ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

Jul 23 2026 1:18 AM | Updated on Jul 23 2026 1:18 AM

ములుగు రూరల్‌: యువత ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ అన్నారు. ఈ మేరకు పోలీస్‌శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ రానున్న నేపథ్యంలో యువతకు ఉచిత శిక్షణ అందించేందుకు దేహదారుఢ్య పరీక్షలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేహదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఉచిత వసతితో కూడిన శిక్షణ అందిస్తామని వివరించారు. నిరుద్యోగ యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బంగారు భవిష్యత్‌కు పునాది వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ సదానందం, సీఐ సురేశ్‌కుమార్‌, ఆర్‌ఐలు స్వామి, తిరుపతి, వెంకటనారాయణ, శ్రీకాంత్‌, ఆర్‌ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

ఆశ్రమ పాఠశాల తనిఖీ

మంగపేట: మండల పరిధిలోని చుంచుపల్లి గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను జిల్లా పంచాయతీ అధికారి, మండల స్పెషలాఫీసర్‌ కొండ వెంకయ్య బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు ఉదయం అందించే బ్రేక్‌ పాస్ట్‌తో పాటు హాస్టల్‌లోని స్టాక్‌ రిజిస్టర్‌, కూరగాయలను పరిశీలించారు. అలాగే విద్యాబోధన, వసతి, భోజన సౌకర్యాలు, పరిశుభ్రత, తాగునీటి సదుపాయాలపై ఆరా తీశారు. విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. హాస్టల్‌లో ఆహార నాణ్యత, వంటశాల నిర్వహణ, హాజరు రికార్డులు, ఆరోగ్య పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. మెనూ పాటించడంతో పాటు వర్షాకాలంలో విద్యార్థినులు అనారోగ్యాల బారిన పడకుండా చూడాలని డీపీఓ హాస్టల్‌ వార్డెన్‌కు సూచించారు. విద్యార్థినులకు మౌలిక వసతులు కల్పించాలని హెచ్‌ఎం వెంకట్‌రెడ్డికి సూచించారు. డీపీఓ వెంట టీఎస్‌ఈజీసీ సభ్యుడు గుమ్మడి సోమయ్య ఉన్నారు.

ఓటర్ల వివరాలు

నమోదు చేయాలి

ములుగు రూరల్‌: 2002 ఓటరు జాబితా నుంచి ఇప్పటి వరకు గుర్తింపు కాని ఓటర్ల వివరాలను క్షేత్ర స్థాయిలో సేకరించి వివరాలను తప్పకుండా నమోదు చేయాలని బీఎల్‌ఓలకు ఆర్డీఓ కృష్ణవేణి సూచించారు. ఈ మేరకు బుధవారం మల్లంపల్లి మండల కేంద్రంలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఎన్యూమరేషన్‌ ఫారాలను త్వరితగతిన పూర్తి చేసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు.

కరకట్ట నిర్మాణ పనుల పరిశీలన

మంగపేట/ఏటూరునాగారం: మంగపేట మండల కేంద్రంలోని గోదావరి ఒడ్డు వెంట రూ.60 కోట్ల అంచనాతో చేపట్టిన 2.5 కిలో మీటర్ల కరకట్ట నిర్మాణం పనులను ఇరిగేషన్‌ జిల్లా చీఫ్‌ ఇంజనీర్‌ ధర్మ బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా కరకట్ట నిర్మాణం డ్రాయింగ్‌ మ్యాప్‌ను ఆయన పరిశీలించి ఇప్పటి వరకు ఎంతమేరకు పనులు జరిగాయనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచించారు. అలాగే ఏటూరునాగారం మండల పరిధిలోని రామన్నగూడెంలో గోదావరి కరకట్ట కోతకు గురికాకుండా నిర్మిస్తున్న జియో ట్యూబ్స్‌ పనులను పరిశీలించారు. పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కరకట్ట మట్టి ఒర్లిపోకుండా వేసిన ఇసుక బస్తాలను తనిఖీ చేశారు. వరద పెరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు. ఆయన వెంట ఇరిగేషన్‌ ఎస్‌ఈ మోహన్‌రావు, ఏటూరునాగారం ఈఈ శంకరయ్య, డీఈఈ వేణుగోపాల్‌, ప్రవీణ్‌, ఏఈఈ రోహిత్‌, కిశోర్‌, కార్తీక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement