సిబ్బంది ఉండరు | - | Sakshi
Sakshi News home page

సిబ్బంది ఉండరు

Jul 17 2026 3:22 AM | Updated on Jul 17 2026 3:22 AM

వైద్యులు రారు..
పల్లె దవాఖానాలపై నిర్లక్ష్యం

సమయపాలన పాటించని వైద్యులు

వంతుల వారీగా విధులకు

హాజరవుతున్న ఏఎన్‌ఎంలు

కొన్ని సెంటర్లలో ఆశ కార్యకర్తలే దిక్కు..

జిల్లాలోని సబ్‌ సెంటర్లను

విజిట్‌ చేసిన ‘సాక్షి’

ములుగు: పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందు కు ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన హెల్త్‌ సబ్‌ సెంటర్లలో వైద్యులు విధులకు సక్రమంగా హాజరు కాకపోవడం, ఏఎన్‌ఎంలు వారానికి రెండు రోజు లు మాత్రమే హాజరవుతోండడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. జిల్లాలో 15 ప్రాథమిక ఆ రోగ్య కేంద్రాల పరిధిలో 89 సబ్‌ సెంటర్లు ఉండగా అందులో 51 సబ్‌ సెంటర్లను 2022లో పల్లె దవా ఖానాలుగా (ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌) అప్‌ గ్రేడ్‌ చేసి ప్రభుత్వం వైద్యులను నియమించింది. ఒక్కొక్క సబ్‌ సెంటర్లో వైద్యుడితోపాటు ఇద్దరు ఏఎన్‌ఎంలు విధులు నిర్వహించాల్సి ఉంది. ఇద్దరు ఏఎన్‌ఎంలు ఉన్నచోట ఒకరు మాత్రమే విధులకు హాజరవుతున్నారు. నేడు నేను.. రేపు నీవు.. అని వంతుల వారీగా ఏఎన్‌ఎంలు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. వైద్యులు, సిబ్బంది పట్టణానికి పరిమితమై చుట్టపుచూపుగా ఆస్పత్రులకు వస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సమయపాలన పాటించకుండా విధులకు ఆలస్యంగా హాజరవుతూ మధ్యాహ్నమే వెళ్లిపోతున్నట్లు తెలిసింది. సబ్‌ సెంటర్లలో ఆశ వర్కర్లే ప్రజలకు మందు ఇస్తున్నారు. అయితే ఉన్నతాధికారుల పర్యవేక్షణ, తనిఖీల వంటివి లేకపోవడంతోనే వైద్యశాఖలో ఇష్టారాజ్యం కొనసాగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని 10 మండలాల పరిధిలో 20 సబ్‌ సెంటర్లను గురువారం ‘సాక్షి’ విజిట్‌ చేయగా.. ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.

గంగారంలో రోగులకు నిరాశే..

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండలంలోని గంగారం పల్లెదవాఖానను గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సాక్షి విజిట్‌ చేయగా వైద్యాధికారితోపాటు ఏఎన్‌ఎం కనిపించలేదు. ఆస్పత్రి తలుపులు మాత్రం తెరిచి ఉండగా, ఆశ వర్కర్‌ ఇంటికి వెళ్లిందని స్థానికులు తెలిపారు. చికిత్స కోసం వచ్చిన వారు సిబ్బంది కోసం వేచి చూసి నిరాశతో వెనుదిరిగినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. విధి నిర్వహణ సమయంలో ఆస్పత్రిని గాలికొదిలేయడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వాజేడు: వాజేడు మండలంలోని పెనుగోలు కాలనీ, జగన్నాథపురం సబ్‌ సెంటర్‌(ఆయుస్మాన్‌ ఆరోగ్య మందిర్‌)లను గురువారం సాక్షి పరిశీలించింది. ఉదయం పదిన్నర వరకు జగన్నాథపురం సబ్‌ సెంటర్‌ తెరువ లేదు. పెనుగోలు గ్రామానికి మంజూ రైన సబ్‌ సెంటర్‌ను గుట్టలపై నిర్మించడం వీలుకాక పెనుగోలు కాలనీలో ఏర్పాటు చేశారు. కానీ భవనం నిర్మించ లేదు. అంగన్‌ వాడీ కేంద్రంలో నిర్వహణ కొనసాగిస్తున్నప్పటికి ప్రతీ బుధవారం ఏఎన్‌ఎం వచ్చి పరీక్షలను చేసి మందులను ఇస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ రెండు సెంటర్లలో వైద్యులు మాత్రం రావడం లేదని స్థానికులు తెలిపారు.

10.30గంటలకు కూడా తెరుచుకోని

జగన్నాథపురం సబ్‌ సెంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement