ రాంనాథ్ కేకన్ స్థానిక ఏఎస్పీ మనన్ భట్‌తో కలిసి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీఐ జీడీ సూర్యప్రకాశ్, ఎస్సై మహేశ్‌లకు రికార్డుల నిర్వహణ, కేసుల ఫైలింగ్‌పై ఎస్పీ సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణ, రిసెప్షన్, వివిధ కేసులకు సంబంధించిన రికార్డులు, సీసీటీఎన్ఎస్ అప్డేషన్, కేసు ఫైళ్ల నిర్వహణ, వివిధ నేరాలలో స్వాధీనం చేసుకుని నిరుపయోగంగా ఉన్న వాహనాలు, సిబ్బంది నివాస గృహాలు, స్టోర్ రూమ్, బెల్ ఆఫ్ రూమ్స్ తదితర విభాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కేసులకు సంబంధించిన ఫైళ్లను క్రమబద్ధంగా నిర్వహించాలని, పోలీస్ స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ భద్రపర్చాలని సీఐ సూర్యప్రకాశ్, ఎస్సై మహేశ్‌లను ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలను ఓర్పుతో విని, చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా పోలీస్‌స్టేషన్ పనితీరులో పూర్తి పారదర్శకత పాటిస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. స్టేషన్ పరిశుభ్రత, క్రమశిక్షణ, రికార్డుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా విధులు నిర్వహించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. యువతకు ఉచిత శిక్షణ ములుగు రూరల్: జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత పోలీస్ రిక్రూట్మెంట్ శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఎస్పీ శిక్షణ తరగతుల వివరాలను వెల్లడించారు. ప్రభుత్వం 7వేల పోలీస్ ఉద్యోగాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనుభవజ్ఞలైన అర్హత కలిగిన అధ్యాపకులు, పిజికల్ ట్రైనర్లతో రెసిడెన్షియల్ కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాలోని మారుమూల, గిరిజన గ్రామాల యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కోచింగ్ ప్రారంభ తేదీ, స్థలం ఇతర పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తామని వివరించారు. యువతీయువకులు తమ సమీప పోలీస స్టేషన్లో తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు
● డీఈఓ సిద్ధార్థరెడ్డి ములుగు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖాధికారి సిద్ధార్థరెడ్డి తెలిపారు. ఈ నెల 1న సమస్యల్లో సర్కారు స్కూళ్లు శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన డీఈఓ శనివారం సాక్షికి ఓ ప్రకటన విడుదల చేశారు. మంగపేట మండలంలోని శనిగకుంట ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకున్న మాట వాస్తవమేనని తెలిపారు. విద్యార్థుల బోధన అభ్యాస కార్యక్రమాలకు అంతరాయం కలగకుండా జీఐ షీట్లతో నిర్మించిన షెడ్లో తరగతి గదులు కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే డిప్యుటేషన్‌పై ఉపాధ్యాయుడిని నియమించినట్లు తెలిపారు. వెంకటాపురం(కె) మండలంలోని రంగరాజుపురం పాఠశాలలో మూడు తరగతి గదులు ఉండగా అందులో ఒక తరగతి గది వర్షానికి కురుస్తుందన్నారు. మన ఊరు, మన బడి పథకంలో రెండు తరగతి గదులు నూతనంగా ప్రారంభించినప్పటికీ నిర్మాణం పూర్తి కాలేదన్నారు. వర్షానికి కురుస్తున్న తరగతి గదిలో విద్యార్థులను కూర్చోపెట్టవద్దని హెచ్ఎంను ఆదేశించినట్లు తెలిపారు. కన్నాయిగూడెం మండలంలోని కొత్తూరు పాఠశాల భవనం సురక్షితంగా లేదని గుర్తించి విద్యార్థులను సురక్షితమైన తరగతి గదులకు తరలించాల్సిందిగా హెచ్ఎంను ఆదేశించినట్లు డీఈఓ తెలిపారు. -
ఆయిల్‌పామ్ సాగుప్రోత్సహించాలి
● రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ములుగు: పంట మార్పిడి విధానాలు, ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచేలా రైతులను అధికారులు ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి అదనపు కలెక్టర్ సంపత్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో 2026– 27 సంవత్సరానికి గాను 85 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ పంట సాగు చేసేందుకు లక్ష్యం నిర్ధేశించామన్నారు. దీనికి అనుగుణంగా జిల్లాలో అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. పంట మార్పిడి విధానాలను అవలంభించాలన్నారు. కూరగాయల సాగు వైపు దృష్టి సారించాలని వివరించారు. సూక్ష్మ సేద్య పద్ధతులు రైతులు పాటించేలా ప్రోత్సహించాలన్నారు. -
● ఒప్పించారు.. మెప్పించారు
బడి బాగుంటే భవిష్యత్ బాగుంటుందని నమ్మారు. ఎంఈఓ, ఉపాధ్యాయులు, గ్రామస్తులు ముక్తకంఠంతో బడిని బతికించాలని నినదించారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే లాభాలేంటో వివరించారు. మొత్తానికి ఏళ్లుగా మూతబడి ఉంటున్న పాఠశాలలకు పునర్జీవం పోశారు. మూతబడిన వాటిని ముందుండి నిలబెట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఏడాది పునఃప్రారంభమైన పాఠశాలలపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. ఉమ్మడి జిల్లాలో మూతబడిన పలు సర్కారు పాఠశాలలు పునఃప్రారంభం తెరిపించడంలో సర్పంచ్, గ్రామస్తులు, ఉపాధ్యాయులది కీలకపాత్ర సత్ఫలితాలిచ్చిన జయశంకర్ బడిబాట ఒనగూరే ప్రయోజనాలు వివరించడంతో సక్సెస్ -
కొత్త రైతులకు భరోసా
ములుగు: ఆరుగాలం కష్టపడి పంటలు పండించి దేశానికి అన్నం పెట్టే రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా సాగుకు యోగ్యమైన భూములకు పెట్టుబడిసాయం అందిస్తూ అండగా నిలుస్తోంది. ప్రతీ వానాకాలం, యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి రూ.6 వేల చొప్పున రెండు విడతలుగా రూ.12 వేలు రైతు ఖాతాల్లో జమ చేస్తుంది. జూన్ 15 వరకు కొత్త పాస్‌బుక్కులు పొందిన రైతులు సైతం రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకుంటే పెట్టుబడిసాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నేటి(ఆదివారం) వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాలని వ్యవసాయ శాఖ పేర్కొంది. 562 మంది రైతులు.. జిల్లాలోని 10 మండలాల పరిధిలో నూతనంగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులు 562 మంది ఉన్నారు. నేటి వరకు రైతు భరోసా పథకానికి నూతనంగా పట్టా పొందిన రైతులు దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అర్హులైన రైతులు పట్టాదారు పాస్బుక్కు, ఆధార్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, రైతు భరోసా దరఖాస్తు ఫారంతో తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి లేదా వ్యవసాయ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆరెకరాల వరకు అందిన పెట్టుబడి సాయం జిల్లాలో వానాకాలం సాగు సీజన్ కోసం ప్రభుత్వం ఎకరానికి రూ.6 వేల చొప్పున ఆరెకరాల వరకు పెట్టుబడి సాయాన్ని రైతు ఖాతాల్లో జమచేసింది. జిల్లాలో 88,450 మంది రైతులకు రూ.106.35 కోట్ల సాయం ప్రభుత్వం అందించాల్సి ఉండగా ఇప్పటి వరకు 75,487 మంది రైతులకు రూ. 76.74 కోట్లు రైతు ఖాతాల్లో జమచేసింది. తొమ్మిది రోజుల్లోపు రైతు భరోసా డబ్బులు అందిస్తామని ప్రకటించి ఎకరం నుంచి ఆరెకరాల వరకు పెట్టుబడి సాయాన్ని అందించింది. మిగిలిన రైతాంగానికి కూడా మరో నాలుగు రోజుల్లో డబ్బులు జమ అవుతాయని వ్యవసాయ అధికారులు వెల్లడిస్తున్నారు. సద్వినియోగం చేసుకోవాలికొత్తగా పట్టాపాస్ పుస్తకాలు పొందిన రైతులు రైతుభరోసా కోసం నేటి(ఆదివారం) వరకు దరఖాస్తులు సమర్పించాలి. ఇప్పటికే గ్రామాల్లో వ్యవసాయ అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. బ్యాంకు ఖాతాలు, ఫోన్ నంబర్ల సవరణకు సైతం దరఖాస్తులు స్వీకరించి వివరాలు నమోదు చేస్తున్నాం. జిల్లాలో నూతనంగా పట్టాపాస్‌బుక్కులు పొందిన 562 మంది దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. – సురేశ్‌కుమార్, డీఏఓజిల్లాలో 562 మందికి కొత్త పాస్‌పుస్తకాలు నేడు దరఖాస్తులకు చివరిరోజు సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు -
పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి
ములుగు రూరల్: సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రవికాంత్, సంజీవరావులు అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం సీపీఎస్ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 28న సీపీఎస్ ఉద్యోగుల జనజాగరణ యాత్ర జిల్లా కేంద్రానికి చేరుకుంటుందని ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు బర్మావత్ శ్రీను, నాయకులు వీరస్వామి, సూరయ్య, వినాయక్, ప్రతాప్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. మీసేవలో మరో కొత్త సర్వీస్ ములుగు: రాష్ట్ర ప్రభుత్వం మీ సేవలో మరో కొత్త సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ఎస్ఎస్సీ మార్కుల మెమోను కోల్పోయిన లేదా పోగొట్టుకున్న విద్యార్థులు ఇకపై తమ ఈ మెమోను మీసేవ కేంద్రాల ద్వారా సులభంగా పొందవచ్చని వెల్లడించారు. ఈఎస్డీ మీసేవ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు 2004 నుంచి ఎస్ఎస్సీ పరీక్షల ఈ మెమోలను మీసేవ ద్వారా ప్రింట్ తీసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందని వివరించారు. దరఖాస్తుదారులు తమ ఎస్ఎస్సీ హాల్ టికెట్ నంబర్, పరీక్ష పూర్తయిన సంవత్సరం వివరాలను అందజేస్తే, వెంటనే మీసేవ స్టేషనరీపై అధికారిక ఎస్ఎస్సీ ఈ మెమో ప్రింట్ అందజేస్తారని తెలిపారు. ఇందుకోసం రూ.62 సేవా రుసుము చెల్లించాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. రామప్పలో ఇంగ్లాండ్ దేశస్తులు వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఇంగ్లాండ్‌కు చెందిన జోనాతన్, బ్రే ఆమంద దంపతులు శనివారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. చట్టాలపై అవగాహన ఉండాలి ములుగు రూరల్: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ మేకల మహేందర్ అన్నారు. ఈ మేరకు మల్లంపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాహక్కు, ర్యాగింగ్, బాల్య వివాహల నిరోధక చట్టం, మోటార్ వెహికల్ చట్టం పై అవగాహ కలిగి ఉండాలన్నారు. ఉచిత న్యాయ సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 15100కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలుగు చంద్రయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నత్తనడకన బ్రిడ్జి పనులుఏటూరునాగారం: మండల పరిధిలోని కొండాయి–దొడ్ల గ్రామాల మధ్యలోని బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జవహర్ అన్నారు. మండల కేంద్రంలోని బీజేపీ మండల అధ్యక్షుడు వినుకోలు చక్రవర్తి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దొడ్ల–కొండాయి బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయని తెలిపారు. గతంలో కొండాయికి వరద వచ్చినప్పుడు అన్యాయంగా ఏడుగురు మరణించారని పేర్కొన్నారు. అప్పుడు కన్నీటిదారలు కార్చిన మంత్రి సీతక్క మరి ఇప్పటి వరకు ఎందుకు పనులు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. గత కొన్ని రోజుల కిందట తాత్కాలికంగా ఇసుక బస్తాలు వేసి చేతులు దులుపుకున్నారన్నారు. ఎలిశెట్టిపల్లి గ్రామానికి వెళ్లేందుకు జంపన్నవాగు ఉండడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు. -
జిల్లాలో కొత్తగా పట్టాపాస్ పుస్తకాలు పొందిన రైతుల వివరాలు
ములుగు ఏటూరునాగారం గోవిందరావుపేట కన్నాయిగూడెం మంగపేట ఎస్‌ఎస్‌తాడ్వాయి వెంకటాపురం(కె) వాజేడు మల్లంపల్లి వెంకటాపురం(ఎం)3216152337401573813767 -
సొంత నిధులతో రవాణా సౌకర్యం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండలంలోని నార్లాపూర్ గ్రా మపంచాయతీ పరిధిలోని తక్కళ్లపాడు గొత్తికోయ గూడెంలో ప్రాథమిక పాఠశాల లేకపోవడంతో విద్యార్థులు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలోని నార్లపూర్ ప్రాథమిక పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. రవాణా సౌకర్యం లేక పలువురు విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడటంతో ఉపాధ్యాయులు సొంత నిధులతో ఆటో రవాణా సౌకర్యాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. పాఠశాల హెచ్ఎం కొర్నెబెల్లి నారాయణరావు చొరవతో కాంప్లెక్స్ హెచ్ఎం విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఎంఈఓ గడ్డి శ్రీనివాస్ సహకారంతో నెలనెలా ఆటో అద్దెను భరించాలని నిర్ణయించారు. దీంతో తక్కళ్లపాడు గూడెంలోని గొత్తికోయ విద్యార్థులు ఇకపై ఆటోలో పాఠశాలకు రాకపోకలు సాగించనున్నారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ ఎంఈఓ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఉపాధ్యాయులే స్వచ్ఛందంగా రవాణా సౌకర్యం కల్పిస్తున్నారన్నారు. ఈ అవకాశాన్ని గూడెం వాసులు సద్వినియోగం చేసుకొని పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపాలని కోరారు. విద్యార్థుల కోసం చొరవ చూపిన హెచ్ఎం నారాయణరావును ఆయన అభినందించారు. -
సీఎంఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి
● అదనపు కలెక్టర్ మహేందర్ జీ ములుగు: సీఎంఆర్ నిల్వ కేంద్రాలకు తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్ జీ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఎఫ్‌సీఐ జనరల్ మేనేజర్ నేత్ర ప్రకాష్, సంబంధిత అధికారులతో ధాన్యం నిల్వ కేటాయింపుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని నిర్ణీత ప్రమాణాల ప్రకారం సీఎంఆర్‌ను నిల్వ కేంద్రాలకు తరలించే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ధా న్యం నిల్వ, రవాణా, మిల్లింగ్ ప్రక్రియల్లో ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారి ఫైజల్ హుస్సేన్, డీఎం కృష్ణవేణి, డీటీ విజయ్ కుమార్, రైస్ మిల్లర్లు, అధికారులు పాల్గొన్నారు. పెండింగ్ బకాయిలు చెల్లించాలి మిషన్ కె 100లో భాగంగా డిఫాల్ట్ రైస్ మిల్లుల నుండి తెలంగాణ సివిల్ సప్లయిస్ కార్పొరేషనన్కు రావాల్సిన బకాయిల చెల్లింపులపై అదనపు కలెక్టర్ మహేందర్ జీ కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి హైదరాబాద్ సివిల్ సప్లయీస్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. బకాయిల చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని అధికారులకు, మిల్లర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియలో సంబంధిత శాఖలు రైస్ మిల్లర్లు పరస్పర సమన్వయంతో పని చేసి పెండింగ్ బకాయిలను త్వరగా క్లియర్ చేయాలని సూచించారు. డిఫాల్ట్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. -
స్నేహం పేరిట నమ్మక ద్రోహం
రవి–శిరీష దంపతులు (ఫైల్)చెన్నారావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన బుడిగె రవి కుటుంబ పరిస్థితుల దృష్ట్యా పదో తరగతితోనే చదువు ఆపేశాడు. ఉన్నత చదువులకు స్వస్తి చెప్పి హైదరాబాద్‌కు వెళ్లి రైస్ మిల్లులో గుమస్తాగా జీవితాన్ని ప్రారంభించాడు. ఆ రంగంలో అనుభవం వచ్చాక హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో ఒక బియ్యం దుకాణం పెట్టుకున్నాడు. తర్వాత కేసముద్రం మండలం నాయక్‌పల్లి గ్రామానికి చెందిన శిరీషను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు. హయత్‌నగర్‌లో సొంత ఇళ్లు కొనుక్కొని పిల్ల లను చదివిస్తున్నాడు. ఆర్థిక స్వేచ్ఛ సాధించానని సంబరపడుతున్న సమయంలో రవి–శిరీష దంపతులకు కొంత మందితో స్నేహం ఏర్పడింది. అది కాస్త ఫ్యామిలీ ఫ్రెండ్‌షిప్‌లా మారింది. ఓ వ్యక్తి, అతడి భార్య.. రవి, శీరిష దంపతులను తమ వ్యాపారంలో భాగస్వామిగా చేర్చుకుంటామని మాటిచ్చారు. లాభాల ఆశజూపి రూ.15 లక్షలు తీసుకున్నారు. ఎన్ని నెలలు గడిచినా భాగస్వామ్యం ఇవ్వకపోగా.. ప్రశ్నించిన రవి దంపతులను బెదిరించారు. దీంతో తాము మోసపోయామని గ్రహించి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఘట్కేసర్ బీబీనగర్ మధ్యలో ద్విచక్ర వాహనాన్ని చెట్ల పొదల్లో పెట్టి, రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు వారి బంధువులు చెబుతున్నారు.అమ్మా, నాన్న లేండి.. రవి, శిరీష దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో వారి పిల్లలు తొమ్మిదేళ్ల సుశాంత్, ఆరేళ్ల విద్వాన్ష్ అనాథలయ్యారు. ‘అమ్మా, నాన్న లేండి’ అంటూ చిన్నారులు రోదించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. తల్లిదండ్రుల మృతితో అనాథలయ్యారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
● వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా సమన్వయంతో పనిచేయాలి ● కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుములుగు: జిల్లాలో కురిసే వర్షాలు, సంభవించే విపత్తు పరిస్థితుల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సూచించారు. జిల్లాలో వర్షాల పరిస్థితులు, ముందస్తు జాగ్రత్తలు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల సమయంలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకలు, చెరువుల పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక అప్రమత్తత అవసరమన్నారు. ఎక్కడైనా వరద ముప్పు ఏర్పడే అవకాశం ఉంటే ముందుగానే చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు అధికారులు అందుబాటులో ఉండి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సిహెచ్.మహేందర్ జి, సంపత్ రావు పాల్గొన్నారు. ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణను ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. శుక్రవా రం తన చాంబర్లో ఉచిత శిక్షణకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులకు చెందిన అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలన్నారు. ఆసక్తి గల నిరుద్యోగులు ఈనెల 12లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవే శ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారని, మెరి ట్ సాధించిన అభ్యర్థులకు హైదరాబాద్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్లో ఉచిత వసతి, భోజన సౌకర్యంతో పాటు శిక్షణ ఇస్తారన్నారు. కార్యక్రమంలో ఎస్సీ డెవలప్మెంట్ అధికారి కొమురయ్య, ఏఓ అల్లం రాజ్‌కుమార్, ఎస్ఓ లాల్ పాల్గొన్నారు. -
సరుకుల నాణ్యతలో రాజీపడొద్దు
● ఐటీడీఏ ఇన్చార్జ్ ఏపీఓ, ఎస్డీసీ ప్రతాప్ ఏటూరునాగారం: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లోని గి రిజన విద్యార్థులకు ఆహార వస్తువుల సరఫరా చేసే గుత్తేదారులు నాణ్యత విషయంలో రాజీపడకుండా సరఫరా చేయాలని ఐటీడీఏ ఇన్చార్జ్ ఏపీ ఓ, ఎస్డీసీ ప్రతాప్ అన్నారు. శుక్రవారం ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన సంక్షేమ పాఠశాలలకు జూలై నుంచి ఆగస్టు 2026 వరకు ఆహార వస్తువులు, క్లీనింగ్ పై టెండర్లను ఖరారు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ ఆహార వస్తువులు, క్లీనింగ్, పెరిషబుల్ కొనుగోలుకు వ్యాపారులు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఈ టెండర్లను కోరామన్నారు. తక్కువ కోడ్ చేసి నాణ్యతగా వస్తువులను సరఫరా చేసే వారికి సరుకుల నాణ్యతను పరిశీలించి వారికి టెండర్లను అప్పగిస్తామన్నారు. నాణ్యత లోపిస్తే వెంటనే టెండర్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో డీడీ ఫిరంగి, డీటీడీఓ నాగసాగర్, జీసీసీ డీఎం వాణి, జీసీసీ మేనేజర్లు దేవ్, యాకయ్య, వ్యాపారస్తులు పాల్గొన్నారు. -
ములుగు
శనివారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 20267స్నేహితులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తే.. అతను మాత్రం పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్ వెళ్లాడు. చిన్నప్పటి నుంచి తాను ప్రత్యక్షంగా అనుభవించిన పేదరికాన్ని జయించాలనుకున్నాడు. హైదరాబాద్ వెళ్లి రైస్ మిల్లులో గుమస్తాగా జీవితాన్ని ప్రారంభించాడు. అనుభవాన్ని మూటగట్టుకుని సొంతంగా రైస్ షాపు ప్రారంభించాడు. పెళ్లి చేసుకున్నాడు. ఇల్లు కొనుక్కున్నాడు. పేదరికాన్ని తరిమేశాననుకుంటున్న తరుణంలో స్నేహం రూపంలో మోసం ఎదురైంది. చివరికి ఆ స్నేహ బంధం ప్రాణాలనే హరించింది. దిక్కుతోచని స్థితిలో ఇద్దరు చిన్నారులు దిక్కులు పెక్కటిల్లేలా రోదిస్తున్నారు. – చెన్నారావుపేటభరించలేక మనస్తాపంతో దంపతుల బలవన్మరణం వ్యాపారం కోసం రూ.15 లక్షలు తీసుకొని మోసం అనాథలైన వారి ఇద్దరు కుమారులు చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో విషాదం -
మాకు దిక్కెవరు?
‘అమ్మానాన్న.. మమ్మల్ని స్కూల్‌కు ఎవరు పంపిస్తారు? కొసరి.. కొసరి గోరుముద్దలెవరు తినిపిస్తారు? తమ్ముడిని, నన్ను అనాథల్ని చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు మాకు దిక్కెవరు’ అంటూ రవి, శిరీష దంపతుల కుమారులు సుశాంత్, విద్వాన్ష్ రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కాగా, వ్యాపారం కోసం ఇచ్చిన డబ్బులు వసూల్ చేయడానికి పడుతున్న ఇబ్బందుల వల్ల ఇద్దరు భార్యాభర్తలు 20 రోజులుగా ఇంట్లో గొడవ పడుతున్నారని, కనీసం తిండి కూడా సక్రమంగా తినట్లేదని ఇరుగుపొరుగు వారు తెలిపినట్లు మృతుడి బంధువులు చర్చించుకుంటున్నారు. -
95.62 శాతం పూర్తి
ములుగు: జిల్లాలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ 95.62 శాతం పూర్తయింది. జిల్లాలో మొత్తం 2,36,970 మంది ఓటర్లకు గాను ఇప్పటివరకు 2,26,585 మందికి ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్ఓలు పంపిణీ చేయడంలో 95.62 శాతం పురోగతి సాధించారు. ఇంకా 10,385 మంది ఓటర్లకు ఫారాలులు అందించాల్సి ఉంది. 2,36,970 మందికి 1,96,663 మందికి మ్యాపింగ్ పూర్తి కాగా, ఇంకా 40,307 మంది మ్యాపింగ్ చే యాల్సి ఉంది. మ్యాపింగ్ పనులు కొంతమేర ముందుకు సాగుతున్నప్పటికీ, పూర్తి స్థాయిలో లక్ష్యాన్ని చేరుకోలేదు. ఓటర్లు నింపిన ఫారాలను బీఎల్ఓలు సేకరిస్తూ డిజిటలైజేషన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 1,803 మందికి డిజిటలైజేషన్ పూర్తి చేశారు. సాంకేతిక కారణాలతో డిజిటలైజేషన్ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతోందని సమాచారం. వివరాలు నమోదులో జాప్యం ఓటు మ్యాపింగ్ ప్రకారం బీఎల్ఓలు ఓటర్లకు ఫారాలు అందిస్తున్నారు. ఓటర్లకు ఇచ్చిన ఫారాల్లో 2002 నాటికి ఓటు హక్కు ఉన్నవారు ఒకవైపు, 2002 తర్వాత ఓటు హక్కు పొందిన వారు మరో వైపు వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఓటర్లకు బీఎల్ఓలు రెండేసి ఫారాలు అందిస్తున్నారు. వివరాలు నమోదు చేశాక బీఎల్ఓలు ఒక ఫారం తీసుకుంటే మరో ఫారం ఓటరు వద్దనే ఉంటుంది. కాని దరఖాస్తులు నింపడంలో ఓటర్లు అయోమయానికి గురై వివరాలు నమోదు చేయకపోవడంతో జాప్యం జరుగుతుంది. ఓటరు పూర్తి వివరాలు నమోదు చేసిన తర్వాతనే ఫారాలు తీసుకొని బీఎల్ఓలు యాప్‌లో ఓటరుగా నమోదు చేస్తారు. ఓటర్లు ఇచ్చిన వివరాలతో జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రకటిస్తారు. జాబితాపై అభ్యంతరాలుంటే ఆగస్టు 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 29 వరకు పరీశీలన పూర్తి చేసి అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రకటిస్తారు. ఫారం నింపడంలో ఇబ్బందులు బీఎల్ఓలు ఇచ్చిన ఎన్యుమరేషన్ ఫారాలు నింపడంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఓటర్లు ఫారంలోని వివరాలు అర్థం చేసుకోవడం, అవసరమైన సమాచారాన్ని సరిగా నమోదు చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది వృద్ధులు, నిరక్షరాస్యులు అయితే పూర్తిగా ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని అధికారులు గ్రామాల వారీగా ప్రత్యేక సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయాలని, సిబ్బంది ఫారం నింపడంలో డోర్ టు డోర్ సహాయం అందిస్తే తప్ప డిజిటలైజేషన్ ప్రక్రియ సకాలంలో పూర్తయ్యే అవకాశాలు లేవు. ఓటర్లకు ఫారం నింపడంలో సరైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ఫారంల నింపడంపై స్పష్టత కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో తుదిదశకు చేరిన ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ 2,36,970 మంది ఓటర్లకు 2,26,585 మందికి పంపిణీ 1,96,663 మందికి మ్యాపింగ్ పూర్తి ప్రారంభమైన డిజిటలైజేషన్ ప్రక్రియ దరఖాస్తు నింపడంలో ఇబ్బందులు పడుతున్న ఓటర్లుమండలం మొత్తం పంపిణీ ఓటర్లు చేసినవిములుగు 52,738 48,939 వెంకటాపురం(ఎం) 33,032 32,900 గోవిందరావుపేట 25,541 23,984 తాడ్వాయి 18,217 17,967 ఏటూరునాగారం 24,784 23,430 కన్నాయిగూడెం 10,090 9,663 మంగపేట 39,524 38,625 కొత్తగూడ 23,843 22,150 గంగారం 9,201 8,927నిర్ణీత గడువులోగా పూర్తిజిల్లాలో చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాం. నిర్దేశించిన సమయంలోగా ప్రతీ దశను పూర్తి చేస్తాం. జిల్లాలో ఇప్పటివరకు 96 శాతం గణన ఫారాల పంపిణీ పూర్తయింది. అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రకటిస్తాం. ప్రజలు, రాజకీయ పార్టీలు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. – భోర్ఖడే హేమంత్ సహదేవరావు, కలెక్టర్ -
బాలల భవితకు భరోసా!
ములుగు రూరల్: రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఇటుక బట్టీలు, ఫ్యాక్టరీలు, హోటళ్లు, బైక్ మెకానిల్ వద్ద బాల్యాన్ని తాకట్టు పెడుతున్న అభాగ్యులకు ‘ఆపరేషన్ ముస్కాన్’ కొత్త జీవితాన్ని ప్రసాదిస్తోంది. బాల కార్మికులను కాపాడేందుకు ప్రభుత్వం 2014 నుంచి ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం చేపడుతుంది. ప్రతీ ఏటా జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్, జూలై 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఆపరేషన్ ముస్కాన్ పేరుతో కార్యక్రమాలు చేపడుతున్నారు. మహిళా శిశు సంక్షేమశాఖ, పోలీస్ శాఖ, చైల్డ్ హెల్ప్ లైన్ ఆధ్వర్యంలో కార్యక్రమాలను చేపడుతున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడుతూ 18 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన పిల్లలను, చదువు మానేసి కార్మికులుగా మారిన వారి వివరాలు సేకరించి అదుపులోకి తీసుకుంటున్నారు. అదుపులోకి తీసుకున్న బాల కార్మికుల పరిస్థితులను బట్టి వారికి అందుబాటులో ఉండే పాఠశాలల్లో అడ్మిషన్లు ఇప్పించి చదువు చెప్పిస్తున్నారు. 920 మంది చిన్నారులకు విముక్తి జిల్లాలోని పది మండలాల్లో ప్రతీ ఏడాది జనవరి, జూలై నెలల్లో ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను అధికారులు 2014 నుంచి నిర్వహిస్తున్నారు. జిల్లా ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 920 మంది బాల కార్మికులను గుర్తించి పాఠశాలల్లో చేర్పించారు. బాలల రక్షణ కమిటీల ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో బాల కార్మికులను పనిలో పెట్టుకోవడం చట్టరీత్య నేరమని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులపై లేబర్ యాక్ట్ కింద కేసులు నమో దు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఇటుక బ ట్టీలు, క్రషర్లలో పనుల నిమిత్తం వచ్చిన కార్మి కుల పిల్లలను అందుబాటులో ఉన్న పాఠశాలల్లో చే ర్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. బాల కార్మికులను గుర్తించిన, బడీడు పిల్లలను బడిలో చే ర్పించకుండా ఉన్న పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో పాటు పాఠశాలకు పంపించేందుకు అంగీకార పత్రాలను రాయిస్తున్నారు. పాఠశాలలో చేర్పించాం..జిల్లాలోని పది మండలాల్లో దాడులు నిర్వహించి గుర్తించిన బాల కార్మికులను పాఠశాలల్లో చేర్పించాం. అలాగే బాల కార్మికుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాం. 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్య నేరం. లేబర్ యాక్టు ప్రకారం యజమానులు శిక్ష అర్హులు అవుతారు. ప్రతీ సంవత్సరం జనవరి, జూలై మాసాల్లో ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు జిల్లాలోని ప్రతిఒక్కరూ సహకరించాలి. –ఈపీ ప్రేమలత, జిల్లా సంక్షేమశాఖ అధికారి ఫలిస్తున్న ‘ఆపరేషన్ ముస్కాన్’ ప్రతీ ఏటా జనవరి, జూలైలో అధికారుల తనిఖీలు 2019 నుంచి ఇప్పటివరకు 920 చిన్నారులకు విముక్తి ప్రారంభమైన ‘జూలై’ ఆపరేషన్ -
ఈవీ బస్సు.. భద్రత తుస్సు
హన్మకొండ: విద్యుత్ బస్సులపై భ్రమలు వీడుతున్నాయి. తరచూ జరుగుతున్న అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆర్టీసీ కార్మిక సంఘాలు విద్యుత్ బస్సులను మొదటినుంచీ వ్యతిరేకిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కాలుష్య నివారణకు, పర్యావరణ పరిరక్షణ కోసమంటూ ఈవీ బస్సులను ప్రవేశపెట్టింది. బస్సుల్లో అగ్నిప్రమాదాలు జరుగుతుండడంతో ఆర్టీసీ యాజమాన్యం ఆలోచనలో పడింది. ప్రయాణికుల భద్రతకు భరోసా లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులను నిలిపేసింది. ఇటీవల కరీంనగర్లో 15 రోజుల వ్యవధిలో రెండు బస్సుల్లో మంటలు లేచి దగ్ధమయ్యాయి. వరంగల్ రీజియన్‌లో వరంగల్–2 డిపోనకు 115 బస్సులు కేటాయించగా.. ఈ డిపో ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతోంది. వీటన్నింటి సేవలను నిలిపేసింది. స్పందించని జేబీఎం యాజమాన్యం వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతుండడంతో ఆర్టీసీ యాజమాన్యం ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్న జేబీఎం సంస్థకు ప్రయాణికుల భద్రతపై లేఖ రాసినట్లు సమాచారం. ప్రయాణికులకు ఎలాంటి రక్షణ కల్పిస్తారని, తరచూ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని అడిగినట్లు తెలిసింది. ఈ లేఖకు జేబీఎం యాజమాన్యంనుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా 500కు పైగా ఎలక్ట్రిక్ బస్సులు నిలిపేసింది. ఈక్రమంలో వరంగల్ రీజియన్‌లో 115 బస్సులు డిపోనకే పరిమితమయ్యాయి. -
‘అల్పాహారం బిల్లులు చెల్లించాలి’
ములుగు రూరల్: వంట కార్మికులకు తొమ్మిది నెలల అల్పాహారం పెండింగ్ బిల్లులు చెల్లించాలని తెలంగాణ మధ్యాహ్నా భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ కోరారు. ఈ మేరకు గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో వంట కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు రూ.10 వేలు వేతనం చెల్లించాలన్నారు. మధ్యాహ్నా భోజన పథకంలో విద్యార్థులకు కోడిగుడ్లు, నిత్యావసర సరుకులను ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరారు. కారణాలు లేకుండా కార్మికులను తొలగిచడం సరికాదని తెలిపారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి సీతక్క సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారని వివరించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్నా భోజన కార్మికులు భారతి, ప్రమీల, తులసి, సఫియా, కమలక్క, పద్మ, సారమ్మ, స్వరూప తదితరులు పాల్గొన్నారు. -
మృతుల ఓట్లు తొలగించాలి
ఏటూరునాగారం: ఓటరు జాబితా నుంచి మరణించిన వారి ఓట్లను తొలగించాలని ములుగు ఆర్డీఓ కృష్ణవేణి బీఎల్ఓలను ఆదేశించారు. మండల కేంద్రంలోని 45వ బూత్‌లో కొనసాగుతున్న ఎస్ఐఆర్ సర్వేను గురువారం ఆర్డీఓ పరిశీలించి బీఎల్ఓలతో మాట్లాడారు. 2002 జాబితాతో మ్యాపింగ్ చేయాలన్నారు. ఊరికి వచ్చిన కోడళ్ల వివరాలను తెలుసుకొని వారి తల్లిదండ్రులతో మ్యాపింగ్ చేసి ఓటు ఇక్కడే ఉండేలా చూడాలన్నారు. ఒకే వ్యక్తికి రెండు బూత్‌లలో ఓటు ఉంటే ఏ బూత్‌లో కావాలని తెలుసుకొని మిగితాది తొలగించాలన్నారు. తప్పులు లేకుండా సర్ ఫామ్‌లను పూర్తి చేసేందుకు సహకరించాలన్నారు. ప్రజలు సర్ సర్వేకు సహకరించి ఓటు హక్కును కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంట తహసీల్దార్ జగదీశ్, బీఎల్ఓలు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. ఆర్డీఓ కృష్ణవేణి -
రైతుకు భరోసా
ములుగు: వానాకాలం సాగు పనులు ఊపందుకుంటున్న తరుణంలో రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. జిల్లాలోని ఆర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రైతు భరోసా మొదటి విడత పెట్టుబడి సాయం జమ కావడం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా సాగుకు అనుకూలమైన భూమి ఉన్న 63,958 మంది రైతులకు గాను.. ఎకరాకు రూ.6వేల చొప్పున మొత్తం రూ.49,82,63,773 రూపాయలను ప్రభుత్వం ఖాతాల్లో జమచేసింది. గత యాసంగి పంట సమయంలో ప్రభుత్వం కేవలం రెండు ఎకరాల వరకు మాత్రమే రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించింది. ఈసారి తొమ్మిది రోజుల్లో రైతులందరికీ పెట్టుబడి సాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించి ఇప్పటివరకు మూడు ఎకరాల భూమి ఉన్న రైతులకు భరోసా డబ్బులను జమ చేసింది. మొత్తం రైతులు 88,450 మంది.. అందాల్సిన సాయం రూ.106 కోట్లు జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్ లో 1.70లక్షల ఎకరాలలో పంటలు సాగయ్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనాలు రూపొందించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో రైతు భరోసా కింద 88,450 మంది రైతులకు ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ.106,35,12,869లను రైతులకు ప్రభుత్వం అందించనుంది. జిల్లా వ్యాప్తంగా గురువారం నాటికి 63,958 మంది రైతుల ఖాతాల్లో రూ. 49,82,63,773 ప్రభుత్వం జమ చేసింది. మూడు ఎకరాల వరకు అందిన సాయం మొదటి విడతలో 2 ఎకరాలలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని అందిస్తామని ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ గురువారం వరకు మూడు ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో భరోసా డబ్బులు జమ ఆయ్యాయి. మరో నాలుగు రోజుల్లో మిగిలిన రైతులకు సైతం రైతు భరోసా డబ్బులను ప్రభుత్వం జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. కొత్తగా పట్టా పాస్‌పుస్తకాలు పొందిన రైతులకు సైతం పెట్టుబడి సాయం అందనుంది. జిల్లాలో 63,958 మంది రైతుల ఖాతాల్లో రూ.49.82 కోట్లు జమ కొత్తగా పట్టాపాస్‌పుస్తకాలు పొందిన రైతులకు సైతం సాయంమండలం రైతులు పెట్టుబడి సాయం (రూ.కోట్లలో) ములుగు 10,010 రూ.7,28,76,385 వెంకటాపురం(ఎం) 9,036 రూ.6,82,93,098 మంగపేట 6,988 రూ.6,40,43,983 వాజేడు 7,004 రూ.5,04,68,209 వెంకటాపురం(కె) 6,432 రూ.4,84,71,086 గోవిందరావుపేట 5,224 రూ.4,51,52,203 ఎస్‌ఎస్‌తాడ్వాయి 5,258 రూ.4,47,40,475 ఏటూరునాగారం 5,494 రూ.4,19,42,109 మల్లంపల్లి 4,670 రూ.3,47,02,763 కన్నాయిగూడెం 3,842 రూ.2,75,73,462 రైతులకు అందిన పెట్టుబడి సాయంవానకాలం సీజన్ కు సంబంధించి ప్రతీ రైతుకు రైతు భరోసా డబ్బులు అందించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇప్పటివరకు మూడు ఎకరాల భూమి ఉన్న రైతులందరికీ పెట్టుబడి సాయం ఖాతాల్లో జమ అయింది మరో నాలుగు రోజుల్లో మిగిలిన రైతులందరికీ పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. – సురేశ్ కుమార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
లక్ష్యం చేరేనా?
ములుగు రూరల్: మహిళల ఆరోగ్యాన్ని తీవ్ర ప్రభావితం చేసే వ్యాధుల్లో ఒకటైన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ప్రధాన సమస్యగా మారుతుంది. దీన్ని అదిగమించేందుకు ప్రభుత్వం 14 నుంచి 15 ఏళ్ల బాలికలకు హ్యూమర్ పాపిలోను వ్యాక్సిన్ (హెచ్‌పీవీ) అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు టీకా కార్యక్రమాన్ని మార్చి నెలలో ప్రారంభించింది. అయినప్పటికీ జిల్లాలో మాత్రం మందకోడిగా కొనసాగుతోంది. విద్యార్థినులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలో వైద్యారోగ్యశాఖ పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్యాన్సర్ నివారణలో కీలక పాత్ర హెచ్‌పీవీ వైరస్ కారణంగా గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ కాకుండా ఇతర ప్రమాదకర క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. ఈ వైరస్ ప్రభావాన్ని ముందుగానే అరికట్టేందుకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ అత్యంత ప్రభావితంగా పని చేస్తుదని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల దీర్ఘకాలికంగా రోగనిరోధకశక్తి అభివృద్ధి చెందడంతో పాటు వ్యాధులను ధరిచేరకుండా చూస్తుంది. పలు రకాల క్యాన్సర్ల నివారణకు ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. జిల్లాలో 3,127 మంది బాలికల గుర్తింపు జిల్లాలోని పది మండలాల్లో వైద్యారోగ్యశాఖ గణాంకాల ప్రకారం 3,127 మంది బాలికలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 1,285 మందికి మాత్రమే వ్యాక్సిన్ అందించారు. జిల్లాలో 30 శాతం మాత్రమే వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేశారు, 70 శాతం మంది బాలికలకు వ్యాక్సిన్ అందించాల్సి ఉంది. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సైతం వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై జిల్లాలోని ప్రతీ గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. బాలికల పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులకు వ్యాక్సిన్ వేశాం. బాలికల తల్లిదండ్రులకు వ్యాక్సిన్ వల్ల కలిగే లాభాలను వివరిస్తున్నాం. జిల్లాలో 30 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశాం. త్వరలోనే జిల్లాలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ వందశాతం పూర్తి చేస్తాం. – గోపాల్‌రావు, డీఎంహెచ్ఓజిల్లా వివరాలుఆస్పత్రి పరిధి బాలికలు వ్యాక్సిన్ తీసుకున్నవారు ములుగు 881 93 ఏటూరునాగారం 229 97 గోవిందరావుపేట 319 46 పస్రా 350 61 చుంచుపల్లి 140 40 మంగపేట 337 83 ఎస్‌ఎస్‌తాడ్వాయి 208 50 వెంకటాపురం(ఎం) 127 105 ఎదిర 135 311 పేరూరు 296 168 వాజేడు 127 209 జిల్లాలో మందకొడిగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ 30శాతం మాత్రమే పూర్తి అవగాహన కల్పించడంలో అధికారులు విఫలం -
కొనసాగుతున్న సింగరేణి అధికారుల దీక్షలు
భూపాలపల్లి అర్బన్: సింగరేణి అధికారుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఎంఓఏఐ ఆధ్వర్యంలో ఏరియా జీఎం కార్యాలయం ఎదుట చేపడుతున్న దీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం నాటికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. వీరి దీక్షలకు బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్, బీఎంఎస్ నాయకులు, సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం, ఉద్యోగు ల సంఘం నాయకులు రాంబాబు, భిక్షమయ్య , భూక్యా మోహన్, హేమనాయక్, సికిందర్‌సింగ్ పా ల్గొని సంఘీభావం తెలిపారు. అధికారుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. -
అడ్మిషన్లు ఫుల్..
● ఆశ్రమ పాఠశాలలో నో అడ్మిషన్స్ బోర్డు గోవిందరావుపేట: మండల పరిధిలోని లక్ష్మీపురం–కర్లపల్లి ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ఫుల్ అయ్యాయని.. ప్రస్తుతం ఒక్క సీటు కూడా ఖాళీ లేదని పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పి.గాంగు, అడ్మిషన్ ఇన్చార్జ్ పెనక వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు గురువారం పాఠశాల గేట్‌కు నో అడ్మిషన్స్ బోర్డును ఏర్పాటు చేశారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలంటే అటు వైపుగా రాని విద్యార్థుల తల్లిదండ్రులు నేడు వస్తున్న ఉత్తమ ఫలితాలు, నాణ్యమైన విద్య, ఉచిత వసతి, పౌష్టికాహారం, క్రమశిక్షణ, అంకితభావంతో బోధిస్తున్న ఉపాధ్యాయుల సేవలపై నమ్మకం పెంచుకుంటున్నారు. అందుకు నిదర్శనంగానే లక్ష్మీపురం ఆశ్రమ పాఠశాలలో అడ్మిషన్లు ఫుల్ కావడం విద్యారంగంలో సానుకూల పరిణామంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ఓపెన్ కాస్ట్‌తో ఆలయానికి ముప్పు
ములుగు రూరల్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప ఆలయానికి ఓపెన్ కాస్ట్‌తో ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని రామప్ప ఆలయ పరిరక్షణ కమిటీ కన్వీనర్ అక్కిరెడ్డి రామ్మోహన్రావు తెలిపారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రామప్ప ఆలయం ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిందన్నారు. ఆలయ ప్రతిష్ట ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉందని తెలిపారు. ఓపెన్ కాస్ట్ పనులు చేపడితే ఆలయ అస్తిత్వం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఓపెన్ కాస్ట్ పనులను నిలిపి వేసి రామప్ప ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత జిల్లా వాసులపై ఉందని వివరించారు. ఆర్కియాలజీ అధికారులు రామప్ప ఆలయ పరిధిలోని నందీశ్వరుడిపై నీడ ఏర్పాటు చేయాలన్నారు. ఓపెన్ కాస్ట్ పనులపై ఆర్కియాలజీ అధికారులు సర్వే నిర్వహించి ఆలయాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. రామప్ప ఆలయ పరిరక్షణ కమిటీ కన్వీనర్ రామ్మోహన్రావు -
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
ములుగు రూరల్: బాలకార్మిక వ్యవస్థను జిల్లాలో పూర్తిగా నిర్మూలించాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్‌కేకన్ అన్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఆపరేషన్ ముస్కాన్ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. బడీడు పిల్లలను బడిలో చేర్పించాలన్నారు. పనిలో పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాలల హక్కుల పరిరక్షణకు అంకితభావంతో పని చేయాలని సూచించారు. జిల్లాను బాల కార్మికుల రహిత జిల్లాగా మార్చుకునేందుకు పాటుపడాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి ప్రేమలత, డీఎస్పీ కిశోర్, బాలల పరిరక్షణ అధికారి ఓంకార్, జిల్లా కార్మికశాఖ అధికారి వినోద తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
ఇళ్ల స్థలాలు కేటాయించాలి
వెంకటాపురం(కె): గోదావరి ముంపు ప్రాంత ఆదివాసీలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూనెం రామచందర్ అన్నారు. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని కోయ బెస్తగూడెం, తుర్సవానిగూడెం, టేకుల బోరు గ్రామాల ఆదివాసీలకు చెందిన ఇళ్లు ప్రతీ ఏడాది గోదావరి వరదలకు ముంపునకు గురవుతున్నాయని తెలిపారు. తక్షణమే అధికారులు స్పందించి గిరిజనులకు ఇంటి స్థలాలు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాంప్రసాద్, సాయిచరణ్, నవీన్, రాజబాబు, సురేంద్ర, నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు. 44 పాఠశాలల అభివృద్ధి పనులకు టెండర్లు ములుగు: జిల్లాలోని 44 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల అభివృద్ధి పనులకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ సిద్దార్థరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతీ పాఠశాలకు రూ.1 లక్ష చొప్పున బాలా ఫీచర్స్, చైల్డ్ ఫ్రెండ్లీ ఫర్నీచర్, అవుట్డోర్ ప్లే మెటీరియల్, విద్యార్థులకు అవసరమైన షూస్, బెల్ట్, స్కూల్ బ్యాగులు, యూనిఫాంలతో పాటు భవనాల మైనర్ రిపేర్లు, పెయింటింగ్ పనులు చేపపట్టేందుకు అర్హత కలిగిన రిజిస్టర్డ్ సంస్థల నుంచి సీల్డ్ టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. టెండర్ ఫారాలు జూలై 3 నుంచి 6 వరకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో లభిస్తాయని, ఫారం పొందేందుకు రూ.10వేలు డిమాండ్ డ్రాఫ్ట్‌ను సమర్పించాల్సి ఉంటుందని వివరించారు. పూర్తి వివరాలతో టెండర్లు ఈనెల 8వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. జూలై 10న కలెక్టరేట్లో టెండర్లు ఓపెన్ చేయనున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాలకు కో–ఆర్డినేటర్ శ్యామ్ సుందర్ రెడ్డిని ఫోన్ నంబర్ 7981956839లో సంప్రదించవచ్చని తెలిపారు. క్యాబిన్లో ఇరుక్కున్న టిప్పర్ డ్రైవర్ ఏటూరునాగారం: మండలంలోని చిన్నబోయినపల్లి వద్ద ఇసుక లారీ ఢీకొని ఒకరు మరణించి 24 గంటలు కాకముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం వరంగల్ నుంచి ఏటూరునాగారం వైపు వస్తున్న ఇసుక టిప్పర్ లారీ మరో లారీని ఢీకొనగా.. ఆ లారీ ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొంది. దీంతో ఇసుక టిప్పర్ లారీ క్యాబిన్ నుజ్జునుజ్జు అయ్యి డ్రైవర్ అందులో ఇరుక్కుపోయాడు. అయితే, డ్రైవర్ వివరాలు తెలియాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ చిటమట రఘు సంఘటనా స్థలానికి చేరుకొని క్యాబిన్లో ఇరుకున్న వ్యక్తిని జేసీబీ సాయంతో బయటకు తీశారు. ఈ సంఘటనతో సుమారు 5 కిలోమీటర్ల మేర ఇసుక లారీలు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై నుంచి టిప్పర్‌ను బయటకు తీయడానికి సుమారు రెండు గంటల సమయం పట్టిందని రఘు తెలిపారు. 92 శాతం బొగ్గు ఉత్పత్తి భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కాకతీయ గనుల్లో జూన్ మాసంలో సంస్థ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి, రవాణా 92శాతం సాధించినట్లు ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గడిచిన మాసంలో 2.35లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యం చేయాల్సి ఉండగా 2.15లక్షల ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. రోజు వారిగా సుమారు 7,181 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి రవాణా చేసినట్లు చెప్పారు. రెండు ఓపెన్ కాస్టు గనుల్లో 121శాతం మట్టి వెలికితీత పనులు చేపట్టినట్లు వివరించారు. జూలై మాసంలో 3.67లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్ విధించినట్లు తెలిపారు. కార్మికులు సమష్ఠి కృషి చేసి ఉత్పత్తి సామర్‌ాధ్యన్ని పెంచాలని కోరారు. దరఖాస్తుల ఆహ్వానం భూపాలపల్లి రూరల్: టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్ కం మెయిన్స్) ఉద్యోగాలకు 10 నెలలు ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి కుమారి సుకీర్తి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలని సూచించారు. -
ఓటర్ల చేర్పులు, మార్పులు పరిశీలించాలి
ములుగు: ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైందని, ఓటర్ల చేర్పులు, మార్పుల ప్రక్రియను నిశితంగా పరిశీలించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల ఆశోక్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. కొత్త ఓటర్ల నమోదు గమనించాలని సూచించారు. గణన ఫారాలు, దరఖాస్తుల నింపే విధానంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజలకు కూడా సరైన సమాచారం అందిస్తూ సవరణ ప్రక్రియను విజయవంతం చేయడంలో బీఎల్ఏలు కీలక పాత్ర పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులందరూ సమన్వయంతో పనిచేస్తూ ప్రతీ అర్హుడికి ఓటు హక్కు ఉండేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, పార్టీ నాయకులు, బీఎల్ఏలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క -
విద్యార్థిని హర్షితకు అభినందనలు
ములుగు రూరల్: తెలంగాణ మోడల్ యునైటెడ్ నేషన్స్‌లో ఇంటర్నేషనల్ ప్రెస్ విభాగంలో అవార్డు సాధించిన బండారుపల్లి మోడల్ పాఠశాల విద్యార్థిని హర్షితను డీఈఓ సిద్ధార్థ రెడ్డి అభినందించారు. ఈ మేరకు బుధవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సర్టిఫికెట్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హర్షిత ప్రతిభను గుర్తించి తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ అభినందించారని తెలిపారు. ఈ మేరకు పాఠశాల సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులు సదానందం, మహ్మద్ ఆయాజ్ ఖాన్‌లను సైతం డీఈఓ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా ఓటరు జాబితా సవరణ
ములుగు: జిల్లాలో చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని, నిర్ధేశించిన సమయం మేరకు పూర్తి చేయడంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ విలేకరులతో మాట్లాడారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు గణన ఫారాలు పంపిణీ చేస్తూ వివరాల సేకరణ ప్రక్రియను చేపడుతున్నారని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 2,36,970 మంది ఓటర్లు ఉండగా ఇప్పటివరకు దాదాపు 96 శాతం గణన ఫారాల పంపిణీ పూర్తి అయిందని తెలిపారు. ప్రస్తుతం ఓటర్లు ఫారాలను నింపడంతో పాటు వాటి సేకరణ ప్రక్రియ కూడా కొనసాగుతోందని తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేక సవరణ కార్యక్రమంలోని ప్రతీ దశలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రతీ బుధవారం జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో, రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీఓ కార్యాలయాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి కార్యక్రమ పురోగతిపై వివరాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఈనెల 24 లోపు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేసి, 31న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురిస్తామని తెలిపారు. ఈనెల 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, దరఖాస్తుల స్వీకరణ కొనసాగించి, సెప్టెంబర్ 28 లోపు వాటి పరిష్కారం పూర్తి చేసి అక్టోబర్ 1న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ప్రజలు, రాజకీయ పార్టీలు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. బీఎల్ఓల ద్వారానే గణన ఫారాల పంపిణీ ఓటరు గణన ఫారాల పంపిణీ బూత్ లెవల్ అధికారులు మాత్రమే పంపిణీ చేయాలని, రాజకీయ పార్టీలకు చెందిన బూత్ స్థాయి ఏజెంట్లు ఫారాలు పంపిణీ చేయరాదని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు బీఎల్ఓలతో సమన్వయం చేసుకుంటూ ప్రక్రియ సక్రమంగా జరుగుతుందా లేదా అని పరీశీలించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు ఆర్డీఓ కృష్ణవేణి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ కుషీల్ వంశీ, ఏఈఆర్ఓ తహసీల్దార్ విజయభాస్కర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు -
విద్యార్థులకు ప్రణాళికతో బోధించాలి
వాజేడు: విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రణాళికతో బోధించి మెరుగైన ఫలితాలు సాధించేలా చూడాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో సూచించారు. ఈ మేరకు ఆయన బుధవారం మండల పరిధిలోని కాచారం పాఠశాలతో పాటు పెద్దగొళ్లగూడెం ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సామర్థ్యాలను పరిశీలించారు. పాఠాలు చదివించి.. రాయించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులతో మాట్లాడుతూ చదువులో వెనుక బడిన వారిని గుర్తించి అందరితో సమానంగా చదివేలా తీర్చిదిద్దాలన్నారు. ప్రతీ విద్యార్థి పరీక్షల్లో ప్రథమ స్థానంలో నిలిచేలా చూడాలన్నారు. విద్యార్థులు చదుపుపై శ్రద్ధ చూపేలా బోధించాలన్నారు. పెద్ద గొళ్లగూడెం ఆశ్రమ పాఠశాల విస్తీర్ణం, గదులు విశాలంగా ఉన్నప్పటికీ విద్యార్ధుల సంఖ్య తగ్గడంపై సిబ్బందిని ప్రశ్నించారు. 130 మంది విద్యార్థినులే ఉండడంతో సంఖ్య పెరిగేలా చూడాలని ఆదేశించారు. బాలికల ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని, మరుగు దొడ్లు సక్రమంగా లేవని, వర్కర్ల వేతనాలు రాకపోవడంతో పాటు ఇతర సమస్యలను పీఓ దృష్టికి సిబ్బంది తీసుకెళ్లగా వివరాలు తనకు పంపించాలని సిబ్బందికి పీఓ సూచించారు. ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో -
పోరాటాలకు సిద్ధం కావాలి
ములుగు రూరల్: నాయీ బ్రాహ్మణులు సమస్యల పరిష్కారానికి పోరాటాలకు సిద్ధం కావాలని సంఘం గౌరవ అధ్యక్షులు జంపాల రవీందర్ అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవాలయాలు, జాతరల్లో తలనీలాల సేకరణ హక్కులు పూర్తిగా నాయీబ్రాహ్మణులకే కేటాయించాలన్నారు. నాయీ బ్రాహ్మణులకు జీవనాధారమైన క్షౌ రవృత్తిని వారికి దూరం చేయాలని చూస్తున్నారని తెలిపారు. దేవాలయాలు, జాతరలలో వృత్తి నిర్వహిస్తున్న నాయీ బ్రాహ్మణులకు ఆదరణ లేక, వృత్తి ద్వారా వస్తున్న ఆదాయం దక్కకుండా పోతుందన్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ పేరుతో ఇతర కులాల వారు ఆదాయం కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు త్వరలో జరగనున్న జిల్లా మహాసభలకు ఆహ్వాన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా జంపాల రవీందర్, ప్రధాన కార్యదర్శిగా చెన్న కుమార్, కోశాధికారిగా వేల్పకొండ శరబంధంలను ఎన్నుకున్నారు. -
ఆయిల్‌పామ్‌తో కాసులు
భూపాలపల్లి: ఏళ్ల తరబడి కష్టనష్టాలను అనుభవించి పత్తి, మిర్చి, వరి సాగు చేసిన రైతులు ఆధునిక వ్యవసాయ రంగం వైపు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న ఆయిల్‌పామ్ సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ యిల్‌పామ్ గెలల ధర రోజురోజుకూ పెరుగుతుండటంతో సాగుకు రైతన్నలు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది 2,500 ఎకరాల్లో సాగు అంచనా.. జిల్లాలోని 12 మండలాల్లో 2021 సంవత్సరంలో ఆయిల్ పామ్ సాగు 352 ఎకరాలతో ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతీ ఏటా పెరుగుకుంటూ రాగా 2024–2026 మధ్య కాలంలో కాస్త తగ్గింది. జిల్లాలో 2021లో సాగు ప్రారంభించిన రైతులకు మార్చి నెల నుంచి మంచి దిగుబడి వస్తుంది. దీంతో రైతులంతా ఈ పంటను సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే 150 ఎకరాల్లో రైతులు మొక్కలు నాటగా.. మునుపెన్నడూ లేని విధంగా 2,500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు జరిగే అవకాశం ఉందని ఉద్యానశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వందల మంది రైతులు మొక్కల కోసం డీడీలు తీసి ఉన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా వీరంతా ఈ నెల చివరి వారంలో మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. భారీ ధర పలుకుతున్న గెలలు.. మన దేశానికి ముఖ్యంగా మలేషియా నుంచి క్రూడ్ పామాయిల్ ఎక్కువగా దిగుమతి అవుతుంది. కోవిడ్ సమయం 2021లో మలేషియా ఎగుమతిని నిలిపివేసింది. దీంతో అప్పుడు ఆయిల్‌పామ్ గెల టన్ను ధర రూ. 24వేలకు చేరుకుంది. అనంతరం పరిస్థితులు చక్కబడటంతో 2022లో రూ.13వేలు, 2023లో రూ.13,500, 2024లో రూ.14వేలు, 2025లో రూ.20వేల ధర పలికింది. ఇప్పుడు ఏకంగా గెలల టన్ను ధర రూ.24వేలకు చేరుకుంది. ప్రస్తుత ధరలను గమనించిన రైతులు, భవిష్యత్‌లో కూడా ఆయిల్‌పామ్‌కు డిమాండ్ ఉంటుందని భావించి మూడు ఎకరాలకు పైన ఉన్న రైతులంతా ఈ పంట సాగుకు సన్నద్ధం అవుతున్నారు. దీంతో ఈ ఏడాది ఊహించని రీతిలో జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు జరగబోతుందని తెలుస్తోంది. రైతులుఎకరాలు1,877.54610.61352.55478.41,163.90229189112609403202120222023202520262024ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం ఉంటుంది. సాగు ఖర్చు కూడా తక్కువ. మొక్కలు, డ్రిప్‌కు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. ఈ ఏడాది 2,500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు జరుగుతుందని అంచనా వేశాం. ఆయిల్‌పామ్ సాగు వలన కలిగే లాభాలను రైతులకు వివరిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పంట సాగు అనుకూలంగా ఉంటుంది. – తిరుపతి, జిల్లా ఉద్యానశాఖ అధికారి ప్రస్తుతం టన్ను గెల ధర రూ.24వేలు ఎకరాకు రూ.లక్షన్నరకు పైగా రాబడి 30 ఏళ్లపాటు రానున్న దిగుబడి


