breaking news
Mulugu District News
-
పుష్కర ఘాట్లకు పగుళ్లు
రామన్నగూడెంలో గోదావరి వద్ద నెర్రెలుబారి కూలిపోయిన పుష్కర ఘాట్ మెట్లుఘాట్ వద్ద కోతకు గురవుతున్న ఒడ్డు ఏటూరునాగారం: ఏటూరునాగారం మండలం రామన్నగూడెం, మంగపేట మండలంలో పుష్కరఘాట్లు గోదావరి ప్రవాహానికి పగుళ్లు తేలి, నెర్రెలుబారి ప్రశ్నార్ధకంగా మారాయి. కరకట్ట కోతకు గురవుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. కరకట్ట పునఃనిర్మాణం చేపడుతామన్న ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో గోదావరి నది సుమారు 110 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. పవిత్ర గోదావరి నది స్నానం, పుణ్యకార్యాలు, కర్మలకు ప్రాధాన్యంగా నిలుస్తోంది. జిల్లాలోని రామన్నగూడెం వద్ద 2003లో గోదావరి పుష్కరాల సందర్భంగా అప్పటి ప్రభుత్వం రూ.67లక్షల నిధులతో పుష్కర ఘాట్‌ను నిర్మించారు. 12 సంవత్సరాలకొకసారి వచ్చే పుష్కరాల కోసం మొట్టమొదటిగా రామన్నగూడెం ఘాట్‌ను నిర్మించడం గమనార్హం. అనంతరం 2015లో వచ్చిన పుష్కరాలకు మరో రూ.కోటి కేటాయించి అదనపు ఘాట్‌ను నిర్మించారు. ఈ రెండు ఘాట్లు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. వర్షాకాలంలో వచ్చే వరదలకు గోదావరి నది ఉధృత రూపానికి పుష్కరఘాట్ బీటలు తేలి, నెర్రెలుబారి పగిలిపోయి ప్రమాదకరంగా ఉన్నాయి. గోదావరి వరద ఉధృతి వల్ల కాంక్రీట్ మెట్లు సైతం కూలిపోయాయి. అక్కడ భక్తులు దిగేందుకు ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. మరోమారు గోదావరి వస్తే ఇక్కడ పుష్కర ఘాట్‌కు మెట్లు ఉండేవి అనే సందేహం నెలకొనే పరిస్థితి ఉంది. మంగపేటలోని పుష్కరఘాట్ సైతం గోదావరి ప్రవాహానికి కొట్టుకుపోయింది. గోదావరి మెట్లకు నెర్రెలుబారింది. ఇక్కడ కూడా 2015లో పుష్కరాల సమయంలో మొదటగా గోదావరి పుష్కర ఘాట్‌ను ఏర్పాటు చేశారు. వచ్చే పుష్కరాలకు కేంద్ర బిందువు 2027లో జరగనున్న గోదావరి పుష్కర ఘాట్‌కు రామన్నగూడెం అత్యంత కీలకమైంది. గోదావరి ఒడ్డు వెంట శివాలయం ఉండడంతో గోదావరిలో స్నానం ఆచరించిన భక్తులు శివపార్వతులను దర్శించుకోవడం ఆనవాయితీ. ఇందుకు రామన్నగూడెం పుష్కరఘాట్‌కు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. గోదావరి వరద ప్రతీ ఏటా కొత్త రూపాన్ని దాల్చి ప్రవాహ సరళిని మార్చుకొని ప్రవహిస్తోంది. గోదావరి ఉగ్రరూపం వల్ల ఘాట్ కనిపించకుండా పోయే ప్రమాదం ఉందని స్థానికులు వాపోతున్నారు. పదేళ్ల నుంచి కరకట్ట పునఃనిర్మాణం చేపడుతామన్న ప్రభుత్వాలు మిన్నకుండి పోతున్నాయి. కరకట్టతోపాటు ఘాట్ కూడా లేకుండా పోయే దుస్థితిలోకి వచ్చింది. అధికారుల సందర్శన కేంద్ర జలవనరులు, భారీ నీటిపారుదల శాఖ అధికారులు సైతం కరకట్ట వెంట ఉన్న పుష్కర ఘాట్‌ను చాలాసార్లు పరిశీలించారు. గోదావరి వరద సమయంలో సైతం జిల్లా అధికారులు, రాష్ట్ర మంత్రులు సైతం రామన్నగూడెం పుష్కరఘాట్‌ను సందర్శించి మరమ్మతు చర్యలు చేపడుతామని పేపర్ల ప్రకటన మాత్రమే చేసి వదిలేశారు. సర్వేలు చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసినప్పటికీ ఉలుకు పలుకు లేకుండా పోయింది. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల ముందు చూపులేని తనంతో గోదావరి పవిత్రకు, రక్షణకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. గోదావరి వరద గ్రామాల్లోకి రాకుండా నిర్మించిన రక్షణ గోడలు ఒక్కొక్కటిగా నీటిలో కలిసిపోతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గోదావరి ఉగ్రరూపానికి జలసమాధి కావాల్సి వస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కోతకు గురవుతున్న ఒడ్డుపుష్కర ఘాట్‌కు రక్షణగా నిర్మించిన మట్టి కట్ట, ఒడ్డు సైతం గోదావరి వరదతో కోతకు గురవుతోంది. దీనివల్ల ఘాట్‌కు ఇటు గ్రామానికి ప్రమాదం పొంచి ఉంది. మట్టి ప్రతి ఏడాది గోదావరి నీటిలో కలిసిపోతూ మూడు మీటర్ల మేర గుంతలు ఏర్పడ్డాయి. మట్టి కొట్టుకుపోతుండడంతో ఘాట్‌కు ఉన్న రక్షణ గోడలు సైతం కూలిపోయే దశకు చేరడం గమనార్హం. ఇలానే వదిలేస్తే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు వాపోతున్నారు. మరమ్మతులు చేపట్టేనా? కోతకు గురవుతున్న కరకట్ట వచ్చే పుష్కరానికి కీలకం కానున్నరామన్నగూడెం ఘాట్ -
ట్రాఫిక్ నియంత్రణకు ముందస్తు ప్రణాళిక
● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ములుగు రూరల్ : మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నియంత్రణ చర్యల్లో భాగంగా ముందస్తు ప్రణాళికను సిద్ధం చేయాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అధికారులకు సూచించారు. జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్‌తో కలిసి ఆదివారం గట్టమ్మ ఆలయ పరిసర ప్రాంతాల్లో వారు స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మేడారం వచ్చే భక్తులు ఆది దేవత గట్టమ్మ తల్లికి మొక్కులు చెల్లిస్తారని అందుకు అనుగుణంగా పార్కింగ్ స్థలాలను గుర్తించాలని తెలిపారు. వాహనాల రాకపోకలతో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉండే విధంగా ప్రత్యామ్నాయ దారిని ఏర్పాటుకు అటవీశాఖ అధికారులు సహకరించాలని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల పార్కింగ్‌కు వేర్వేరు ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్, ఫారెస్టు రేంజ్ అధికారి శంకర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శంకర్, సీఐ సురేష్, ఎస్సై వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు. -
గద్దెల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారంలో సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణ పునఃనిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని మంత్రి సీతక్క సూచించారు. వరుస క్రమంలో నిర్మిస్తున్న వనదేవతల పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల నిర్మాణ పనులను ఆదివారం సీతక్క పరిశీలించారు. నూతనంగా నిర్మించిన గద్దెలపై పగిడిద్దరాజు, గోవిందరాజును ఈనెల 4న పూజారులు ప్రతిష్ఠించే అవకాశం ఉందని త్వరగా పనులు పూర్తి చేయాలని ఆమె కాంట్రాక్టర్‌ను అదేశించారు. గద్దెల ప్రాంగణంలో సీసీ ఫోర్లింగ్ పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులను అదేశించారు. ఆమె వెంట జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కల్యాణి, అధికారులు ఉన్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపునకు పాటుపడాలి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని మంత్రి సీతక్క తెలిపారు. ఆదివారం మేడారంలోని హరితహోటల్లో మండలంలోని ఎల్బాక గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొక్క రాజు, సుశీల, మడ్డి వెంకన్న, సమ్మక్క, గుండ్లపల్లి సమ్మయ్య, పాయం వెంకటరావు, శాంతమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరగా మంత్రి సీతక్క కండువా కప్పి వారిని ఆహ్వానించారు. ఈసందర్భంగా సీతక్క మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని అభ్యర్థుల విజయానికి కష్టపడి పని చేయాలన్నారు. గ్రామాలభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పార్టీలో చేరిన కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, జాతర చైర్మన్ అరెం లచ్చుపటేల్, తాడ్వాయి మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్, మాజీ ఎంపీపీ ఎనగంటి రాములు, నార్లాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. మంత్రి సీతక్క -
స్కూల్ వ్యాన్ డ్రైవర్ల వేతనాలు పెంచాలి
భూపాలపల్లి అర్బన్: స్కూల్ వ్యాన్ డ్రైవర్లు, క్లీనర్ల వేతనాలు పెంచాలని భూపాలపల్లి పట్టణ అఖిల పక్ష పార్టీల నాయకులు, విద్యార్థి యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ది కాకతీయ ప్రైవేట్ స్కూల్స్ వ్యాన్ డ్రైవర్స్, క్లీనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష పార్టీల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సీపీఐ, కాంగ్రెస్, బీజేపీ, డీఎస్పీ, టీఆర్పీ, ఏఐటీయూసీ, విద్యార్థి యువజన సంఘాలు ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ, ఏఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ పార్టీలు, సంఘాల నాయకులు సోత్కు ప్రవీణ్‌కుమార్, రాజేందర్, గీసా సంపత్, సతీష్, రవీందర్, రవిపటేల్, వేముల శ్రీకాంత్, నేరెళ్ల జోసెఫ్, సురేష్ మాట్లాడారు. ది కాకతీయ స్కూల్ వ్యాన్ డ్రైవర్ క్లీనర్ అసోసియేషన్ మూడు డిమాండ్లతో ఒక రోజు సమ్మె చేపట్టినట్లు తెలిపారు. డ్రైవర్ వేతనం నెలకు రూ.20వేలు, క్లీనర్ వేతనం రూ.10వేలు, 12 నెలల జీతం చెల్లించాలని, ఇద్దరు పిల్లలకు ఉచిత విద్యను అందించాలని కోరారు. ఈ డిమాండ్లతో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం (ట్రస్మా) దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఏ ఒక్క డిమాండ్ కూడా పరిష్కారం కాలేదన్నారు. ప్రైవేట్ పాఠశాలలు ప్రతి సంవత్సరం స్కూల్ ఫీజులు పెంచుతూ యాజమాన్యం లాభాల్లో ఉన్నప్పటికీ డ్రైవర్లకు, క్లీనర్లకు జీతాలు పెంచకపోవడం చాలా దారుణమన్నారు. సమ్మెకు అన్ని రాజకీయ, విద్యార్థి, యువజన సంఘాల మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో ది కాకతీయ ప్రైవేట్ స్కూల్ వ్యాన్స్, క్లీనర్ అసోసియేషన్ నాయకులు నాతరి ప్రదీప్, పువ్వాడ రాంబాబు, జైద నర్సింగ్, మీసాల శ్రీనివాస్, జైద మధు, బొల్లపల్లి అశోక్, ఓరిగంటి కిరణ్, ఎండీ షఫీ, నేలి మొగిలి, దుబ్బాక సందీప్ పాల్గొన్నారు. ఒక రోజు సమ్మె -
హేమాచలానికి పోటెత్తిన భక్తులు
మంగపేట: మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి వారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం తదితర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి తదితర సుదూర ప్రాంతాల నుంచి భక్తులు కార్లు, ప్రైవేటు వాహనాల్లో వేలాదిగా తరలివచ్చి సందడి చేశారు. ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద భక్తులు స్నానాలు ఆచరించి స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని తిల తైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. అర్చకులు భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి ఆలయ చరిత్ర, పురాణం వివరించి వేదాశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు అర్చకులు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. అలాగే మండలంలోని వివిధ గ్రామాల నుంచి అయ్యప్ప మాలధారులు, భక్తులు తరలివచ్చి లక్ష్మీనర్సింహస్వామి దర్శించుకున్నారు. -
ఆరు వార్డులకు నామినేషన్లు నిల్..!
● 32 వార్డులకు ఒక్కో దరఖాస్తుతో ఏకగ్రీవం.. గోవిందరావుపేట: మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసే సరికి చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. మొత్తం 18 గ్రామ పంచాయతీలు ఉండగా 154 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇందులో 32 వార్డులకు ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలయ్యాయి. ఆరు వార్డుల్లో ఒక్క నామినేషన్ రాలేదు దీంతో ఎలాంటి ఓటింగ్ అవసరం లేకుండానే వారిని ఈ నెల 3న నామినేషన్ల ఉపసంహరణ రోజున విజేతలుగా ప్రకటించే అవకాశం ఉంది. నామినేషన్లు రాకపోవడంతో తిరిగి ఎన్నికలు తప్పవా? మండలంలోని ఆరు వార్డులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. అభ్యర్థుల ఎంపికలో విభేదాలు, కమ్యూనిటీ స్థాయి సమీకరణాలు, స్థానిక వర్గాల మధ్య అనుసంధానం వంటి కారణాలతో ఆయా వార్డుల్లో పోటీకి ఎవరూ ముందుకు రాలేకపోయినట్లు సమాచారం. ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్ దాఖలు కానీ ఆరు వార్డులకు తొలిదశ ఎన్నికలు పూర్తయిన తర్వాత మరోసారి నోటిఫికేషన్ జారీ చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మండలంలో గ్రామ పంచాయతీ రాజకీయాలు కాస్త వేడెక్కాయి. ఏకగ్రీవాల ప్రభావం, ఖాళీగా ఉన్న వార్డుల పున:ఎన్నికలు, మిగతా వార్డుల్లో జరగనున్న పోటీ మొత్తం ఎన్నికల ఫలితాలను ఎలా ప్రభావితం చేస్తాయోననే అంశం ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. -
సర్పంచ్ 18.. వార్డులకు 37
రెండో విడత నామినేషన్లు ప్రారంభం ములుగు రూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల స్వీకరణ ఆదివారం ములుగు, మల్లంపల్లి, వెంకటాపురం(ఎం) మండలాల్లో ప్రారంభమైంది. వెంకటాపురం (ఎం) మండలంలో సర్పంచ్ స్థానానికి–9, ములుగు మండలంలో 4, మల్లంపల్లి–5 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం సర్పంచ్ నామినేషన్లు–18, వార్డు సభ్యుల నామినేషన్లు–37 దాఖలు చేశారు. మరో రెండు రోజుల పాటు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. వాహనాల తనిఖీ ఏటూరునాగారం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండలంలోని 163 జాతీయ రహదారిపై ఆదివారం పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. అనుమానిత వాహనాలను క్షుణ్ణంగా సోదా చేసి పంపించారు. ప్రయాణికులు, డ్రైవర్ల వివరాలను తెలుసుకున్నారు. అలాగే మద్యం, డబ్బు, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే ఇతర వస్తువులు సరఫరా అవుతున్నాయా అని ఆరా తీస్తున్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపిక కాళేశ్వరం: మహదేవపూర్ మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన వెలగందుల తరుణి 6వ తరగతి, వెలగందుల తణ్మయి 8వ తరగతి విద్యార్థులు వీవీఎం (విద్యార్థి విజ్ఞాన్ మంథన్) పరీక్షకు రాష్ట్రస్థాయి ఎంపికై నట్లు జిల్లా వీవీఎం కోఆర్డినేటర్, పాఠశాల ఫిజికల్ సైన్స్ టీచర్ మడక మధు ఆదివారం తెలిపారు. వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పరీక్షలో పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికై నందుకు పాఠశాల హెచ్ఎం జి.శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యాయులు సరిత, సుధారాణి, సరితాదేవి, వలిపాషా, శ్రీనివాస్, రజిత, లీలారాణి, సమ్మయ్య, వీరేశం, దీపిక, వసుధప్రియా, ప్రసూన, సాహెదాబేగం, పూర్ణిమ, అజ్మాత్పాషా, ఆంజనేయులు విద్యార్థులను అభినందించారు. తరుణి తన్మయి -
మేడారంలో హెల్త్ డైరెక్టర్ పర్యటన
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వైద్యశిబిరాల స్థలాలను రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ శనివారం పరిశీలించారు. మేడారంలో 2026 జనవరి 28నుంచి 31వరకు జరుగనున్న మహాజాతర నేపథ్యంలో భక్తులకు అందించే వైద్యసేవల ఏర్పాట్లను ఆయన పరిశీలిస్తు పర్యటించారు. టీటీడీ కల్యాణ మండపాన్ని దర్శించి ఆస్పత్రి ఏర్పాటుపై ఉమ్మడి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత జాతరలో వైద్యసేవల పరంగా ఏర్పడిన ఇబ్బందులను ఈసారి జాతరలో తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించారు. కార్యక్రమంల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్ గోపాల్‌రావు, అప్పయ్య, సాంబశివరావు, డీపీఎం సంజీవరావు పాల్గొన్నారు. లక్ష్మీదేవరకు విడిది ఏర్పాటు చేయాలి వెంకటాపురం(ఎం) : మేడారం వనదేవతల సన్నిధిలో సమ్మక్క– సారక్కల ఆడబిడ్డ అయిన ఆదివాసీ లక్ష్మీదేవరకు విడిది ఏర్పాటు చేయాలని ఆదివాసీ నాయక పోడ్ దెబ్బ వ్యవస్థాపక అధ్యక్షుడు దబ్బా సుధాకర్ పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలో లక్ష్మీదేవర గుడారపు పండుగకు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడారం మహాజాతరలో సమ్మక్క–సారలమ్మ గద్దెలకు రాకముందే ఆదివాసీ లక్ష్మీదేవర వనదేవతల గద్దెలు తొక్కుతుందని పేర్కొన్నారు. మేడారంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాలు ఆదివాసీల ఇలవేల్పు లక్ష్మీదేవరలకు మేడారంలో విడిది ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో నాయక పోడ్ దెబ్బ కోఆర్డినేటర్ నెమలి నర్సయ్య, నాయకులు బొల్లెం సారయ్య, గాలి సమ్మయ్య, మధు, సరోజన, యాదగిరి, రాజు, స్వామి, కనకయ్య, రామక్క తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా ఇన్‌చార్జ్‌ల నియామకం హన్మకొండ: భారతీయ జనతా పార్టీ జిల్లాల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఇన్‌చార్జ్‌ల పేర్లను శనివారం ప్రకటించారు. హనుమకొండ జిల్లాకు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ (భువనగిరి)ను ఇన్చార్జ్గా నియమించారు. వరంగల్‌కు కొండపల్లి శ్రీధర్ రెడ్డి (ఖమ్మం), జయశంకర్ భూపాలపల్లికి దశమంత రెడ్డి (జనగామ), మహబూబాబాద్‌కు డాక్టర్ జరుపులావత్ గోపి (నల్లగొండ), ములుగు జిల్లాకు డాక్టర్ కోరండ్ల నరేష్ (రంగారెడ్డి), జనగామ జిల్లాకు కట్ట సుధాకర్ రెడ్డి (నాగర్ కర్నూల్)ను ఇన్చార్జ్గా నియమించారు. భక్తులతో కిక్కిరిసిన హేమాచలంమంగపేట : మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి పవిత్ర చింతామణి జలపాతం వద్ద స్నానాలు ఆచరించి ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకున్నారు. తిల తైలాభిషేకం పూజలో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు అర్చకులు స్వామి వారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. వాటర్ కూలర్ల ఏర్పాటు ఆలయ దర్శనానికి వచ్చే భక్తుల దాహార్తిని తీర్చుకునేందుకు దాతలు బహూకరించిన వాటర్ కూలర్లను రెండు చోట్ల ఏర్పాటు చేసినట్లు ఈఓ రేవెల్లి మహేష్ తెలిపారు. -
రెండో విడతకు వేళాయె..
● నేటినుంచి నామినేషన్ల స్వీకరణ ● 52 సర్పంచ్.. 462 వార్డులకు ఎన్నికలుములుగు: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. మొదటి విడతగా జిల్లాలోని గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లో 48 గ్రామ పంచాయతీలకు, 420 వార్డులకు శనివారం వరకు నామినేషన్లు స్వీకరించారు. రెండవ విడతలో ములుగు, మల్లంపల్లి, వెంకటాపూర్ మండలాల్లోని 52 గ్రామ పంచాయతీలకు, 462 వార్డులకు నేటి నుంచి డిసెంబర్ 2 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. రెండో విడతలో 32,242 మంది పురుషులు, 34,478 మహిళలు, తొమ్మిది మంది ఇతరులతో కలిసి మొత్తం 66,729 మంది ఓటర్లు ఉన్నారు. నామినేషన్లు స్వీకరించేందుకు ములుగు మండలంలో ఎనిమిది క్లస్టర్లు, వెంకటాపూర్ మండలంలో ఆరు క్లస్టర్లు, మల్లంపల్లి మండలంలో మూడు క్లస్టర్లు ఎర్పాటు చేశారు. ఏ మండలంలో ఎన్ని జీపీలు.. ములుగు మండలంలో 19 గ్రామపంచాయతీలు, 172 వార్డులు ఉండగా 24,985 మంది ఓటర్లు ఉన్నారు. మల్లంపల్లి మండలంలో 10 గ్రామ పంచాయతీలు.. 90 వార్డులు ఉండగా 13,505 మంది ఓటర్లు ఉన్నారు. వెంకటాపూర్ మండలంలో 23 గ్రామపంచాయతీలు, 200 వార్డులు ఉండగా 28,239 మంది ఓటర్లు ఉన్నారు. -
పరిశీలన.. సమీక్ష
● ‘గ్రేటర్’లో రోజంతా బిజీబిజీగా గడిపిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ● వరంగల్ రైల్వే స్టేషన్ పరిశీలన.. క్యాంటీన్లో చాయ్‌పే చర్చ ● శ్రీభద్రకాళి, వేయిస్తంభాల ఆలయాల్లో ప్రత్యేక పూజలు● కల్యాణమండపం పనుల అలసత్వంపై అసంతృప్తి ● కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ తనిఖీ.. పనులపై ఆరా ● వరంగల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వెల్లడి – హన్మకొండ/హన్మకొండ కల్చరల్/ఖిలా వరంగల్/కాజీపేట రూరల్ వేయిస్తంభాల ఆలయ కల్యాణ మండపాన్ని పరిశీలిస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, చిత్రంలో బీజేపీ నాయకులు -
మోహన్రావుది వీర మరణం!
టేకుమట్ల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా, టేకుమట్ల మండలంలోని రామకిష్టాపూర్(వి) గ్రామానికి చెందిన లింగంపల్లి మోహన్‌రావు నాలుగు పర్యాయాలు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ సేవలందించారు. సొంత ఖర్చులతో రోడ్ల విస్తరణ, సబ్‌స్టేషన్ ఏర్పాటు రోడ్లు, డ్రెయినేజీ, నీటి వసతి ఇలా అనేక సేవలందించారు. సర్పంచ్‌గా కొనసాగుతున్న సమయంలోనే 2009లో మావోయిస్టులో చేతిలో హతమయ్యారు. దాంతో ఆయన అభివృద్ధ్దికి గుర్తుగా గ్రామస్తుల కోరిక మేరకు గ్రామ పంచాయతీ వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయనది వీరమరణమని ఇప్పటికీ స్థానికులు చెప్పుకుంటారు.. -
తొలి సర్పంచ్ కందుకూరి కాంతయ్య
హసన్‌పర్తి: హనుమకొండ మండలం గోపాలపురానికి చెందిన కందుకూరి కాంతయ్య గ్రామానికి తొలి సర్పంచ్. 1979 నుంచి 1995 వరకు వరుసగా 17 ఏళ్ల పాటు సర్పంచ్‌గా సేవలందించారు. హనుమకొండ సమితి డిప్యూటీ ప్రెసిడెంట్‌గా, ఏనుమాముల మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా, వరంగల్ కో–ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్‌గా పదవులు నిర్వర్తించారు. మాజీ మంత్రి హయగ్రీవాచారికి ముఖ్య అనుచరుడిగా వ్యవహరించారు. 1999లో ఆయన హత్యకు గురయ్యారు. ఆయన సేవలకు గుర్తుగా గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం వద్ద కాంతయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏటా కాంతయ్య వర్ధంతి, జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. కాంతయ్య స్ఫూర్తితో ఆయన కుటుంబీకులు రాజకీయంలో రాణిస్తున్నారు. -
సర్పంచ్‌లకు 275.. వార్డులకు 913 దాఖలు
ముగిసిన మొదటి దశ నామినేషన్లు ఏటూరునాగారం: గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశ నామినేషన్లు శనివారంతో ముగిశాయి. జిల్లాలోని ఏటూరునాగారం, తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల్లో నామినేషన్ల స్వీకరణ చేపట్టారు. ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీల నాయకులు రెండు మూడు సెట్లతో కూడిన నామినేషన్లను అందజేశారు. నేడు స్రూటినీ చేయనున్నారు. 3వ తేదీన ఉపసంహరణల అనంతరం అభ్యర్థులకు గుర్తులు కేటాయించనున్నారు. ఏ మండలంలో ఎన్ని నామినేషన్లు.. ఏటూరునాగారం మండలంలో సర్పంచ్‌కు 75, వార్డు సభ్యులకు 266, తాడ్వాయి మండలంలో సర్పంచ్‌కు 111, వార్డు సభ్యులకు 280, గోవిందరావుపేట మండలంలో సర్పంచ్‌కు 89, వార్డుసభ్యులకు 367 నామినేషన్లు దాఖలు చేశారు. -
కేసీఆర్ పట్టుదలతోనే ప్రత్యేక రాష్ట్రం
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారావు ఏటూరునాగారం : ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని, అనేక మంది అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం, జయశంకర్ విగ్రహం ఎదుట దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించి కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సాధించడం కోసం కేసీఆర్ అనేక ఉద్యమాలు చేశారన్నారు. ఎంతోమంది విద్యార్థులు తమ ప్రాణాలను త్యాగం చేసి సాధించుకున్నట్లు చెప్పారు. నిధులు, నీళ్లు, నియమాకాలను సాధించుకునే స్థాయికి చేరుకున్నామని తెలిపారు. అనంతరం తొలి ఉద్యమకారులను లక్ష్మీనర్సింహరావు ఘనంగా సన్మానించారు. పార్టీ మండల అధ్యక్షుడు గడదాసు సునీల్‌కుమార్, సమ్మయ్య, నగేష్, కృష్ణ, వలిబాబు, మల్లారెడ్డి, నూతి కృష్ణ, సర్దార్, సమ్మయ్య, ముత్తయ్య, స్వరూప, ముత్తేష్ తదితరులు పాల్గొన్నారు. -
ములుగు
ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్ శ్రీ 2025వసతుల కల్పన.. అభివృద్ధి రూపకల్పనదామెర: హనుమకొండ జిల్లా దామెర మండలం కోగిల్వాయికి చెందిన గట్ల మల్లారెడ్డి సేవలు ఇప్పటికీ గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. 1984–90, 1996–2001 రెండు పర్యాయాలు సర్పంచ్‌గా సేవలందించారు. గ్రామంలో ప్రైమరీ, హై స్కూల్ నిర్మించారు. పలు గ్రామాల్లో వాటర్ ట్యాంకులు, పైప్‌లైన్, బస్‌షెల్టర్ నిర్మాణం, అంతర్గత రోడ్లు, వీఽధి దీపాలు ఏర్పాటు వంటి ఎన్నో సేవలు చేశారు. ఆయన సేవలకు గుర్తుగా గ్రామంలోని కూడలిలో మల్లారెడ్డి ప్రతిమను ప్రతిష్టించారు. మల్లారెడ్డి కుమారుడు గట్ల విష్ణువర్ధన్ రెడ్డి అమెరికా నుంచి వచ్చి 2018 నుంచి 2024 వరకు సర్పంచ్‌గా, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడిగా సేవలందించారు. -
ఊరు వెలగాలని మూడెకరాలు అమ్మేశారు..
● ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి ● కలెక్టర్ దివాకర టీఎస్పాలకుర్తి టౌన్: పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో రెండు పర్యాయాలు సర్పంచ్‌గా సేవలందించిన గంట సోమయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి 1981–1994 వరకు సర్పంచ్‌గా ప్రజలకు విశిష్ట సేవలందించారు. చివరకు తనకున్న ఆస్తినంతా ప్రజా సేవకు ధారపోశారు. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని వావిలాల గ్రామానికి రప్పించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి గ్రామానికి బస్సు సర్వీసులు నడిపించారు. గ్రామంలో 13 నీళ్ల ట్యాంకులు నిర్మించారు. ప్రధాని రాజీవ్‌గాంధీ చేతుల మీదుగా ఉత్తమ సర్చంచ్‌గా పురస్కారం అవార్డు, ప్రశంసపత్రం అందుకున్నారు. గ్రామంలో టెలిఫోన్ ఎక్చేంజ్, విద్యుత్ సబ్సేష్టన్ మంజూరు చేయించారు. 1991 ఆగస్టు 19న సీపీఐ(ఎంఎల్) పీపుల్స్‌వార్ నాగన్న దళం సర్పంచ్ సోమయ్యను కిడ్నాప్ చేయడంతో అప్పటి కలెక్టర్ బీపీ ఆచార్య చొరవతో నాలుగు రోజుల తర్వాత విడుదలయ్యారు. 2021లో కన్నుమూశారు. గ్రామ ప్రజలు ఆయన సేవలకు గుర్తుగా 2022 ఏప్రిల్‌లో వావిలాల ప్రధాన కూడలిలో విగ్రహం ఏర్పాటు చేశారు. దుగ్గొండి: మండలంలోని తిమ్మంపేట గ్రామ సర్పంచ్‌గా విశిష్ట సేవలందించిన సారంపల్లి రాజిరెడ్డి 1970 నుంచి 11 ఏళ్లపాటు సర్పంచ్‌గా పనిచేశారు. ఈసమయంలో ఇంటింటికీ విద్యుత్‌ను తీసుకొచ్చేందుకు తన మూడెకరాల పొలాన్ని అమ్మేశారు. నాలుగు కిలోమీటర్ల దూరంలో లక్నెపల్లి గ్రామం నుంచి విద్యుత్ లైన్ వేయించారు. గ్రామంలోని ప్రభుత్వ స్థలాన్ని వందలాది మంది పేదల ఇళ్ల కోసం ఇచ్చారు. ఆయన మరణానంతరం 2008లో రాజిరెడ్డి విగ్రహాన్ని గ్రామ పంచాయతీ ఎదుట ప్రధాన రహదారి పక్కన గ్రామస్తులంతా కలిసి ప్రతిష్టించారు. ఇప్పటికీ రాజిరెడ్డి పేరు ప్రస్తావన రాగానే కరెంట్ తెచ్చిన మహానుభావుడు అంటూ గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆయనను గుర్తు చేసుకుంటారు. ఎన్నికల ‘కిక్కు’పదవులకు వేలం వేస్తే చర్యలుఆస్తిని ధారపోశారు.. ప్రజల గుండెల్లో నిలిచారు -
నిస్వార్థ సేవ.. వెలిశాల తోవ
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలం రెడ్యాలకు చెందిన వెలిశాల రాధాకృష్ణ 1975 నుంచి 1995 వరకు నాలుగు పర్యాయాలు సర్పంచ్‌గా పనిచేశారు. అనంతరం 2000 నుంచి 2005వ సంవత్సరం వరకు మళ్లీ ఎన్నికై ప్రజలకు సేవలందించారు. గ్రామ అభివృద్ధికి తనవంతుగా కృషి చేశారు. భూ సమస్యలు, కుటుంబ తగాదాలను పరిష్కరించారు. మృధుస్వభావిగా ఉంటూ అందరి మన్ననలు పొందారు. నిస్వార్థంగా సేవ చేసిన ఆయన 2006 మార్చిలో మృతిచెందారు. పలు పార్టీల నేతలు, గ్రామస్తుల సహకారంతో 2014 జనవరి 27న రాధాకృష్ణ విగ్రహాన్ని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేశారు. -
చిచ్చు పెడుతున్న ఇసుక ర్యాంప్‌లు
వెంకటాపురం(కె): మండలంలోని ఇసుక ర్యాంప్‌లు గిరిజనులు, గిరిజనేతులకు మధ్య చిచ్చు పెడుతున్నాయి. మండల పరిధిలోని అబ్బాయిగూడెంలోని ఓ ఇసుక ర్యాంప్తో గిరిజనులు, గిరిజనేతరులకు మధ్య గొడవలు జరుగుతుండటంతో వారం రోజు లుగా గ్రామంలో రిలే దీక్షలు చేస్తున్నారు. శుక్రవా రం పంట పొలాల నుంచి రహదారి పోవడంతో పంటలు నష్టపోతున్నామని ఆందోళన చేస్తున్నారు. పంట పొలానికి దుమ్ము పడకుండా కంచెను ఏర్పా టు చేయగా ఇసుక సొసైటీ సభ్యులు కూల్చారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మన్నేటి ధనలక్ష్మి అనే మహిళపై దాడి చేయడంతో గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు పురుగుమందు డబ్బాలతో రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వారితో మాట్లాడారు. అయినా వినకపోవడంతో విషయాన్ని టీఎండీసీ పీఓ విష్ణువర్ధన్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన అక్కడికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. ఇసుక రీచ్ పనులు నిలిపేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కాగా అబ్బాయిగూడెం ఇసుక రీచ్తో పంటలు నష్టపోతున్నామని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఘర్షణ మహిళలకు గాయాలు పురుగుమందు డబ్బాలతో ధర్నాకు దిగిన గ్రామస్తులు -
కొనసాగిన నామినేషన్ ప్రక్రియ
ఏటూరునాగారం/గోవిందరావుపేట/ఎస్‌ఎస్‌తాడ్వాయి: జిల్లాలో మొదటి దశలో ఏటూరునాగారం, తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నామినేషన్ల పర్వం రెండో రోజు కొనసాగింది. శుక్రవారం సర్పంచ్ పోటీ కోసం 41 మంది, వార్డు సభ్యుల కోసం 72 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ తెలిపారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించి కేవలం ముగ్గురు వ్యక్తులను మాత్రమే నామినేషన్‌కు అనుమతి ఇచ్చారు. జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు సతీమణి శ్రీలత ఏటూరునాగారం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడంతో ప్రత్యేకత సంతరించుకుంది. కాగా ఇప్పటి వరకు మూడు మండలాల్లో సర్పంచ్‌లకు 63, వార్డులకు 92 నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకుండా అసిస్టెంట్ ఎన్నికల అధికారులు నిత్యం పర్యవేక్షణ చేశారు. సర్పంచ్ 41, వార్డు సభ్యులకు 72 నామినేషన్లు దాఖలు నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వంమండలం సర్పంచ్ వార్డులు ఏటూరునాగారం 16 6 గోవిందరావుపేట 8 29 తాడ్వాయి 17 37 మొత్తం 41 72 -
విద్యార్థులు శాస్త్రీయ అవగాహన పెంచుకోవాలి
ఏటూరునాగారం: విద్యార్థులు శాసీ్త్రయ అవగాహన పెంచుకోవాలని ములుగు ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో జన విజ్ఞాన వేదిక చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ జిల్లా స్థాయి పరీక్ష పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు మూఢనమ్మకాలను వదిలిపెట్టాలని, సైన్స్‌ను జీవితంలో అన్వయించుకోవాలన్నారు. ప్రస్తుతం ఆకస్మిక గుండెపోటు మరణాలు అధికంగా ఉన్నాయని, ప్రతిఒక్కరూ సీపీఆర్ చేయడం నేర్చుకోవాలన్నారు. చెకుముకి పరీక్షలకు జిల్లా నలుమూలల నుంచి 40 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారన్నారు. తెలుగు విభాగం నుంచి జెడ్పీహెచ్ఎస్ అలుబాక, ఇంగ్లిష్ విభాగం నుంచి జెడ్పీహెచ్ఎస్ ఏటూరునాగారం, పైవేట్ స్కూల్స్ విభాగం నుంచి గోవిందరావుపేట మెరిట్ స్కూల్, టీజీఎంఎస్ బండారుపల్లి రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు అర్హత సాధించారు. కరీంనగర్లో జరగనున్న రాష్ట్ర స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు కొయ్యడ మల్లయ్య, ప్రధాన కార్యదర్శి గడ్డి శ్రీనివాస్, కలకొట్ల నరేష్, పల్లె నాగరాజు, మహిళా సమత సొసైటీ కన్వీనర్ యమున, అనిత, రేవతి, వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.ములుగు ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ -
ఆశావహులకు ఆప్షన్!
ములుగు: పంచాయతీ ఎన్నికల సమరం మొదలైంది. రిజర్వేషన్ల వారీగా గెలుపు గుర్రాల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు గ్రామాల్లో అభిప్రాయాలను సేకరిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని సర్పంచ్ పదవులను ఆశిస్తున్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైనా.. మండల పరిషత్ ఎన్నికల్లో సానుభూతితో గెలవొచ్చనే ధీమాతో పల్లెపోరుకు సిద్ధమవుతున్నారు. మొదటి విడత నామినేషన్లు ప్రారంభం కావడంతో జిల్లాలోని పలు గ్రామాల్లో సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థులు తమకు అండగా నిలిచి గెలుపొందేందుకు సహకారం అందించాలని కోరుతున్నారు. మారిన సమీకరణలు రాజకీయ పార్టీల పరంగా జరిగే పరిషత్ ఎన్నికలను మొదట నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఆ దిశగా నోటిఫికేషన్ సైతం గత సెప్టెంబర్‌లో విడుదల చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు ఆశావహులు సన్నద్ధమయ్యారు. ప్రధాన పార్టీల తరఫున బీఫాం దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేపట్టారు. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్ల పెంపును కోర్టు సమర్థించకపోవడంతో ఎన్నికలకు బ్రేక్ పడడంతో ఆశావహులు నిరాశ చెందారు. ప్రస్తుతం పరిషత్ ఎన్నికల కంటే ముందుగానే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం, ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతో పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందేందుకోసం ఆశావహులు సన్నద్ధమవుతున్నారు. పంచాయతీ పోరుకు ముహూర్తం దగ్గర పడుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ప్రస్తుతం పల్లెల్లో ఎక్కడ చూసినా రిజర్వేషన్ల వారీగా అభ్యర్థులు ఎవరున్నారు. ఎవరూ పోటీ చేస్తే గెలుపొందుతారనే వాటిపై పార్టీల పరంగా సర్వేలు నిర్వహించుకుంటున్నారు. పార్టీల పరంగా ఒక్కొక్క పార్టీ నుంచి ఇద్దరి నుంచి ఐదుగురు అభ్యర్థుల జాబితాను తయారు చేస్తున్నారు. తీవ్రంగా పోటీ ఉన్న చోట సర్పంచ్‌గా ఒకరిని, ఎంపీటీసీగా మరొకరిని ప్రకటిస్తూ సమన్వయం చేస్తున్నారు. కొంతమంది రెండింటిలోనూ పోటీ చేసేందుకు తహతహలాడుతున్నారు. ఇప్పటికే ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు ఆశావహులు పలు ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు గ్రామాల్లో ప్రజలు చర్చించుకుంటున్నారు. గ్రామాల్లో మొదలైన ఎన్నికల హడావుడి -
శనివారం శ్రీ 29 శ్రీ నవంబర్ శ్రీ 2025
గ్రామ ప్రథమ పౌరుడి హోదా దక్కించుకునేందుకు ఇప్పటినుండే వివిధ రాజకీయ పార్టీల నుంచి చోటా, బడా నేతలు పోటీ పడుతున్నారు. పార్టీ పరంగా పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండనప్పటికీ గెలుపే ధ్యేయంగా ఇప్పటినుంచే గ్రూపులను ఒక్కటి చేస్తూ ఎన్నికల్లో గెలుపొందేందుకు పావులు కదుపుతున్నారు. ప్రభుత్వం మండల పరిషత్ ఎన్నికలు ముందుగా జరిపి పంచాయతీ ఎన్నికలు తర్వాత జరపాలని ఆలోచించింది. మారిన సమీకరణాల నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు తొలుత రావడంతో సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయినా.. ఆ సానుభూతితో మండల పరిషత్ ఎన్నికల్లో గెలవవచ్చనే ధీమాలో అభ్యర్థులు ఉన్నారు. -
ఎన్నికల విధానం చూస్తే బాధేస్తోంది..
సాక్షి, మహబూబాబాద్ :‘స్వాతంత్య్ర ఉద్యమం, నిజాంపాలన చూశాను. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. సర్పంచ్ పదవితో రాజకీయ ఆరంగ్రేటం చేసి నాలుగుసార్లు ఎమ్మెల్యే, నాలుగుసార్లు ఎంపీగా పనిచేశా. అప్పటి రాజకీయాలకు ప్రస్తుత రాజకీయాలకు పొంతన లేదు. అప్పుడు మంచి నాయకుడిని ఎన్నుకోవాలనే తపన ప్రజల్లో ఉండేది. అభ్యర్థులను గెలిపించే బాధ్యత నాయకులు, కార్యకర్తలు తీసుకునేది. జీపులు.. డీజిల్ ఖర్చు తప్ప, ఇతరత్రా వ్యయాలు ఉండేవి కాదు. ఇప్పుడు ఓట్లు పడాలంటే డబ్బులు ఖర్చుపెట్టాలి. ఈవిధానం చూస్తే బాధేస్తోంది’ అని మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నాటి పరిస్థితులను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. సర్పంచ్‌గా అరంగ్రేటం చదుకునే రోజులు.. అప్పటివరకు నాకు రాజకీయాలు తెలియదు. అందరి ప్రోత్సాహంతో 1960లో మహబూబాబాద్ జిల్లా మరిపెడ గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యా. ఏకగ్రీవ ఎన్నిక కావడంతో పెద్దగా డబ్బులు ఖర్చుపెట్టలేదు. నాకు ఇప్పుడు 95ఏళ్లు.. నేను సర్పంచ్‌గా గెలిచినప్పుడు ముప్పై సంవత్సరాలు కూడా లేవు. అయినా సర్పంచ్ అంటే గ్రామంలో ప్రత్యేక ఆదరణ. నాయకుడికి కూడా గ్రామం అన్నా.. గ్రామస్తులు అన్నా.. ప్రాణంగా పనిచేసేవారు. గ్రామాల అభివృద్ధికి ఎంతదూరమైనా పోయేవాళ్లం. ఎన్నికల్లో డబ్బులు పంచడం అంటే తెలియదు. గ్రామాల్లోకి వెళ్తే.. అక్కడి నాయకులే భోజనాలు పెట్టేవారు. పార్లమెంట్ ఎన్నికలకు నాకు అయిన ఖర్చు రూ.7,500 మాత్రమే.. ఇప్పుడు ఒక్క ఓటుకు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఈ పరిస్థితి చూస్తుంటే బాధేస్తోంది. కమ్యూనిస్టులతో పోటీ.. ఆరోజుల్లో ఇన్ని పార్టీలు లేవు. కమ్యూనిస్టు, కాంగ్రెస్ రెండు పార్టీల మధ్యనే పోటీ ఉండేది. 1967లో ఎంపీగా ఎన్నికై న సమయంలో తొలి దశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుంది. అప్పుడు మర్రి చెన్నారెడ్డి ఇతర నాయకులు నన్ను తెలంగాణ పార్లమెంటరీ సమితి కన్వీనర్‌గా ఎన్నుకున్నారు. 1969లో హైదరాబాద్‌లో పదివేల మందితో సత్యాగ్రహ కార్యక్రమం చేశాం. జైలుకు వెళ్లిన సంఘటనలు ఉన్నాయి. అయితే అప్పుడు కమ్యూనిస్టులు ప్రజాప్రతినిధులతో పనులు చేయించేలా పోటీ పడేవారు. అభివృద్ధిని ఆకాంక్షించేవారు. పనిచేసిన వారిని అభినందించే సంస్కృతి ఉండేది. ఇప్పుడు అలాంటి వాతావరణం కనిపించడం లేదు.నాడు గ్రామానికి సేవ చేసే నాయకులను ఎన్నుకునేవారు. ఇప్పుడు డబ్బులు ఖర్చుపెట్టే వారికి టికెట్లు ఇస్తున్నారు. ప్రజలు వారికి ఓట్లు వేసి ఎన్నుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఈ వాతావరణం మంచిదికాదు. డబ్బులు లేనివారు ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. డబ్బులు పంచి పెట్టడం అంటే అవినీతికి అవకాశం ఇవ్వడమే.. ఈ సంస్కృతి మారాలి. ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు కలగజేసుకొని డబ్బులకు, ఎన్నికలకు ఉన్న సంబంధాన్ని విడగొట్టాలి. లేకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. ఓటుకు డబ్బులు ఇవ్వడం అంటే.. అవినీతిని ప్రోత్సహించడమే ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు ప్రత్యేక దృష్టి పెట్టాలి ‘సాక్షి’తో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రామసహాయం సురేందర్ రెడ్డి సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీగా ఎదిగిన రామసహాయం -
నామినేషన్ పత్రంలో ఖాళీలు ఉంచొద్దు
ములుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసే అభ్యర్థులు పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నామినేషన్ పత్రంలో ఖాళీలు ఉంచొద్దని జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నామినేషనన్తో పాటు ఇద్దరు సాక్షులతో సెల్ఫ్ డిక్లరేషన్ దాఖలు, ఎవరైనా అభ్యర్థి నామినేషన్‌తో పాటు సెల్ఫ్ డిక్లరేషనన్ దాఖలు చేయడంలో విఫలమైతే, అతను/ఆమె దానిని నామినేషన్ వేసే చివరి తేదీ సాయంత్రం 5 గంటలలోపు దాఖలు చేయాలన్నారు. డిక్లరేషన్ కోసం అఫిడవిట్ కానీ, నోటరీ కానీ అవసరం లేదన్నారు. అన్ని నిలువు వరుసలను పూరించాలని, ఏ కాలమ్‌ను ఖాళీగా ఉంచొద్దన్నారు. ఏదైనా వస్తువుకు సంబంధించి సమాచారం లేకుంటే, సందర్భానుసారంగా ‘నిల్’ లేదా ‘వర్తించదు’ అని పేర్కొనాలన్నారు. నామినేషన్ వేసే అభ్యర్థి నూతన బ్యాంకు ఖాతా తప్పనిసరిగా తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రం జత చేయాలి. సర్పంచ్, వార్డు మెంబర్ సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. నామినేషన్ వేసే అభ్యర్థులు ఈ సూచనలు తప్పక పాటించాలన్నారు.జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ -
వేస్ట్ వస్తువులతో ఆదాయం
ములుగు: ఇంటి పరిసరాల్లో ఏర్పడే చెత్త (వేస్ట్)తో ఆదాయాన్ని సంపాదించుకోవచ్చని రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్జీసీ అధికారి విద్యాసాగర్ తెలిపారు. శుక్రవారం ములుగు బాలికల ఉన్నత పాఠశాలలో శ్రీవేస్ట్ టు వెల్త్ఙ్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లాలోని సుమారు 30 పాఠశాలల విద్యార్థులు వేస్ట్ పదార్థాలతో పనికి వచ్చే వాటితో పాటు ఇంటిలో అలంకరణకు ఉపయోగపడే వస్తువులను తయారు చేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ పరిసరాల్లో ఇంట్లో ఏర్పడే చెత్త నుంచి ఉపయోగకరమైన వస్తువులను తయారు చేసి పర్యావరణాన్ని కాపాడాలని, పొల్యుషన్‌ను తగ్గించాలన్నారు. పైగా ఆదాయం కూడా సంపాదించవచ్చన్నారు. ఎగ్జిబిషన్లో మొదటి బహుమతి బండారుపల్లి గురుకుల పాఠశాల, ద్వితీయ బహుమతి పస్రా ఉన్నత పాఠశాల, తృతీయ బహుమతి ములుగు మైనార్టీ పాఠశాల విద్యార్థులు నిలిచారు. వీరిని ప్రశంసతో పాటు నగదును అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్, హెచ్ఓం పుష్ప తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాసాగర్ -
నామినేషన్లు 44
ఏటూరునాగారం/ఎస్‌ఎస్‌తాడ్వాయి/గోవిందరావుపేట: జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ మేరకు జిల్లాలోని ఏటూరునాగారం, ఎస్‌ఎస్‌తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల్లో తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 22 నామినేషన్లు అభ్యర్థులు దాఖలు చేయగా వార్డు స్థానాలకు సైతం 22 నామినేషన్లు మొత్తంగా 44 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల్లో ఆర్వోలు, ఏఆర్వోలు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. పోలీసులు నామినేషన్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమతి లేనిది ఎవరిని లోనికి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పోలింగ్ బూత్‌లను ఎన్నికల అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పరిశీలించి లోటుపాట్లను సరిచేశారు. 12 జీపీలకు.. 5 క్లస్టర్లలో నామినేషన్ల స్వీకరణ ఏటూరునాగారం మండలంలోని 12 గ్రామ పంచాయతీలకు గాను 5 క్లస్టర్లలో నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తొలిరోజు నామినేషన్లు ఏటూరునాగారం నుంచి సర్పంచ్ స్థానానికి రెండు, శంకరాజుపల్లి నుంచి ఒకటి సర్పంచ్ స్థానానికి, ఒకటి వార్డు స్థానానికి నామినేషన్ వచ్చింది. రామన్నగూడెం నుంచి ఒకటి సర్పంచ్, చిన్నబోయినపల్లి నుంచి వార్డు స్థానానికి రెండు, రొయ్యూరు నుంచి ఒకటి వార్డు స్థానానానికి నామినేషన్ దాఖలైనట్లు ఎంపీడీఓ శ్రీనివాస్ తెలిపారు. సర్పంచ్ స్థానాలకు రెండు.. వార్డు స్థానాలకు 14.. గోవిందరావుపేట మండలంలోని 5 క్లస్టర్లలో కలిపి మొత్తం రెండు సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు రాగా వార్డు స్థానాలకు 14 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అందులో మచ్చాపూర్ నుంచి జంపాల ప్రభాకర్, పస్రా నుంచి భూక్య సుమలత సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు వేశారు. అలాగే వార్డు స్థానాలకు బుస్సాపూర్ గ్రామం నుంచి ఐదు నామినేషన్లు రాగా మచ్చాపూర్ ఒకటి, గాంధీనగర్ నుంచి ఒకటి, పస్రా నుంచి ఒకటి, గోవిందరావుపేట నుంచి 6 నామినేషన్లు దాఖలయ్యాయి.ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలంలోని 18 గ్రామ పంచాయతీల నుంచి సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు అధికారులు నామినేషన్లు స్వీకరించారు. మండల పరిధిలో మొత్తంగా 16 సర్పంచ్, నాలుగు వార్డు స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. బీరెల్లి గ్రామం నుంచి సర్పంచ్ స్థానానికి వంగరి అనసూర్య, బెజ్జూరి శ్రీనివాస్, దాయ సత్యవతి, జాజ విజయ, నార్లాపూర్ నుంచి భూక్య శ్రీనివాస్, ఊరట్టం నుంచి చర్పా సౌజన్య, కాటాపూర్ నుంచి దిడ్డి మోహన్‌రావు, ఖలిల్ హుస్సెన్, గంగారం నుంచి బడే రజిత, రంగాపూర్ నుంచి ఇర్ప శివప్రసాద్, తాడ్వాయి నుంచి ఇర్ప సుకన్యసునీల్, కల్తి నాగమణి, కొట్టెం ప్రవళిక, బయ్యక్కపేట నుంచి సురకంటి సమ్మక్క, దామెరవాయి నుంచి వట్టం తిరుపతిలు నామినేషన్లు వేశారు. వార్డు స్థానాలకు కాటాపూర్ నుంచి దిడ్డి మాధవి, దిడ్డి మల్లయ్య, తాడ్వాయి నుంచి దుర్గం నవీన్, దామెరవాయి నుంచి లోడారి సమ్మయ్యలు నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 22, వార్డు స్థానాలకు 22 నామినేషన్లు స్వీకరించిన ఆర్వోలు, ఏఆర్వోలు కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తుమండలం సర్పంచ్‌లు వార్డులు ఏటూరునాగారం 4 4 గోవిందరావుపేట 2 14 ఎస్‌ఎస్‌తాడ్వాయి 16 4 -
ప్రజావైద్యుడు విద్యాసాగర్ కన్నుమూత
ఏటూరునాగారం: ఆయన ఒక ప్రజావైద్యుడు. పేదలకు కేవలం రూ.3లకే ఇంజక్షన్ వేసి ప్రజల మనలను పొందిన గొప్ప ఆదర్శవాది వంగల విద్యాసాగర్. అయితే ఆయన ఆర్ఎంపీగా పనిచేస్తూనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ నుంచి 2001లో ఏటూరునాగారం నుంచి ఎంపీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. ఐదేళ్లపాటు ఎంపీటీసీగా పనిచేసిన అనంతరం ఆర్ఎంపీగా పనిచేస్తూనే కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురయ్యారు. పరిస్థితి విషమించి వంగల విద్యాసాగర్(60) గురువారం మృతి చెందాడు. ఎంతో మంది పేద ప్రజలకు తక్కువ ధరకు వైద్యం అందించి వెన్నుదన్నుగా నిలిచారు. ఆయన మరణవార్త విన్న ప్రజలు కన్నీరుమున్నీరుగా విలపించారు. విద్యాసాగర్ మరణ వార్త తెలుసుకున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి మృతదేహంపై పార్టీ కండువా కప్పి నివాళులర్పించారు. తొలితరం బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జెఈ్ప మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి, నాయకులు మల్లారెడ్డి, చిన్నికృష్ణ, ఖాజాపాషా, రాంనర్సయ్య, బోజారావు, ప్రదీప్‌రావు తదితరులు పాల్గొన్నారు. రూ.3కే ఇంజక్షన్ వేసి పేదప్రజల మన్ననలు పొందిన ఆదర్శవాది -
నేటి నుంచి జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు
ములుగు రూరల్: జిల్లా అథ్లెటిక్స్ సోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఆస్మిత అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ పగడాల వెంకటేశ్వర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జాకారం సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో నేటి నుంచి అండర్ 14, 16 బాలికలకు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2036 ఒలంపిక్స్‌లో దేశం తరఫున పాల్గొనేందుకు కిందిస్థాయి నుంచి బాలికల్లోని క్రీడానైపుణ్యాన్ని గుర్తించేందుకు పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారిణులను రాష్ట్ర, జాతీయస్థాయిలో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి ఉన్నతస్థాయిలో పాల్గొనే విధంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.ములుగు: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం–2025 సందర్భంగా జిల్లాలోని దివ్యాంగులందరికీ రేపటి నుంచి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి తుల రవి తెలిపారు. ములుగు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో దివ్యాంగులకు రన్నింగ్, షాట్‌పుట్, చెస్, జవెలిన్ త్రో పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని దివ్యాంగులందరికీ జూనియర్స్ విభాగంలో 10 నుంచి 17 సంవత్సరాల వరకు, సీనియర్స్ విభాగంలో 18 నుంచి 54 ఏళ్ల వారికి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. క్రీడా పోటీల్లో పాల్గొనే దివ్యాంగులు సదరం సర్టిఫికెట్తో పాటు ఆధార్‌కార్డుతో హాజరు కావాలని సూచించారు. విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని వివరించారు. వెంకటాపురం(కె): ఉపాధ్యాయులకు ప్రభుత్వం టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరభద్రం అన్నారు. మండల కేంద్రంలో ఎస్టీయూ మండల అధ్యక్షుడు పుణెం రమణయ్య ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులను టెట్ పరీక్ష మానసిక ఒత్తిడికి గురిచేస్తుందన్నారు. బోధన నాణ్యత, అభ్యసన ప్రక్రియకు ఆటకంగా మారుతుందని వివరించారు. టెట్ మినహాయింపుపై యూనియన్ ఆధ్వర్యంలో న్యాయ పోరాటం చేస్తుందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యలపై సంఘం నిరంతరం పోరాడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాండా రంగారావు, వాంకుడోత్ రాంబాబు, నాయుడు, రాజశేఖర్, రాంబాబు, శిరీష, ఉషారాణి, సమ్మక్క, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. గోవిందరావుపేట: ఇటీవల ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సుధీర్ రాంనాథ్‌ను చల్వాయి టీజీఎస్పీ 5వ బెటాలియన్ కమాండెంట్ కె.సుబ్రహ్మణ్యం గురువారం మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలు, కమ్యూనిటీ పోలిసింగ్, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమన్వయంతో పని చేయాలని నిర్ణయించుకున్నారు. కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రాంబాబు దర్శించుకున్నారు. గురువారం ఆయన ఆలయానికి రాగా అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు చేశారు. శ్రీశుభానందదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ అర్చకులు ఆయనను శాలువాతో సన్మానించారు. -
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ములుగు: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ఫిర్యాదులు, సమాచారం కొరకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జి ల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దివాకర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం మొదటి విడత ఎన్నికల్లో 48 సర్పంచ్, 420 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు ఫ్లయింగ్, స్టాటిస్టిక్, వీడియో సర్వేలైన్ బృందాలు, ఎన్నికల సంబంధిత పర్యవేక్షణ బృందాలను, ఎన్నికల అధికారులను నియమించినట్లు వివరించారు. ప్రజలను ప్రలోభపెట్టే నగదు, మద్యం, కానుకల పంపిణీ, ప్రచారం, అక్రమ నగదు రవాణా, ఇతర ప్రభావిత అంశాలపై నిఘా పెట్టినట్లు వెల్లడించారు. ఓటర్లను ప్రలోభ పెట్టే సంఘటనలు ఉంటే కంట్రోల్ రూమ్ నంబర్ 18004257109కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. అదే విధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సౌకర్యవంతంగా ఎన్నికల సమాచారాన్ని అందించేందుకు రూపొందించిన టీ–పోల్ మొబైల్ యాప్‌ను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. గూగుల్ ప్లే స్టోర్ యాప్ అందుబాటులో ఉందని ప్రతిఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. యాప్ ద్వారా ఓటర్ల పోలింగ్, కేంద్రం వివరాలు, ఓటర్ స్లిప్పులు, నమోదు సమాచారం సులభంగా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దివాకర -
విత్తన బిల్లుపై అభిప్రాయాల సేకరణ
ములుగు: కొత్త విత్తన బిల్లు–2025 ముసాయిదాపై రైతులు, విత్తన వ్యాపారులు, ఉత్పత్తిదారులు, నర్సరీల యజమానులు, ఇతర వాటాదారుల నుంచి అభిప్రాయాలను సేకరించినట్లు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మహేందర్‌జీ తెలిపారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కొత్త విత్తన బిల్లు–2025 ముసాయిదాపై జిల్లా స్థాయి సంప్రదింపుల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో కొత్త విత్తన బిల్లులోని సెక్షన్లు, క్లాసులు, విత్తన చట్టం 1966లోని లోపాలు, కొత్త చట్టం లక్ష్యం గురించి చర్చించారు. ఈ సందర్భంగా హాజరైన రైతులు, విత్తన వ్యాపారులు, విత్తన ఉత్పత్తిదారులు, నర్సరీల యజమానులు బిల్లులోని ప్రతీ క్లాజ్‌పై తమ సూచనలు, అభిప్రాయాలను తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి సురేశ్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అవినాష్ వర్మ, మండలాల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న మేడారం పనులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. గద్దెల చుట్టూ ప్రహరీ నిర్మాణం పనులు బేస్మెంట్ పూర్తయి రాతి పిల్లర్లు ఏర్పాటు చేస్తున్నారు. గద్దెల సాలహారం చుట్టూ ఎనిమిది ఆర్చీ ద్వారాల సీసీ పిల్లర్ల పనులు కూడా పూర్తి దశకు చేరుకున్నాయి. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల నిర్మాణం పనులు పూర్తి కావస్తున్నాయి. గద్దెల చుట్టూ ఆదివాసీ చిత్రాలు, పడిగలతో కూడిన పిల్లర్ల ఏర్పాటుకు సిద్ధం చేశారు. సమ్మక్క– సారలమ్మల గద్దెలను విస్తరణ పనులు సైతం ముమ్మరంగా సాగుతున్నాయి. తల్లుల గద్దెల చుట్టూ రాతి పిల్లర్ల ఏర్పాటు చేసేందుకు బేస్మెంట్ స్థాయిలో పనులు పూర్తయ్యాయి. గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణంతో పాటు గద్దెల ప్రాంగణంలో షో లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మేడారంలో ప్రస్తుతం 1.5 కిలోమీటర్ల మేరకు సీసీ రోడ్డు పనులు వేస్తున్నారు. -
అయ్యయ్యో.. ‘చే’జారిందే!
సాక్షిప్రతినిధి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల ఎంపికపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు నేతలు తమ పేర్లు సిఫారసు చేయకపోవడం వల్లే చాన్స్ చేజారిందని ఆశావహులు వాపోతుతుండగా, దరఖాస్తు చేసుకున్నా అవకాశం దక్కని సీనియర్లు అధిష్టానం తమపై చిన్నచూపు చూసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ప్రకటన వెలువడిన నాలుగైదు రోజులకు చాపకింది నీరులా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాలకు గాను ఇద్దరు షెడ్యూల్ కులాలు, ఒక మైనారిటీ, ఒక బీసీ, ఒక జనరల్, ఒక షెడ్యూల్ తెగలకు చెందిన నాయకులకు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించారు. ఈ విషయంలో సామాజిక, సమన్యాయం పాటించినట్లు పార్టీ అధిష్టానం, సీనియర్లు చెబుతుండగా, సిఫారసులు ఫలించని, అవకాశం దక్కని నేతలు మాత్రం అసంతృప్తిగా ఉన్నట్లు అనుచరవర్గాలు చెప్తున్నాయి. వరంగల్‌పై పోటాపోటీ సిఫారసులు.. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మైనార్టీ వర్గానికి చెందిన మహ్మద్ అయూబ్‌కు అనూహ్యంగా అవకాశం దక్కిందని చెప్పొచ్చు. తూర్పు నియోజకవర్గంలో రెండు వర్గాలుగా పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. మంత్రి కొండా సురేఖ దంపతులు ఒక వర్గంగా, మిగిలిన నాయకులు మరో వర్గంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొండా దంపతులు మినహా మిగిలిన వారంతా డీసీసీ అధ్యక్షురాలిగా మాజీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణను ప్రతిపాదించారు. వర్ధన్నపేట, పరకాల ఎమ్మెల్యేలతోపాటు ఆ నియోజకవర్గాలకు చెందిన నాయకులు కూడా స్వర్ణను ప్రతిపాదించారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వర్ధన్నపేట నియోజకవర్గం ఏనుగల్లుకు చెందిన బొంపెల్లి దేవేందర్‌రావుకు డీసీసీ పదవీ ఇవ్వాలంటూ ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలిసింది. కొండా దంపతులు గోపాల నవీన్రాజుకు గానీ, లేని పక్షంలో మీసాల ప్రకాశ్‌కు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. కాగా, మైనార్టీ వర్గానికి చెందిన మహ్మద్ అయూబ్ పేరును డీసీసీ అధ్యక్షుడిగా ఎవరు ప్రతిపాదించలేదు. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్‌లకు సన్నిహితంగా, ఛత్తీస్‌గఢ్‌కు పార్టీ పరిశీలకుడిగా వెళ్లడంతో మీనాక్షి నటరాజన్ దృష్టిలో పడడం, మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆ కోటాలో ఆయూబ్ పేరును చేర్చినట్లు తెలిసింది. మాజీలకు ఇవ్వొద్దని, కనీసం ఐదేళ్ల నుంచి పార్టీలో కొనసాగుతుండాలన్న నిబంధనలను పరిగణనలోకి తీసుకోవడంతో స్వర్ణ, నవీన్రాజులు అనర్హులయ్యారు. దీంతో మంత్రి కొండా సురేఖ దంపతులు, వారి అనుచరులు అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. మహబూబాబాద్‌లో ఎంపీ వర్గం.. జనగామలో ‘కొమ్మూరి’ వర్గం కినుక జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ భార్య ఉమకు కేటాయించడం పట్ల కొందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పదవి ఆశించిన మరికొందరు అసంతప్తిగా ఉన్నారు. మాజీ డీసీసీ అధ్యక్షుడు భరత్చందర్ రెడ్డి వర్గానికి దక్కడం పట్ల ఆయన వర్గం సంతోషంగా ఉంది. కానీ, ఎంపీ బలరాం నాయక్ వర్గానికి చెందిన నునావత్ రాధకు ఇవ్వకపోవడం పట్ల ఆయన అసంతప్తిగా ఉన్నట్లు అనుచరవర్గంలో చర్చ జరుగుతోంది. మొదటినుంచీ డీసీసీ అధ్యక్షుడు పదవి వస్తుందని భావించిన పీసీసీ సభ్యుడు వెన్నం శ్రీకాంత్ రెడ్డి కూడా అసంతృప్తిగానే ఉన్నారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి అనుచరుడిగా ఉన్న గణపురం అంజయ్య కూడా అధ్యక్ష పదవి వస్తుందని ప్రచారం చేసుకున్నారు. అందరిని సమన్వయం చేసుకునేందుకు మురళి నాయక్ దంపతులు ప్రయత్నాలు చేస్తున్నారు. జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా పనిచేసిన లకావత్ ధన్వంతి లక్ష్మీనారాయణ నాయక్‌ను నియమించగా, మాజీ ఎమ్మెల్యే, మాజీ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి, ఆయన అనుచరులు అసంతృప్తిలో ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. పార్టీ స్థాపించిన నాటినుంచి నేటివరకు ఒకే పార్టీలో ఉండడం లకావత్ ధన్వంతికి తగిన గుర్తింపు ఇచ్చిందన్న చర్చ జరుగుతుండగా, ఎస్టీ సామాజిక వర్గం, మహిళ కావడంతో గొడవలకు ఫుల్స్టాప్ పెట్టవచ్చని ఉద్దేశంతో ఆమెను జిల్లా అధ్యక్షురాలిగా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్వినిరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, పలువురు కూడా బలపరిచినట్లు ప్రచారం జరుగుతోంది. ములుగు డీసీసీ అధ్యక్షుడిగా మళ్లీ పైడాకుల అశోక్‌కే చాన్స్ దక్కింది. ఈ విషయంలో మంత్రి సీతక్క సిఫారసు మేరకు ఆయనకు మరోసారి అవకాశం దక్కిందన్న చర్చ పార్టీలో ఉంది. పార్టీలోని ఒక్కరిద్దరు సీనియర్లు అసంతృప్తికి గురైనట్లు వారి అనుచరులు చెబుతున్నారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, జయశంకర్ భూపాలపల్లి అధ్యక్షుడిగా బట్టు కరుణాకర్లను నియమించడంలో ఎమ్మెల్యేల మాట చెల్లుబాటయ్యింది. భూపాలపల్లి నుంచి మాజీ మావోయిస్టు నేత గాదర్ల అశోక్ అలియాస్ ఐతు ప్రయత్నించినా ఆయనకు చాన్స్ రాలేదు. హనుమకొండ నుంచి సుమారు 20మందికిపైగా ఆశించినా సీనియర్ నేత వెంకట్రాంరెడ్డికే అధిష్టానం పార్టీ పగ్గాలు అప్పగించింది. ఉమ్మడి జిల్లాలో డీసీసీ అధ్యక్షుల ఎంపికపై మోదం, ఖేదం పార్టీ సీనియర్లనుంచీ భిన్న స్వరాలు.. వరంగల్‌పై మంత్రి సురేఖ శిబిరంలో అసంతృప్తి? మంత్రి సీతక్క అనుచరుడికే మళ్లీ ములుగు పగ్గాలు.. హనుమకొండ, భూపాలపల్లిల్లో ఎమ్మెల్యేల మాటే చెల్లుబాటు మహబూబాబాద్ డీసీసీపై ఎంపీ వర్గం కినుక.. -
మహాజాతర విజయవంతానికి పాటుపడాలి
ములుగు రూరల్: మేడారం మహాజాతర విజయవంతానికి పాటుపడాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు మేడారం జాతరను మీడియా, పోలీస్ యంత్రాంగం గత జాతర అనుభవాలను దృష్టిలో పెట్టుకొని విజయవంతం చేయాలని కోరారు. గతంలో చోటుచేసుకున్న సంఘటనలు పనరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు. జాతరకు సుమారు కోటి 50 లక్షల మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లిస్తారని అందుకు అనుగుణంగా 10 వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తారని వివరించారు. మేడారం జాతరలో అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో కొనసాగుతున్న మాస్టర్ ప్లాన్ పనుల వివరాలతో పాటు అమ్మవార్ల దర్శనానికి క్యూలైన్ల ఏర్పాటు వివరాలు వెల్లడించారు. పోలీస్ యంత్రాంగం తీసుకునే నిర్ణయాలకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి, మత్తు పదార్థాల నివారణపై కళాజాతా బృందాలతో అవగాహన కార్యక్రమాలను నిర్విహిస్తామని వివరించారు. అక్రమ మట్టి, పశువుల రవాణాను అడ్డుకుంటామని అన్నారు. జాతర సమయంలో పాత్రికేయులకు ఇబ్బందులు తలెత్తకుండా గుర్తింపుకార్డులు ఇవ్వడానికి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అనంతరం పోలీస్ అధికారులతో ఎస్పీ సమావేశం నిర్వహించారు.మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు కోసం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో పకడ్బందిగా ఏర్పాట్లు చేయాలన్నారు. మేడారంలో సాగుతున్న పనులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, డీఎస్పీ రవీందర్‌లు పాల్గొన్నారు. అనంతరం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిన రెయిన్కోట్లు, టీషర్ట్లను ఎస్పీ పంపిణీ చేశారు. ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన టీఎన్జీవోస్ నాయకులు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సుధీర్ రాంనాథ్ కేకన్‌ను టీఎస్‌జీవోస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో సంఘం జిల్లా అధ్యక్షుడు పోలురాజు ఆధ్వర్యంలో ఎస్పీని శాలువాలతో సన్మానించి మొక్కను అందించారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి ప్రామాణికం
ములుగు రూరల్: భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి ప్రామాణికమని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. ఈ మేరకు బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ పౌరుడికి సమాన హక్కులు కల్పించడమే రా జ్యాంగ లక్ష్యమన్నారు. అంబేడ్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి అందరికి మార్గదర్శిగా మారాడని తెలిపారు. ఆయన చూపిన మార్గంలో యువత ముందుకు సాగాలన్నారు. నవంబర్ 26న రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో ఆ నందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు. ప్రజల రక్షణ పోలీసుల బాధ్యత గోవిందరావుపేట: ప్రజల హక్కుల రక్షణ పోలీసుల బాధ్యతని టీజీఎస్పీ 5వ బెటాలియన్ కమాండెంట్ కె.సుబ్రహ్మణ్యం అన్నారు. మండల పరిధిలోని చల్వాయి టీజీఎస్పీ 5వ బెటాలియన్‌లో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ సుబ్రహ్మణ్యం హాజరై డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. ప్రజలకు రక్షణ కల్పించడం పోలీసుల ప్రాథమిక బాధ్యత అన్నారు. పోలీసులది కేవలం ఉద్యోగం మాత్రమే కాదని రాజ్యాంగం తమ మీద పెట్టిన పవిత్ర కర్తవ్యమన్నారు. అనంతరం సిబ్బందితో న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం వంటి తదితర అంశాలను కాపాడేందుకు సంసిద్ధులుగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్ సీతారామ్, అసిస్టెంట్ కమాండెంట్ అనిల్ కుమార్, శ్రీనివాసరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్టీఓ
ములుగు రూరల్: జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సుధీర్ రాంనాథ్ కేకన్‌ను జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయంలో పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయంలో శ్రీసుబ్రహ్మణ్యషష్ఠి సందర్భంగా శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో విశేష అభిషేక పూజలను ఉపప్రధాన అర్చకులు పనకంటి ఫణీంద్రశర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామికి పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులు తీర్ధప్రసాదం వితరణ చేశారు.ఈకార్యక్రమంలో ఈఓ మహేష్, జిల్లా గ్రంథాలసంస్ధ చైర్మన్ కోట రాజబాబు, పీఏసీఎస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, భక్తులు పాల్గొన్నారు. కాటారం: జాతీయ మొక్కల ఆరోగ్య నిర్వహణ సంస్థ(ఎన్ఐపీహెచ్ఎం) ఆధ్వర్యంలో భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, జాతీయ తేనెటీగల బోర్డు సారథ్యంలో కాటారం వ్యవసాయ మార్కెట్లో వారం రోజులపాటు నిర్వహించిన తేనెటీగల పెంపకం ఉచిత శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన 25 మంది రైతులకు తేనెతీగల పెంపకంపై అవగాహన కల్పించారు. శ్రీ నేచురల్ హనీ వ్యవస్థాపకురాలు తాళ్లపెల్లి సంజన–రఘుతోపాటు వివిధ ప్రైవేట్ సంస్థల నిపుణులు శిక్షణలో రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. తేనెటీగల వర్గీకరణ, తేనెటీగ పెట్టె, ఉపకరణాల గుర్తింపు, కాలనీ నిర్వహణ, కాలానుగుణంగా నిర్వహణ, తేనె సంగ్రహణ, వ్యాధి, తెగుళ్ల నిర్వహణ వంటి అంశాలపై సైద్ధాంతిక, ఆచరణాత్మక శిక్షణ అందించారు. రైతులు తేనెటీగల పెంపకంతో అదనపు ఆదాయం పొందవచ్చని పలువురు సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్ పర్సన్ పంతకాని తిరుమల, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, ఆత్మకూరి కుమార్‌యాదవ్, పంతకాని మల్లికార్జున్, బొమ్మన భాస్కర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
జిల్లాలో మొదటి విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లాలో వాజేడు, వెంకటాపురం(కె) మండలాలను రెండు సమస్యాత్మక మండలాలుగా గుర్తించాం. ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలి. నేటి నుంచి మొదటి విడత నామినేషన్లు స్వీకరిస్తాం. వచ్చే నెల 11న 48 సర్పంచ్‌లకు, 420 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నిక నిర్వహిస్తాం. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు, ప్రజలకు ఏమైనా సందేహాలు ఉంటే జిల్లా కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లో సంప్రదించాలి. –కలెక్టర్ టీఎస్.దివాకర -
నేటి నుంచి.. నామినేషన్ల స్వీకరణ
ములుగు రూరల్: జిల్లాల్లో మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు నేటి(గురువారం) నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. జిల్లాలోని గోవిందరావుపేట, ఎస్ఎస్ తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లో మొదటి విడత ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నామినేషన్ల స్వీకరణకు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించారు. నామినేషన్లు దాఖలు చేసే జీపీల వివరాలు.. ప్రతీ మండలంలో సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గోవిందరావుపేట మండలంలో లక్నవరం జీపీ కార్యాలయంలో లక్నవరం, రాంనగర్, కోటగడ్డ గ్రామాలకు చెందిన వారు నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. కర్లపల్లి జీపీ కార్యాలయంలో కర్లపల్లి, బాలాజీనగర్, లక్ష్మీపురం గ్రామస్తులు నామినేషన్ల పత్రాలు సమర్పించాలి. చల్వాయి జీపీ కార్యాలయంలో చల్వాయి, సోమళ్లగడ్డ, మచ్చాపూర్, బుస్సాపూర్, గోవిందరావుపేట జీపీలో గోవిందరావుపేట, రాఘవపట్నం, పస్రా జీపీ కార్యాలయంలో పస్రా, గాంధీనగర్, మొల్లగూడెం, ముత్తపూర్, పాపయ్యపల్లి గామాలకు చెందిన వారు నామినేషన్ల పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలంలోని మండల పరిషత్ కార్యాలయం రూం నంబర్ 1 లో బీరెల్లి, రంగాపూర్, వెంగళపూర్, నార్లాపూర్ గ్రామాలకు చెందిన వారు నామినేషన్ పత్రాలు అందజేయాలి. రూం నంబర్ 2 లో లింగాల, బంధాల, ఊరట్టం, మేడారానికి చెందిన వారు తమ నామినేషన్ పత్రాలు ఇవ్వాలి. తహసీల్దార్ కార్యాలయంలో దామెరవాయి, గంగారం, కాటాపూర్‌కు చెందిన వారు, పంచాయతీ కార్యాలయంలో ఎస్ఎస్ తాడ్వాయి, అంకంపల్లి, పంబాపూర్, కాల్వపల్లి, బయ్యక్కపేట, మండల సమాఖ్య భవనంలో కామారం, నర్సాపూర్‌కు చెందిన సర్పంచ్, వార్డు స్థానాలకు బరిలో నిలిచే అభ్యర్థులు నామినేషన్ పత్రాలు అందజేయాలి. ఏటూరునాగారం జీపీలో ఏటూరునాగారానికి చెందిన వారు మాత్రమే నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. రామన్నగూడెం పంచాయతీ కార్యాలయంలో రామన్నగూడెం, కోయగూడెంకు చెందిన వారు మాత్రమే.. రోహిర్ పంచాయతీలో రోహిర్, చెల్పాక, ఆకులవారిగణపురంకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు ఇవ్వాలి. శంకర్రాజ్పల్లి జీపీలో శంకర్రాజ్పల్లి, ముల్లకట్టకు చెందిన వారు.. చిన్నబోయినపల్లి పంచాయతీలో చిన్నబోయినపల్లి, శివాపురం, శాపెల్లి, కొండాయి అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేయాలి. విధుల్లో 15 మంది ఆర్వోలు, 15 మంది ఏఆర్వోలు మూడు మండలాల్లో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులుమండలం సర్పంచ్ వార్డు ఆర్వోలు ఏఆర్వోలు స్థానాలు స్థానాలుగోవిందరావుపేట 18 154 5 5 ఎస్‌ఎస్‌తాడ్వాయి 18 152 5 5 ఏటూరునాగారం 12 114 5 5 -
కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ ప్రకటన
హన్మకొండ/గీసుకొండ: దీక్షా దివస్ స్ఫూర్తితో ప్రభుత్వంపై వరంగల్ నుంచి ప్రతిఘటన మొదలవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ దీక్షతో తెలంగాణ ప్రకటన వచ్చిందని స్పష్టం చేశారు. వరంగల్, హనుమకొండ జిల్లాల పర్యటనకు వచ్చిన కేటీఆర్‌కు బుధవారం పలువురు నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. వరంగల్ జిల్లా సంగెం మండలంలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు చేరుకుని కై టెక్స్ కంపెనీతో పాటు పార్కును సందర్శించారు. అక్కడి నుంచి హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. రాజ్యాంగ దివస్‌లో భాగంగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. మడికొండరెడ్డి కన్వెన్షన్‌లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బీరవెల్లి భరత్ కుమార్‌రెడ్డి కుమార్తె భార్గవిరెడ్డి, ఉదయ్‌రెడ్డి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తెలంగాణ సమాజాన్ని కదిలించిన రోజు నవంబర్ 29 అని, దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని కోరారు. 42 శాతం రిజర్వేషన్ల కోసం రేవంత్ సర్కారు రూ.160 కోట్లు ఖర్చుపెట్టిందని, బిహార్‌లో రాహుల్ గాంధీ డబ్బా కొట్టినా ఫలితం లేదని తూర్పారబట్టారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన 24 శాతాన్ని 17 శాతానికి తగ్గించి బీసీలకు రేవంత్ ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. తడిగుడ్డతో గొంతు కోసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీసీలకు క్షమాపణ చెప్పాలి.. కామారెడ్డి డిక్లరేషన్‌తో బీసీలతో ఓట్లు వేయించుకుని సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారని కేటీఆర్ ఆరోపించారు. రిజర్వేషన్లు పెంచకుండానే పంచాయతీ ఎన్నికలకు వెళ్తున్నారని విమర్శించారు. చెంపలేసుకుని సీఎం బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓడిపోయామనే బాధ లేదు.. అప్పుడప్పుడు ఇలా జరిగితేనే మంచిదని రాష్ట్రంలో అధికారం కోల్పోవడంపై కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓడిపోయామనే బాధ అవసరం లేదని, ప్రభుత్వం పోయిందని నిరుత్సాహపడాల్సింది లేదని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కేసీఆర్ సీఎం కావాలని బలంగా కోరుకుంటున్నారన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, దాస్యం వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, శంకర్‌నాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి, తాటికొండ రాజయ్య, మాజీ మంత్రులు డీఎస్ రెడ్యానాయక్, సత్యవతిరాథోడ్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం,నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, సాంబారి సమ్మారావు, ఎల్లావుల లలితాయాదవ్, రాకేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు.దీక్షా దివస్ స్ఫూర్తితో వరంగల్ నుంచి ప్రతిఘటన ఓట్లు వేయించుకుని బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటనకాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు (కేఎంటీపీ) పూర్తయితే సుమారు 30 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ అన్నారు. గతంలో ఆజంజాహి మిల్లు మూతబడి వైభవాన్ని కోల్పోయిన వరంగల్‌కు కేఎంటీపీ మళ్లీ పూర్వ వైభవం తెచ్చిందన్నారు. నేత కార్మికులు వలసలు వెళ్లకుండా ఉండేందుకు 2017 అక్టోబర్ 22న పార్కు పనులకు అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం గణేశా, యంగ్వన్, కై టెక్స్ కంపెనీల్లో ఉత్పత్తి జరుగుతోందని పేర్కొన్నారు. కేఎంటీపీని కేంద్రం పీఎం మిత్ర కింద ఎంపిక చేసిందన్నారు. -
పంచాయతీ ఎన్నికలకు సహకరించాలి
ములుగు రూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కలెక్టర్ దివాకర అన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికల నిర్వహణ కొనసాగుతుందన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని నిబంధనల మేరకు నడుచుకోవాలని సూచించారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. అలాగే ఎన్నికల బరిలో నిలబడిన అభ్యర్థుల ప్రచారం కోసం ప్రచురించే పోస్టర్లు, ఇతర మెటీరియల్ నిబంధనలకు లోబడి ముద్రణ చేపట్టాలని ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులు ఆదేశాలు జారీ చేశారు. జీపీ ఎన్నికల్లో చట్టాలకు లోబడి ప్రింటింగ్, ప్రచురణ కర్తల పేర్లు, చిరునామాను ముద్రించాలని సూచించారు. ముద్రణ పత్రాలపై ప్రిటింగ్ ప్రెస్ చిరునామా తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. డిక్లరేషన్ పత్రాలను కలెక్టర్, ఎన్నికల స్థాయి అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ఎన్నికల కోడ్ పై వీడియో కాన్ఫరెన్స్.. పంచాయతీ ఎన్నికల కోడ్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని అన్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్ సంపత్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ సజావుగా జారీ చేయాలని ఆదేశించారు. డిసెంబర్ 11న మొదటి, 14న రెండో విడత, 17న మూడో విడత ఎన్నికల పోలింగ్ జరుగనున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ దివాకర అధికారులతో టెలీ కాన్పరెన్స్ నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల నియమ నిబంధనలు పాటిస్తూ పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వివరాలను గ్రామ పంచాయతీ కార్యాలయాలతో పాటు ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, ఇన్చార్జ్ జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు
హన్మకొండ: తమిళనాడులోని అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నడుపనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను తెలిపారు. డిసెంబర్ 4న అరుణాచలం గిరిప్రదక్షిణకు వెళ్లాలనుకునే భక్తులకు ఆర్టీసీ ఈ అవకాశాన్ని కల్పిస్తుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరంగల్–1 డిపోకు సంబంధించిన సూపర్ లగ్జరీ బస్సు హనుమకొండ నుంచి డిసెంబర్ 2న మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి 3న ఉదయం 6 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని కాణిపాకం చేరుకుంటుందని తెలిపారు. ఇక్కడ విఘ్నేశ్వరుడి దర్శనం చేసుకున్న తర్వాత బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు వెల్లూరులోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధికి చేరుకుంటుందని, ఇక్కడ అమ్మవారి దర్శనం అనంతరం బయలుదేరి రాత్రి 7 గంటలకు అరుణాచలం చేరుకుంటుందని తెలిపారు. తిరుగు ప్రయాణం డిసెంబర్ 4న మధ్యాహ్నం బయలుదేరి 5న ఉదయం జోగుళాంబ అమ్మవారి శక్తి పీఠం సన్నిధికి చేరుకుంటుందన్నారు. ఇక్కడ దర్శనానంతరం బీచుపల్లి హనుమాన్ ఆలయం సన్నిధికి చేరుకుంటుందని, ఇక్కడ దర్శనానంతరం బయలుదేరి హనుమకొండకు చేరుకుంటుందని తెలిపారు. చార్జీలు పెద్దలకు ఒక్కొక్కరికి రూ.5 వేలు, పిల్లలకు రూ.3,500గా నిర్ణయించినట్లు వివరించారు. ఆర్టీసీ వెబ్సైట్లో కాని నేరుగా ఆర్టీసీ రిజర్వేషన్ల కౌంటర్లో రిజర్వేషన్ చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి సమాచారం కోసం 8074562195, 9885779970, 9866373825, 9959226047 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
‘లేబర్ కోడ్లను రద్దు చేయాలి’
ములుగు రూరల్: కార్మికులను శ్రమదోపిడీకి గురిచేసే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కమిటీ నాయకుడు ఎండీ అమ్జద్‌పాషా డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ దివాకరకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని ఆరోపించారు. రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు గిట్టుబాటు ధర చట్టం, వ్యవసాయ కార్మికులకు సమగ్ర రుణమాఫీ పథకాన్ని అమలు చేయడం, మైక్రో ఫైనాన్స్ దోపిడీని అరికట్టాలన్నారు. విద్యుత్ సవరణ చట్టం రద్దు చేయాలని కోరారు. స్మార్ట్ మీటర్లను బిగించకూడదని కోరారు. 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. పంటల తేమశాతాన్ని 12 నుంచి 20శాతం వరకు పెంచాలన్నారు. పంటల దిగుమతిని వ్యతిరేకించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు చంద్రయ్య, కొమురయ్య, నాగిరెడ్డి, విద్యాసాగర్‌రెడ్డి, వేణు, వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. -
హేమాచలక్షేత్రంలో భక్తుల కోలాహలం
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మంగళవారం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో సహజసిద్ధంగా వెలిసిన పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకున్నారు. పూజారులు శేఖర్శర్మ, రాజీవ్ నాగఫణి శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల పేరిట గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి ప్రత్యేకతలు, చరిత్రను వివరించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. -
ఇసుక లారీలతో ట్రాఫిక్ జామ్
అబ్బాయిగూడెం వద్ద రోడ్డుకు ఇరువైపులా నిలిపి ఉన్న ఇసుక లారీలువెంకటాపురం(కె): ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా అడ్డదిడ్డంగా రోడ్డుకు ఇరువైపులా ఇసుక లారీలు నిలిపివేయడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. మండల పరిధిలోని ఆలుబాక నుంచి అబ్బాయిగూడెం వరకు ఇసుక లారీలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం నుంచి ఇసుక లారీలు అధిక సంఖ్యలో రోడ్డుకు ఇరువైపులా నిలిపివేయడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు, ద్విచక్రవాహనదారులు వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఇసుక లారీలను రోడ్డుపై నిలపకుండా పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి నిలపాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు. -
మహిళా సంఘాలకు ఆర్థిక భరోసా
ములుగు రూరల్: మహిళా సంఘాలకు ప్రభుత్వం రుణాలు అందించి ఆర్థిక భరోసా కల్పిస్తుందని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా సంఘాలకు అందిస్తున్న రుణా లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ములుగు నియోజకవర్గానికి చెందిన 9 మండలాల స్వయం సహాయక సంఘాలకు రూ. 2.26కోట్ల చెక్కును అందించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు సగటు మహిళ ఆత్మగౌరవంగా నిలుస్తున్నాయన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఒక్కో గ్రూపునకు రూ.20 లక్షల రుణాన్ని అందించి వ్యాపారస్తులుగా తీర్చిదిద్దుతుందన్నారు. మహిళా సంఘాలకు 2025–26 ఖరీఫ్ సీజన్లో 60ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయించినట్లు తెలిపారు. వాటి ద్వారా 21,364 మెట్రిక్‌టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు ముంజారు కాగా 2,900 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాల య సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, అదనపు కలెక్టర్ సంపత్‌రావు, డీఆర్డీఓ శ్రీనివాస్‌రావు, ఎల్డీఎం జయప్రకాశ్, ఏపీడీ శ్రీనివాస్, జిల్లా, మండల స మాఖ్య, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. యువతకు ఉద్యోగావకాశాలు టాస్క్ ఆధ్వర్యంలో టెలీ పర్ఫార్మెన్స్ కంపెనీలో ఉద్యోగావకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దివాకర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగావకాశాలకు 2024–25 సంవత్సరంలో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన యువకులు అర్హులని పేర్కొన్నారు. కంపెనీ వందమంది యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించనుందని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఫోన్ నంబర్ 9618449360 ద్వారా లేదా క్యూఆర్‌కోడ్ స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు డిసెంబర్ 1న ములుగు రీజినల్ సెంటర్ నుందు సెలక్షన్ నిర్వహించబడుతుందని వివరించారు. ఎంపికై న అభ్యర్థులకు తొమ్మిది రోజుల పాటు శిక్షణ ఉంటుందని వెల్లడించారు. నెల వేతనం రూ.20 వేలు అందిస్తారని వివరించారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని యువకులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దివాకర సూచించారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన ఎస్పీ
ములుగు రూరల్: ఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సుధీర్ రాంనాథ్ కేకన్ కలెక్టర్ టీఎస్.దివాకరను మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరకు కలెక్టర్‌కు ఎస్పీ మొక్కను అందించారు. అనంతరం జనవరి 28నుంచి 31 వరకు జరిగే మేడారం మహాజాతరపై చర్చించారు. కన్నాయిగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో రిజర్వేషన్లపై భీముని నరేశ్ చేస్తున్న ఆరోపణలు సరికాదని తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడెం బాబు అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం తుడుందెబ్బ మండల అధ్యక్షుడు గెండ్ల పాపారావు ఆధ్వర్యంలో నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మంత్రి సీతక్కపై నరేశ్ చేస్తున్న ఆరోపణలు మానుకోవాలన్నారు. రాజ్యాంగం ప్రకారం 5వ షెడ్యూల్డ్ ప్రాంతంలోని గిరిజనులకు వందశాతం గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వాలనే నిబంధన ఉందని గుర్తుచేశారు. నరేశ్‌కు అవగాహన లేక మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పీరీల శ్రీనివాస్, ఆలం సంతోష్, మురళి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన భూపాలపల్లి అర్బన్: కేంద్రం ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఏరియాలోని సింగరేణి గనుల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య మాట్లాడుతూ.. కేంద్ర న్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లు మార్చి కార్మికులను కార్పొరేట్లకు కట్టు బానిసలుగా మార్చిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జనార్దన్, నర్సయ్య, ప్రసాద్‌రెడ్డి, శంకర్, శ్రీనివాస్, పవన్, మల్లేష్, సాజిత్ పాల్గొన్నారు. రిజర్వాయర్ పనుల అడ్డగింత కాటారం: చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా కాటారం మండల కేంద్రంలోని గారెపల్లి రిజర్వాయర్ వద్ద కొనసాగుతున్న పనులను మంగళవారం నిర్వాసిత రైతులు అడ్డుకున్నారు. పరిహారం తేల్చకుండా పనులు చేపట్టవద్దని జేసీబీ ఎదుట కూర్చొని పనులను నిలిపేశారు. తాము భూములు కోల్పోయి ఏళ్లు గడుస్తున్నప్పటికీ పరిహారం అందించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. భూములు కోల్పోయి, పరిహారం అందక తాము రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ రైతులు వినలేదు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఆందోళనలో రైతులు విష్ణు, రాజయ్య, ఆశయ్య, మల్లక్క, వెంకటమ్మ ఉన్నారు. ‘ఆర్టిజన్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి’గణపురం: విద్యుత్ రంగ సంస్థలలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను వెంటనే రెగ్యులరైజేషన్ చేయాలని విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) చైర్మన్ సుంకు సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం గణపురం మండలం చెల్పూరు కేటీపీపీ ప్రధాన గేట్ ఎదుట గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ 23 వేల మంది కార్మికులను రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఏపీ ఎస్సీబీ రూల్స్(కన్వర్షన్) ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో డిసెంబర్ మొదటివారంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. సమ్మెకు సైతం సిద్ధంగా ఉన్నామని తెలిపారు. -
క్రీడలతోనే మానసికోల్లాసం
ఏటూరునాగారం: క్రీడాకారులకు క్రీడలతోనే మానసికోల్లాసం కలుగుతుందని క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ క్రీడామైదానంలో క్రికెట్ క్రీడాకారుల ఎంపికను భాస్కర్‌రెడ్డి మంగళవారం ప్రారంభించి వారిని పరిచయం చేసుకుని మాట్లాడారు. జిల్లాలోని పది మండలాల నుంచి చురుకై న క్రీడాకారులను ఎంపిక చేసి జిల్లా టీంగా తయారు చేయనున్నట్లు తెలిపారు. ఈ టీంను హైదరాబాద్‌లో నిర్వహించబోయే జిల్లాల టోర్నీకి పంపించనున్నట్లు వెల్లడించారు. క్రీడాకారులు క్రీడలపై మక్కువ పెంచుకొని చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ తక్కలపల్లి దేవేందర్, బీజేపీ మండల అధ్యక్షుడు వినుకోలు చక్రవర్తి, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు గండెపల్లి సత్యం, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు వావిలాల జనార్దన్, మండల అధ్యక్షుడు దుర్గం దుర్గారావు, కోచ్ లకావత్ రాణాప్రతాప్, క్రీడాకారులు పాల్గొన్నారు.క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి -
మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉందని గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. మండల పరిధిలోని ఇంచర్లలో ఇందిరా మహిళా శక్తి చీరలను మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణితో కలిసి ఆయన మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవిచందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ చిక్కుల రాములు, మాజీ చైర్మన్ సమ్మిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ముసినపల్లి కుమార్‌గౌడ్, శానబోయిన అశోక్, తిరుపతి, రాజమొగిలి, రాజు తదితరులు పాల్గొన్నారు.గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ -
కొండాయి బ్రిడ్జి పనులు షురూ..
కొండాయి బ్రిడ్జి పనులు నాణ్యతగా చేపట్టాలి. గతంలో నిర్మించిన బ్రిడ్జి వరదలకు కొట్టుకుపోయింది. మళ్లీ అలా జరగకుండా తగు చర్యలు తీసుకోవాలి. అందుకు అధికారులు, పాలకులు నాణ్యతగా పనులు చేపట్టి ప్రజలకు పది కాలల పాటు బ్రిడ్జి ఉపయోగపడేలా చూడాలి. – దబ్బగట్ల కిశోర్, కొండాయి, ఏటూరునాగారం బ్రిడ్జి పనులు సకాలంలో పూర్తి చేయాలి. ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. పనుల్లో జాప్యం లేకుండా చూడాలి. గిరిజనులకు ఎంతో అవసరమైన బ్రిడ్జిని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి. బ్రిడ్జి నిర్మాణం సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలి. – బొచ్చు ప్రకాశ్, కొండాయి, ఏటూరునాగారం ఏటూరునాగారం: ఎట్టకేలకు కొండాయి బ్రిడ్జి పనులు మొదలయ్యాయి. మూడేళ్ల నుంచి పెండింగ్ పడుతూ వస్తున్న పనులు వడివడిగా అడుగులు పడ్డాయి. నూతన సాంకేతిక విధానాన్ని అమలు చేస్తూ వరద ఎంత ఉధృతి ఉన్నా తట్టుకునే విధంగా నూతన బ్రిడ్జి నిర్మాణం డిజైన్వేశారు. జిల్లాలోని ఏటూరునాగారం మండలం కొండాయి–దొడ్ల గ్రామాల మధ్యలో ఉన్న జంపన్నవాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి సీతక్క కృషితో రోడ్డు భవనాల శాఖ ద్వారా రూ.16 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ పనులను శ్రీ వేంకటేశ్వర కన్స్ట్రక్షన్ దక్కించుకొని పనులు మొదలు పెట్టింది. ఈ పనులను 2026 నవంబర్ వరకు పూర్తి అయ్యేలా కావాల్సిన చర్యలు తీసుకున్నట్లు ఆర్‌అండ్‌బీశాఖ అధికారులు తెలిపారు. 24 గడ్డర్లతో నిర్మాణం బ్రిడ్జి పొడువు 180 మీటర్లు, 7 పిల్లర్లు, 24 గడ్డర్ల(బీమ్)తో బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. 24 గడర్స్ నిర్మాణంలో భాగంగా ఇప్పటి వరకు 9 నిర్మాణం పూర్తికాగా మిగతా వాటి నిర్మాణానికి చురుకుగా కార్మికులు పనులు చేపడుతున్నారు. జంపన్నవాగులో ఆరు పిల్లర్లను భూమి లోపటికి 27 మీటర్ల లోతులో ప్రత్యేక టెక్నాలజీతో కాంక్రీట్ పిల్లర్లను రెండు నిర్మించారు. మరో ఐదు పిల్లర్లను నిర్మించాల్సి ఉంది. నిర్మించిన ఆరు పిల్లర్లపై 8 మీటర్ల ఎత్తులో పిల్లర్ నిర్మాణం చేపట్టి దానిపై గడర్స్ అమర్చిన తర్వాత బ్రిడ్జిపై 8.5 మీటర్ల కాంక్రీట్ స్లాబ్ నిర్మిస్తారు. ఒక్కో పిల్లర్‌కు మధ్య 22.2 మీటర్ల పొడువు ఉంటుంది. ఈ పిల్లర్ల నిర్మాణం వల్ల ఎక్కడ ఎలాంటి పిల్లర్లు కుంగిన స్లాబ్ చెక్కుచెదరకుండా ఉండేలా డిజైన్ చేశారు. అంతేకాకుండా సుమారు వందేళ్ల వరద నీటి ప్రవాహాన్ని అంచనా వేసి దీనిని నిర్మించారు. 2016లో నిర్మించిన ముళ్లకట్ట బ్రిడ్జి పిల్లర్లు 44 మీటర్ల లోతులో దింపగా కొండాయి బ్రిడ్జి వాగుకు 27 మీటర్ల లోతులోకి దింపడం గమనార్హం. సులభతరం కానున్న రవాణా కొండాయి వద్ద బ్రిడ్జి 2023 వరదలకు కొట్టుకుపోయి 8 మంది జలసమాది అయిన విషయం తెలిసిందే. దీంతో రవాణా కష్టాలు మూడేళ్లుగా లోతట్టు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందిపడుతూ జీవిస్తున్నారు. ఈ బ్రిడ్జి పనులు పూర్తి అయితే కొండాయి, మల్యాల, గోవిందరాజుల కాలనీ, ఐలాపురం, కొత్తూరు గ్రామాల గిరిజనులు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. ఇవేకాకుండా 2028లో వచ్చే మేడారం జాతరకు ఈ బ్రిడ్జి పూర్తి స్థాయిలో మేడారం భక్తులకు అందుబాటులోకి వస్తుంది. ఇవేకాకుండా వైద్యం, విద్య, వ్యవసాయం, నిత్యావసర వస్తువుల మార్గం సులభతరం కానుంది. రెండు పిల్లర్లకు కాంక్రీట్ ఫిల్లింగ్ ఏడాది వరకు పనులు పూర్తయ్యేలా చర్యలు -
హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి
● సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ములుగు రూరల్: హమాలీ కార్మికుల వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో సోమవారం ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలైన ఐకేపీ, పీఏసీఎస్, జీసీసీ తదితర హమాలీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం హమాలీల వెల్ఫేర్ బోర్డు తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు ప్రమాదవశాత్తు బస్తాలు మీద పడి గాయాలపాలై, చనిపోయినా ఎలాంటి రక్షణ లేనందున ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. కార్మికులకు యూనిఫామ్, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘు, చిన్ని, స్వామి, శ్రీధర్, లక్ష్మణ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన దర్బార్‌లో వచ్చిన వినతులు..
ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన గిరిజనుడు ఐటీడీఏలో సర్వేయర్‌గా, మరో వ్యక్తి నైట్‌వాచ్ మెన్‌గా నియమించాలని ఏపీఓను కోరారు. ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో పట్టాదారు పాసుపుస్తకాలు ఇప్పించాలని గిరిజనులు కోరారు. వెంకటాపురం(కె) గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సీఆర్టీ ఉద్యోగం ఇప్పించాలని కోరారు. కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామానికి చెందిన గిరిజనులు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారు పాసుపుస్తకం బదలాయించాలని కోరారు. గోవిందరావుపేట మండలం చల్వాయిలో బాలుర హాస్టల్లో వర్కర్‌గా నియమించాలని గిరిజనుడు కోరారు. మహాముత్తారం మండలం బర్లగూడెం గ్రామానికి చెందిన గిరిజనులు పోడు భూమి కి పట్టాలు ఇప్పించాలని కోరారు. వాజేడు మండలానికి చెందిన గిరిజనులు నీరు, విద్యుత్, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఏపీఓను కోరారు. మంగపేట మండలం మల్లూరు గ్రామానికి చెందిన భూమిని సర్వే చేయించి పట్టా ఇవ్వాలని ఓ గిరిజనుడు వేడుకున్నాడు. ఏటూరునాగారం ఆకులవారిఘణపురంలో తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పించాలని కోరారు. అదే విధంగా ఇంటర్నెట్ సెంటర్ పెట్టుకునేందుకు ఐటీడీఏ కాంప్లెక్స్‌లో గది ఇప్పించాలని ఓ గిరిజనుడు కోరారు. ఈ గిరిజనదర్బార్‌లో డీడీ జనార్దన్, ఏఓ రాజ్‌కుమార్, ఎస్ఓ సురేశ్‌బాబు, డీటీ అనిల్, హెల్త్ ప్రోగ్రాం మేనేజర్ మహేందర్, పెసా కో ఆర్డినేటర్ ప్రభాకర్, ఆలెం కిశోర్, జగన్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి టెన్నికాయిట్ పోటీలకు ఎంపిక
ములుగు/ములుగు రూరల్: జాతీయ స్థాయి టెన్నికాయిట్ పోటీలకు సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల మల్లంపల్లి విద్యార్థులు ఎంపికై నట్లు పాఠశాల పీడీ శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు సోమవారం విద్యార్థులు శమంత్, ఆకాష్‌లు రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికయ్యారని తెలిపారు. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు జమ్మూకశ్మీర్‌లో జరిగే పోటీలలో పాల్గొంటారని వివరించారు. ఈ మేరకు జాతీయ స్థాయికి ఎంపికై న విద్యార్థులను సోమవారం పాఠశాల ప్రిన్సిపాల్ అంకయ్య, వైస్ ప్రిన్సిపాల్ ప్రసన్న, ఉపాధ్యాయులు రహీంపాషా, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, శోభన్, పూర్ణచందర్, హేమాద్రి, తిరుపతి, శేఖర్, టెన్నికాయిట్ అసోసియేషన్ బాధ్యులు విద్యార్థులను అభినందించారు. రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు.. ఈ నెల 28 నుంచి సంగారెడ్డిలోని డీవైఎస్ఓ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు ములుగు సన్ రైజర్ హైస్కూల్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు ఎంపికై నట్లు పాఠశాల కరస్పాండెంట్ పెట్టెం రాజు తెలిపారు. జిల్లాస్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థులు కార్తీక్, వెంకటేశ్, ప్రేమ్‌సాయి, దర్శిని, హర్షిత, రవళిని ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ జనార్దన్, పీఈటీలు శ్రీకాంత్, శివ, మహిపాల్ పాల్గొన్నారు. -
పథకాలపై అవగాహన కల్పించాలి
ములుగు రూరల్: కార్మిక సంక్షేమ పథకాలపై కార్మికులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ దివాకర అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో కార్మిక సంక్షేమ పథకాల అవగాహన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 28న సహాయ కార్మిక శాఖ అధికారి వినోద, ఆర్డీఓ వెంకటేశ్‌ల ఆధ్వర్యంలో కార్మిక సంఘాల సభ్యులకు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రకాల పథకాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. కార్మికుల నూతన కార్డు అప్లై చేసుకునే విధానం, బెన్ఫిట్స్ పొందే విధానంపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
నేడు క్రికెట్ క్రీడాకారుల ఎంపిక
ఏటూరునాగారం: నేడు క్రికెట్ క్రీడాకారుల ఎంపిక నిర్వహించనున్నట్లు జిల్లా క్రికెట్ అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కోడి వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపిక ప్రక్రియ జెడ్పీహెచ్ఎస్ క్రీడా మైదానంలో నిర్వహించనున్నట్లు వివరించారు. జిల్లాలోని పది మండలాల నుంచి ఒక జిల్లా టీంను తయారు చేసి క్రికెట్ షెడ్యూల్ వచ్చిన తర్వాత స్టేట్మీట్ను ఆడిస్తామని తెలిపారు. ప్రతీ క్రీడాకారుడు నేడు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. క్రీడాకారులు వైట్ డ్రెస్, ఆధార్‌కార్డు, టెన్త్ మెమో వెంట తీసుకొని రావాలని సూచించారు. అండర్ 19, ఓపెన్ టు ఆల్ 30 వయస్సులోపు విద్యార్థులు, క్రీడాకారులు హాజరు కావాలని కోరారు. ఏటూరునాగారం: సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల నియామక సమయంలో అర్హత ప్రమాణాలన్ని పూర్తి చేసి ఉద్యోగంలో చేరిన వారిని మళ్లీ అర్హత నిరూపించుకోమనటం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని పేర్కొన్నారు. టెట్ పరీక్ష ఉద్దేశం కొత్తగా ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించబోయే వారికి అర్హతను నిర్దేశించి మాత్రమేనని వివరించారు. తక్షణమే ప్రభుత్వం విద్యాహక్కుల చట్టాన్ని సవరించి టెట్ పరీక్ష నుంచి ఉపాధ్యాయులను మినహాయించాలని కోరారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్‌పోస్టు కాళేశ్వరం: మహారాష్ట్ర మీదుగా ధాన్యం అక్రమ రవాణాకు చెక్‌పెట్టేందుకు ఖరీఫ్ సీజన్లో చెక్‌పోస్టును ఏర్పాటు చేసినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి (డీసీఎస్ఓ) కిరణ్‌కుమార్ అన్నారు. సోమవారం మహాదేవపూర్ మండలం కాళేశ్వరం సమీపంలోని కన్నెపల్లి వద్ద అంతర్రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్ర నుంచి ధాన్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారి బృందాలు రెండు షిఫ్టులుగా 24/7 విధుల్లో ఉంటూ ఈ తనిఖీ కేంద్రం ద్వారా పర్యవేక్షణ చేపట్టనున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహదేవపూర్ రామారావు, మండల వ్యవసాయ అధికారి సుప్రజ్యోతి, సివిల్ సప్లై విభాగం డీఎం రాములు, కాళేశ్వరం ఎస్సై జి.తమాషారెడ్డి, ఆర్ఐ సురేందర్‌రెడ్డి, రఘు, జీపీఓ శ్యామ్ పాల్గొన్నారు. ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలి భూపాలపల్లి అర్బన్: మీసేవ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి, నూతన మీ సేవల ఏర్పాట్లను విరమించుకోవాలని తెలంగాణ మీసేవ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొత్త కిరణ్‌కుమార్ కోరారు. వాట్సప్ ద్వారా మీసేవ సర్వీసులను రద్దు చేయాలని, నూతన మీ సేవ కేంద్రాల ఏర్పాటును విరమించుకోవాలని కోరుతూ సోమవారం జిల్లా వ్యాప్తంగా మీ సేవల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం కిరణ్‌కుమార్ మాట్లాడుతూ.. పది సంవత్సరాల క్రితం నుంచి ఉన్న కమిషన్ విధానమే నేటికీ కొనసాగుతుందని కమిషన్ పెంచాలని కోరారు. కొద్దిపాటి కమిషన్‌తోనే మీ సేవలో నడిపిస్తున్నామని, పెరిగిన ఖర్చులతో ఇబ్బందికరంగా మారిందన్నారు. గతంలో తొలగించిన సర్వీసులు తిరిగి పునరుద్ధరించాలని, జీవనోపాధి భద్రత దృష్ట్యా భరోసా కల్పించే విధంగా ఉత్తర్వులు అందించాలని ఆయన కోరారు. -
వందేమాతరం వార్షికోత్సవ ర్యాలీ
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం హాజరై మాట్లాడారు. బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గేయాన్ని స్మరించుకుంటూ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నట్లు వెల్లడించారు. జాతీయ కార్యక్రమం వార్షికోత్సవాన్ని ఏడాది పాటు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నవంబర్‌లో ప్రధానమంత్రి మోదీ ఈ కార్యక్రమాన్ని న్యూఢిల్లీలో ప్రారంభించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు వినుకోలు చక్రవర్తి, జనార్దన్, లవన్, మహాలక్ష్మీ, స్వరూప, కృష్ణవేణి, సీతయ్య, సత్యం, రోహిత్, రవికిరణ్ పాల్గొన్నారు. -
ఐటీడీఏ భవనం తరలించొద్దని ధర్నా
ఏటూరునాగారం: ఐటీడీఏ భవనాన్ని తరలించొద్దని కోరుతూ సోమవారం ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఐటీడీఏ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కబ్బాక శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం నూతన ఐటీడీఏ భవనానికి నిధులు మంజూరు చేయటం అభినందనీయమన్నారు. ఆకులవారి ఘనపురంలో ఉన్న ఐటీడీఏ భవనం ఆదివాసీల అస్తిత్వానికి చిహ్నంగా ఉందన్నారు. దీన్ని తరలించడం వల్ల ఆదివాసీలు తమ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. చుట్టు పక్కల మండలాలకు సెంటర్ పాయింట్‌గా ఉన్న కొమురంభీమ్ స్టేడియాన్ని గ్రామస్తులు వ్యాయామం, స్కూల్ పిల్లలు ఆటలు ఆడుకునేందుకు ఎంతో అనుకూలంగా ఉందని తెలిపారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఏపీవో వసంతరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేశ్, సమ్మయ్య, అనసూయ, లక్ష్మయ్య, రామన్న, ఫణికుమార్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాలాభివృద్ధికి ప్రభుత్వం కృషి
ములుగు రూరల్/ఏటూరునాగారం/మంగపేట/కన్నాయిగూడెం: గ్రామాలాభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. ఈ మేరకు సోమవారం మండల పరిధిలోని జంగాలపల్లి నుంచి గాంధీనగర్ వరకు చేపట్టనున్న రోడ్డు పనులకు కలెక్టర్ దివాకరతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ రోడ్డు నిర్మాణ పనులకు రూ.20 కోట్లను కేటాయించామన్నారు. ఇంచర్లలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ, టూరిజం విలేజ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో జిల్లా వ్యాపార, ఉపాధి రంగాలలో మరింత అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. అనంతరం జగ్గన్నపేట గ్రామంలో మహిళలకు ఇందిరమ్మ చీరలను అందజేశారు. రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన నీటిశుద్ధి కేంద్రం, ఉచిత వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. అలాగే కోటక్ మహేంద్ర సహకారంతో 175మందికి ఉచిత శిక్షణ ధ్రువీకరణ పత్రాలు, కుట్టు మిషన్లు అందజేశారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 9 మందికి, మరో తొమ్మిది యూనిట్ల పాడి గేదెలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ఎస్పీ రాంనాథ్ కేకన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి తుల రవి, ఏపీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏటూరునాగారం మండల కేంద్రంలోని గిరిజన భవన్లో మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 152 సంఘాలకు రూ. 9.50 కోట్ల రుణాల చెక్కులను మంత్రి అందజేశారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను 17 మందికి, మహిళా సంఘాల సభ్యులకు చీరలను పంపిణీ చేసినట్లు మంత్రి సీతక్క వివరించారు. అలాగే ఎక్కెల, గంటలకుంట గ్రామాల్లోని 500మంది గిరిజనులకు రిలయబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో దుప్పట్లు, స్వెటర్లను మంత్రి పంపిణీ చేశారు. రిలయబుల్ ట్రస్ట్ వారు ఏజెన్సీలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. మంగపేట మండలంలోని 419 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.32.72కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులను అందజేశారు. అనంతరం 55మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. అలాగే వృద్ధాశ్రమం పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన పనులను భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావ్‌తో కలిసి ప్రారంభించారు. కన్నాయిగూడెంలోని రైతు వేదికలో రూ.6.47కోట్ల లింకేజీ రుణాల చెక్కులను మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు. అనంతరం పలువురు కాంగ్రెస్‌లో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క -
అందెశ్రీ సంస్మరణ సభ
ములుగు: జిల్లా కేంద్రంలో సోమవారం కళాకారుల సంఘం ఆధ్వర్యంలో అందెశ్రీ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అందెశ్రీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షుడు గోల్కొండ బుచ్చన్న మాట్లాడారు. పశువుల కాపరిగా మొదలైన అందెశ్రీ జీవితం లోక కవిగా ప్రపంచాన్ని చుట్టి వచ్చారని తెలిపారు. జానపద, పల్లె, ఉద్యమ గీతాలతో పాటు రాష్ట్ర గీతం అందించిన మహాకవి అందెశ్రీ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకుడు ఇరుగు పైడి, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజాల భిక్షపతి, నాయకులు మడిపెల్లి శ్యాంబాబు, చంటి భద్రయ్య, సమ్మయ్య, రవి, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు గురుకుల విద్యార్థి
కాటారం: కాటారం మండలకేంద్రంలోని గిరిజన గురుకుల సంక్షేమ బాలుర పాఠశాలకు చెందిన నిఖిల్ అనే విద్యార్థి రాష్ట్ర స్థాయి అండర్ 17 విభాగం ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 25న యాదాద్రి భువనగిరిలో జరగనున్న రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో వరంగల్ జట్టు తరఫున నిఖిల్ పాల్గొననున్నట్లు ఎస్జీఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జైపాల్, ప్రిన్సిపాల్ రాజేందర్ తెలిపారు. ఈ మేరక వైస్ ప్రిన్సిపాల్ మాధవి, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, పీడీ మహేందర్, పీఈటీ మంథెన శ్రీనివాస్, కోచ్ వెంకటేశ్, ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు. -
‘గ్రంథాలతో దేవాలయాల చరిత్ర తెలుసుకోవచ్చు’
కన్నాయిగూడెం: త్రైత సిద్ధాంత గ్రంథాలతో దేవాలయ చరిత్ర తెలుసుకోవచ్చని త్రైత సిద్ధాంత ప్రబోధ మహబూబాబాద్ కమిటీ అధ్యక్షురాలు కృష్ణవేణి అన్నారు. మండల పరిధిలోని ముప్పనపల్లిలో త్రైత సిద్ధాంత గ్రంథాల ప్రచారంలో భాగంగా ఆదివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్రైత సిద్ధాంత ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా నిజ అర్ధాలను తెలుసుకోవచ్చని తెలిపారు. ఏడు గోవులు, ఏడు ద్వారాలు, ధ్వజస్తంభాలు, గంట ప్రదక్షిణలు మొదలగు వాటి గురించి తెలియజేశారు. త్రైత సిద్ధాంత భగవద్గీత గ్రంథం శ్రీకృష్ణుడి అసలైన జ్ఞానాన్ని తెలుపుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో వీరస్వామి, స్వామి, వంశీ, లళిత, సుష్మ, రజిత, సంతోష్, రేఖ, స్వరూప తదితరులు పాల్గొన్నారు. -
మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
● పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కములుగు రూరల్: రాష్ట్రంలోని మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. మల్లంపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇందిరా మహిళా శక్తి సంఘాలను బలోపేతం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 67లక్షల మంది మహిళా సంఘాల సభ్యులుగా ఉన్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో కోటి మంది మహిళలు మహిళా సంఘాలలో చేరే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మల్లంపల్లి మండలంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 210 సంఘాలకు రూ. 26 కోట్ల రుణాల చెక్కును అందించారు. మహిళలు కాలంతో పోటీపడడమే కాకుండా అన్ని రంగాల్లో రాణించాలన్నారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం గరిష్టంగా రూ. 20 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించి ఆర్థిక, వ్యాపార రంగాలలో ముందుకు తీసుకెళ్తుందని వివరించారు. అనంతరం మండల పరిధిలోని కొడిశలకుంట గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వంచ రిషికేశ్ రైస్ మిల్లును మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ఆత్మ చైర్మన్ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
కబడ్డీ పోటీల్లో ప్రతిభ చూపాలి
ములుగు రూరల్: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబర్చాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కబడ్డీ జట్టుకు ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా భాస్కర్‌రెడ్డి ములుగు రూరల్: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ములుగుకు చెందిన చింతలపూడి భాస్కర్‌రెడ్డిని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు నియామక ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ క్రికెట్లో జిల్లా క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రోత్సహించడానికి కృషి చేస్తానని తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి, ఉపాధ్యక్షుడు విజయ్‌చందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు జైపాల్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రశాంతంగా ఎన్ఎంఎంఎస్ పరీక్ష ములుగు రూరల్: జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ (నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్) ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు డీఈఓ సిద్ధార్థరెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి వినోద్‌కుమార్ తెలిపారు. ములుగు మండల పరిధిలోని బండారుపల్లి మోడల్ స్కూల్, ఏటూరునాగారం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు 247 మంది విద్యార్థులకు గాను 242 మంది పరీక్షకు హాజరు కాగా ఐదుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారని వివరించారు. క్లిిప్పింగ్.. ఫెన్సింగ్ ఏటూరునాగారం: గతంలో మనం పొలాలకు రక్షణగా కట్టెలు పాతి వైర్లను తాళ్లతో కట్టేవాళ్లం. కానీ ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు సైతం అందిపుచ్చుకుంటున్నారు. మండల పరిధిలోని షాపెల్లికి చెందిన ఓ రైతు తన పొలంలోకి పశువులు రాకుండా క్లిప్పింగ్‌లను అమర్చి తీగలు కిందకు రాకుండా, వదలు కాకుండా ఉండేలా అమర్చాడు. దీంతో ఆ పెన్సింగ్‌ను చూస్తే అచ్చం సోలార్ ఫెన్సింగ్ లాగే కనిపిస్తూ ఆకట్టుకొంటుంది. క్లీనింగ్ డ్రైవ్ హన్మకొండ కల్చరల్: వరల్డ్ హెరిటేజ్ వీక్ పురస్కరించుకుని స్వచ్ఛత అభియాన్ క్లీనింగ్ డ్రైవ్‌లో భాగంగా వేయిస్తంభాల ఆలయంలో ఆది వారం స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించా రు. దేవాలయ పురావస్తుశాఖ జిల్లా అధికారి అజిత్, కో–ఆర్డినేటర్ నిరంజన్, ఈఓ అనిల్‌కుమార్, ప్రధానార్చకుడు ఉపేంద్రశర్మ, పు రావస్తుశాఖ, దేవాదాయశాఖ సిబ్బంది తరలివచ్చిన విద్యార్థులు పాల్గొని చీపురుకట్టలతో, పారలతో ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. -
జాతర పనులకు నాణ్యతలేని ఇసుక?
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం జాతర అభివృద్ధి పనులకు నాణ్యత లేని ఇసుక వినియోగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మేడారం జంపన్నవాగులోకి భక్తుల పుణ్యస్నానాల కోసం లక్నవరం నీటిని విడుదల చేస్తారు. నీరు సమాంతరంగా పారేందుకు వాగులో ఇసుక చదును చేస్తుంటారు. గతంలో ఇసుక చదును చేస్తున్న సమయంలో చిలకలగుట్ట సమీపంలోని వాగులో ఒక దగ్గర ఇసుకను అడ్డుకట్టగా నిల్వ చేశారు. నిల్వ ఉన్న ఇసుక సంవత్సరాల తరబడి ఉండడంతో ఇసుక కొంత మేరకు మట్టిగా తయారైంది. మంత్రి సీతక్క జంపన్నవాగులో ఇసుక ఎక్కడపడితే అక్కడ తీయొద్దని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మట్టి కలిసిన ఇసుకతోనే పనులు ఇదే క్రమంలో అధికారులు వాగులో నిల్వ ఉన్న ఇసుకనే మేడారం జాతర పనులకు అనుమతించారు. మట్టితో కలిసిన ఇసుకను మేడారం రోడ్డు విస్తరణ, డ్రెయినేజీ నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణాలకు వినియోగిస్తున్నారు. మట్టి కలిసిన ఇసుకను పనులకు వినియోగించడంతో నాణ్యత ప్రమాణాలు లోపించేనాస్కారం ఉందని ఓ రిటైర్డ్ ఇంజనీరింగ్ అధికారి తెలిపారు. -
నత్తనడకన పనులు
● మేడారం మహాజాతరకు సమీపిస్తున్న గడువు ● మిగిలింది ఇంకా 65రోజులే.. ● కొనసాగుతున్న అభివృద్ధి పనులు ● డిసెంబర్ 20 కల్లా పనులు పూర్తిచేయాలని మంత్రుల ఆదేశం ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మల మహాజాతర వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. ఈ మహాజాతరకు ఇంకా 65 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న అభివృద్ధి పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయి. డిసెంబర్ 20 కల్లా ప నులన్నీ పూర్తి చేయాలని మంత్రులు ఆయా శాఖల అధికారులను ఆదేశించినా డెడ్‌లైన్ నాటికి పనులు పూర్తయ్యేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హడావుడిగా రోడ్డు విస్తరణ పనులు మేడారం కాలనీ నుంచి ఊరట్టం స్తూపం వరకు 3 కిలోమీటర్ల వరకు రూ. 27 కోట్లతో ఆర్‌అండ్‌బీశాఖ ఆధ్వర్యంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. 3 కిలో మీటర్ల మేర పనులు చేపట్టగా ప్రస్తుతం 1.2 కిలో మీటర్ల వరకు సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. మిగిలిన పనులు సాగుతున్నాయి. ఇటీవల నిర్వహించిన సమీక్షలో మంత్రులు డెడ్‌లైన్ విధించడంతో పనుల్లో పురోగతి కోసం హడావుడిగా చేపడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. డిసెంబర్ నెలాఖరు వరకు పనులు పూర్తి చేస్తామని ఈఈ శ్యామ్సింగ్ తెలిపారు. ఆర్డబ్ల్యూఎస్ పనులు అక్కడే.. మేడారంలో ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో మేడారంలో ఓహెచ్‌ఆర్ వాటర్ ట్యాంక్ నిర్మాణం పనులు మాత్రమే సాగుతున్నాయి. తాత్కాలిక జీఐ షీట్స్ మరుగుదొడ్లు, తాగునీటి పైపులైన్ పనులు మొదలు కాలేదు. మేడారంలో తాగునీటి కోసం 65 బోర్లు, 120 చేతి పంపులు ప్లషింగ్ పనులు చేస్తున్నారు. జంపన్నవాగు పరిసరాల్లో మిని వాటర్ ట్యాంకుల మరమ్మతుల పనులతో పాటు జీఐ షీట్స్ మరుగుదొడ్ల నిర్మాణాలకు తాడ్వాయి గోదాం నుంచి కాంట్రాక్టర్లకు మెటీరియల్‌ను అప్పగించారు. వరి కోతల కారణంగా టాయిలెట్లు, తాగునీటి పనులు మొదలు కాలేదని అధికారులు చెబుతున్నారు. ప్రహరీ పనులు అంతంతే.. అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. సాలహారం(ప్రహరీ) నిర్మాణం పనుల్లో భాగంగా గద్దెల చుట్టూ బీమ్ నిర్మాణం పనులు పూర్తవ్వగా ఆర్చీల నిర్మాణానికి ఇంకా కొంత మేరకు సీసీ పనులు నడుస్తున్నాయి. ప్రస్తుతం పూర్తయిన బీమ్‌లపై రాతి పిల్లర్లను ఏర్పాటు చేస్తున్నారు. పగిడిద్దరాజు, గోవిందరాజు నూతన గద్దెల నిర్మాణానికి స్టోన్స్ ఏర్పాటు చేస్తున్నారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం సమయానికి పూర్తయ్యేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నా లక్ష్యం నాటికి పనులు పూర్తి చేస్తామని అధికారులు దీమా వ్యక్తం చేస్తున్నారు. 12 బావుల్లో పూడికతీత పూర్తి.. ఇరిగేషన్‌శాఖ ఆధ్వర్యంలో జంపన్నవాగులో 22 ఇన్‌ఫిల్టరేషన్ బావుల్లో పూడికతీత పనులు చేయాల్సి ఉండగా ప్రస్తుతం 12బావుల్లో పూడిక పనులు పూర్తయాయి. ఇంకా ఇసుక లెవంలింగ్ పనులు మొదలు పెట్టాల్సి ఉంది. వాగులో ఇసుక వరదకు కొట్టుకపోవడంతో బయట నుంచి లెవలింగ్ కోసం ఇసుక తీసుకొచ్చి పోయాల్సి వస్తుందని డీఈఈ సదయ్య తెలిపారు. త్వరలో స్నానఘట్టాల పై భక్తుల జల్లు స్నానాల కోసం బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ఏర్పాటుకు మెటీరియల్ తీసుకొస్తామని వివరించారు. డ్రెయినేజీ పనులు అస్తవ్యస్తం పీఆర్‌శాఖ ఆధ్వర్యంలో మేడారంలో 7 కిలోమీటర్ల డ్రెయినేజీ పనులు సాగుతున్నాయి. రెడ్డిగూడెంలో కిలోమీటన్నర డ్రెయినేజీ పనులు ఇప్పుడిప్పుడే మొదలు పెట్టారు. కొన్నిచోట్ల సైడ్‌వాల్ నిర్మాణం పనులు సమానంగా ఉండకుండా అడ్డదిడ్డం గా చేస్తున్న విషయం అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. ఈ పనులపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనల మేరకు పనులు చేయాలని కార్మికులను మందలించారు. డ్రెయినేజీల నుంచి నీటి సరఫరా సాఫీగా వెళ్లేలా సమాంతరంగా సరిచేయాలని ఆదేశించారు. -
రిజర్వేషన్లు ఖరారు..
ములుగు రూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రిజర్వేషన్లను 50 శాతానికి మించకుండా ఎన్నికలను నిర్వహించేందుకు ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కాగా అభ్యర్థుల వేటలో వివిధ పార్టీల నాయకులు పడ్డారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. 9మండలాలు.. 146 సర్పంచ్ స్థానాలు జిల్లాలో 10 మండలాలు ఉండగా మంగపేట వివాదం కోర్టులో ఉండడంతో ఎన్నికలు నిలిపివేశారు. మిగితా 9 మండలాల్లో మొత్తం 146 సర్పంచ్ స్థానాలకు అధికారులు శనివారం అర్ధరాత్రి వరకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. జిల్లాలో ఓటర్లు 2,29,159 మంది ఉండగా పురుషులు 1,10,838, మహిళలు 1,18,299, ఇతరులు 22 మంది ఉన్నారు.మండలం ఎస్టీ ఎస్సీ బీసీ జనరల్ములుగు 10 2 1 6 మల్లంపల్లి 3 1 1 5 వెంకటాపురం(ఎం) 5 4 3 11 గోవిందరావుపేట 17 0 0 1 ఎస్‌ఎస్‌తాడ్వాయి 15 0 0 3 ఏటూరునాగారం 8 1 0 3 కన్నాయిగూడెం 7 2 0 2 వెంకటాపురం(కె) 18 0 0 0 వాజేడు 17 0 0 0 జిల్లాలో 146 సర్పంచ్, 1,282 వార్డు స్థానాలు సర్పంచ్, వార్డు స్థానాలకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి మంగపేట మండలంలో ఎన్నికల బంద్మండలం గ్రామ వార్డుల పంచాయతీలు సంఖ్యములుగు 19 164 మల్లంపల్లి 10 90 వెంకటాపురం(ఎం) 23 200 గోవిందరావుపేట 18 154 ఎస్‌ఎస్‌తాడ్వాయి 18 152 ఏటూరునాగారం 12 114 కన్నాయిగూడెం 11 90 వెంకటాపురం(కె) 18 166 వాజేడు 17 152 -
ఎస్పీగా సుధీర్ రాంనాథ్ కేకన్ బాధ్యతలు
ములుగు: జిల్లా ఎస్పీగా శనివారం సుధీర్ రాంనాథ్ కేకన్ బాధ్యతలు స్వీకరించారు. మహబూబాబాద్ ఎస్పీగా పనిచేసిన ఆయన ములుగు ఎస్పీగా బదిలీపై వచ్చారు. ఇక్కడ ఎస్పీగా పనిచేసిన డాక్టర్ శబరీశ్ మహబూబాబాద్ ఎస్పీగా బదిలీ అయ్యారు. గతంలో ములుగు ఏఎస్పీగా పనిచేసిన సుధీర్ రాంనాథ్ కేకన్‌కు మేడారం జాతరపై అవగాహన, అనుభవం ఉంది. మరో రెండు నెలల్లో జరగనున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ఎస్పీ పర్యవేక్షణలో జరగనుంది. విద్యుత్‌శాఖ సర్కిల్ ఎస్ఈగా ఆనందం ములుగు రూరల్: ములుగు విద్యుత్‌శాఖ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా ఆనందం శనివారం బాధ్యతలను స్వీకరించారు. సర్కిల్ పరిధిలోని విద్యుత్ శాఖ ఉద్యోగులు ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించారు. ఇంతకాలం ములుగు సర్కిల్‌కు సూపరింటెండెంట్ ఇంజనీర్ లేకపోవటంతో ప్రతీ విషయానికి భూపాలపల్లి జిల్లాకు వెళ్లాల్సి వచ్చేదని ఇప్పుడు ఆ సమస్య తీరిపోయిందని అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లేబర్ కోడ్లతో కార్మికుల కుటుంబాలు చీకటిపాలు ములుగు రూరల్: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తున్న నాలుగు లేబర్ కోడ్లను అమలుతో కార్మికుల కుటుంబాలు చీకటి పాలు అవుతాయని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ లేబర్ కోడ్లను ప్రతిఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. లేబర్ కోడ్ల అమలుతో కార్మికుల కనీస సౌకర్యాలు, హక్కులను అధికారికంగా కాలరాయడమేనని వెల్లడించారు. ప్రజా చైతన్యానికి కళాకారుల కృషిగోవిందరావుపేట: ప్రజా చైతన్యానికి కళాకారులు నిరంతరం కృషి చేయాలని ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ అన్నారు. మండల పరిధిలోని పస్రా సీపీఎం కార్యాలయంలో శనివారం ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో ములుగు డివిజన్ స్థాయి శిక్షణ తరగతులు గుగ్గిళ్ల దేవయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కళ కాసుల కోసం కాకుండా ప్రజల అభ్యున్నతికి ఉపయోగపడాలన్నారు. అనేక ఉద్యమాలు కళాకారుల ద్వారానే ఉద్బవించాయని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కళ ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. కళాకారులు తమ కళారూపాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి రాష్ట్ర సహాయ కార్యదర్శి నక్క సైదులు, పొదిల్ల చిట్టిబాబు, అంబాల మురళి, ప్రవీణ్, నాగరాజు, కవిత, సువర్ణ, రాజు, రామకృష్ణ, చిరంజీవి, కృష్ణబాబు, ఐలయ్య, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. భక్తుల రద్దీ కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయంలో శని, కాలసర్ప నివారణ పూజలకు శనివారం భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచి ఆలయంలో శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప, నవగ్రహాల వద్ద శనిపూజలను భక్తులు అధికంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి గర్బగుడిలో అభిషేక పూజలు చేశారు. దీంతో ఆలయంలో భక్తుల సందడి కనిపించింది. -
రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపిక
విద్యార్థి నవ్యను అభినందిస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులను సన్మానిస్తున్న సర్దార్సింగ్ములుగు రూరల్/ఏటూరునాగారం: ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి రెజ్లింగ్ పోటీలలో వెంకటాపురం(కె) మండలానికి చెందిన జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు మెడల్స్ సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల జిల్లాలో నిర్వహించిన పోటీల్లో ఫ్రీ స్టైల్ 48 కేజీల విభాగంలో ఎల్.సుజన్ ప్రథమ, 65 కిలో విభాగంలో సాయిచరణ్ ప్రథమ, 46 కిలోల విభాగంలో ఏహెచ్ఎస్ జగ్గన్నపేటకు చెందిన ఐశ్వర్య ప్రథమ స్థానంలో నిలిచి మెడల్స్ సాధించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో మెడల్స్ సాధించిన విద్యార్థులను జిల్లా క్రీడల అధికారి సర్దార్‌సింగ్ అభినందించి శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ లావణ్య, కోచ్ సతీష్ పాల్గొన్నారు. కరాటే పోటీలకు.. ములుగు మండల పరిధిలోని జగ్గంపేట ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న నవ్య అండర్–14 కేటగిరి విభాగంలో రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు ఎంపికై ంది. జిల్లా కేంద్రంలో ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి కరాటే పోటీల్లో ప్రతిభను చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న నవ్యను ఉపాధ్యాయులు అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విజయలక్ష్మి, సుశీల, జయరాం, రమాదేవి, సృజన, జీవన్ తదితరులు పాల్గొన్నారు. -
డీసీసీ అధ్యక్షుడిగా అశోక్
● రెండోసారి ఎంపిక చేసిన ఏఐసీసీ ములుగు: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పైడాకుల అశోక్‌ను రెండోసారి నియమిస్తూ ఏఐసీసీ శనివారం జాబితా విడుదల చేసింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి గత నెల 14న ఏఐసీసీ పరిశీలకులు జాన్సన్ అబ్రహం, సాగరికరావు, నాగేందర్‌రెడ్డిలు నామినేషన్లు స్వీకరించగా జిల్లా నుంచి ఆరుగురు నామినేషన్లను దాఖలు చేశారు. జిల్లాలోని గోవిందరావుపేట మండలం నుంచి ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, ములుగు మండలం నుంచి గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, వెంకటాపురం(ఎం) మండలం నుంచి మల్లాడి రాంరెడ్డి, గోవిందరావుపేట నుంచి సూరపనేని నాగేశ్వర్రావు, ఏటూరునాగారం నుంచి ఇర్సవడ్ల వెంకన్న, వెంకటాపురం(కె) నుంచి చీడం రామ్మోహన్రావు పోటీపడ్డారు. జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో పాటు వివిధ మండలాలకు చెందిన పార్టీ మండల అధ్యక్షుల నుంచి ఏఐసీసీ పరిశీలకులు అభిప్రాయాలు సేకరించారు. ఈ మేరకు పైడాకుల అశోక్‌కు డీసీసీ అధ్యక్షుడిగా రెండోసారి అవకాశం కల్పిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. -
డిజిటల్ లెర్నింగ్‌తో చదువు సులభం
● డీఈఓ సిద్ధార్థరెడ్డి గోవిందరావుపేట: డిజిటల్ లెర్నింగ్‌తో చదువు మరింత సులభతరం అవుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చల్వాయి మోడల్ స్కూల్లో మూడు రోజులుగా ఏ బుక్ అండ్ డిజిటల్ లెర్నింగ్ కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు శనివారం నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి డీఈఓ హాజరై మాట్లాడారు. డిజిటల్ లెర్నింగ్‌తో విద్యార్థుల అభ్యసన సామర్థ్యం మరింత పెరుగుతుందన్నారు. డిజిటల్ పరికరాలు సురక్షితంగా, సమర్థవంతంగా ఉపయోగించి బోధనను సులభతరం చేయడం ఈ శిక్షణ ప్రధాన లక్ష్యం అన్నారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి సుమారు 400 మంది ఉపాధ్యాయులు ఈ శిక్షణలో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ నైపుణ్యాలను తమ తమ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రయోజనకరంగా అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి బి. శ్యాంసుందర్ రెడ్డి, మండల విద్యాధికారి గొంది దివాకర్, రీసోర్స్ పర్సన్లుగా వెంకటేశ్వర్లు, సతీష్ కుమార్, శ్రీకాంత్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మోడల్ స్కూల్ హాస్టల్ విద్యార్థినులతో సమీక్ష మండల పరిధిలోని చల్వాయి మోడల్ స్కూల్ హాస్టల్లో విద్యార్థుల సంక్షేమం, సౌకర్యాలు, ఆహార నాణ్యత, హాస్టల్ నిర్వహణపై డీఈఓ సిద్ధార్థరెడ్డి శనివారం సమీక్ష సమావేశం హాస్టల్ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మోడల్ స్కూల్ హాస్టల్ విద్యార్థినుల శ్రేయస్సే ముఖ్యమని తెలిపారు. పిల్లలకు అందిస్తున్న ఆహార నాణ్యత, వసతి, పరిశుభ్రత, భద్రత విషయాల్లో ఎలాంటి రాజీపడమని తెలిపారు. హాస్టల్ వర్కర్లు, వాచ్మెన్, స్కావెంజర్లు, కుక్స్ అందరూ తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థినులు హాస్టల్లో ఎదుర్కొంటున్న సమస్యలను వింటూ ఒక్కొక్కటిగా పరిష్కరించారు. జిల్లా గల్స్ చైల్డ్ డెవలప్మెంటఆఫీసర్ బుర్ర రజిత మాట్లాడుతూ విద్యార్థినుల ఫుడ్ లీడర్ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ దివాకర్, ప్రిన్సిపాల్ కుమార్, హాస్టల్ వర్కర్లు, ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు. -
వందేమాతరం ఉత్సవాలు
ములుగు రూరల్: వందేమాతరం ఉత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో శనివారం జిల్లా కన్వీనర్ జాడి వెంకట్ ఆధ్వర్యంలో 300 మంది విద్యార్థులు, 100 మంది యువతతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం వందేమాతరం గీతాలాపన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వందేమాతరం ఉత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతలపూడి భాస్కర్‌రెడ్డి, కృష్ణవేణి నాయక్, జవహర్లాల్, రమేష్, మహేందర్, శోభన్, స్వరూప తదితరులు పాల్గొన్నారు. -
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
ములుగు రూరల్: విద్యారంగ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై పోరాటాలను ఉధృతం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగానికి 15శాతం నిధులు విడుదల చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్షిపులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సాగర్, అన్వేష్, సాయికుమార్, రణదీప్, రామ్‌చరణ్, శివ పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ -
అడవిని విడిచిన ఆజాద్
సాక్షిప్రతినిధి, వరంగల్ : మావోయిస్టు పార్టీ నేత కొయ్యడ సాంబయ్య అలియాస్ గోపన్న, ఆజాద్ అడవిబాట విడిచారు. జిల్లాలోని గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన ఆయన బీకే–ఏఎస్ఆర్ డివిజనల్ కమిటీ కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా వ్యవహరించగా, శనివారం 37మంది సహచరులతో కలిసి రాష్ట్ర డీజీపీ ఎదుట లొంగిపోయాడు. మూడు దశాబ్దాలపాటు మావోయిస్టు పార్టీలో వివిధ కేడర్లలో పనిచేసిన ఆయన చివరకు జనజీవన స్రవంతిలో కలవడం చర్చనీయాంశంగా మారింది. ఆజాద్‌పై కొద్ది రోజులుగా లొంగుబాటు ప్రచారం... ఇటీవల మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్లు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న ఆయుధాలతో సహా తమ టీమ్‌తో లొంగిపోవడంతో.. ఆజాద్ కూడా లొంగిపోవడానికి ప్రయత్నించినట్టు తెలి సింది. ఈ నెల 15న ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఈయనను స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కూడా ప్రచారం జరిగింది. ఒక దశలో 16నే ఆయన పోలీ సులకు లొంగిపోయారన్నది కూడా వైరల్ అయ్యింది. వీటిపై స్పందించిన ఆజాద్ తండ్రి సమ్మయ్య తన కుమారుడికి ఎలాంటి హానీ తలపెట్టవద్దని, అరెస్టు చేసి అప్పగించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆజాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారా? లేక ఆయన లొంగిపోయారా? అన్న చర్చ జరుగుతుండగా.. డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో లొంగిపోయారన్న ప్రకటనతో సస్పెన్స్‌కు తెరపడింది. ఇదిలా ఉండగా ఉమ్మడి వరంగల్‌కు చెందిన పలువురు ఎన్కౌంటర్లలో మృతిచెందగా, కొందరు లొంగిపోయారు. ప్రస్తుతం బడే దామోదర్ అలియాస్ చొక్కారావుతో పాటు మరో 16 మందికి పైగా అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. డీజీపీ ఎదుట లొంగిపోయిన కొయ్యడ సాంబయ్య దళసభ్యుడి నుంచి స్టేట్ కమిటీ సభ్యుడి వరకు ప్రస్థానం మూడు దశాబ్దాలుగా అజ్ఞాతవాసం.. డీకేఎస్జడ్సీలో కీలకం ఆయన స్వస్థలం గోవిందరావుపేట మండలంలోని మొద్దులగూడెం అజ్ఞాతంలో మరో 16 మంది ఉమ్మడిజిల్లా వాసులు..? 20 ఏళ్ల వయసులో పీపుల్స్‌వార్ గ్రూపులో చేరిన కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ మూడు దశాబ్దాలపాటు అజ్ఞాతంలో గడిపారు. దళసభ్యుడి నుంచి తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, బీకే ఏఎస్ఆర్ డివిజనల్ కమిటీ కార్యదర్శిగా ఎదిగారు. దండకారణ్యం స్పెషల్ జోన్లో కీలకంగా వ్యవహరించిన ఈయనపై 50కి పైగా కేసులు ఉన్నాయి. తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దు, ఏఓబీలోనూ పని చేసినట్లు పోలీసు రికార్డులోకెక్కగా, ఎన్ఐఏ హిట్‌లిస్టులో కూడా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ– ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో దాడులు చేయడానికి కేడర్‌కు శిక్షణ, ఆయుధాల సరఫరా వంటి పనులు చేయడంతోపాటు కొత్త రిక్రూట్మెంట్ బాధ్యతలు నిర్వహించారన్న పేరుంది. ఈ క్రమంలో దండకారణ్యంలో ఎన్కౌంటర్లు జరిగినప్పుడల్లా ఈయన పేరు వినిపించింది. -
చట్టాలపై అవగాహన తప్పనిసరి
చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మహేందర్ వెంకటాపురం(ఎం): ప్రతిఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించి విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. విద్యాహక్కు, పోక్సో, ర్యాగింగ్, బాల్య వివాహ నిరోధక చట్టం గురించి ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్, కళాశాల ప్రిన్సిపాల్ చందర్, అధ్యాపకులు చరణ్, గోవర్ధన్, కిరణ్‌కుమార్, సుస్మిత, లక్ష్మినారాయణ పాల్గొన్నారు. -
మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం
ములుగు/గోవిందరావుపేట/ఎస్ఎస్ తాడ్వాయి: రాష్ట్రంలోని కోటిమంది మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు, వెంకటాపురం(ఎం), గోవిందరావుపేట మండలాల్లో కలెక్టర్ దివాకరతో కలిసి మంత్రి సీతక్క మహిళా సంఘాలకు ఇందిరమ్మ చీరలు, బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. మహిళా ఉన్నతికి, మహిళలు వ్యాపార రంగంలో రాణించడానికి వడ్డీలేని రుణాలను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. మహిళలు లేనిదే సృష్టి లేదని, మహిళలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు వెలుస్తారని పేర్కొన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు వారిని గౌరవించాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ ఫలాలను ప్రవేశ పెడుతున్నారని వివరించారు. మహిళా సంఘాల గ్రూపులోని ప్రతి మహిళను గుర్తించడానికి ప్రత్యేక చీరలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఇంటింటికి ఇందిరమ్మ చీరలు అందుతాయన్నారు. మాజీ ప్రధాని ఇందిరమ్మ ఉక్కు సంకల్పం ప్రతీ మహిళలో ఉండాలని పిలుపునిచ్చారు. వచ్చే సంవత్సరం మార్చి 8వ తేదీలోపు ప్రతీ మహిళకు చీరలను అందజేయడానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. చెక్కుల పంపిణీ ములుగు మండలంలోని 370 మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.46.50 కోట్ల రుణాల చెక్కులను, 38 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం వెంకటాపురం (ఎం) మండలంలోని 195 మహిళా సంఘాలకు రూ. 26.50 కోట్ల రుణాల చెక్కులను, 43 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి అందించారు. గోవిందరావుపేట మండల కేంద్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 283 సంఘాలకు రూ. 29.86కోట్ల రుణాల చెక్కును అందజేశారు. ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలంలోని 120 మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.8 కోట్ల చెక్కులను మంత్రి సీతక్క పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ఆత్మ చైర్మన్ రవీందర్ రెడ్డి, డీఆర్డీఓ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికీ ఇందిరమ్మ చీర అందిస్తాం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
ఆదివారం శ్రీ 23 శ్రీ నవంబర్ శ్రీ 2025
సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు రిజర్వేషన్లకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలతో ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఇందులో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లపై విధివిధానాలు సూచించారు. ఇప్పటికే కలెక్టర్లతో ఎన్నికల అధికారులు కాన్ఫరెన్స్‌ల ద్వారా ఆదేశాలిచ్చారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికలపై అధికారులు శనివారం నుంచి కసరత్తు ముమ్మరం చేశారు. కలెక్టర్ల పర్యవేక్షణలో గ్రామ పంచాయతీ రిజర్వేషన్లు ఆర్డీఓలు, వార్డుల రిజర్వేషన్లపై ఎంపీడీఓలు ఖరారు చేయనున్నారు. రెండు రోజుల్లోపే రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు దూకుడు పెంచగా.. ఉమ్మడి వరంగల్‌లో 1,705 జీపీలు, 15,006 వార్డులకు త్వరలో రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. మార్గదర్శకాల మేరకు రిజర్వేషన్లు ఈ నెల 26 లేదా 27న గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని భావిస్తున్న నేపథ్యంలో రిజర్వేషన్ల ప్రక్రియ వేగం పుంజుకున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. షెడ్యూల్ విడుదలైన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానున్నందున.. అంతకు ముందే కేబినెట్ భేటీలో పంచాయతీ ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికల తేదీలను నిర్ణయించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)కు తెలియజేస్తారంటున్నారు. ఈలోగా రిజర్వేషన్ల ప్రక్రియ ముగించేందుకు జీఓ విడుదల కావడంతో అధికారులు తొందరపడుతున్నట్లు చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా రిజర్వేషన్లు 50 శాతం మించరాదని జీఓలో పేర్కొన్నారు. కులగణన ఆధారంగా వార్డు సభ్యుల ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు, కులగణన ఆధారంగానే బీసీలకు సర్పంచ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు సర్పంచ్ రిజర్వేషన్లు కల్పించనున్నారు. రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో లాటరీ ద్వారా మహిళ రిజర్వేషన్లు ఖరారు చేసేలా కసరత్తు చేస్తున్నట్లు అధికారవర్గాల సమాచారం. 2019లో 1,664 జీపీలకు ఎన్నికలు 2019 పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్‌లో 1,708 గ్రామ పంచాయతీలకు 1,664 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. 1,664 సర్పంచ్ స్థానాల్లో 1,198 స్థానాల కోసం 2011 జనాభా ప్రకారం కేటాయించారు. 223 షెడ్యూల్డ్ గ్రామ పంచాయతీలు కాగా, వంద శాతం ఎస్టీ జనాభా ఉండడంతో 239 స్థానాలను వారికే కేటాయించారు. మహబూబాబాద్ జిల్లాలో 115, జనగామలో 37, జేఎస్ భూపాలపల్లి/ములుగులో 6, వరంగల్‌లో 77, హనుమకొండలో 4 గిరిజన పంచాయతీలు ఉన్నాయి. 2019లో బీసీలకు 24 శాతం కోటా కింద 223 స్థానాలు రిజర్వ్ చేశారు. అదే విధంగా అన్ రిజర్వుడ్(యు.ఆర్) 48 శాతం కింద 582 స్థానాలను ఆ కోటాలో కేటాయించారు. ఈసారి నిర్వహించే ఎన్నికల్లో కూడా ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి రిజర్వేషన్లు ఖరారు చేస్తుండగా.. ఈ నెల 24వ తేదీ వరకు ఫైనల్ అయ్యే అవకాశం ఉందని అధికారవర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుండగా.. ఏ గ్రామ పంచాయతీ ఎవరికి కేటాయిస్తారో? అనే చర్చ పల్లెలను కుదిపేస్తోంది. నేడు తుది జాబితా ప్రకటిస్తాం.. గ్రామ పంచాయతీల పరిధిలో ఒకే వార్డులో ఒకే కుటుంబం ఉండేలా ప్రజల నుంచి శుక్రవారం వరకు అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించాం. కుటుంబ సభ్యులు రెండు, మూడు వార్డుల్లో ఉంటే అభ్యంతరాలు రాకున్నా జీపీ కార్యదర్శులు సుమోటోగా తీసుకొని తప్పులను సరిదిద్దుతారు. నేడు ఆదివారం ఓటర్ల తుది జాబితా ప్రదర్శిస్తాం. – శ్రీధర్, ఇన్చార్జ్ డీపీఓ, ములుగు ఉమ్మడి వరంగల్‌లో ఇలా..జిల్లా సర్పంచ్ పంచాయతీ పోలింగ్ స్థానాలు వార్డులు కేంద్రాలు హనుమకొండ 210 1,986 1,986 వరంగల్ 317 2,754 2,754 జేఎస్ భూపాలపల్లి 248 2,102 2,102 మహబూబాబాద్ 482 4,110 4,110 ములుగు 171 1,520 1,535 జనగామ 280 2,534 2,534 -
ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి సంస్థ రక్షణకు సింగరేణి కార్మిక సంఘాలు ఐక్య పోరాటాలు చేసేందుకు సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నంద నరసింహారావు కోరారు. ఏరియాలోని కేటీకే 5వ గనిలో శుక్రవారం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. రికార్డు స్థాయిలో లాభాలు గడిస్తూ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు పొందుతూ, నవరత్నం లాంటి సింగరేణి కంపెనీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సింగరేణిని భవిష్యత్ లేకుండా చేస్తున్నాయని ఆరోపించారు. సింగరేణి సంస్థను కాపాడేందుకు కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కార్మిక సంఘాలు ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి కంపేటి రాజయ్య, నాయకులు తోట రమేష్, బాబురావు, సాయికిరణ్, ప్రసాద్, శివకుమార్‌రెడ్డి పాల్గొన్నారు. -
దామోదర్ పేరుతో ఫోన్ చేస్తున్నదెవరు..?
శనివారం శ్రీ 22 శ్రీ నవంబర్ శ్రీ 2025– 10లోuకాల్వపల్లికి చెందిన మావో యిస్టు అగ్రనేత బడే దామోదర్ పేరిట కొందరు రాజకీ య నాయకులు, వ్యాపారులకు ఫోన్ కాల్స్ వస్తుండటం కలకలంగా మారింది. తాను దామోదర్‌ను అంటూ ఫోన్చేస్తున్న సదరు వ్యక్తి.. జిల్లా అటవీ ప్రాంతానికి చెందిన ఓ నాయకుడిని కలిసి డబ్బులు ఇవ్వాలని సూ చించడం వివాదాస్పదమవుతోంది. ఇటీవల ఇద్దరు అధికార పార్టీ నాయకులు, ముగ్గురు ఇసుక వ్యాపారులకు దామోదర్ పేరిట ఫోన్ కాల్స్ రావడం.. ఆ ఫోన్లో మాట్లాడిన పలు విషయాలను బహిరంగంగానే మాట్లాడుకుంటుండటం గమనార్హం. నిత్యనిర్బంధం మ ధ్య దామోదర్ ఎక్కడున్నాడు.. ఎలా ఉన్నా డు.. అన్న చర్చ జరుగుతున్న తరుణంలో దామోదర్ వాయిస్‌తో ఫోన్ చేస్తున్నదెవరు? ఒకవేళ దామోదరే అయితే ఎవరిని కలవమన్నారు? అనే అంశాలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. వరుస లొంగుబాట్లు, ఎన్కౌంటర్ల నేపథ్యంలో చర్చసాక్షిప్రతినిధి, వరంగల్ : మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి, ఉమ్మడి వరంగల్‌కు చెందిన బడే దామోదర్ అలియాస్ చొక్కారావు ఎక్కడ? ఇటీవల సాగుతున్న వరుస లొంగుబాట్లు, ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఆయన వ్యూహం ఏమిటీ? ఓ వైపు ఛత్తీస్‌గఢ్ – తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నాడంటుండగా.. మరో వైపు లొంగుబాటు ప్రయత్నం చేస్తున్నాడని వైరల్ అవుతోంది? ఈ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, సౌత్‌బస్తర్, ఏఓబీలలో కీలకమైన దామోదర్ ఎక్కడున్నాడు? ఏం జరుగుతోంది? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఇటీవల జిల్లాకు చెందిన కొందరు రాజకీయ నా యకులు, వ్యాపారులకు ఆయన పేరిట ఫోన్ కాల్స్ రావడం, ఓ రా జకీయ నేతను కలవా లని సూచించడం కలకలం రేపుతోంది. దామోదర్ వ్యూహం ఏమిటో.. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం కాల్వ పల్లికి చెందిన బడే దామోదర్‌ది సీపీఐ (మావోయిస్టు) పార్టీ ఉద్యమ చరిత్రలో ఓ అధ్యాయం. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ 2021 జూన్ 21న కోవిడ్ బారిన పడి మృతిచెందగా.. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన బాధ్యతలను దామోదర్‌కు పార్టీ అప్పగించింది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో కీలకంగా మారిన ఈయన ఈ ఏడాది జనవరిలో పూజారి కాంకేర్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వైరలైంది. ఐదారు రోజుల వ్యవధిలో దామోదర్ బతికే ఉన్నట్లు మావో యిస్టు పార్టీ నాయకత్వం ప్రకటించింది. ఈ 11 మాసాల వ్యవధిలో మావోయిస్టు పార్టీ నాయకత్వం ఎన్నో ఉత్థానపతనాలను చూసింది. అగ్రనేతలు ఎన్కౌంటర్లకు గురికావడం.. కేంద్ర కమిటీ స్థా యి నాయకులు, పెద్ద సంఖ్యలో దళసభ్యులు ఆయుధాలతో లొంగిపోవడం లాంటి సంఘటనలు జరిగాయి. ఇదే క్రమంలో ఏఓబీ సరిహద్దు మారేడుమిల్లి ఏరియాలో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో హిడ్మా సహా 13 మంది మృతిచెందడం... పదుల సంఖ్యలో నేతలను విజయవాడలో అరెస్టు చేసి న ట్లు పోలీసులు ప్రకటించడం ఆ పార్టీ మనుగడకు సవాల్‌గా పరిణమించింది. ఇదే సమయంలో బడే దా మోదర్ అలియాస్ చొక్కారావు, కొయ్యడ సాంబ య్య అలియాస్ ఆజాద్, కంకణాల రాజిరెడ్డి అలి యాస్ వెంకటేశ్ తదితరులు సైతం లొంగిపోతున్నారన్న ప్రచారం జరిగింది. కానీ ఇప్పటివరకు అధికా రికంగా ఎటునుంచి ప్రకటన వెలువడలేదు. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న దామోదర్ ఆయన స్వస్థలం ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి లొంగుబాటు ప్రయత్నాలపైనా సోషల్ మీడియాలో వైరల్ ఆయన పేరిట నాయకులు, వ్యాపారులకు ఫోన్ కాల్స్? -
ఎస్పీగా సుధీర్ రాంనాథ్ కేకన్
ములుగు: జిల్లా ఎస్పీగా సుధీర్ రాంనాథ్ కేకన్‌ను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ములుగు ఎస్పీగా పనిచేస్తున్న డాక్టర్ శబరీష్ మహబూబాబాద్ ఎస్పీగా బదిలీపై వెళ్లగా, అక్కడ ఎస్పీగా పనిచేస్తున్న సుధీర్ రాంనాథ్ కేకన్‌ను జిల్లా ఎస్పీగా నియమించింది. గతంలో 2020 నుంచి 2022 వరకు ములుగు ఏఎస్పీగా సుధీర్ రాంనాథ్ కేకన్ పనిచేశారు. ఏఎస్పీగా మానన్భట్ ఏటూరునాగారం: ఏటూరునాగారం ఏఎస్పీగా మానన్ భట్‌ను నియమిస్తూ డీజీపీ జితేందర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2023 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన మానన్ భట్ గ్రేహౌండ్స్‌లో పనిచేస్తుండగా ఏఎస్పీగా బదిలీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న ఏఎస్పీ శివం ఉపాధ్యాయను ములుగు ఓఎస్డీగా నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగాలి
ములుగు రూరల్: విద్యార్థులు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగాలని జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకుడు ఆదిరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చెకుముకి పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడనమ్మకాల నిర్మూలనకు విద్యార్థులు నడుంబిగించాలన్నారు. చెకుముకి టాలెంట్ టెస్ట్ ప్రశ్నపత్రాలను పాఠశాల ఉపాధ్యాయులు ఆవిష్కరించారు. మొత్తం 24 మంది విద్యార్థులు పాల్గొనగా బండారుపల్లి గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానం, మైనార్టీ గురుకుల పాఠశాల దేవగిరిపట్నం విద్యార్థులు ద్వితీయ స్థానం సాధిచారన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, జేవీవీ నాయకులు రత్నం ప్రవీణ్, చంటి, బాలేశ్వర్, తదితరులు పాల్గొన్నారు. -
బాలల హక్కుల పరిరక్షణకు పాటుపడాలి
● అదనపు కలెక్టర్ సంపత్‌రావు ములుగు రూరల్: బాలల హక్కుల పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) సంపత్‌రావు అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాలల హక్కుల పరిరక్షణతో బాలలపై హింస తగ్గే అవకాశం ఉందన్నారు. జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం నిర్వహించిన పోటీల్లో ప్రతిభకనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందించారు. బాల్య వివాహాల నిర్మూలన, బాలల హక్కుల పరిరక్షణ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షమాధికారి తుల రవి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్, సీడీపీఓ ప్రేమలత, శిరిష, సూపర్వైజర్లు, బాలసదనం సూ పరింటెండెంట్ కావ్య, సిబ్బంది పాల్గొన్నారు. అలా గే వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులను అదనపు కలెక్టర్ శా లువాతో సన్మానించారు. వయోవృద్ధులు దేశాని కి వెలకట్టలేని సంపద అన్నారు. వయోవృద్ధుల సంక్షేమ ఫోరం అధ్యక్షుడు రామూర్తి, సీడీపీఓలు శిరీష, ప్రేమలత, డీసీపీఓ ఓంకార్, వయోవృద్ధుల శాఖ ఇన్చార్జ్ నాగేంద్ర, గణేష్, రమాదేవి, శ్రీనివాస్‌రెడ్డి, చంచు రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
వాగు దాటితేనే జాతర!
● కొండాయి వద్ద వాహనాలు వెళ్లేదెలా? ● డైవర్షన్ రోడ్డు లేక భక్తుల ఇబ్బందులు ● టెండర్లు పూర్తయినా.. అగ్రిమెంట్ కాని పరిస్థితిఏటూరునాగారం: ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి ప్రైవేట్ వాహనాల ద్వారా ఏటూరునాగారం, చిన్నబోయినపల్లి, షాపెల్లి, కొండాయి మీదుగా ఊరట్టం నుంచి మేడారం జాతరకు చేరుకుంటారు. అయితే మండలంలోని కొండాయి వద్ద హైలెవల్ బ్రిడ్జి కూలిపోగా డైవర్షన్ తాత్కాలిక రోడ్డును మేడారం జాతర సందర్భంగా ప్రభుత్వం ఆర్‌అండ్‌బీశాఖ ద్వారా రూ.50 లక్షలు మంజూరు చేసింది. వీటికి ఇంజనీరింగ్‌శాఖ టెండర్లు పూర్తికాగా అగ్రిమెంట్ ఇంత వరకు చేయలేదు. దీంతో కొండాయి జంపన్నవాగు వద్ద తాత్కాలిక రోడ్డు పనులు మొదలు కాలేదు. జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరిగే మహా జాతర దగ్గర పడుతున్నప్పటికీ పనులు మొదలు కాకపోవడంతో అప్పటి వరకు పూర్తి అవుతాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 110 మీటర్ల పొడవుతో మట్టిరోడ్లు జంపన్నవాగు బ్రిడ్జికి ఇరువైపుల 110 మీటర్ల పొడువుతో మట్టి రోడ్డును నిర్మించాల్సి ఉంది. వాగులో సిమెంట్ పైపులు అమర్చి ఇసుక బస్తాలు, మొరంతో వాహనాలు వెళ్లే విధంగా చేయాల్సి ఉంది. అయితే ఈ రోడ్డు పూర్తి కాకపోతే మేడారం జాతరకు వచ్చే భక్తుల వాహనాలు వాగు దాటే పరిస్థితి ఉండదు. గతంలో 2024లో రూ.27 లక్షలతో నిర్మించిన రోడ్డు వర్షాలకు కొట్టుకుపోయింది. ఇప్పుడు కేవలం వాగు నీటిలో నుంచి రాకపోకలను సాగిస్తున్నారు. గ్రామం వైపు ఉన్న వారు వాహనాలు అటువైపు నిలుపుకొని కాలినడకన దాటి ఆటోలు, బైక్‌లతో మండల కేంద్రానికి రాకపోకలను సాగిస్తున్నారు. విద్యార్థులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదిఏమైనప్పటికీ రోడ్డు నిర్మిస్తేగానీ ప్రజలు, భక్తుల ఇబ్బందులు తొలగవని స్థానికులు వాపోతున్నారు. గోతులమయంగా కొండాయి రోడ్డు ఏటూరునాగారం, చిన్నబోయినపల్లి నుంచి కొండాయి వరకు ఉన్న 14 కిలోమీటర్ల రోడ్డు గోతుల మయంగా మారింది. 2022లో రూ.6 కోట్లు మంజూరు కాగా కాంట్రాక్టర్ పనులు చేయకుండానే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో షాపెల్లి వద్ద కల్వర్టు అసంపూర్తిగా అటు ఇటు కేవలం కాంక్రీట్ వాల్ నిర్మించి పైన స్లాబ్ వేయలేదు. దీంతో గ్రామస్తులు కల్వర్టు పక్క నుంచి మట్టిరోడ్డు నిర్మించి వాహనాల రాకపోకలను సాగిస్తున్నారు. కల్వర్టుతోపాటు షాపెల్లి, దొడ్ల కొత్తూరు సమీపంలో రోడ్డు ధ్వంసమై కంకరతేలి అధ్వానంగా మారింది. జాతర సందర్భంగా పంచాయతీరాజ్ ద్వారా రూ.35 లక్షలు కేటాయించగా ఇప్పటి వరకు తట్ట పని కూడా మొదలు పెట్టలేదు. జాతర సమీపిస్తున్నప్పటికీ కాంట్రాక్టర్లు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డు నిర్మించాలి చిన్నబోయినపల్లి నుంచి దొడ్ల, కొండాయి వరకు శాశ్వత బీటీ రోడ్డు నిర్మించాలి. అసంపూర్తిగా ఉన్న కల్వర్టులు పునరుద్ధరించి ఇబ్బందులు లేకుండా చూడాలి. రోడ్డు సరిగా లేక బస్సులు వచ్చే పరిస్థితిలేదు. ప్రయాణికులు, గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. – మాదరి రాంబాబు, షాపెల్లి, ఏటూరునాగారం త్వరలో నిర్మాణ పనులు చేపడతాం..డైవర్షన్ రోడ్డు నిర్మాణం కోసం టెండర్లు పూర్తి చేశాం. ఇంకా అగ్రిమెంట్ కాలేదు. మరో వారం రోజుల్లో పనులు చేపడతాం. –వెంకటేశ్, ఏఈ -
ఉద్యమాలతోనే హక్కుల సాధన
వెంకటాపురం(కె): ఉద్యమాలతోనే హక్కులను సాధించుకోవాలని వాడ బలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ అన్నారు. శుక్రవారం మండలంలోని మెర్రవానిగూడెం పంచాయతీ పరిధి అబ్బాయిగూడెంలో సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు ఉద్యమాలకు సిద్ధంకావాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో బీసీలకు 1/70 యాక్టుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. చేపల వృత్తి చేసుకునే వారికి చెరువులు, కుంటల్లో చేపలు పట్టుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి తోట మల్లికార్జున్‌రావు, బొల్లె ఆదినారాయణ, ప్రశాంత్, కోటేశ్వర్రావు, చంటి, రమేశ్, దేవుడు తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటక అభివృద్ధికి కృషి
● జిల్లా అటవీ అధికారి నవీన్ రెడ్డి రేగొండ: పాండవుల గుట్టలను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని జిల్లా అటవీ అధికారి నవీన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని రావులపల్లి శివారు పాండవుల గుట్టలను అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాండవుల గుట్టలను సందర్శించే పర్యాటకుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీఓ అప్పలకొండ, ఎఫ్ఆర్వోలు నరేష్, చంద్రమౌళి, ఎఫ్ఎస్ఓ గౌతమి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
మొక్కజొన్న సాగుకు ఒప్పందం తప్పనిసరి
● జిల్లా వ్యవసాయాధికారి సురేష్ వెంకటాపురం(కె): మొక్కజొన్న సాగుకు ఆర్గనైజర్‌తో రైతులు తప్పనిసరిగా ఒప్పందం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సురేష్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో మొక్కజొన్న డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అగ్రిమెంట్ ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు ఎంఆర్పీ ధరలకే ఎరువులు, పురుగు మందులు విక్రయించాలని, అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు ఎరువులు, పురుగు మందులకు తీసుకునే సమయంలో బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఏడీఏ అవినాష్ వర్మ, మండల వ్యవసాయ అధికారి నవీన్ తదితరులు ఉన్నారు. -
అక్రమ నిర్మాణాలను తొలగించాలి
ఏటూరునాగారం: మేడారంలో లంబాడీల అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో జరిగిన సమా వేశంలో ఆయన మాట్లాడారు. సమ్మక్క సారలమ్మ జాతరలో ఆదివాసీల పవిత్రతను వలస వాదులతో భంగం కలుగుతుందన్నారు. రైతులను బ్లాక్మెయిల్ చేస్తూ భూములను లాక్కుంటున్నారన్నారు. అధికారులు సర్వే చేసి లంబాడీల నిర్మాణాల తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొర్నిబెల్లి గణేష్, ఆలం స్వామి, మోకాళ్ల వెంకటేష్, వెంకటేష్‌లు పాల్గొన్నారు. సైన్స్‌ఫెయిర్‌ను విజయవంతం చేయాలి ములుగు రూరల్: జిల్లాలోని బండారుపల్లి మోడల్ పాఠశాలలో నిర్వహించనున్న సైన్స్‌ఫెయిర్‌ను విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిసెంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు జిల్లా స్థాయి సైన్స్‌ఫెయిర్ డీఎల్బీవీపీ, ఇన్‌స్పైయిర్ సంయుక్తంగా నిర్వహిస్తుందన్నారు. 2024–25 విద్యా సంవత్సరానికి ఇన్‌స్పైయిర్ 20 ప్రాజెక్టులు ఈ ఏడాది నిర్వహించడం జరుగుతుందన్నారు. సుస్థిరమైన వ్యవసాయం, వ్యర్థ పదార్థాల నిర్వాహణ, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలు, హరిత శక్తి, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, వినోదకరమైన గణిత నమూనాలు, పరిశుభ్రత, జల సంరక్షణ తదితర అంశాలపై విద్యార్థులు ప్రాజెక్టులు తయారు చేయాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను సిద్ధం చేయాలన్నారు. నూతన మండలంలో సౌకర్యాలు కల్పించాలి ములుగు రూరల్: నూతనంగా ఏర్పాటు చేసిన మల్లంపల్లి మండలంలో పరిపాలన సౌలభ్యం అన్ని సౌకర్యాలు కల్పించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు అన్నారు. ఈ మేరకు శుక్రవారం మల్లంపల్లి మండలకేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్లంపల్లి ప్రజల ఆకాంక్ష మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వం మండలంగా ప్రకటించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచిన నూతన మండలంలో కార్యాలయం ఏర్పాటు చేయలేదన్నారు. మండలం ఏర్పాటు అయినప్పటికీ ప్రజలు ములుగుకు వెళ్లక తప్పడం లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు గోవింద్‌నాయక్, చందా కుమార్, చీదర్ల సంతోష్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. హేమాచలుడిని దర్శించుకున్న సీసీఎఫ్ మంగపేట: మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహా స్వామిని అటవీశాఖ కాళేశ్వరం సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రభాకర్ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ పూజా రులు శేఖర్శర్మ, రాజీవ్ నాగఫణిశర్మ మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకున్న అనంతరం గోత్ర నామాలతో ప్రత్యేక అర్చనలు జరి పించారు. ఆలయ చరిత్రను వివరించి స్వామి వారి శేషవస్త్రాలను అందించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఆయన వెంట తాడ్వాయి, ఏటూరునాగారం ఎఫ్డీఓ వజ్రారెడ్డి, రమేష్, మంగపే ట రేంజ్ అధికారి అశోక్, డిప్యూటీ రేంజ్ అధికారి కోటేశ్వర్ ఉన్నారు. నేడు డయల్ యువర్ సింగరేణి సీఎండీ భూపాలపల్లి అర్బన్: నేడు (శనివారం) డయల్ యువర్ సింగరేణి సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సింగరేణి సంస్థలో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదల, రక్షణ, వైద్య సేవల వంటి అంశాలపై సింగరేణి సంస్థ చైర్మన్ బలరా మ్ శనివారం సాయంత్రం 4 నుంచి 5గంటల వరకు ‘డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం’ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు 040–23311338 నంబర్‌కు కాల్ చేయాల్సి ఉంటుంది. -
డిజిటల్ నైపుణ్యాభివృద్ధికి శిక్షణ అవసరం
● డీఈఓ సిద్ధార్థరెడ్డిగోవిందరావుపేట: ఉపాధ్యాయుల డిజిటల్ నైపుణ్యాభివృద్ధికి శిక్షణ అవసరమని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి అన్నారు. మండలపరిధిలోని చల్వాయి మోడల్ స్కూల్లో గణిత, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులకు డిజిటల్ లెర్నింగ్ సామర్థ్యాల అభివృద్ధి (కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం)కి మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ శుక్రవారం సందర్శించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా డిజిటల్ రంగంలోనూ ప్రావీణ్యం సాధించేలా ఉపాధ్యాయుల శిక్షణ దోహదపడాలన్నారు. కార్యక్రమ నిర్వహణకు అవసరమైన వసతి, కంప్యూటర్ ల్యాబ్‌లు సమకూర్చినందుకు టీజీఎంఎస్ చల్వాయి ప్రిన్సిపాల్ జి.కుమార్, ఏఎంఓ శ్యాంసుందర్ రెడ్డిలతో పాటు ఆర్పీలు, డీఆర్పీలను డీఈఓ అభినందించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్లు అర్షం రాజు, జి.సాంబయ్య, ఉల్లాస్ జిల్లా కో ఆర్డినేటర్ పీర్ల కృష్ణ బాబు, డీఆర్పీలు వెంకటేశ్వర్లు, ఆర్పీలు లక్ష్మణ్, యూసఫ్, సుమన్, నరేందర్, జయశ్రీ, కుమార్ రాథోడ్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన జోనల్‌స్థాయి క్రీడాపోటీలు
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని కొమురం భీమ్ మినీ స్టేడియంలో రెండు రోజుల పాటు ఐటీడీఏ పరిధిలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థులకు నిర్వహించిన జోనల్ స్థాయి క్రీడాపోటీలు గురువారం ముగిశాయి. అట్టహాసంగా ప్రారంభమైన పోటీల్లోని విజేతలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నట్లు ఐటీడీఏ డీడీ దబ్బగట్ల జనార్ధన్ తెలిపారు. కబడ్డీలో అండర్ 17 బాలురలో మొదటి బహుమతి ఏటూరునాగారం గెలుపొందగా, ద్వితీయ బహుమతి హనుమకొండ దక్కించుకుంది. వీరికి డీడీ దబ్బగట్ల జనార్ధన్ బహుమతులను అందజేశారు. అలాగే కబడ్డీ బాలికల విభాగంలో ములుగు మొదటి బహుమతి, మహబూబాబాద్ రెండో బహుమతి గెలుపొందింది. ఖోఖోలో బాలికల విభాగంలో ములుగు మొదటి బహుమతి, కొత్తగూడ రెండో బహుమతి గెలుచుకుంది. ఏటూరునాగారం మొదటి బహుమతి, కొత్తగూడ రెండో బహుమతి గెలుచుకుంది.టెన్నికాయిట్‌లో బాలురు కొత్తగూడ మొదటి బహుమతి, మహబూబాబాద్ రెండో బహుమతి గెలుపొందగా బాలికల్లో కొత్తగూడ మొదటి బహుమతి, ములుగు రెండో బహుమతి గెలుచుకుంది. అలాగే అండర్ 14లో విభాగంలో టెన్నికాయిట్‌లో కొత్తగూడ మొదటి బహుమతి, మహబూబాబాద్ రెండో బహుమతి, బాలికల్లో భూపాలపల్లి మొదటి బహుమతి, వాజేడు రెండో బహుమతి గెలుచుకున్నారు. కబడ్డీలో మొదటి బహుమతి భూపాలపల్లి, రెండో బహుమతి ములుగు గెలుపొందగా బాలురలో మొదటి బహుమతి కొత్తగూడ, రెండో బహుమతి ఏటూరునాగారం జట్లు గెలుపొందినట్లు జనార్ధన్ తెలిపారు. ఖోఖో బాలికల పోటీల్లో మొదటి బహుమతి భూపాలపల్లి, రెండో బహుమతి ములుగు జట్లు గెలుపొందినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏటీడీఓలు అజయ్‌కుమార్, ఉపేందర్, భాస్కర్, స్పోర్ట్స్ ఆఫీసర్లు యాలం ఆదినారాయణ, నారాయణ, కొమ్మాలు తదితరులు పాల్గొన్నారు. రాణించిన గిరిజన విద్యార్థులు బహుమతులు అందజేసిన డీడీ -
ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు
ములుగు రూరల్: జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గురువారం గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు, పాఠకులకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ నిఖిల్, గ్రంథాలయ పాలకురాలు సమ్మక్క, రాకేశ్, పాఠకులు పాల్గొన్నారు.వనదేవతలను దర్శించుకున్న కళాబృందంఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మలను ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసీ కళాబృందం సభ్యులు గురువారం దర్శించుకున్నారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కళాబృందానికి పూజారి యాదగిరి, మేడారం తుడుందెబ్బ గ్రామ కమిటీ అధ్యక్షుడు గడిగ సునీల్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కళాకారులు మ్యూజియాన్ని సందర్శించి ఆదివాసీల సంస్కృతీ, సంప్రదాయాల చిత్రాలు, పురాతన వస్తువులను వీక్షించారు. కళాకారులకు పూజారులు విడిది సౌకర్యం, విందు భోజన వసతి కల్పించారు.ఉత్తమ పౌరులుగా ఎదగాలివాజేడు: ప్రతీ విద్యార్థి ఉత్తమ పౌరులుగా ఎదగాలని జిల్లా బాలల పరిరక్షణ విభాగం సోషల్ వర్కర్ కడారి సుమన్, చైల్డ్ హెల్ప్‌లైన్ కేసు వర్కర్ చంటి, హెచ్ఎం ఆనందరావు అన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో గురువారం అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం నిర్వహించగా పాల్గొని మాట్లాడారు. బాలలు శారీరక ఎదుగుదలను అర్ధం చేసుకోవాలన్నారు. బావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలని తెలిపారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవడానికి జీవన నైపుణ్యాలను అలవర్చుకోవాలని వివరించారు. బాలలు తమ హక్కులకు భంగం కలిగిస్తే 1098 ఫోన్ నంబర్‌కు కాల్ చేయాలని వివరించారు. బాల్య వివాహాలు చట్ట ప్రకారం నేరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లయ్య, రాజ్యలక్ష్మి, కుమార్ బాబు తదితరులు పాల్గొన్నారు.ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలిములుగు రూరల్: స్వయం ఉపాధి అవకాశాలను యువత, మహిళా సంఘాల సభ్యులు సద్వి నియోగం చేసుకోవాలని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సిద్ధార్థ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్లో సీఎంఈజీపీ పథకంపై గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే స్థానిక యువత, మహిళా సంఘాల సభ్యులు వ్యాపారాల పట్ల ఆసక్తి చూపాలన్నారు. పీఎంఈ జీపీ అర్హత, రుణ పరిమితి, సబ్సిడీ ప్రయోజనాలు, ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ గురించి వివరించారు. వ్యాపారాలు ప్రారంభించేందుకు అవసరమైన ప త్రాలు, డీపీఆర్ ప్రాజెక్టు రిపోర్టు తయారీ, కేవీఐసీ, డీఐసీ, బ్యాంకుల పాత్ర గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇడీసీ మేనేజర్ విక్రమ్, అసిస్టెంట్ మేనేజర్ భూక్య శ్రీకాంత్, రీసోర్స్ పర్సన్ అశోక్, జయప్రకాశ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి తుల రవి, డీపీఎం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ చేపట్టాలి
ములుగు రూరల్: ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ చేపట్టాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన బస్సుజాతా ములుగు జిల్లా కేంద్రానికి గురువారం చేరుకుంది. ఈ సందర్భంగా డీఎల్ఆర్ ఫంక్షన్‌హాల్ నుంచి గాంధీచౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మావోయిస్టుల ఎన్కౌంటర్లను సుప్రీంకోర్టు సుమోటగా స్వీకరించి విచారణ చేపట్టాలన్నారు. మావోయిస్టులను టెర్రరిస్టుల మాదిరిగా కేంద్రం భావించడం సరికాదన్నారు. కేంద్రంలో బీజేపీ నరహంతక పాలన కొనసాగిస్తుందని ఆరోపించారు. ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు వామపక్ష ప్రజాతంత్ర శక్తులు ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అమలుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు. డిసెంబర్ 26న ఖమ్మంలో నిర్వహించతలపెట్టిన సభకు కార్మికులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జున్, జిల్లా సహాయ కార్యదర్శి జంపాల రవీందర్, ఎండి అమ్జద్‌పాషా, ముత్యాల రాజు, బండి నర్సయ్య, సారయ్య, శ్రీనివాస్, రమేష్, తిరుపతి, రమా, ప్రమీల, రాజకుమారి, కమలక్క, లింగమూర్తి, రాధ తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు -
ప్రతిభకు ప్రోత్సాహం
23న ఎన్ఎంఎంఎస్ పరీక్ష.. హాజరు కానున్న 247 మందిప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ పరీక్షకు అర్హులుగా గుర్తించారు. విద్యార్థులు ఏడవ తరగతిలో 55 శాతం మార్కుల సాధించి ఉండాలని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 50 శాతం సాధించాలనే నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాలలతో పాటు హాస్టల్ వసతి లేని ఆదర్శ పాఠశాలల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.● ఎంపికై న విద్యార్థులకు రూ.12 వేల చొప్పున ఉపకారవేతనం ● నాలుగేళ్లపాటు అందజేయనున్న కేంద్ర ప్రభుత్వంములుగు రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులు ఆర్ధిక సమస్యలతో విద్యాభ్యాసాన్ని మధ్యలోనే నిలిపివేయకుండా విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్) అందిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులను అర్హులుగా గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎన్ఎంఎంఎస్ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులకు ఉపకారవేతనం అందిస్తారు. అర్హత పొందిన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు నాలుగు సంవత్సరాల పాటు ఏడాదికి రూ. 12వేల చొప్పున ఉపకార వేతనం విద్యార్థుల బ్యాంకు ఖాతాలలో జమ చేస్తారు. -
పథకాలను ప్రజలకు సకాలంలో అందించాలి
ములుగు రూరల్: కేంద్ర ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు సకాలంలో అందించాలని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్ అన్నారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన దిశ సమావేశానికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ దివాకరతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. వాటిని సద్వినియోగం చేసుకొని అభివృద్ది సాధించాలన్నారు. జిల్లాలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి సహకరించాలని కోరారు. జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ది పనుల నివేదికలను అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో రాబట్టుకుని జిల్లాను ప్రగతిపథంలోకి తీసుకెళ్లాలని వివరించారు. జిల్లాలో కోల్డ్ స్టోరేజీలు, గోదాంల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలన్నారు. చెక్ డ్యామ్‌ల నిర్మాణం, జంగాలపల్లి టు పస్రా ఫోర్‌లైన్ రోడ్డు నిర్మాణం, జలగలంచ, కృష్ణాపురం, టేకులగూడెం బ్రిడ్జిల నిర్మాణాల ప్రతిపాదనలు, ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జిల్లాను నాల్గో స్థానంలో నిలిపినందుకు అధికారులను అభినందించారు. అనంతరం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి పనులను సంబంధిత శాఖల అధికారులు ప్రజలకు వివరించాలన్నారు. జిల్లాలో నూతన అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో దిశ కమిటీ మెంబర్ పూర్ణచందర్, అదనపు కలెక్టర్ మహేందర్ జీ, ఆర్డీఓ వెంకటేశ్, డీఆర్డీఓ శ్రీనివాస్, డీఎస్పీ రవీందర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్ -
ఈ సారైనా మోడికుంట పూర్తయ్యేనా?
వాజేడు: మరో రెండు నెలల్లో మోడికుంట ప్రాజెక్టు పనులు ప్రారంభం అవుతాయని ప్రచారం సాగుతుంది. అదే నిజమైతే ఏజెన్సీ ప్రజల ఏళ్ల నాటి కళ నెర వేరుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎస్అర్సీ కంపెనీ సర్వే పనులు మొదలు పెట్టినట్లుగా తెలుస్తుంది. 2005లో ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు మండల పరిధిలోని కృష్ణాపురం సమీపంలో మోడికుంట వాగుపై ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం 26 మే 2005న రూ.124.6 కోట్లతో పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది. దీనిలో భాగంగా 1259 మీటర్ల మట్టి కట్ట, 92 మీటర్ల స్పిల్‌వే, 21.85 కిలో మీటర్ల ప్రధాన కాల్వ, 10 డిస్ట్రిబ్యూటర్లు నిర్మించాల్సి ఉంది. తొలుత గామన్ ఇండియాకు పనులు ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ముంబాయికి చెందిన గామన్ ఇండియా కంపెనీ రూ.118.95 కోట్లతో జూలై 2005లో ఒప్పందం చేసుకుంది. రెండు సంవత్సరాల్లో ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ అది సాధ్యం కాలేదు. 1250 ఎకరాల అటవీ భూమి అవసరం కాగా సమస్య తలెత్తింది. ఈ ప్రాజెక్టు ద్వారా 13,590 ఎకరాలకు సాగునీరు, 35 గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉంది. పలు అనుమతులు ఆలస్యం కావడంతో పాటు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టు 20 ఏళ్లుగా నిర్మాణానికి నోచుకోలేదు. కాల్వల నిర్మాణానికి భూసేకరణ జరిగినప్పటికీ కాంట్రాక్టర్ కాల్వ నిర్మాణాన్ని చేపట్టలేదు. పలు మార్లు నోటీసులను జారీ చేసినప్పటికీ కాంట్రాక్టర్ నుంచి ఎలాంటి స్పందన లేక పోవడంతో 2022 ఆగష్టులో ఈ సంస్థను తొలగించి మరో సంస్థకు ప్రాజెక్టు పనులను ఇవ్వడం కోసం ప్రభుత్వం అంచనాలను సవరించింది. సవరించిన అంచనాల ప్రకారం రూ.527.66 కోట్లుగా నిర్ధారించి 29 ఆగష్టు 2022న ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని అనుసరించి సంబంధిత శాఖ 29 అక్టోబర్ 2023న గామన్ ఇండియా సంస్థకు నోటీసులను జారీ చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో 31 జనవరి 2024న సదరు కాంట్రాక్టర్‌ను తొలగించినట్లు తెలిసింది. ప్రాజెక్టు అంచనాల పెంపు అటవీ భూముల సేకరణ, నిర్మాణ వ్యయం పెరగడంతో 2024–25 సంవత్సరానికి అనుగుణంగా తాజా అంచనాల ప్రకారం రూ.720.84 కోట్లుగా నిర్ధారించారు. సంబంధిత ప్రతిపాదనలను ఇంజనీరింగ్ శాఖ పంపగా రాష్ట్రస్థాయి స్టాండింగ్ కమిటీ 2024 నవంబర్ నెలలో పరిశీలించి రూ.718.60 కోట్లుగా ఆమోదించింది. ఈ మేరకు 17మే 2025న నీటి పారుదల శాఖ అధికారిక శాఖ నివేదికలను పంపించింది. 29 జూలై 2025న నిర్వమించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి అంచనాలను పెంచినట్లు సమాచారం. పనులు దక్కించుకున్న ఎస్ఆర్సీ ఇంఫ్రా కంపెనీ ప్రాజెక్టు స్థలం వద్ద సర్వే పనులు షురూఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎస్అర్సీ కంపెనీ టెండర్ ద్వారా పనులు దక్కించుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు సదరు కంపెనీ కృష్ణాపురం గ్రామ సమీపంలో మోడికుంట ప్రాజెక్టు నిర్మాణ ప్రదేశంలో సర్వే పనులు చేపట్టినట్లు సమాచారం. రెండు నెలల్లో ప్రాజెక్టు పనులు మొదలు పెట్టే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. ఈ సారైన ప్రాజెక్టు పనులను చేపట్టి నిర్మాణ పనులు పూర్తి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం..
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉపకార వేతనాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. పరీక్షకు ప్రణాళికతో చదివితే అర్హత సాధించవచ్చు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు ఆయా సబ్జెక్టుల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తూ మెళకువలు నేర్పిస్తున్నారు. గతంలో ఎంటే ఎక్కువ మంది విద్యార్థులు అర్హత సాధించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఎన్ఎంఎంఎస్ పరీక్ష నిర్వహణకు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశాం. రెండు పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశాం. – సిద్ధార్థరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి● -
ఎన్సీడీ స్క్రీనింగ్ పూర్తిచేయాలి
● డీఎంహెచ్ఓ గోపాల్‌రావు మంగపేట : ఎన్సీడీ స్క్రీనింగ్‌ను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు వైద్యాధికారులు, సిబ్బందిని ఆదేశించారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పీహెచ్సీ నిర్వహణ రికార్డులు, సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంగపేట, వైద్యాధికారి స్వప్నిత, చుంచుపల్లి పీహెచ్సీ వైద్యాధికారి యమున, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల పట్ల అంకితభావంతో సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. అనంతరం అసంఘటిత వ్యాదుల నివారణ(ఎన్సీడీ) సిబ్బందికి ప్రొగ్రాం అధికారి పవన్‌కుమార్ ఎన్సీడీ స్క్రీనింగ్‌పై శిక్షణ కల్పించారు. సకాలంలో ఎన్సీడీ స్క్రీనింగ్‌ను పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమం త్వరితగతిన పూర్తయ్యే విధంగా వైద్యాధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ వెంకట్, ఆయా పీహెచ్‌సీల వైద్యులు, సిబ్బంది, ఏఎన్ఎం, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు. -
సీసీఐ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి
ములుగు రూరల్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి అన్నారు. మండల పరిధిలోని జాకారం సమీపంలో గల రాజరాజేశ్వర కాటన్ మిల్లులో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఆమె గురువారం ప్రారంభించి మాట్లాడారు. పత్తి రైతులకు మిల్లర్లతో సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తీసుకు రావాలన్నారు. రైతులకు అన్యాయం జరుగకుండా పారదర్శకంగా కొనుగోళ్లు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి సోనియా, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
అక్రమ పట్టాను రద్దు చేయాలి
ములుగు రూరల్: గోవిందరావుపేట మండలం పస్రా నాగారం శివారులో 40 ఎకరాల ప్రభుత్వ భూమి పట్టాను రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు తుమ్మల వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ దివాకరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే నంబర్ 109/ఏ/ఈ లో 40 ఎకరాల ప్రభుత్వ భూమిని పుల్యాల వసంత పేరున అక్రమ పట్టా పొందారని ఆరోపించారు. భూమిలో 30 ఎకరాల్లో చిన్న, సన్నకారు రైతులు సాగులో ఉన్నారని తెలిపారు. మిగతా 10 ఎకరాల భూమిలో 570 మంది నిరుపేదలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారని వెల్లడించారు. ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కి స్థానిక రెవెన్యూ అధికారులు అక్రమ పట్టా చేశారని వివరించారు. రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమిగా నిర్ధారించారని తెలిపారు. ప్రభుత్వ భూమిని పట్టా చేయించుకున్న వసంతపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గుడిసె వాసులకు వెంటనే పట్టాలు అందించాలని కోరారు. లేనిపక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సోమ మల్లారెడ్డి, చిట్టిబాబు, ఆగిరెడ్డి, రాజేశ్, ప్రవీణ్, రవీందర్, నాగరాజు, సువర్ణ, అశోక్, సరళ, సులోచన, బ్రహ్మచారి, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా -
16 రోజులు.. 4 వేల కిలోమీటర్ల సైక్లింగ్
ములుగు: కశ్మీర్ టు కన్యాకుమారి వరకు 4వేల కిలోమీటర్ల సైక్లింగ్ రైడ్‌ను 16 రోజుల్లో జిల్లా ఫైర్ అధికారి నాగరాజు పూర్తిచేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయనను బుధవారం ట్రైసిటీ రైడర్స్ వరంగల్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డితో పాటు అగ్నిమాపక సిబ్బంది శాలువాతో సత్కరించి అభినందించారు. సర్ధార్ వల్లాభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని భారత ప్రభుత్వం ఫిట్ ఇండియాలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఆఫర్స్ అండ్ స్పోర్ట్స్ వారు మొట్ట మొదటిసారిగా ఇండియాలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శ్రీఏ రైడ్ ఫర్ యునిటీశ్రీ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో 31 రాష్ట్రాల నుంచి 3 వేల మంది దరఖాస్తు చేసుకోగా 150 మందిని ఎంపిక చేశారు. ఈ పోటీలో జిల్లా ఫైర్ ఆఫీసర్ నాగరాజు ఎంపికయ్యారు. నవంబర్ 1న శ్రీనగర్ నుంచి మొదలైన సైక్లింగ్ ఈ నెల 16వ తేదీ వరకు సాగింది. కన్యాకుమారికి చేరుకునేలా రోజుకు 250 కిలోమీటర్ల చొప్పున 16 రోజుల్లో పూర్తి చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ సైక్లింగ్ రైడ్ అందమైన అనుభూతిని ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ సైక్లింగ్ రైడ్ మరిచిపోలేనిదని ఆనందం వ్యక్తం చేశారు. పూర్తిచేసిన జిల్లా ఫైర్ ఆఫీసర్ నాగరాజు సన్మానించిన ట్రైసిటీ రైడర్స్ వరంగల్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, అగ్నిమాపక సిబ్బంది -
క్రీడలతో మానసికోల్లాసం
ఏటూరునాగారం: క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడుతాయని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అన్నారు. మండల కేంద్రంలోని కొమురం భీమ్ మినీ స్టేడియంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్ విద్యార్థులకు జోనల్ స్థాయి క్రీడాపోటీలను ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా జ్యోతి ప్రజ్వలన చేసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ క్రీడలతో విద్యార్థుల్లో చురుకుదనం పెరుగుతుందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో గల ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, కరీంనగర్, జగిత్యాల జిల్లాల నుంచి దాదాపు 1600 మంది బాల బాలికలు పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను డిసెంబర్లో నిర్వహించనున్న రాష్ట్రా స్థాయి క్రీడాపోటీలకు పంపనున్నట్లు వివరించారు. బాల బాలికలకు వేర్వేరుగా వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో ఏటూరునాగారంలో నిర్వహించబోయే రాష్ట్రస్థాయి క్రీడాపోటీల్లో ఏటూరునాగారం ఐటీడీఏ ప్రథమ బహుమతి గెలుపొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు, ఈఈ వీరభద్రం, డిప్యూటీ డైరెక్టర్ జనార్ధన్, ఏఓ రాజ్‌కుమార్, హనుమకొండ డిప్యూటీ డైరెక్టర్ హేమలత, ఏసీఎంఓ రవీందర్, జీసీడీఓ సుగుణ, స్పోర్ట్స్ అధికారులు సుమలత, ఆదినారాయణ, కృష్ణ, నారాయణ పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా జోనల్‌స్థాయి క్రీడాపోటీలను ప్రారంభించిన పీఓఐటీడీఏ అధికారులు దూర ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులకు కనీస ఏర్పాట్లను చేయకపోవడంతో ఇద్దరు క్రీడాకారులు జమున, రేణుక సొమ్మసిల్లి పడిపోయారు. క్రీడా అధికారులు విద్యార్థులను గంటల తరబడి ఎండలో నిలబెట్టడంతో పడిపోయారు. వారికి అందుబాటులో ఉన్న వైద్య సిబ్బందితో చికిత్సలు చేయించి ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. -
నీరు నిల్వచేయలేక!
నివేదిక ఇవ్వక.. ఏటూరునాగారం: జిల్లాలోని సమ్మక్క బ్యారేజ్ డీపీఆర్ రెండేళ్లుగా అధికారులు నివేదిక ఇవ్వడం లేదు. దీంతో బ్యారేజ్‌లో నీటిని నిల్వ చేయలేక ఇరిగేషన్ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రిబ్యునల్‌కు రెండు రాష్ట్రాల పంచాయితీ చేరినా పరిష్కారం పరిస్థితి నెలకొంది. ఏం చేయాలో తెలియక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కన్నాయిగూడెం మండల పరిధిలోని తుపాకులగూడెం వద్ద నిర్మించిన సమ్మక్క బ్యారేజ్ నీటి సామర్థ్యం అంతంతగానే మారింది. బ్యారేజ్‌పై డిటేల్డ్ ప్రాజెక్టు రిపోర్టును ఇచ్చేందుకు ఇరిగేషన్ అధికారులు రెండేళ్లుగా నాన్చుతున్నారు. బ్యారేజ్ బ్యాక్ వాటర్‌తో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన 32 ఎకరాల భూమి ముంపునకు గురవుతోంది. ఆ భూమిని సమ్మక్క ప్రాజెక్టు కింద కొనుగోలు చేయాల్సి ఉంది. ఇందుకు గాను రెండేళ్ల క్రితం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఇరిగేషన్ అధికారులు జాయింట్ సర్వే చేపట్టారు. కానీ రిపోర్టు మాత్రం ఇవ్వడం లేదు. సమ్మక్క బ్యారేజ్ కెపాసిటీ నీటి సామర్థ్యం 6.5 లక్షల క్యూసెక్కులు. దీనికి తగ్గట్టుగా బ్యారేజీలో నీటిని నిల్వ చేయాల్సి ఉంది. కానీ బ్యారేజ్‌కు ఉన్న 59 గేట్లు మూసివేసి నీటిని నిల్వ చేస్తే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని 32 ఎకరాల భూమి ముంపునకు గురవుతుంది. దీనిపై ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన ఇంజనీరింగ్ అధికారులు రిపోర్ట్ ఇవ్వాలని బాధ్యతలను అప్పగించింది. ఏడాది దాటినా ఇంత వరకు రిపోర్టు రాలేదు. సమ్మక్క బ్యారేజ్ నిర్మాణం దేవాదుల ఎత్తిపోతల పథకానికి భరోసాగా నిలిచేందుకు నిర్మించారు. కాని సమ్మక్క బ్యారేజ్‌కు ఉన్న 59 గేట్లను మూసివేసినప్పటికీ 6.5 క్యూసెక్కుల నీటిని నిల్వ చేసుకోలేక అధికారులు ఇబ్బంది పడుతున్నారు. వచ్చిన నీటిని గోదావరి దిగువకు వదిలేసి ఉన్న నీటినే పట్టుకొని దేవాదులకు మళ్లిస్తున్నారు. అయితే సామర్థ్యానికి తగ్గట్టుగా నిల్వ చేయకపోవడంతో దేవాదులలోని మోటార్లు నీటిని ఎత్తిపోసే పరిస్థితి లేకుండా పోయింది. ఏదిఏమైనప్పటికీ 32 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వం చేజిక్కుంచుకునే వరకు బ్యారేజ్ నీటి సామర్ధ్యం అంతంతేగా ఉండే పరిస్థితి ఉంది.దీంతో ఈ నెల 9న హైదరాబాద్‌లో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇరిగేషన్ అధికారులతో సమావేశమై భూమి విషయాన్ని తేల్చాలని ఆదేశించారు. దీనిపై చర్చించేందుకు ఈనెల 16, 17 తేదీల్లో ఢిల్లీలోని గోదావరి జలాల ట్రిబ్యునల్‌కు రాష్ట్ర భారీ నీటిపారుదల మంత్రిత్వశాఖ, ఇరిగేషన్ అధికారులు సమస్యను వివరించారు. కానీ ఎలాంటి పరిష్కారం కాలేదు. ఇటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సరైన పరిష్కారం చూపకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించకపోవడం వంటి అంశాలతో సమ్మక్క బ్యారేజ్ నీటి సామర్థ్యం ప్రశ్నార్థకంగా మారింది. రెండేళ్ల నుంచి ఈ సమస్య జఠిలం కావడంతో ఇరిగేషన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
కళ్ల ముందే దందా..
సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రేటర్ వరంగల్‌లో గుట్కా దందా రూట్ మార్చింది. గతంలో టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడులు, అరెస్టుల పరంపరకు పలువురు పంథా మార్చారు. ఇతర ప్రాంతాలపై దృష్టి సారించారు. గ్రేటర్ వరంగల్ పరిసర మండలాలు, గ్రామాలకు విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలనుంచి వరంగల్‌కు వలస వచ్చిన కొందరు, గుట్కా దందాలో ఆరితేరిన స్థానిక వ్యాపారులతో కలిసి మళ్లీ దందాను సాగిస్తున్నట్లు సమాచారం. గతంలో వారికి సహకరించిన వివిధ రాజకీయ పార్టీల నేతల అండదండలతో చాపకింద నీరులా వ్యాపారాన్ని విస్తరించినట్లు ఇటీవల నమోదైన కేసులు, పోలీసులకు లభ్యమైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. బీదర్ టు వరంగల్ వయా హైదరాబాద్.. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌నుంచి హైదరాబాద్ ద్వారా వరంగల్‌కు ఈ గుట్కా చేరుతోంది. హైదరాబాద్ బేగంబజార్‌కు చెందిన ఓ మార్వాడి వ్యాపారి వరంగల్‌లోని కొందరికి సరఫరా చేస్తున్నారు. ఇక్కడినుంచే ఉమ్మడి నల్లగొండ, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలకు చేరవేస్తున్నట్లు గతంలో పోలీసులకు చిక్కిన వారు విచారణలో చెప్పడం గమనార్హం. వరంగల్, హనుమకొండలలోని శివనగర్, పిన్నవారి స్ట్రీట్, టైలర్ స్ట్రీట్ తదితర ప్రాంతాలకు చెందిన కొందరు ఈ దందాలో భాగస్వాములైనట్లు పోలీసు రికార్డుల్లో ఉంది. వరంగల్‌కు చెందిన అంబర్ డిస్ట్రిబ్యూటర్లు, ధర్మారానికి చెందిన కొందరిపై ఫిర్యాదులున్నాయి. వరంగల్‌కు చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్ నిషేధిత పొగాకు ఉత్పత్తులను ఆటోల ద్వారా గ్రేటర్ వరంగల్ చుట్టున్న కొన్ని మండలాలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. అంబర్, అనార్, మిరాజ్, ఆర్ఆర్ పాన్ మసాలల పేరిట నిషేధిత గుట్కాలకు సరఫరా చేస్తూ.. పోలీసులకు చిక్కి కోర్టుకు వెళ్లాల్సి వస్తే పాన్ మసాలాల పేర్లు చెప్పి బయట పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నిన్న, మొన్నటి వరకు వ్యాపారులే గుట్కా దందా చేయగా.. తాజాగా వివిధ పార్టీలకు చెందిన కొందరు నాయకులే సూత్రధారులుగా మారి దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క లారీ సరుకుపై రూ.60–రూ.75 లక్షల ఆదాయం.. మాణిక్‌చంద్, సితార్, సాగర్, గోవా, రెబల్, సిమ్లా, గోవా, అంబర్ .. తదితర బ్రాండ్లకు చెందిన నిషేధిత పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. కంపెనీనుంచి హోల్‌సేల్ వ్యాపారికి.. అక్కడినుంచి రిటైల్‌గా షాపులకు సరఫరా చేసేందుకు ప్రతి జిల్లాలో ‘గుట్కా మాఫియా’పెద్ద నెట్‌వర్క్‌నే ఏర్పాటు చేసుకుంది. ఒక్క గుట్కా లారీ (డీసీఎం వ్యాన్) నేరుగా వ్యాపారి వద్దకు వస్తే రూ.60 లక్షల సంపాదన వచ్చినట్లే. ఒక లారీలో 250 కాటన్ల గుట్కా వస్తుంది. ఒక్కో కాటన్లో 70 పొడలు, ఒక్కో పొడలో 50 ప్యాకెట్లు ఉంటాయి. 50 పొట్లాలు ఉండే ఒక్క పొడ (బాక్స్) రూ.350లకు ఇస్తుండగా... రిటైల్ వ్యాపారులు ‘నిర్భంధం, నిషేధం, పోలీసు నిఘా’తదితర పదా లు వాడుతూ రూ.750ల వరకు సొమ్ము చేసుకుంటున్నారు. అంటే ఒక్క గుట్కా ప్యాకెట్‌ను రూ.7కు తీసుకుని రూ.15ల నుంచి 18లు, ఆపై రేట్లకే అమ్ముతున్నారంటే లాభాలు ఏ మేరకు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. హోల్‌సేల్ వ్యాపారులు ఇవే గుట్కాలను కంపెనీని బట్టి రూ.20 నుంచి రూ.25ల వరకు.. పాన్టేలా, కిరాణం దుకాణం దారులు రూ.30ల నుంచి రూ.40లు అమ్ముతున్నారు. గుట్కా విక్రయాలను తీవ్రంగా పరిగణిస్తూ దాడులు చేస్తూ కేసులు పెడుతున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు. అయినా ఆగకపోవడంతో పోలీసులు ఇంకా కఠినంగా వ్యవహరించాలని, ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు. యథేచ్ఛగా వ్యాపారం.. రూ.లక్షల్లో పట్టుబడుతున్న గుట్కా కర్ణాటక నుంచి హైదరాబాద్ ద్వారా వరంగల్‌కు.. నిల్వ కేంద్రాలుగా ‘గ్రేటర్’ పరిసరాలు.. ఇక్కడినుంచే పొరుగు జిల్లాలకు పోలీసులకు కీలక సమాచారం?.. వ్యాపారులకు రాజకీయ మద్దతు -
చీరలు సకాలంలో పంపిణీ చేయాలి
ములుగు రూరల్: మహిళా సమాఖ్య సభ్యులకు ఇందిరమ్మ చీరల పంపిణీ సకాలంలో చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వాకటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి రామక్రిష్ణారావులతో కలిసి సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా నుంచి కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు, డీఆర్డీఓ శ్రీనివాస్, మహిళా సమాఖ్య సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది మహిళలకు చీరలను పంపిణీ చేయాలన్నారు. మహిళలకు పండుగ వాతావరణంలో చీరలను అందించాలని సూచించారు. డిసెంబర్ 9వ తేదీ నాటికి పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ చీరల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలిపారు. మహిళా సమాఖ్య సభ్యులకు చీరలను అందించేందుకు సిద్ధం చేస్తున్నామన్నారు. జిల్లాలో అన్ని మండలాలకు చీరలను అందిస్తామని వివరించారు. వీసీలో సీఎం రేవంత్‌రెడ్డి -
ములుకనపల్లిలో పోస్టాఫీస్ ప్రారంభం
వాజేడు: మండల పరిధిలోని మారుమూల గ్రామమైన ములుకనపల్లిలో బుధవారం పోస్టాఫీసును ప్రారంభించారు. పోస్టల్ డిపార్ట్మెంట్ భద్రాచలం ఏఎస్పీ ప్రకాశ్‌రావు రిబ్బన్ కత్తిరించి పోస్టల్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్టాఫీసు ద్వారా అందుబటులో ఉన్న సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. రంగోలి పోటీలు ములుగు రూరల్: జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా 6వ రోజు విద్యార్థినులకు రంగోలి పోటీలను నిర్వహించారు. ఈ మేరకు బుధవారం ఇంటర్మీడియట్ విద్యార్థినులు, మహిళా పాఠకులు రంగోలి పోటీల్లో పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థినులకు గ్రంథాలయ సిబ్బంది బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి అలివేలు, సీనియర్ అసిస్టెంట్ నిఖిల్, గ్రంథాలయ పాలకురాలు సమ్మక్క, కళాశాల అధ్యాపకుడు రఫీ తదితరులు పాల్గొన్నారు. ముసుగులు తీసేదెప్పుడో? ఏటూరునాగారం: గత నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని గ్రామ పంచాయతీ అధికారులు హడావుడిగా ఎన్నికల కోడ్ ఉందని రాజకీయ నాయకుల విగ్రహాలు, శిలాఫలకాలకు ముసుగులు వేశారు. కానీ అనివార్య కారణాలతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎన్నికల కోడ్‌ను సడలించారు. అయినప్పటికీ స్థానిక గ్రామ పంచాయతీ అధికారులు, సిబ్బంది మాత్రం శిలాఫలకాలకు వేసిన ముసుగులను మాత్రం తీయకుండా నిర్లక్ష్యంగానే వదిలేశారు. స్వయంగా మంత్రి సీతక్క ప్రారంభించిన శిలాఫలకాలకు వేసిన ముసుగులను అలాగే వదిలేయడం అధికారుల పనితీరుకు నిదర్శనంగా మారింది. హేమాచలుడికి శాంతి కల్యాణంమంగపేట: మండల పరిధిలోని మల్లూరులో గల శ్రీ హేమాచలక్షేత్రంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు ఆలయ పూజారి ముక్కామల శేఖర్శర్మ ఆధ్వర్యంలో బుధవారం శాంతికల్యాణం(మాస కల్యాణం) జరిపించారు. యాగశాలలో స్వామివారి జన్మనక్షత్రం(స్వాతి) సందర్భంగా ఉత్సవ మూర్తులకు శాంతి కల్యాణాన్ని వేదమంత్రోచ్ఛరణ నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్న భక్తులు శాంతి కల్యాణంలో పాల్గొన్నారు. అదే విధంగా లక్ష్మీనర్సింహస్వామిని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ బుధవారం దర్శించుకున్నారు. మొదటి సారిగా ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ పూజారులు శేఖర్శర్మ, రాజీవ్ నాగఫణిశర్మ మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఆయన గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. ఆనంతం స్వామివారి విశిష్టత, ఆలయ చరిత్రను వివరించి స్వామివారి శేష వస్త్రాలను అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు. బాల్యవివాహాలపై కళాజాతా కాళేశ్వరం: మహదేవపూర్, అంబట్పల్లి, సూరారం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలల్లో కలెక్టర్, డీపీఆర్ఓల ఆదేశాల మేరకు మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్యవివాహాలపై తెలంగాణ సాంస్కృతిక సారథి సెగ్గం శిరీష కళా బృందం అవగాహన కల్పించారు. బాల్యవివాహాలతో కలిగే అనర్థాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు పాల్గొన్నారు. -
వయోవృద్ధుల హక్కులను గౌరవించాలి
ఏరియా ఆస్పత్రి నుంచి చేపట్టిన ర్యాలీసదస్సులో మాట్లాడుతున్న మహేందర్ ములుగు రూరల్: వయోవృద్ధుల హక్కులను ప్రతిఒక్కరూ గౌరవించాలని జిల్లా సంక్షేమాధికారి తుల రవి అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో బుధవారం ఏరియా ఆస్పత్రి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా ఆశయాలు, మా శ్రేయస్సు, మా హక్కులు అనే థీమ్‌తో వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వయోవృద్ధులు దేశానికి వెలకట్టలేని సంపద అన్నారు. మన భవిష్యత్‌కు బలమైన పునాదని వివరించారు. ప్రస్తుత సమాజంలో వయో వృద్ధులను పట్టిచుకోవడం లేదన్నారు. వయోవృద్ధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిని సీనియర్ సిటిజన్ యాక్టు ద్వారా వారి హక్కులను కాపాడవచ్చని వివరించారు. వయోవృద్ధుల పట్ల వేదింపులకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. అనంతరం వయోవృద్ధుల సంక్షేమ ఫోరం అధ్యక్షుడు రాంమూర్తి మాట్లాడుతూ వయోవృద్ధుల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రక్షణ చట్టం, పోషణ చట్టం పకడ్బందీగా అమలు చేయాలన్నారు. అనంతరం సంక్షేమశాఖ ఆధ్వర్యంలో క్రీడా, కవితా పోటీలు, వైద్య శిబిరం ఏర్పాటు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీఓ ఓంకార్, వయోవృద్ధుల శాఖ ఇన్చార్జ్ నాగేంద్ర, ఎఫ్ఆర్ఓ గణేశ్, డీసీపీయూ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. వృద్ధుల సంరక్షణ ప్రతీపౌరుడి బాధ్యత వెంకటాపురం(ఎం): వృద్ధుల పట్ల గౌరవం, సంరక్షణ ప్రతీ పౌరుడి బాధ్యతని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ తెలిపారు. మండల పరిధిలోని లక్ష్మీదేవిపేట గ్రామపంచాయతీ ఆవరణలో న్యాయ విజ్ఞాన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకొచ్చిన వృద్ధుల భరణ పోషణ చట్టం 2007 గురించి వివరించారు. కుటుంబ సభ్యుల నుంచి తల్లిదండ్రులకు రక్షణ కల్పించడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశమన్నారు. ఉచిత న్యాయ సహాయానికి టోల్ ఫ్రీ నంబర్ 15100కు కాల్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోతు స్వామిదాస్, పంచాయతీ కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లా సంక్షేమాధికారి తుల రవి -
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి పాటుపడాలి
● జిల్లా సంక్షేమాధికారి తుల రవి ములుగు రూరల్: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతిఒక్కరూ పాటుపడాలని జిల్లా సంక్షేమాధికారి తుల రవి అన్నారు. జిల్లా కేంద్రంలో నషా ముక్త్ భారత్ అభియాన్ వేడుకలను పురస్కరించుకుని మంగళవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందన్నారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి లక్ష్యంతో ముందుకుసాగాలన్నారు. డ్రగ్స్‌కు బానిసగా మారితే మానడం చాలా కష్టమని తెలిపారు. డ్రగ్స్‌కు బానిసగా మారిన వారిని గుర్తిస్తే టీజీఏఎన్‌బీ విభాగాన్ని సంప్రదించాలని సూచించారు. విద్యార్థులు చెడు మార్గంలో వెళ్లకుండా ఉపాధ్యాయులు కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు పోలీస్‌శాఖకు ప్రతిఒక్కరూ సహకరించాలనానరు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ భగవద్గీత, బాలల పరిరక్షణ అధికారి ఓంకార్, కమ్యూనిటీ ఎడ్యుకేటర్ అనూష, నషా ముక్త్ అభియాన్ జిల్లా ఇన్చార్జ్ నాగేంద్ర, ఎఫ్ఆర్ఓ గణేశ్, మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
డ్రెయినేజీ పనులు.. నిబంధనలు నిల్
ములుగు: మేడారం సమీపంలోని రెడ్డిగూడెంలో నిర్మిస్తున్న డ్రెయినేజీ నిర్మాణం పనుల్లో కాంట్రాక్టర్ నిబంధనలు పాటించడం లేదు. నాణ్యత ప్రమాణాలను పాటించకుండానే తూతూ మంత్రంగా పనులు కానిచ్చేస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెడ్డిగూడెంలో పీఆర్‌శాఖ ఆధ్వర్యంలో రూ.3 కోట్లతో డ్రెయినేజీ నిర్మాణ పనులు చేస్తున్నారు. కాంట్రాక్టర్ ఇష్టారీతిన పనులు చేస్తున్నా అధికారులు చూసీచూడనట్లుగా వదిలేస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి. కర్రతో కంకర కుదింపు డ్రెయినేజీ నిర్మాణం పనుల్లో సైడ్‌వాల్ నిర్మాణం కోసం సెంట్రింగ్ రేకులు కట్టి ఐజాక్స్ మిషన్‌తో కంకర, ఇసుక, సిమెంట్ కలిపి పోస్తున్నారు. ఈ క్రమంలో సైడ్‌వాల్ బలంగా ఉండేలా కంకరను వైబ్రేషన్ మిషన్‌తో కుదించాల్సిన ఉంటుంది. కానీ సదరు కాంట్రాక్టర్ కర్రతో కంకరను కుదిస్తూ పనులు చేయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా సిమెంట్, కంకర, ఇసుక సమాన స్థాయిలో మిక్సింగ్ చేయాల్సి ఉండగా ఇసుక ఎక్కువగా పోసి సిమెంట్ తక్కువగా కులుపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పది కాలల పాటు డ్రెయినేజీలు నిలిచేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా డ్రెయినేజీల నిర్మాణంలో చెట్టు, కరెంట్ స్తంభాలు అడ్డుగా వచ్చినా వాటి మధ్యలో నుంచే డ్రెయినేజీలు నిర్మిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం, పనులను పర్యవేక్షించకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. మంత్రుల ఆదేశాలు పట్టించుకోని కాంట్రాక్టర్ మేడారం జాతర అభివృద్ధి పనుల నాణ్యతలో రాజీపడేది లేదని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి సీతక్కలు కాంట్రాక్టర్లను అదేశించినా వారి అదేశాలను బేఖాతర్ చేస్తూ ఇష్టారితీన పనులు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. డ్రెయినేజీల నిర్మాణాల్లో అడ్డుగా వస్తున్న విద్యుత్ స్తంభాలను తొలగించాల్సి ఉండగా వాటిని తొలగించకుండానే నిర్మాణాలు చేపడుతు న్న అధికారులు పట్టింపులేనట్లుగా వ్యహరిస్తున్నారని చర్చించుకుంటున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పనులు నిబంధనల ప్రకారం చేపట్టేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. పట్టించుకోని అధికారులు మంత్రుల ఆదేశాలు బేఖాతర్ -
రేవంత్ మాటలు ఘనం.. చేతలు శూన్యం
వరంగల్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఆయన చెప్పే మాటలు ఘనంగా ఉంటున్నాయని, చేతలు మాత్రం శూన్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించారు. మక్కలు, పత్తి యార్డుల్లోని రైతులతో మాట్లాడారు. వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలో రైతుల పక్షపాతి ఒక్క కేసీఆర్ మాత్రమే అని, ఆయన మొట్టమొదటిసారిగా రైతుబంధు తెచ్చి రైతులను ఆదుకున్నారని అన్నారు. రాష్ట్రంలో పత్తి రైతులు తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారు. సీసీఐ అడ్డమైన ఆంక్షలు పెట్టి ఆగమాగం చేస్తున్నా రేవంత్‌రెడ్డి లేఖలు రాస్తూ పట్టించుకోవడం లేదన్నారు. పంటలకు బోనస్ ఇస్తామని అనడమే కానీ, ఇచ్చింది లేదన్నారు. ఎల్1, ఎల్2, కపాస్ యాప్, తేమశాతం లాంటి తుగ్లక్ నిర్ణయాలతో రైతులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడానికి విచ్చలవిడిగా డబ్బులు పంచిన రేవంత్‌రెడ్డి పత్తి రైతులకు కనీస మద్దతు ధర అందించలేకపోతున్నారని ఆరోపించారు. మక్క రైతులతో మాటామంతి.. అంతకుముందు అపరాల యార్డుకు వెళ్లిన హరీశ్‌రావు మక్కలను పరిశీలించారు. అమ్మడానికి వచ్చిన ములుగు జిల్లాకు చెందిన రైతులు వెంకటేశ్వర్లు, లక్ష్మయ్యలతో ముచ్చటించారు. మక్కలను ఎంతకు అమ్మారు అని ప్రశ్నించగా రూ.1,825లకు అని సమాధానం చెప్పారు. మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,400లు ఉంది కదా అని అంటే.. వారు ట్రేడర్‌కు అమ్మామని, ఆయన వెంటనే డబ్బులు ఇవ్వడమే కాకుండా పంట వేసేందుకు ముందుగా పెట్టుబడి పెడుతున్నందున విక్రయించామని చెప్పారు. కేంద్రాల్లో కొనుగోలు చేసిన మక్కలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్ల మార్క్‌ఫెడ్ రైతులకు డబ్బులు చెల్లించలేక పోతోందని హరీశ్‌రావు అన్నారు. అందువల్ల క్వింటాల్‌కు రైతులు రూ.575లు నష్టపోతున్నా ట్రేడర్లకే అమ్ముకుంటున్నారని వాపోయారు. కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ టి.రవీందర్రావు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఒడితల సతీష్‌కుమార్, నన్నపునేని నరేందర్, సరోగసి కమిటీ మాజీ సభ్యురాలు డాక్టర్ హరి రమాదేవి, ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కా కులమర్రి లక్ష్మణ్‌బాబు, నాయకులు పాల్గొన్నారు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్ సందర్శన కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌ను తన్నీరు హరీశ్‌రావు సందర్శించి, రైతులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, బోనస్ రాక, మరోవైపు యూరియా, రైతుబంధు,రైతు బీమా అందకపోవడంతో గోసపడుతున్న రైతులంతా రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం రేవంత్‌రెడ్డిపై శాపనార్దాలు పెడుతున్నారని విమర్శించారు. కేసముద్రం మార్కెట్లో కనీస సౌకర్యాలు లేవని, పందులు, మేకలు తిరుగుతుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంటునుంచి కాంటా దాకా అన్నీ సమస్యలే మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు వరంగల్ ఏనుమాముల మార్కెట్ సందర్శన.. రైతులతో ముచ్చటించి సమస్యలు తెలుసుకున్న మాజీ మంత్రి -
వాహనదారులు అప్రమత్తం
ములుగు: ఉదయం దట్టమైన పొగమంచు కురుస్తుండడంతో రోడ్లు సరిగా కనపడడం లేదని.. డ్రైవర్లు అప్రమత్తంగా వాహనాలు నడిపి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ డాక్టర్ శబరీశ్ సూచించారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఎస్పీ తన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. పొగమంచు కురిసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాహనదారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని సూచించారు. ఉదయం 4 నుంచి 8 గంటల వరకు, రాత్రి 10 గంటల తర్వాత అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలన్నారు. లేకుంటే ప్రయాణాలను మానుకోవాలన్నారు. ముందు వెళ్తున్న వాహనానికి సాధారణం కంటే మూడురేట్లు ఎక్కువ దూరంగా ఉండాలన్నారు. వేగంగా వెళ్తూ ఆకస్మికంగా బ్రేకులు వేయకూడదన్నారు. రోడ్డు మార్కింగ్ లైన్ కనిపించకపోతే రహదారి అంచులను అనుసరిస్తూ డ్రైవింగ్ చేయాలన్నారు. అలాగే నిద్ర లేకుండా డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. పాదాచారులు రాత్రి సమయంలో నల్లటి బట్టలు దరించడం మానుకోవాలన్నారు. బైక్‌లపై రిఫ్లెక్టివ్ జాకెట్లు, హెల్మెట్ పై రిఫ్లెక్టివ్ స్టికర్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. రాత్రి సమయాల్లో ప్రత్యేక నైట్ పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రహదారిపై మరమ్మతులకు గురైన వాహనాలను వెంటనే తొలగించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పోలీసులు చేపడుతున్న చర్యలతో పాటు ప్రతీ వ్యక్తి బాధ్యతగా వ్యవహరిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని సూచించారు. పొగమంచుతో కనిపించని రహదారులు ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లు జాగ్రత్తలు తీసుకోవాలి ఎస్పీ డాక్టర్ శబరీశ్ -
ఉల్లాస్‌తో విద్యాబోధన
మహిళా సంఘాల్లోని సభ్యులకు సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యం ఏటూరునాగారం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన విద్యావిధానంలో భాగంగా ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆన్ ఇన్‌ది సొసైటీ) అనే నూతన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాయి. విద్యాశాఖ, సెర్ప్ సంయుక్త ఆధ్వర్యంలో స్వయం సహాయక మహిళా సంఘాల్లోని సభ్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. మహిళలకు చదవడం, రాయడం, నేర్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అమ్మకు అక్షరాలు.. అ అంటే అమ్మ.. ఆ అంటే ఆవు అన్ని చిన్నప్పుడు చదువుకున్నాం. కానీ ఆ అంటే అక్షరాలను మళ్లీ మొదటి నుంచి ప్రారంభించపోతున్నారు. నారీ లోకానికి అక్షర విజ్ఞానం లేక అనేక కుటుంబాలు వెనుకబడుతున్నాయని 2022లో కేంద్ర ప్రభుత్వం అక్షర విజ్ఞానంపై సర్వే చేపట్టింది. అయితే అందులో ఎక్కువ శాతం మహిళలు నిరక్షరాస్యులుగా ఉండడం గమనార్హం. వారిని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలంటే చదువు ఎంతో అవసరమని కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ కార్యక్రమాన్ని చేపట్టింది. అమ్మకు అక్షరమాల అనే నినాదంతో ఉల్లాస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే రాష్ట్రంలో ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ కార్యక్రమంపై అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ మేరకు అక్టోబర్ 1వ తేదీ నుంచి జిల్లాలోని 9 మండలాల్లో సెర్ప్(ఐకేపీ) ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు(ఎస్హెచ్జే) అక్షరాలు నేర్పించడం ప్రారంభించారు. మండల సమాఖ్య కేంద్రాల్లో వారం రోజుల పాటు శిక్షణను నిర్వహించారు. శిక్షణ పొందిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచురించిన అక్షర వికాసం పుస్తకాలను అందించారు. జిల్లాలోని 9 మండలాల్లో గల మహిళా సంఘాల్లో 68,532 మంది సభ్యులు ఉన్నారు. అందులో చదువుకోని వారు 7,586 మంది ఉన్నట్లుగా అధికారులు గుర్తించి వారికి పది మందికి ఒకరి చొప్పున 940 మంది వలంటీర్లను ఏర్పాటు చేశారు. 10 మంది మహిళా సభ్యులకు అందులో ఒకరిని వలంటీర్‌గా నియమించి చదువు చెప్పినందుకు కొంత పారితోషికం ఇచ్చేలా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాలో 7,586 మంది నిరక్షరాస్యుల గుర్తింపు 940 మంది వలంటీర్ల కేటాయింపు -
పేదింటి బిడ్డ.. సీఐఎస్ఎఫ్ ఉద్యోగం
ఏటూరునాగారం: దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఓ పేదింటి బిడ్డ సీఐఎస్ఎఫ్( సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్) ఉద్యోగం సాధించింది. తండ్రి తన ఐదేళ్ల ప్రాయంలోనే అనారోగ్యంతో మృతి చెందగా తల్లి పిండి మిల్లు పడుతూ వచ్చే డబ్బులతో కుమారుడు, కుమార్తెను ఉన్నత చదువులు చదివించింది. తల్లి కష్టాన్ని చూసిన ఆమె దేశానికి సేవచేయాలని, తల్లి కష్టాన్ని తీర్చాలని పట్టుదలతో సీఐఎస్ఎఫ్ ఉద్యోగం సాధించి ఈ నెల 12న నియామక పత్రాన్ని అందుకుంది. మధ్యప్రదేశ్‌లోని బర్వాహాలో విధుల్లో చేరింది. వివరాల్లోకి వెళ్తే..మండల పరిధిలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన వనపర్తి ఆదినారాయణ శ్రీదేవి దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉంది. తండ్రి ఆదినారాయణ అనారోగ్యంతో మృతి చెందగా తల్లి శ్రీదేవి అన్ని తానై పిండి మిల్లు, కారం గిర్ని నడుపుకుంటూ కొడుకును ఫార్మసీ చేయించింది. కుమార్తె సుప్రియను దేనికి కొదవ లేకుండా పెంచింది. సుప్రియ స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి వరకు చదువుకుంది. ఇంటర్ వరంగల్‌లోని ప్రైవేటు కళాశాలలో చదివి ఉత్తమ ర్యాంక్ సాధించి ఉపకార వేతనంతో చదువుకుంది. ఆ తర్వాత ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి కేయూలో ఎంఎస్సీ ఉచిత సీటు సాధించింది. మూడేళ్ల పాటు చదివిన తర్వాత దేశానికి సేవ చేయాలని, తల్లి కష్టాన్ని తీర్చాలనే ఉద్దేశంతో సెంట్రల్ ఉద్యోగానికి ప్రత్యేక శిక్షణ హైదరాబాద్‌లో తీసుకుని సీఐఎస్ఎఫ్ ఉద్యోగం సాధించింది. తల్లి కష్టానికి ఫలి తాన్ని అందజేసింది. తల్లికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటానని తెలిపింది. చదు వు పేదరికానికి అడ్డు కాదని నిరూపించింది. -
వైభవంగా శివపార్వతుల కల్యాణం
మంగపేట: మండల కేంద్రంలోని శ్రీ ఉమాచంద్రశేఖరస్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్తీకమాసం మాస శివరాత్రి సందర్భంగా అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ కమిటీ చైర్మన్ కోలగట్ల నరేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని ఆలయ పూజారి విస్సావజ్జుల నరేశ్ శర్మ శాస్త్రోక్తంగా జరిపించారు. దేవతామూర్తుల కల్యాణ మహోత్సవానికి మంగపేట, బోరునర్సాపురం, కమలాపురం, చెరుపల్లి తదితర గ్రామాల నుంచి భక్తులు వందలాదిగా తరలివచ్చి భక్తిశ్రద్ధలతో తిలకించారు. ఈ సందర్భంగా భక్తులకు మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
కాటారం: యువజన క్రీడా ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి సాంస్కృతిక పోటీల్లో మండలకేంద్రంలోని కేజీబీవీ, కాటారం జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. బృంద గీతంలో కేజీబీవికి చెందిన పరిమళ బృందం ఉత్తమ ప్రదర్శన ఇచ్చి ప్రథమ స్థానంలో నిలవగా.. బృందనృత్య విభాగంలో సౌమ్య బృందం రెండో స్థానంలో, కాటారం జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన విజ్ఞా బంజార బృందం డప్పు నృత్యంలో ప్రతిభ కనబరిచింది. పరిమళ బృందం, విజ్ఞా బంజార బృందంను రాష్ట్రస్థాయి యువజన పోటీలకు ఎంపిక చేసినట్లు కేజీబీవీ ప్రిన్సిపాల్ చల్ల సునీత, జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం సోమలింగం తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు. -
నందీశ్వరా.. నమస్తుభ్యం
కాళేశ్వరం: కార్తీకమాసం చివరి సోమవారం బహుళ త్రయోదశి సందర్భంగా తూర్పు దిక్కున నందీశ్వరుడికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో రుద్రాభిషేకం, విశేష పూజలను శాస్త్రోక్తంగా పండితులు వైభవంగా నిర్వహించారు. సోమవారం ప్రదోషకాల సమయంలో దేవస్థానం ఉప ప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మ ఆధ్వర్యంలో పండితులు అభిషేక పూజల తంతును నిర్వహించారు. సాయంత్రం 7 గంటల నుంచి 8.30 గంటల వరకు అర్చకులు పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆలయంలో మొదటిసారిగా నిర్వహిస్తుండడంతో తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఎంతో భక్తితో భక్తులు గంటన్నరపాటు పూజతంతును తిలకించి భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. అన ంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ప్రసాద వితరణ చేశారు. భక్తులు భారీగా తరలిరావడంతో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఏకాదశ రుద్రుడే నందీశ్వరుడు.. ఏకాదశ రుద్రుడే నందీశ్వరుడని డాక్టర్ బాచంపల్లి సంతోష్‌కుమార్‌శాస్త్రి భక్తులకు ప్రవచనాలు వినిపించారు. మహాశివుడికి ప్రియభక్తుడు నందీశ్వరుడని తెలిపారు. కార్తీకమాసం బహుళ త్రయోదశి సందర్భంగా నందీశ్వరుడిని కొలిస్తే మహాశివుడు సంతృప్తి చెందుతాడన్నారు. నందీశ్వరుడికి అభిషేకం చేస్తే పాహరణం జరుగుతుందని చెప్పారు. అరుణాచలంలో నందీశ్వరుడికి అభిషేక పూజలు చేస్తారని, ఇప్పుడు కాళేశ్వరంలో నందీశ్వరుడికి అభిషేకం నిర్వహించడం ఎంతో శుభపరిణామం అన్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈఓ మహేష్, అర్చక బృందాన్ని అభినందించారు. పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం శాస్త్రోక్తంగా గంటపాటు భక్తుల విశేష పూజలు -
3,775 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
ములుగు: వానాకాలం 2025–26 సీజన్‌కు సంబంధించి జిల్లాలో ఏర్పాటు చేసిన 185 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 3,775 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు కలెక్టర్ దివాకర సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు 7,131.080 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందని పేర్కొన్నారు. కొనుగోలు చేసిన 3,775.120 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేసినట్లు వివరించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు రూ.1.82 కోట్లను రైతులకు చెల్లించినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు 11,09,198 ఖాళీ సంచులను, 1,843 టార్ఫాలిన్ కవర్లను సరఫరా చేశామని పేర్కొన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోలులో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటే టోల్ ఫ్రీ నంబర్ 9347416178 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులను క్వాలిటీ కంట్రోల్ అధికారులు సోమవారం తనిఖీ చేశారు. ఎస్ఈ మనోహర్, జేఈ రమాదేవీలు గద్దెల చుట్టూ నిర్మిస్తున్న సాలహారం నిర్మాణం పనులను తనిఖీ చేసి నాణ్యతను పరిశీలించారు. అంతేకాకుండా ప్రహరీ నిర్మాణంలో ఏర్పాటు చేస్తున్న రాతి పిల్లర్లను సైతం తనిఖీ నిర్వహించారు. రాతి పిల్లర్ల వెడల్పు, పొడవు కొలతల ప్రకారం ఉన్నాయా లేదా అని పరిశీలించారు. భూపాలపల్లి అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈనెల 21వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రూ.50 అపరాధ రుసుముతో డిసెంబర్ 1వ తేది వరకు, రూ.200 అపరాధ రుసుముతో డిసెంబర్ 12వ తేది వరకు, రూ.500 అపరాధ రుసుముతో డిసెంబరు 30వ తేదీలోపు చెల్లించాలన్నారు. కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం పాలకమండలికి దేవాదా యశాఖ రీ నోటిఫికేషన్ వేసినట్లు ఈఓ మహేష్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో పలుమార్లు పాలకమండలికి నోటిఫికేషన్ వేయగా అనివార్య కారణాలతో వాయిదా పడింది. దీంతో మరోసారి 14మంది డెరెక్టర్లు, ఒక ఎక్స్అఫీషియో సభ్యులకు (అర్చక) నోటిఫికేషన్‌ను ఆ శాఖ కమిషనర్ ఆదేశాలతో వేశారు. ఈ నోటిఫికేషన్ వెలుబడిన 20 రోజుల్లో ఆశావహులు వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ సారైనా పాలకమండలి నియామకం జరుగుతుందా లేదా అని ఆశావహులు చర్చించుకుంటున్నారు. కాటారం: జాతీయ స్థాయి అండర్ 17 విభాగం హ్యాండ్‌బాల్ పోటీలకు మండలకేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థి ఎంపికయ్యారు. ఈ నెల 7నుంచి 9వరకు మహబూబ్‌నగర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో గురుకుల పాఠశాలకు చెందిన క్రీడాకారుడు అజయ్ ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టు తరఫున పాల్గొని అత్యంత ప్రతిభ కనబర్చి గోల్డ్‌మెడల్ సాధించాడు. దీంతో నిర్వాహకులు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ నెల 27నుంచి 30వరకు కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో అజయ్ పాల్గొననున్నారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవడం పట్ల ఎస్జీఎఫ్ఐ కార్యదర్శి జైపాల్, కళాశాల ప్రిన్సిపాల్ రాజేందర్, వైస్ ప్రిన్సిపాల్ మాధవి, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, పీడి మహేందర్, పీఈటీ శ్రీనివాస్, కోచ్ వెంకటేశ్, హర్షం వ్యక్తం చేశారు. -
కావడిలో తీసుకొచ్చి.. వైద్యం చేయించి..
వెంకటాపురం(కె): ప్రభుత్వాలు మారినా ఏజెన్సీ ప్రజలకు అవస్థలు మాత్రం తప్పడం లేదు. మండల పరిధిలోని పామూలూరులో 10కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ క్రమంలో గ్రామానికి చెందిన మడవి అడమ జ్వరంతో బాధపడుతోంది. ఆదివాసీలకు అత్యవసర వైద్య సేవలు అందే పరిస్థితి లేదు. దీంతో ఆ మహిళను వైద్య చికిత్స కోసం కావడిలో 20కిలో మీటర్లు గుట్టల పైనుంచి తీసుకొచ్చి మండల కేంద్రంలోని ఆస్పత్రిలో చేర్చారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఏజెన్సీ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించి ఆదుకోవాలని కోరారు. -
ప్రత్యేక అలంకరణలో గణపేశ్వరుడు
గణపురం: కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా మండలకేంద్రంలోని కాకతీయుల కళా క్షేత్రం (గణపేశ్వరాలయం) కోటగుళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి భక్తులు తెల్లవారు జాము నుంచే పెద్దఎత్తున పోటెత్తారు. ఉదయం నుంచే స్వామి వారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని నాగభరణం, పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు దీపారాధనలు చేశారు. ఆలయ గోశాలలో గో మాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఆలయ అర్చకులు నాగరాజు తీర్థ ప్రసాదాలు అందచేశారు.కోటగుళ్లలో పూజలు నిర్వహిస్తున్న భక్తులు -
చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం
ములుగు/ములుగు రూరల్: రాష్ట్రంలోని పేదరికంలో ఉన్న చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని కృష్ణకాలనీలో గల అంగన్వాడీ కేంద్రంలో రాష్ట్రంలోనే తొలిసారిగా చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రీస్కూల్ చిన్నారులకు ప్రతిరోజూ 100 మిల్లీ లీటర్ల పాల పంపిణీ కార్యక్రమానికి సోమవారం మంత్రి సీతక్క కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్ మహేందర్జీలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలోని పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో 3 నుంచి 6 ఏళ్ల చిన్నారులకు ప్రతిరోజూ పాలను అందజేయనున్నట్లు తెలిపారు. చిన్నారులకు అందించే ఆహారాన్ని ప్రతిరోజూ అంగన్వాడీ టీచర్లు పరిశీలించాలన్నారు. పాడైన వస్తువులు వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్నారని వెల్లడించారు. ప్రతీ టీచర్‌కు చీరలు పంపిణీ చేయడంతో పాటు వేతనాలను పెంచారని వివరించారు. కార్పొరేట్ స్థాయి పాఠశాలలకు ధీటుగా సెంటర్లను బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు. సెంటర్ల నిర్వాహకులు పిల్లల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభించి ప్రీ స్కూల్ చిన్నారులకు పాలను అందించారు. అనంతరం వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా మంత్రి సీతక్క పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. తల్లిదండ్రులను పిల్లలు నిర్లక్ష్యం చేస్తే వారి నుంచి ఆస్తులను జప్తు చేసి తల్లిదండ్రుల మీదకు మార్పిడి చేసేఅవకాశం ఉందన్నారు. అదే విధంగా బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాలపై ఏర్పాటు చేసిన పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, డీడబ్ల్యూఓ తుల రవి, సీడీపీఓ శిరీష తదితరులు పాల్గొన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలు జిల్లాలోని వినియోగదారులకు ఇండియన్ బ్యాంక్ మెరుగైన సేవలు అందించాలని మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలో ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్‌ను మంత్రి సోమవారం ప్రారంభించి మాట్లాడారు. ఇండియన్ బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఖాతాదారులకు బ్యాంక్ అధికారులు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, బ్యాంక్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ గణేశ్, కరీంనగర్ జోనల్ మేనేజర్ సుధాకర్, డిప్యూటి మేనేజర్ కేశవరావు, ములుగు శాఖ నిర్వహణ అధికారి శ్యాంకుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రీస్కూల్ చిన్నారులకు 100 మిల్లీలీటర్ల పాలు పంపిణీ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క -
70
మంగళవారం శ్రీ 18 శ్రీ నవంబర్ శ్రీ 2025వినతులుప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరిస్తున్న కలెక్టర్ దివాకరగ్రీవెన్స్లో 62, గిరిజన దర్బార్‌లో 8 అర్జీలు ములుగు రూరల్/ఏటూరునాగారం: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవె న్స్, ఏటూరునాగారంలోని ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ప్రజలు పలు సమస్యలపై వినతులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో కలెక్టర్ దివాకర, ఐటీడీఏలో డీటీ అనిల్ గిరి జనుల సమస్యలను ఆలకించి అర్జీలు స్వీకరించా రు. ప్రజావాణిలో 62, గిరిజన దర్బార్‌లో వచ్చిన 8 వినతులను పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని ఉన్నతాధికారులకు సిఫారసు చేశారు. గిరిజన దర్బార్‌లో.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలోని హాస్టల్లో నైట్‌వాచ్‌మెన్ పోస్టు ఇప్పించాలని వినతి అందజేశారు. జిల్లాలోని పేరూరు గ్రామస్తులు 17, చెల్పాక గ్రామస్తులు 5, గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన మరికొందరు బాధితులు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని విన్నవించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామానికి చెందిన మహిళ భర్త ఉద్యోగం ఇప్పించాలని కోరారు. అలాగే తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ములుగు జిల్లా కమిటీ నుంచి గిరిజన సంక్షేమశాఖ పరిధిలో ఉన్న బ్యాక్లాగ్ ఉద్యోగాలను రెగ్యూలర్ ప్రాతిపదికన గిరిజన అభ్యర్థులతో భర్తీ చేయాలని వినతి పత్రం అందజేశారు. వాజేడు, వెంకటాపురం గురుకులం బాలికల కళాశాలలో ఎంపీడబ్ల్యూ ఉద్యోగం తిరిగి ఇప్పించాలని బాధితురాలు దరఖాస్తు అందజేశారు. ఏటూరునాగారం మండల పరిధిలోని ఆకులవారి ఘనపురంలో కొనుగోలు చేసిన భూమిని గిరిజనేతరులు దౌర్జన్యం చేస్తూ భూమిని ఆక్రమించాలని చూస్తున్నారని న్యాయం చేయాలని బాధితురాలు వినతి అందజేసింది. ఈ గిరిజన దర్బార్‌లో ఐటీడీఏ ఆఫీస్ మేనేజర్ శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. వెంకటాపురం శివారులో 1746/బి సర్వే నంబర్లో 2.10ఎకరాల భూమిని కొనుగోలు చేశాను. గతంలో అధికారులు పట్టా జారీ చేశారు. నూతన పాస్‌బుక్‌లో 2 ఎకరాలు మాత్రమే పట్టా చేశారు. 10 గుంటల భూమిని వేరే వ్యక్తి పేరున పట్టా చూపిస్తుంది. ఈ విషయంపై తహసీల్దార్‌ను పలుమార్లు కలిసినా సమస్య పరిష్కారం కాలేదు. అధికారులు స్పందించి విచారణ చేపట్టి పట్టాజారీ చేయాలి. – కొనాల ఓదెలు, వెంకటాపురం(ఎం) నా భర్త మరణించి రెండేళ్లు గడిచింది. పలుమార్లు వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయినా పింఛన్ మంజూరు కాలేదు. నిరుపేద కుటుంబానికి చెందిన తనకు ఉన్నతాధికారులు స్పందించి పింఛన్ ఇప్పించాలి. – కేలోత్ వినోద, ములుగు ●గ్రామంలోని తనకు వారసత్వంగా వచ్చిన భూమిని వేరే వ్యక్తులు కబ్జా చేశారు. ఈ విషయంపై ఆధారాలతో కోర్టును ఆశ్రయించాను. కోర్టు తనకు అనుకూలంగా ఇచ్చిన ఉత్తర్వులను అధికారులకు ఇచ్చినా అమలు చేయడం లేదు. భూమి మోకాపైకి వెళ్తే కబ్జాదారులు దాడులకు పాల్పడుతున్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలి. – జంగం ఆదినారాయణ, మల్లూరు, మంగపేట స్వీకరించిన కలెక్టర్ దివాకర, డీటీ అనిల్ పరిశీలించి పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశాలు -
మళ్లీ కసరత్తు !
డీసీసీ అధ్యక్షుల ఎంపికపై టీపీసీసీ తుది అభిప్రాయ సేకరణసాక్షిప్రతినిధి, వరంగల్: అర్ధంతరంగా ఆగిపోయిన డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియపై టీపీసీసీ మళ్లీ దృష్టి సారించింది. త్వరలోనే డీసీసీ రథసారథులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఒక్కో జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, సీనియర్ల నుంచి తుది అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. వాస్తవానికి ఈ నెల మొదటి వారంలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అక్టోబర్‌లో కార్యాచరణ చేపట్టారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ మార్గదర్శకాల మేరకు అక్టోబర్ 11 నుంచి 18 వరకు ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు జిల్లాల్లో పర్యటించి ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఉమ్మడి వరంగల్‌లో ఆరు జిల్లాల నుంచి 161 మంది డీసీసీ అధ్యక్ష పదవుల కోసం పోటీ పడ్డారు. ఏఐసీసీ, టీపీసీసీ మార్గదర్శకాల మేరకు ఒక్కో జిల్లా నుంచి నాలుగు పేర్లను తీసుకుని సీఎం, టీపీసీసీ చీఫ్‌కు అందజేశారు. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటికేషన్ రావడం, హైకోర్టు స్టేతో రద్దు కావడం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కారణంగా డీసీసీల ఎంపిక ప్రక్రియ ఆగిపోయింది. జూబ్లీహిల్స్ ఎన్నిక ముగియగా.. స్థానిక సంస్థల ఎన్నికలకు సైతం సిద్ధం కావాలని పార్టీ భావిస్తోంది. ఈనేపథ్యంలోనే డీసీసీలను పూర్తి చేయాలని పార్టీ అధిష్టానం భావించి మళ్లీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ‘పారామీటర్’లు పక్కానా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది. అధిష్టానం సంస్థాగత పదవులను కీలకంగా చూస్తోంది. వారికి తగిన ప్రాధాన్యం ఇస్తామని కూడా చెప్తోంది. దీంతో డీసీసీ అధ్యక్షుడు జిల్లాస్థాయిలో కీలకం కానున్నారన్న ప్రచారం ఉంది. ఈనేపథ్యంలో ఇటీవల దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా ఆశావహులు పోటీపడ్డారు. పార్టీ నిబంధనల ప్రకారం.. డీసీసీ అధ్యక్షులుగా దరఖాస్తు చేసుకునేవారు కనీసం ఐదేళ్లపాటు క్రమశిక్షణతో, నిరంతరం పార్టీ కోసం పనిచేసిన వారై ఉండాలి. అలా... లేని దరఖాస్తులు ఏఐసీసీ పరిశీలకులు తొలగిస్తారని స్పష్టం చేశారు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షులుగా పని చేస్తున్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ రెండోసారి అవకాశం ఉండబోదన్నారు. పార్టీ నుంచి ప్రజాప్రతినిధిగా ఎంపికై న వారిని డీసీసీ పీఠానికి పరిగణనలోకి తీసుకోరని, అలాగే పార్టీ ప్రజాప్రతినిధుల దగ్గరి బంధువులకు కూడా అవకాశం కల్పించడం లేదని తేల్చిచెప్పారు. డీసీసీ అధ్యక్ష నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా నాయకులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఏఐసీసీ సూచించిన ఈ పారామీటర్లను పరిగణనలోకి తీసుకుంటే చాలా జిల్లాల్లో డీసీసీ పదవులకు సమర్థులను ఎంపిక చేయడం కష్టమేనన్న అభిప్రాయం పరిశీలకుల్లో వచ్చింది. ఐదేళ్లుగా పార్టీ కోసం పనిచేసిన నాయకులు చాలామందే దరఖాస్తుదారుల్లో ఉన్నా.. అందులో నుంచి ఎంపికై న వారు పార్టీని సమర్థంగా నడిపించగలరా? అనేది ప్రశ్నగా ఉంది. దీంతో ఏఐసీసీ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుంటారా? లేక జిల్లా ఇన్చార్జ్ మంత్రి, ఎమ్మెల్యేల అభిప్రాయాల మేరకు డీసీసీలను ఎంపిక చేస్తారా? ఏఐసీసీ గైడ్‌లైన్స్ సడలించి స్థానిక అవసరాలు, ప్రాథమ్యాలను గమనించి నియమిస్తారా? అసలేం జరగనుంది? అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. పోటాపోటీగా దరఖాస్తులు.. పార్టీ హైకమాండ్ కార్యాచరణతో డీసీసీ ఎన్నికల కసరత్తుకు రంగంలోకి దిగిన పరిశీలకులకు పోటీపోటీగా ఆశావహుల నుంచి దరఖాస్తులు అందాయి. ఇప్పుడున్న డీసీసీ అధ్యక్షుల మార్పు తథ్యమన్న ప్రచారం నేపథ్యంలో.. కొత్తగా హనుమకొండ జిల్లా నుంచి ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, జంగా రాఘవరెడ్డి, ఈవీ శ్రీనివాస్‌రావు, బట్టి శ్రీనివాస్, పింగిళి వెంకట్రాం నర్సింహారెడ్డి, బొమ్మనపల్లి అశోక్‌రెడ్డి, కట్ల శ్రీనివాస్‌తో పాటు పలువురు దరఖాస్తు చేసుకున్నారు. వరంగల్ నుంచి ప్రస్తుత డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, నమిండ్ల శ్రీనివాస్, ఎంపీ ఆనంద్, బొంపెల్లి దేవేందర్‌రావు, గోపాల నవీన్‌రాజ్, నల్గొండ రమేశ్, నర్సంపేట మాజీ ఎంపీపీ టి.రవీందర్రావు, పిన్నింటి అనిల్‌రావు తదితరులు పోటీపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి డీసీసీ కోసం మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్, చల్లూరి మధుతో పాటు 18 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పరిశీలకులు ప్రకటించారు. జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి స్థానంలో హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగపురం ఇందిర, మొగుళ్ల రాజిరెడ్డి, బండ శంకర్, లకావత్ ధన్వంతి, కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి, మాసాన్‌పల్లి లింగాజీ తదితరులు రేసులో ఉన్నారు. ములుగు జిల్లాకు పైడాకుల అశోక్, కుంజ సూర్య, మల్లాడి రాంరెడ్డి, గొల్లపల్లి రాజేందర్‌గౌడ్, బాదం ప్రవీణ్ తదితరులు దరఖాస్తు చేసుకున్నట్లు పార్టీవర్గాల సమాచారం. మహబూబాబాద్ నుంచి జె.భరత్‌చంద్రారెడ్డి, వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, అంజయ్యతో పాటు 20 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ప్రచారం ఉంది. అయితే మొత్తంగా ఉమ్మడి జిల్లా నుంచి ఆరు డీసీసీల కోసం 161 దరఖాస్తులు రాగా.. ఒక్కో జిల్లా నుంచి నాలుగు పేర్ల చొప్పున 24 మంది పేర్లను ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలనకు పంపారు. ఇందులో నుంచి ఎంపిక చేసేందుకు తాజాగా టీపీసీసీ ముఖ్యనేతల నుంచి తుది అభిప్రాయ సేకరణ చేస్తుండడం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ.. ఒక్కో జిల్లా నుంచి పరిశీలనలో నలుగురి పేర్లు ‘స్థానిక’, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో తాత్కాలికంగా బ్రేక్ నియామకంపై నేటి కేబినెట్లో చర్చించే అవకాశం -
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
వాజేడు: మధ్యాహ్న భోజన వంట కార్మికుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జంపాల రవీందర్ అన్నారు. మండల పరిధిలోని జగన్నాథపురం పాఠశాల ఆవరణలో ఆదివారం అల్లి అమృత అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండల స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వంట కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అవలంభిస్తున్న ధోరణి సరైంది కాదన్నారు. కేంద్ర పభుత్వం కేవలం రూ.600 ఇచ్చి చేతులు దులుపుకుంటుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచుతామన్న రూ.10 వేల వేతనం విషయం మరుగున పడిందన్నారు. వంట కార్మికులకు ఇస్తున్న మెనూ చార్జీలు ప్రస్తుత ధరలకు అనుకూలంగా లేకపోవడంతో మెనూ అమలు చేయడం సాధ్యం కావడం లేదని తెలిపారు. ప్రతీ విద్యార్థికి రూ. 25 ఇస్తే రెండు కూరలు, మూడు కోడిగుడ్లు అందించ వచ్చని వివరించారు. 8, 9 నెలల నుంచి వంట, కోడిగుడ్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. గత ప్రభుత్వంలో ప్రవేశ పెట్టిన అల్పాహారానికి సంబంధించిన 9 నెలల బిల్లులను ఈ ప్రభుత్వం చెల్లించకపోవడంతో వంట కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు స్పందించి వంట కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించడంతో పాటు బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతనంగా మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా నాగమణి, ప్రధాన కార్యదర్శిగా సంతోష్‌తో పాటు మరో ఆరుగురిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో మంగ, పార్వతి, జయమ్మ, నాగసుధ, లలిత, సరిత, అరుణ, నాగమ్మ, సరోజిని, సమ్మక్క, రాధ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రవీందర్ -
హేమాచలుడికి పూజలు
మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఆదివారం వేలాది మంది భక్తజనంతో కిక్కిరిసిపోయింది. రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద స్నానాలు ఆచరించి ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించిన తిలతైలాభిషేకం పూజలో పాల్గొని స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు అర్చకులు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. నిత్యాన్నదాన కార్యక్రమ నిర్వహణ ఖర్చులకు భక్తులు విరాళాలను అందజేశారు. – మంగపేట -
ఉద్యోగులకు సన్మానం
ములుగు రూరల్: జిల్లా కేంద్రంలో 58వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మూడోరోజు గ్రంథాలయంలో వివిధ పుస్తకాలు చదివి ఉద్యోగాలు సాధించిన వారిని ఆదివారం సన్మానించారు. అనంతరం గ్రంథాలయానికి ఉద్యోగులు పుస్తకాలను డొనేట్ చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయ మెంబర్ షిప్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాలకులు సమ్మక్క, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. దుక్కిటెద్దు మృతి.. ములుగు రూరల్: మండల పరిధిలోని పత్తిపల్లి గ్రామానికి చెందిన రైతు ఇనుముల శంకర్ దుక్కిటెద్దు అకస్మాతుగా ఆదివారం మృత్యువాత పడింది. దీంతో రైతు కన్నీటి పర్యంతం అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. నిరుపేద కుటుంబానికి చెందిన రైతు శంకర్ ఎద్దుల సాయం వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఎద్దులను బండికి కట్టుకొని పొలానికి వెళ్లి పచ్చిగడ్డి మేపుకొని పశుగ్రాసాన్ని బండిలో వేసుకుని ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో బడికి కట్టిన ఎద్దు నడుస్తూనే ఒక్కసారిగా కుప్పకూలింది. శంకర్ వెంటనే బండి ఇప్పి పరిశీలించగా ఎద్దు మృతి చెంది ఉండడంతో కన్నీటి పర్యంతం అయ్యాడు. శంకర్ రోధించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఎద్దులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న తనను ప్రభుత్వం ఆదుకుని ఆర్థిక సాయం అందించాలని వేడుకున్నారు. చలి చంపేస్తోంది.. కాళేశ్వరం: వారం రోజులుగా గోదావరి తీర ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది. చలికి మనుషులతో పాటు ఏ జీవరాశి కూడా తట్టుకోవడం లేదు. పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గుతూ..రాత్రికి 13–14 డిగ్రీలకు చేరుతుంది. దీంతో మహదేవపూర్ మండలంలో నిర్మించిన అన్నారం(సరస్వతి బ్యారేజీ) వద్ద శనివారం రాత్రి చలికి వణికిపోతూ వానరాల గుంపు దర్శనమిచ్చింది. అడవిలో ఉండాల్సిన వానరాలు బ్యారేజీ వంతెనపై రాత్రిపూట చలికి గజగజ వణికిపోతూ తన పిల్లలను ఒడిలో హత్తుకుపెట్టుకొని బతుకు జీవుడా అంటూ ప్రయాణికులు కనిపించాయి. అయ్యో! మాకు కూడా చలేస్తుంది అన్నట్లుగా వానరాలు వణుకుతూ అటుగా వెళ్తున్న చూపరుల మనస్సు చలించుకుపోయేలా కనిపించాయి. ‘మహా లక్ష్మీ’ భళా! కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఆదివారం మహిళా భక్తులు బారులుదీరారు. ఆర్టీసీ బస్సుల్లో భారీగా మహిళలు ‘మహాలక్ష్మీ’ పథకాన్ని వినియోగించుకుని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. దీంతో రాత్రి వరకు మహిళా భక్తులు బస్టాండ్‌లో బస్సుల్లో ఎక్కి కిక్కిరిసి ప్రయాణించారు. -
హాస్టల్ విద్యార్థినుల ఆందోళన
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని జవహర్‌నగర్ మోడల్‌స్కూల్ హాస్టల్లో ఉంటున్న విద్యార్థినులు అదివారం ఉదయం ఆందోళనకు దిగారు. హాస్టల్లో ఉంటున్న తమకు సెక్యూరిటీ కరువైందని, నాలుగు నెలలుగా ఏఎన్ఎం కూడా అందుబాటులో ఉండడం లేదని, హాస్టల్ పరిసరాల్లో లైట్లు లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తుండడంతో భయాందోళనకు గురవుతున్నామని పేర్కొంటూ హాస్టల్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న డీఈఓ సిద్ధార్థరెడ్డి, తహసీల్దార్ గిరిబాబు హాస్టల్‌కు చేరుకుని విద్యార్థినులతో మాట్లాడారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ హాస్టల్ నిర్వహణలో నిర్లక్ష్యం చోటు చేసుకున్నట్లు గుర్తించామని తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన కేర్ టేకర్ కవిత, ఏఎన్ఎం జ్యోతి, వాచ్మెన్ అంజలిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. హాస్టల్లో తక్షణమే అదనపు లైటింగ్‌ను ఏర్పాటు చేయాలని, వారంలోగా విద్యార్థులకు మౌలిక వసతులకు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీసీడీఓ రజిత, స్పెషల్ ఆఫీసర్ లక్ష్మి పాల్గొన్నారు. జవహర్‌నగర్ మోడల్‌స్కూల్‌ను సందర్శించిన డీఈఓ సిద్ధార్థరెడ్డి కేర్ టేకర్, ఏఎన్ఎం, వాచ్మెన్ సస్పెన్షన్ -
జిల్లా అభివృద్ధికి కృషి
● పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ములుగు రూరల్: జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర,శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు. జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయం వద్ద రూ.45లక్షలతో నిర్మించతలపెట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులకు కలెక్టర్ దివాకర, గ్రంథాయల సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్‌తో కలిసి మంత్రి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జిల్లాను సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు వివరించారు. జిల్లాలో వివిధ ప్రాంతాలకు వెళ్లే భక్తులు ముందుగా గట్టమ్మతల్లిని దర్శించుకున్న అనంతరమే ముందుకు సాగుతారని తెలిపారు. అందుకోసమే గట్టమ్మ తల్లి ఆలయం వద్ద అన్ని రకాల వసతులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రహస్య పూజా మందిరంపై నిర్లక్ష్యం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో ప్రహరీ పక్కన ఉన్న రహస్య పూజామందిరంపై సంబంధిత కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిఏటా మహాజాతర, చిన్న జాతర సమయంలో రహస్య పూజామందిరంలో పూజారులు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఆ మందిరంలోకి సాధారణ వ్యక్తులను పూజారులు అనుమతిచ్చారు. అమ్మవార్లకు పూజారులు సంస్కృతీ, సంప్రదాయాల ప్రకారం పూజా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం అభివృద్ధి పనుల్లో భాగంగా గద్దెల చుట్టూ సాలహారం(ప్రహరీ) నిర్మాణం పనుల నేపథ్యంలో రహస్య పూజా మందిరం అడ్డుగా ఉందని తొలగించి రేకులను ఏర్పాటు చేశారు. రోజులు గడుస్తున్నా పూజా మందిరాన్ని బహిర్గంతంగానే వదిలేయడంతో భక్తులు కాంట్రాక్టర్ తీరుపై ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. జాతర నాటికి రహస్య పూజా మందిరం నిర్మించేనా అనే సందేహాలను పూజారులు, ఆదివాసీ సంఘాల నాయకులు వ్యక్తం చేస్తున్నారు. -
పక్షులకు ఆవాసం.. ప్రకృతితో సహవాసం
హనుమకొండ ప్రకాశ్‌రెడ్డి పేటకు చెందిన ప్రైవేట్ విద్యాసంస్థల బస్సుల ఓనర్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గాదె స్వరూప్రెడ్డికి పక్షులంటే అమితమైన ప్రేమ. ఇంటి ఆవరణలో ప్రత్యేక షెడ్డు వేసి పక్షులను పెంచుతున్నారు. అంతేకాకుండా నిత్యం పిచ్చుకలు, రామ చిలుకలు, పలు జాతులకు చెందిన పక్షులు ఇక్కడికి వచ్చి ఆహారం తిని వెళ్తుంటాయి. వాటి కోసం డబ్బాలను ఏర్పాటు చేసి ధాన్యం గింజలు పోస్తున్నారు. ధాన్యపు గుత్తులు వేలాడదీస్తున్నారు. గిన్నెల్లో నీళ్లు పోసి వాటి దప్పిక తీరుస్తున్నారు. కొంత సమయం పక్షుల మధ్య గడిపితే ఆ రోజంతా మనసు ఉల్లాసంగా ఉంటుందని స్వరూప్‌రెడ్డి చెబుతున్నారు. -
కుక్కపిల్లలంటే ఆమెకు ప్రాణం
మానుకోట మున్సిపాలిటీ పరిధి ఈదులపూసలపల్లికి చెందిన మ్యారేజ్ ఈవెంట్స్ ఆర్గనైజర్ పింగిలి దీపికకు కుక్కపిల్లలంటే ప్రాణం. దీపిక బాల్యంలో ఆమె నాన్న చిన్న కుక్క పిల్లను ఇంటికి తీసుకొచ్చాడు. ఆ కుక్కపిల్లను ఆమె అల్లారుముద్దుగా చూసుకునేవారు. అప్పటి నుంచే ఆమెకు కుక్కపిల్లలపై ప్రేమ పెరిగింది. కుక్కలకు సొంత డబ్బుతో వైద్యం, నాన్న పెన్షన్ డబ్బులతో స్నాక్స్, భోజనం అందిస్తున్నారు. ఆమె పెంచుతున్న వీధి కుక్కల్లో చాలావరకు గుండె, లివర్, క్యాన్సర్, ఫిట్స్ వంటి రోగాల బారిన పడి ఉన్నాయి. వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి కారులో తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె 3 వేల కుక్కలను దత్తత ఇచ్చారు. అదేవిధంగా ఆమె ఇంటి వద్ద ప్రస్తుతం 36 కుక్కలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రత్యేకంగా కుక్కల కోసం యూట్యూబ్ చానల్ ప్రారంభించారు. కుక్కలను ఎవరైనా దత్తత తీసుకోవాలంటే 73962 82837 నంబర్లో సంప్రదించాలని దీపిక కోరుతున్నారు. -
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
ములుగు రూరల్: మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ అన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థను శనివారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంట కార్మికులకు రావాల్సిన అల్పాహారం, కోడిగుడ్లు, వంట బిల్లులతో పాటు 9 నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. తక్షణమే వాటిని విడుదల చేయాలన్నారు. ఎన్నికలకు ముందు చేసిన వాగ్ధానాలను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమ, రాజకుమారి, ప్రమీల, పద్మ, రాధ, కమల, శోభ, భారతి, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు. శివాలయంలో ఏఎస్పీ పూజలు ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఉమారామలింగేశ్వరస్వామి ఆలయంలో జిల్లా అడిషనల్ ఎస్పీ శివం ఉపాధ్యాయ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏకాదశి కార్తీక మాసం కావడంతో ఏఎస్పీ దంపతులు వచ్చి అకాశ దీపాన్ని వెలిగించి ఆలయంలో కొబ్బరికాయ కొట్టి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఆలయంలో శివలింగాకారంలోని జ్యోతులను వెలిగించారు. ఈ కార్యక్రమంలో శివాలయం చైర్మన్ మడుగూరి ప్రసాద్, సాయిబాబా ఆలయ చైర్మన్ పెండ్యాల ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు. జాతర ట్రస్టుబోర్డు కమిటీని నియమించాలి ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ జాతర ట్రస్టుబోర్డు కమిటీని నియమించాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు పాయం కోటేశ్వర్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో జాతర ట్రస్టుబోర్డు కమిటీని నియమించకుండా తాత్కాలిక ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటున్నాయని మండిపడ్డారు. ఈ సారి జాతరకై నా ప్రభుత్వం స్పందించి ట్రస్టుబోర్డు కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. జాతరలో అమ్మవార్లకు భక్తులు కానుకల రూపంలో సమర్పించే ఆదాయాన్ని దేవాదాయశాఖ తీసుకుని ఆదివాసీ ప్రజలను, పూజారులను విస్మరిస్తుందన్నారు. ఈ సమావేశంలో గిరిజన అభ్యుదయ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముద్దబోయిన రవి, నాయకులు పూర్ణ, నియోజకవర్గ అధ్యక్షుడు కొప్పుల జగన్నాధరావు, మహిళ జాక్ చైర్మన్ శమంతకమణి, మాల్కం రాధిక, మండల అధ్యక్షులు మోకాళ్ల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. ఇసుక తరలింపు అడ్డగింత ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని ఊరట్టం తూములవాగు నుంచి మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులకు తరలిస్తున్న ఇసుకను ఊరట్టం గ్రామస్తులు శనివారం అడ్డుకున్నారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణ ప్రహరీ నిర్మాణానికి తూముల వాగు నుంచి ఇసుక తీసుకువచ్చి వినియోగించుకునేందుకు అధికారులు అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. గ్రామ పంచాయతీ, పెసా తీర్మానం లేకుండా ఇసుక నేరుగా జేసీబీతో లారీల్లో ఇసుక లోడింగ్ చేసి తరలిస్తుండడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. అమ్మవార్ల అభివృద్ధి పనులకు ఇసుక తరలింపునకు అభ్యంతరం లేదని పెసా తీర్మానం చేసి కూలీలతో ట్రాక్టర్ల ద్వారా ఇసుక బయట డంపు చేసి లారీల్లో తీసుకెళ్లాలని గ్రామస్తులు తెలిపారు. పగలే కాకుండా రాత్రి వేళలో కూడా వాగులో నుంచి ఇసుక తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. మేడారం జాతర అభివృద్ధి పనులకు మేడారం పరిసరాల్లో ఉచితంగా ఇసుక లభించడంతో కాంట్రాక్టర్లు ఇష్టారీతిన ఇసుక తరలించి ఇతర ప్రాంతాల్లో డంపు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
రాజీమార్గమే రాజమార్గం
● జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కన్నయ్యలాల్ములుగు: రాజీమార్గమే రాజమార్గమని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కన్నయ్యలాల్ అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో ప్రత్యేక లోక్ అదాలత్‌ను ఆయన శనివారం ప్రారంభించి మాట్లాడారు. ప్రత్యేక లోక్‌అదాలత్‌లో తమ కేసులను రాజీ చేసుకుంటే మరోసారి అప్పీల్ వ్యవస్థ ఉండదని తెలిపారు. ఇదే అంతిమ తీర్పు అని వెల్లడించారు. లోక్‌అదాలత్‌లో మూడు బెంచీలను ఏర్పాటు చేసి 151 పెండింగ్ కేసులను పరిష్కరించినట్లు వివరించారు. ఐదు నెలల క్రితం కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న దంపతులకు న్యాయవాది రంగోజు భిక్షపతి మధ్యవర్తిత్వం వహించి ఇద్దరి మధ్య రాజీ కుదర్చడంతో దంపతులిద్దరూ దండలు మార్చుకొని తిరిగి ఒక్కటైనట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ జూనియర్ సివిల్ జడ్జి శాంతి సోనీ, ఆర్డీఓ వెంకటేశ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాల చారి, జనరల్ సెక్రటరీ రంగోజు భిక్షపతి, న్యాయవాదులు నర్సిరెడ్డి, వినయ్ కుమార్, కొండి రవీందర్, సునీల్ కుమార్, సుధాకర్, చిరంజీవి, రాజేందర్, రాజ్ కుమార్, కావ్య, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు మేకల మహేందర్, బానోత్ స్వామిదాస్, ఎస్సై వెంకటేశ్వర్రావు, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా గ్రూపులకు డ్రెస్‌కోడ్
ఏటూరునాగారం: రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం నూతనంగా డ్రెస్‌కోడ్ దుస్తులను త్వరలోనే అందజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం సిరిసిల్ల జిల్లాలోని చేనేత వస్త్రాల తయారీ కేంద్రాల వద్దకు ఇటీవల జిల్లా సమాఖ్య నుంచి ముగ్గురు సభ్యులను పంపించారు. అక్కడ తయారవుతున్న వస్త్రాలు, వాటి విధానం, నాణ్యతను పరిశీలించే విధంగా మూడు రోజుల పర్యటన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ సీఈఓ ఆధ్వర్యంలో జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద రెండు జతల చీరలను ఉచితంగా ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రక్రియను ఈ నెలఖారు వరకు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. కార్యక్రమం ముందు ఒక చీర ఆ తర్వాత మరో చీరను అందజేయనున్నట్లు తెలిసింది. దీంతో జిల్లాలో 68,532 మహిళా సంఘాల సభ్యులకు లబ్ధి చేకూరనుంది. దీనివల్ల ఒకే రకం చీరెలను ధరించడం వల్ల పేద, ధనికుల మధ్య బేధం లేకుండా అందరూ సమానమే అనే భావన ఏర్పడుతుంది. అయితే గతంలో ఉన్న ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల సభ్యులు వారి సొంత డబ్బులతో చీరలను కట్టుకొని గ్రూప్ సమావేశానికి వెళ్లాలని ఆదేశాలు ఇచ్చారు. ఆ సమయంలో కొంత మేర డ్రెస్‌కోడ్ నడిచింది. కానీ ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే మహిళా సంఘాల సభ్యులు వీఓ గ్రూపు సమావేశాలకు, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు తరలివచ్చే సమయంలో ఈ చీరలను ధరించాలని మౌఖిక ఆదేశాలు ఉన్నాయి. మహిళలకు రెండు జతల బట్టలను ఇవ్వడంతో కొంత మేర ఆశాజనకంగా ఉన్నప్పటికీ వాటిని ధరించి మీటింగ్ వెళ్లాలా అనే అసంతృప్తి వ్యక్తం చేసేవారు కూడా ఉండడం గమనార్హం. మహిళలకు నీలిరంగు చీరలు మహిళాలు ఆకాశానికే హద్దుగా గుర్తింపు పొందడంతో నీలి రంగు చీరల పంపిణీకి సిద్ధమయ్యారు. నీలం రంగు తీసుకోవడానికి కారణం సీ్త్ర, మహిళ అనగానే ప్రత్యేక గుర్తింపు, వారికి ఎవరు హద్దు లేరు కేవలం ఆకాశమే వారికి హద్దు అన్నట్లు భావించాలనే ఉద్దేశంతో ఈ రంగును ఎంపిక చేసినట్లు తెలిసింది. ప్రత్యేక గుర్తింపు కోసమే.. మహిళా సంఘాల సభ్యులు ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో ఈ డ్రెస్‌కోడ్‌ను ప్రవేశపట్టారు. వీఓ సంఘాల వద్ద ఇష్టానుసారంగా దుస్తులు వేసుకోవడం వల్ల సరైన గుర్తింపు, ఆకర్షణ కలుగుతుంది. వీఓ సంఘాల మహిళలు ఏదైనా వీఓ సంఘం, జిల్లా, మండల సమాఖ్యకు కు వెళ్లినప్పుడు కూడా ఈ డ్రెస్‌కోడ్‌ను ఉపయోగించాలని సూచనలు చేశారు. ఇవేకాకుండా సేవా కార్యక్రమాలకు కూడా ఈ డ్రెస్‌కోడ్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాలోని సెల్ప్ ఎంప్లాయీ గ్రూప్స్(ఎస్‌హెచ్‌జీ) ఉన్న సభ్యుల వివరాలను జిల్లా నుంచి రాష్ట్ర సెర్ప్‌కు అందజేశారు. మండలాలు వీఓలు ఎస్‌హెచ్‌జీఎస్ సభ్యులు ఏటూరునాగారం 37 735 7,183 గోవిందరావుపేట 31 747 7,522 కన్నాయిగూడెం 18 323 3,045 మంగపేట 57 1,192 11,980 ములుగు 50 1,244 12,318 ఎస్‌ఎస్‌తాడ్వాయి 33 586 5,849 వెంకటాపురం(ఎం) 32 796 8,047 వెంకటాపురం(కె) 42 727 7,094 వాజేడు 41 579 5,494 ఇందిరా మహిళాశక్తి కింద మంజూరుకు ప్రభుత్వం ప్రణాళికలు నూతన డిజైన్లు, చీరలను పరిశీలించిన జిల్లా సమాఖ్య సభ్యులు త్వరలో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు -
– హన్మకొండ/ఖిలావరంగల్/హసన్‌పర్తి/ మహబూబాబాద్ అర్బన్
కదిలే ప్రతీ జీవికి ఈ భూమ్మీద జీవించే హక్కు ఉంది. అవన్నీ మనగలిగితేనే మానవాళి ముందుకు సాగుతుంది. ఆ విషయాన్ని గుర్తించిన కొందరు తమ వంతుగా వాటికి సాయం చేస్తున్నారు. పిచ్చుక గూళ్లను పంపిణీ చేస్తూ పంటల రక్షణకు తోడ్పడుతున్నారు. పక్షులకు ఆహారం అందిస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్నారు. చీమలకు ఆహారమందిస్తూ మట్టిని సారవంతం చేసేందుకు ఉపయోగపడుతున్నారు. కుక్కలను పెంచుతూ ఆనందం, ఆహ్లాదాన్ని పొందుతున్నారు. జీవ వైవిధ్యంలో తమవంతు పాత్ర పోషిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జీవచరాల బంధువులపై ‘సాక్షి’ సండే స్పెషల్ కథనం. ‘చీమా.. చీమా ఎక్కడున్నావమ్మా’ అంటూ వెతికి మరీ వాటి కడుపు నింపుతున్నారు వాకర్స్. హనుమకొండకు చెందిన శివకుమార్, గోయల్ వాకింగ్ కోసం ప్రతీ రోజు పబ్లిక్ గార్డెన్‌కు వస్తుంటారు. నడక మొదలు పెట్టే ముందే.. చీమలు ఎక్కడున్నాయా.. అని వెతికి మరీ వెంట తెచ్చుకున్న గోధుమ పిండి, చక్కెర చల్లుతారు. సనాతన ధర్మం, రుగ్వేదంలో జీవుల పట్ల దయ కలిగి ఉండాలని, ఆహారాన్ని వృథా చేయకుండా ప్రాణులకు అందించాలని ఉందని వారు చెబుతున్నారు. కాగా, నిత్యం చపాతీలు చేసిన అనంతరం కింద పడిన, మిగిలిన పిండిలో చక్కెర కలిపి చీమలకు వేస్తున్నట్లు చెబుతున్నారు.హనుమకొండ పబ్లిక్ గార్డెన్లో చీమలకు చక్కెర కలిపిన పిండిని ఆహారంగా వేస్తున్న శివకుమార్హనుమకొండ పబ్లిక్ గార్డెన్లో చీమలకు ఆహారం వేస్తున్న గోయల్హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టులోని మహర్షి గోశాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా పిచ్చుక గూళ్లు, వరికంకులు పంపిణీ చేస్తున్నారు. ఎస్ఆర్ఎం ఫౌండేషన్ సహకారంతో ‘జీవులపై దయ చూపి జీవ వైవిధ్యం కాపాడుదాం’ నినాదంతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. మహర్షి గోశాల ట్రస్ట్ ఆధ్వర్యంలో తమిళనాడు నుంచి పక్షి గూళ్లను కొనుగోలు చేసి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. వరి కంకులను ఇక్కడే అల్లుతున్నారు. ఇప్పటి వరకు ఆరునెలల్లో 2 వేలకుపైగా పిచ్చుక గూళ్లు పంపిణీ చేసినట్లు మహర్షి గోశాల ట్రస్ట్ నిర్వాహకుడు డాక్టర్ ఎస్.రమేశ్ తెలిపారు. జీవవైవిధ్యానికి తోడ్పడుతున్న ఉమ్మడి వరంగల్‌వాసులు వాటి ఆకలిదప్పికలు తీరుస్తూ ఆదర్శం సొంత డబ్బులతో ప్రకృతి సేవ పర్యావరణ సమతుల్యతకు దోహదం -
పోరాటయోధుడు బిర్సాముండా
● అదనపు కలెక్టర్ సంపత్‌రావు ములుగు రూరల్/ఏటూరునాగారం: ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన యోధుడు బిర్సాముండా అని అదనపు కలెక్టర్ సంపత్‌రావు అన్నారు. మండల పరిధిలోని జగ్గన్నపేట ఆశ్రమ పాఠశాలలో శనివారం బిర్సాముండా 150వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బిర్సాముండా జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం జన జాతీ గౌరవ దినోత్సవంగా ప్రకటించిందన్నారు. ఆదివాసీల హక్కుల కోసం చేసిన పోరాటం మరువలేనిదని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం విజయలక్ష్మి, డిప్యూటి వార్డెన్ అనిత తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఏటూరునాగారంలోని ఐటీడీఏ కార్యాలయంలో బిర్సాముండా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిర్సాముండా చిత్రపటానికి పీఓ చిత్రామిశ్రా పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పీఓ మాట్లాడుతూ బిర్సాముండా గొప్ప వీరుడని, పోరాటపటిమ కలిగిన యోధుడని తెలిపారు. బిర్సాముండాను యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు, ఈఈ వీరభద్రం, డీటీడీఓ జనార్ధన్, సీడీపీఓ ప్రేమలత, ఎస్ఓ సురేష్‌బాబు, అదికారులు పాల్గొన్నారు. వాలీబాల్ క్రీడాపోటీలు మంగపేట: మండలంలోని లక్ష్మీనర్సాపురంలో వనవాసీ కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో వాలీబాల్ క్రీడాపోటీలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక దక్షిణ మధ్యక్షేత్ర సంఘటన మంత్రి శివరామకృష్ణ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిర్సాముండా జయంతిని పురస్కరించుకుని ములుగు జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక, కరకగూడెం మండలాల క్రీడాకారులకు వాలీబాల్ మండలస్థాయి పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. -
అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం
మంగపేట: మండల కేంద్రంలోని కస్తూర్బా వృద్ధాశ్రమంలో కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ అధికారి తుల రవి ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు రన్నింగ్, మ్యూజికల్ చైర్స్, పాఠాలు, సంగీత పోటీలను జిల్లా సంక్షేమ శాఖ, మహిళా శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా పోటీలలో పాల్గొన్న వృద్ధులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. పోటీలలో గెలుపొందిన వృద్ధులకు ఈ నెల 21న అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బహుమతులను అందజేయనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి తుల రవి తెలిపారు. కార్యక్రమంలో సీడీపీఓ ప్రేమలత, సిబ్బంది నాగేంద్ర, ఎఫ్ఆర్ఓ గణేశ్, వృద్ధాశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. -
జాగ్రత్తలు పాటించాలి
చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. వృద్ధులు, చిన్న పిల్లలు చలినుంచి జాగ్రత్తలు పాటించాలి. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. చలిని తట్టుకునే విధంగా దుస్తులు ధరించాలి. ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులతో భాధపడుతున్నవారు చలికి గురికాకుండా వీలైనంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ప్రతీఒక్కరు గోరువెచ్చని నీటినే తాగాలి. దగ్గు, దమ్ము, జలుబు ఉంటే వైద్యులను సంప్రదించాలి. – చీర్ల శ్రీకాంత్, వైద్యాధికారి, వెంకటాపురం(ఎం) -
వామ్మో.. చలి
శనివారం శ్రీ 15 శ్రీ నవంబర్ శ్రీ 2025ఏటూరునాగారం: వానాకాలం ముగియగానే.. జనాన్ని చలి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత వారం రోజులుగా ఎముకలు కొరికే చలి వీస్తుండడంతో వృద్ధులు, చిన్నారులు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. వెచ్చటి వస్త్రాలు, దుప్పట్లు కప్పుకొని ముసుగు తీయని పరిస్థితి నెలకొంది. చలి ఎక్కువగా ఉండడంతో గ్రామాల్లో ప్రజలు చలిమంటలు వేసుకుంటున్నారు. శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉండడంతో జాగ్రత్తలు పాటించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఉదయం పొగమంచు, చలిగాలులు, రాత్రి వేళలలో చలి తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే సూచించడంతో జనం మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. రాష్ట్రంలో సగటున ఉష్ణోగ్రత్తలు పడిపోయాయి. ములుగు జిల్లాలో తీవ్రత మరింత పెరిగింది. గోదావరి, దట్టమైన అటవీ ప్రాంతం కావడం ఉదయం పొగమంచు కురుస్తుండడంతో వాహనదారులు హెడ్లైట్లు ఆన్ చేసుకునే ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా ఈనెల 7వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పడిపోతోండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. పలు అనారోగ్య సమస్యలు చలి తీవ్రత వల్ల సీజనల్ ఫ్లూ వచ్చే అవకాశం ఉందని, జ్వరం, దగ్గు, గొంతు తడి ఆరిపోవడం, నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా ఆస్పత్రులకు వెళ్లడం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. మరో వారం రోజులు ఇదే తరహా వాతావరణం ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. జిల్లాలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు బయటకు వెళ్లలేకపోతున్న వృద్ధులు, చిన్నారులు ఉదయం ఇబ్బందిపెడుతున్న పొగమంచు సాయంత్రం నుంచే మొదలవుతున్న చలి జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు -
పుస్తకపఠనంపై ఆసక్తి పెంచుకోవాలి
ములుగు రూరల్ : విద్యార్థులు పుస్తకపఠనంపై ఆసక్తి పెంచుకోవాలని అదనపు కలెక్టర్ సంపత్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవాలను గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ పితామహుడు ఎస్ఆర్ రంగనాథన్, జవహర్లాల్ నెహ్రూ, సరస్వ తి మాత చిత్రపటాలకు పూలమాలలు వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యార్థులు గ్రంథాలయంలోని పుస్తకాలను వినియోగించుకుని ఉద్యోగాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ సిద్ధార్థరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కల్యాణి, పీఏసీఎస్ చైర్మన్ సత్తిరెడ్డి, ఉల్లాస్ జిల్లా కోఆర్డినేటర్ కృష్ణబాబు ఉన్నారు. -
చదువుతోనే ఉజ్వల భవిష్యత్
● కలెక్టర్ దివాకర ములుగు రూరల్: విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో చదువుకుంటే ఉజ్వల భవిష్యత్ నిర్మించుకోవచ్చని కలెక్టర్ దివాకర అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా దిశ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహింస్తున్న ఈఎల్ఎఫ్ ఇంగ్లిష్ లెర్న్ టు రైట్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కలెక్టర్ తన ఛాంబర్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ఇంగ్లిష్‌లో ఇంటర్‌ూయ్వ నిర్వహించి అభిరుచులు, రోల్ మోడల్ పై ముఖాముఖి నిర్వహించారు. బాలల దినోత్సవంపై రోల్ ప్లే చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అరుణ్ కుమార్, దిశ ఫౌండేషన్ కోఆర్డినేటర్ ముబీన్, సునీల్ తదితరులు ఉన్నారు. -
మార్చి ముహూర్తం కుదిరేనా?
సాక్షి, వరంగల్: గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే వరంగల్‌లోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని అందుబాటులోకి తెస్తామని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినా.. పనుల్లో వేగం లేకపోవడంతో 2024 మార్చిలో ప్రారంభిస్తామని చెప్పింది. ఆ తర్వాత ఎన్నికలు జరగడం, కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆస్పత్రి డిజైన్ మార్పు, వ్యయం అంచనాపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణతో కొద్దిరోజులు పనులకు బ్రేక్ పడింది. ఆ తర్వాత మళ్లీ పనులు ప్రారంభమైనా ఈ ఏడాది డిసెంబర్లో ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పలు దఫాలుగా సమీక్ష సమావేశాల్లో చెప్పినా.. కార్యరూపం దాల్చలేదు. తాజాగా రాష్ట్ర వైద్యవిద్యా సంచాలకుడు డాక్టర్ నరేంద్రకుమార్ మార్చిలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సేవలు ప్రారంభిస్తామని చెప్పారు. ఇలా పలుదఫాలుగా వాయిదా పడుతున్న ఈ ఆస్పత్రి ప్రారంభ ముహూర్తం మార్చిలోనైనా కుదురుతుందా లేదా మళ్లీ యథాలాపంగా వాయిదా పడుతుందా? అన్న చర్చ వరంగల్వాసుల్లో జరుగుతోంది. నాలుగేళ్లుగా నాన్చుతూ... వరంగల్‌లోని సెంట్రల్ జైలు స్థానంలోని 56 ఎకరాల్లో 16.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 24 అంతస్తుల భవనంలో 34 విభాగాల స్పెషాలిటీ మెడికల్ సర్వీసులతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు 2021జూన్‌లో ప్రారంభమయ్యాయి. మొదట పనులు వేగిరంగానే జరిగినా, 2022లో డిజైన్ మార్చి అంచనా వ్యయం పెంచి పనులు తిరిగి మొదలు పెట్టడంలో జాప్యం చేశారు. 2024 మార్చికి అందుబాటులోకి వస్తుందనుకున్న సమయంలో ప్రభుత్వం మారడంతో మరింత ఆలస్యమైంది. డిజైన్ల మార్పు, అంచనాల పెంపు, దానిపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ, తదితర కారణాలతో ఆగుతూ.. సాగుతున్నాయి. గతేడాది డిసెంబర్లో వరంగల్‌కు వచ్చిన సమయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలో నిర్మాణం 84 శాతం పూర్తయ్యిందని, 16 శాతం పూర్తి చేసేందుకు ఇంకెన్ని నెలల సమయం పడుతుందని ప్రశ్నించారు. ఇటీవల వరంగల్‌లో పర్యటన సమయంలో తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు కల్వ కుంట్ల కవిత.. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ అంచనా వ్యయం ఎందుకు పెంచాల్సి వచ్చిందని, అవకతవకలు జరిగాయనడంతో ఈ ఆస్పత్రి మరోసారి తెరమీదకు వచ్చింది. కొద్దినెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశంలోనే ఈ ఏడాది డిసెంబర్ వరకు నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించినా.. ఇప్పుడు ఆ గడువు వచ్చే ఏడాది మార్చి వరకు మారింది. మరో నాలుగు నెలల్లోనైనా ఈ ఆస్పత్రి సేవలు ప్రారంభిస్తే పేదలకు వరంగా మారనుంది. ఈ ఎంజీఎంలోని 1500 పడకల ఆస్పత్రి అక్కడికి తరలడం ద్వారా, అక్కడా మరో 500 పడకలు (కార్డియాలాజీ, న్యూరాలజీ, పిడియాట్రిక్ సర్జరీ, గ్యాస్ట్రో ఎంట్రాలాజీ, కార్డియోథెరపీ, నెఫ్రాలజీ, యూరాలజీ) ఏర్పాటు వల్ల 2వేల పడకల సామర్థ్యంతో వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. దీనిద్వారా హైదరాబాద్‌కు రెఫరల్ వైద్యం తగ్గి, ఇక్కడే అన్ని వైద్య సేవలు అందే అవకాశముంది. అవయవ మార్పిడికి సంబంధించిన శస్త్రచికిత్సలు కూడా హైదరాబాద్‌కు వెళ్లనవసరం లేకుండా ఇక్కడే జరగనున్నాయి. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సేవలు అందుబాటులోకి వస్తే ఆస్పత్రిని అక్కడికి తరలిస్తారన్న ఉద్దేశంతో ఎంజీఎంలో సివిల్వర్క్లు చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా కొన్ని వైద్యపరికరాలను కూడా సమకూర్చడం లేదని సమాచారం. దీనికితోడు పాలన అస్తవ్యస్తంగా మారి, కుంభకోణాలకు నెలవుగా మారింది. రోగులకు అవసరమైన సౌకర్యాలు సమకూర్చడంలో అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ వివాదంలో పాత సూపరింటెండెంట్ మారి కొత్తగా డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి వచ్చారు. ఈయన వచ్చాక ఎంజీఎంలో జరిగిన గోల్‌మాల్‌పై విచారణలు జరుగుతున్నాయి. ఇంకోవైపు రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిద్దామనుకున్నా సరైన వనరులు అందుబాటులో లేక ఇబ్బందులు తప్పడం లేదు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సాధ్యమైనంతమేర వరంగల్ సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తీసుకువస్తే కార్పొరేట్ వైద్యం పేదలకు అందే అవకాశముంది. నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకువస్తామని డీఎంఈ ప్రకటన క్షేత్రస్థాయిలో ఆశించని మేరకు సాగని పనులు నాలుగున్నరేళ్లుగా ఊరిస్తున్న వైద్యసేవలు అందుబాటులోకి వస్తే ప్రయోజనమే ఎంజీఎంను తరలిస్తారన్న సమాచారంతో ఇక్కడా నిర్లక్ష్యం సివిల్ వర్క్‌లు చేయకుండా తాత్సారంతో రోగుల ఇబ్బందులు -
మహిళల చదువుతోనే కుటుంబ అభివృద్ధి
వెంకటాపురం(ఎం): మహిళలు చదువుకుంటేనే కుటుంబం అభివృద్ధి చెందుతుందని డీఈఓ సిద్ధార్థరెడ్డి అన్నారు. మండల సమాఖ్య కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఉల్లాస్ శిక్షణ శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల్లో అక్షరాస్యత పెంపొందించడానికి ఉల్లాస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నిరక్ష్యరాస్యులైన ప్రతి మహిళ అక్షరాస్యులుగా గుర్తింపు పొందాలని తెలిపారు. కార్యక్రమంలో ఉల్లాస్ డిస్ట్రిక్ కోఆర్డినేటర్ కృష్ణబాబు, ఆడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాస్, ఎపీఎం ధర్మేంధ్ర, సీసీలు, తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి ములుగు రూరల్ : ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కల్యాణి అన్నారు. మండలంలోని మదనపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించి, మాట్లాడారు. రైతులు పంట ఉత్పత్తులను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. దళారును ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోవద్దని తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, పీఏసీఎస్ చైర్మన్ సత్తిరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, జయపాల్‌రెడ్డి, చాంద్‌పాషా తదితరులు ఉన్నారు. పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు ములుగు రూరల్: మండల పరిధిలోని జాకారం బాలికల పాఠశాలలో శుక్రవారం బాల దినోత్సవం సందర్భంగా జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ ఈగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ మాట్లాడుతూ.. బాల, బాలికల చేతిలోనే దేశ భవిష్యత్ ఉందన్నారు. అనంతరం డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాసు బాల కార్మిక చట్టాలు, బాల్య వివాహ చట్టాలపై అవగాహన కల్పించారు. ఉచిత న్యాయ సలహాల కోసం 15100కు కాల్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు అనిత, ఉపాధ్యాయులు లలిత, రజిత, శిరీష తదితరులు ఉన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలిములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని లేదంటే ఉద్యమం తప్పదని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదనాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ వేతనాలు పెంచాలని అన్నారు. రాష్ట్రంలో ఏఎన్ఎంల పనిభారం తగ్గించాలని కోరారు. రాత పరీక్ష పూర్తయి పెండింగ్‌లో ఉన్న 2,246 ఏఎన్ఎం పోస్టులు, 2,300 నర్సింగ్ ఆఫీసర్స్, 1,284 ఎల్టీ, 735 ఫార్మసిస్టు పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వ చర్యలు చేపట్టాని కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్న ఆరోగ్య మిత్రల వేతనాలు పెంచాలని, 104 ఉద్యోగులందరికీ జీతాలు ఇవ్వాలని, స్వంత జిల్లాలో నియమించాలని అన్నారు. ఈ నెల 18న సంగారెడ్డిలో నిర్వహించే రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు రత్నం రాజేందర్, సుధాకర్, జమున రాణి, పద్మ, వజ్ర, విజయలక్ష్మి, సులోచన, స్వప్న తదితరులు ఉన్నారు. -
రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి
● ఆర్అండ్బీ ఎస్ఈ శ్యామ్సింగ్ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో రోడ్డు విస్తర్ణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆర్అండబీ ఎస్ఈ శ్యామ్సింగ్ కాంట్రాక్టర్‌ను అదేశించారు. శుక్రవారం ఆయన మేడారంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి నార్లాపూర్ చెక్‌పోస్టు వరకు మూడు కిలోమీటర్ల మేరకు రోడ్డు విస్తరణ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. రోడ్డు విస్తీర్ణం వెట్‌మిక్స్ పనులు ఏ రోజు వరకు పూర్తవుతాయో పనుల వివరాల పురోగతి తేదీల వివరాలను చెప్పాలన్నారు. మంత్రుల ఆదేశాలకు అనుగుణంగా పనుల్లో పురోగతి మెరుగుపడాలని ఆదేశించారు. ఆయన వెంట డీఈఈ వెంకటరమణ, ఏఈ సాయితేజ ఉన్నారు. విద్యుత్ పనుల పరిశీలన మేడారంలో విద్యుత్ పనులను ఎస్ఈ మల్చూర్‌నాయక్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. రోడ్డు విస్తీర్ణం పనుల్లో అడ్డుగా ఉన్న వైర్లను తొలగించి నూతనంగా విద్యుత్ లైన్ ఏర్పాటు పనులను ఆయన పరిశీలించారు. విస్తరిస్తున్న రోడ్డుకు కొంత దూరంలోనే విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తే భవిష్యత్‌లో సమస్య తలెత్తకుండా ఉంటుందన్నారు. ఆయన వెంట డీఈఈ పులుసం నాగేశ్వర్రావు, అధికారులు ఉన్నారు. ఇదిలా ఉండగా.. మేడారంలో రోడ్డు విస్తర్ణ పనులు జరుగుతున్న నేపథ్యంలో గ్రామస్తులు, వ్యాపారుల నుంచి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దీంతో తహసీల్దార్ సురేష్‌బాబు పనులను పరిశీలిస్తూ ఎదురువుతున్న అడ్డంకులను పరిష్కరిస్తూ పనులను ముందుకు సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. -
అభివృద్ధి దశలో 5వ బెటాలియన్
● ఆధునిక జిమ్ ను ప్రారంభించిన కలెక్టర్ గోవిందరావుపేట: తెలంగాణ స్పెషల్ పోలీస్ 5వ బెటాలియన్ ప్రాంగణం అభివృద్ధిలో మరో అడుగుపడింది. చల్వాయి గ్రామంలోని టీజీఎస్పీ 5వ బెటాలియన్‌లో ఏర్పాటు చేసిన ఆధునిక జిమ్, ఓపెన్ జిమ్ ను కలెక్టర్ దివాకర టీఎస్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బెటాలియన్ సిబ్బంది శారీరక దృఢత్వం, క్రమ శిక్షణను పెంపొందించే దిశగా జిమ్ సెంటర్ సాయపడుతుందన్నారు. బెటాలియన్ అభివృద్ధికి, అవసరాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. బెటాలియన్ కమాండెంట్ సుబ్రహ్మణ్యం కలెక్టర్‌కు స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) పని తీరును, వారు ఉపయోగించే ప్రత్యేక పరికరాల వినియోగం గురించి వివరించారు. అనంతరం బెటాలియన్ సిబ్బందితో కలెక్టర్ పరస్పరం మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ సీతారాం, అసిస్టెంట్ కమాండెంట్ అనిల్ కుమార్, వేణుగోపాల్ రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్, శ్రీనివాస చారి, భాస్కర్, స్వామి, సాయిబాబు, వెంకటేశ్వర్లు, శ్రీధర్, అశోక్‌తో పాటు బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు. -
16 నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు
● ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం డి.విజయభాను హన్మకొండ: సమ్మక్క–సారలమ్మ జాతరను పురస్కరించుకుని ఈనెల 16 నుంచి మేడారానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను ఒక ప్రకటనలో తెలిపారు. 2026 జనవరి 28 నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు జాతర జరుగుతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ముందుగా వనదేవతలను దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. హనుమకొండ బస్టాండ్ నుంచి మేడారానికి ప్రతిరోజు ఉదయం 6.10, 7.00, 8.00, 9.00, మధ్యాహ్నం 12.10, 1.00, 1.40, 14.30; రాత్రి 8.20 గంటలకు బస్సులు బయలుదేరుతాయని వివరించారు. అదేవిధంగా మేడారం నుంచి హనుమకొండకు ఉదయం 5.45, 9.45, 10.15, 11.15, మధ్యాహ్నం 1.10, సాయంత్రం 4.00, 5.00, 5.30, 6.00 గంటలకు బస్సులు బయలుదేరుతాయని చెప్పారు. పల్లెవెలుగు బస్సు చార్జీలు పెద్దలకు రూ.130, పిల్లలకు రూ.80, ఎక్స్‌ప్రెస్ బస్సు చార్జీలు పెద్దలకు రూ.180, పిల్లలకు రూ.110గా నిర్ణయించినట్లు తెలిపారు. భక్తులు ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా, సుఖవంతంగా ప్రయాణించి వనదేవతలను దర్శించుకోవాలని ఆర్ఎం విజయభాను కోరారు. -
దేవునిగుట్టను టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దుతాం
● అటవీశాఖ కాళేశ్వరం జోన్ సీసీఎఫ్ ప్రభాకర్ములుగు: జిల్లాలోని దేవునిగుట్టను టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దుతామని అటవీశాఖ కాళేశ్వరం జోన్ సీసీఎఫ్ ప్రభాకర్ అన్నారు. ములుగు మండలంలోని కొత్తూరు గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న దేవునిగుట్టను శుక్రవారం ఆయన ములుగు డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్‌తో కలిసి సందర్శించారు. ఆలయంలోని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్న దేవునిగుట్టను అన్ని విధాలా అభివృద్ధి చేసి పర్యాటకులు, భక్తులకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ సందర్భంగా దేవస్ధానం పాలకమండలి సభ్యులు సీసీఎఫ్ ప్రభాకర్‌ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ములుగు ఎఫ్ఆర్ఓ శంకర్, డీఆర్ఓ రవికుమార్, బీట్ ఆఫీసర్ భద్రునాయక్, పాలకమండలి సభ్యులు వీరంనేని కిషన్‌రావు, అక్కల సంపత్, రవీందర్రావు, మల్లయ్య, రాజ్‌కుమార్, రాంబాబు, సుమన్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. -
డీలర్లు కాంటా పెట్టి బియ్యం తీసుకోవాలి
● సివిల్ సప్లయీస్ డీఎం రాంపతి వెంకటాపురం(కె): జీసీసీ గోదాం నుంచి రేషన్ షాపులకు బియ్యం తరలించే సమయంలో డీలర్లు తప్పనిసరిగా బియ్యం కాంటా పెట్టుకుని షాపులకు తరలించాలని సివిల్ సప్లయీస్ డీఎం రాంపతి అన్నారు. శుక్రవారం మండలంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మండ కేంద్రంలోని జీసీసీ గోదాంను తనిఖీ చేశారు. గోదాంలో ఉన్న బియ్యం నిల్వలను పరిశీలించి మాట్లాడారు. రేషన్ షాపు డీలర్లు గోదాం నుంచి బియ్యం షాపునకు తరలించే సమయంలో బియ్యం కాంటా పెట్టుకోవాలని సూచించారు. కాంటా పెట్టకుండా తరలిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు చెప్పారు. కార్యక్రమలలో జీసీసీ మేనేజర్ స్వామి తదితరులు ఉన్నారు. -
రేకుల షెడ్డు.. మొండి గోడలు
ఏటూరునాగారం: పేద విద్యార్థులకు విద్యనందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏటూరునాగారం మండలంలో మూడు ప్రభుత్వ పాఠశాలను ఈ ఏడాది జూన్ 7న ప్రారంభించింది. ఇందులో ఒకటి కొమురం భీం గొత్తికోయగూడెంలోని పాఠశాల. ఈ పాఠశాల నేటికీ గుడిసెలో కొనసాగుతోంది. నూతనంగా పాఠశాల మంజూరు కావడంతో గ్రామ పంచాయతీ నిధులతో నూతనంగా భవనం నిర్మించేందుకు గ్రామ పంచాయతీకి చెందిన ఓ కారోబార్ పనులు చేపట్టారు. అయితే రిజర్వ్ ఫారెస్టులో శాశ్వత నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతులు లేవని అటవీశాఖ అధికారులు నిర్మాణ పనులను అడ్డుకున్నారు. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోవడంతో మొండిగోడలే దర్శనమిస్తున్నాయి. చేసేది ఏమిలేక ప్రభుత్వ పాఠశాలను ఆ గూడెం ప్రజలు స్వయంగా నిర్మించుకున్న గుడిసెలోనే నిర్వహిస్తున్నారు. వర్షం, గాలి దుమా రం వస్తే పాఠశాలను మూసివేయక తప్పడం లేదు. మట్టినేలపైనే కూర్చొని చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. పేద విద్యార్థులకు విద్య అందకుండా పోవడం ఒక సమస్య అయితే కనీసం శాశ్వత నిర్మాణం భవనం, మౌలిక వసతులు లేకపోవడం మరో సమస్యగా మారింది. తమ పిల్లలు అక్షరాలు నేర్చుకునేందుకు అవకాశం లేకుండా పోతుందని గిరిజన గూడెం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణాన్ని అడ్డుకున్న అటవీశాఖ ఇబ్బందిపడుతున్న విద్యార్థులుప్రభుత్వ పాఠశాలకు పక్కా భవనం నిర్మించాలి. గుడిసెలు, రేకుల ఇల్లు కావడంతో విద్యార్థులకు రక్షణ లేకుండా పోయింది. ఇక్కడ ఉన్న గిరిజనులకు సరైన విద్య, సౌకర్యాలు కల్పించాలి. వేరే దగ్గరకు వెళ్లి చదువుకునే పరిస్థితి లేదు. ఇక్కడ నుంచి ఏ పాఠశాలకు పోవాలన్న నాలుగు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అందుకని పాలకులు, ప్రభుత్వ అధికారులు ఈ పాఠశాల భవన నిర్మాణం పూర్తయ్యేలా చూడాలి. – కుర్సం భూమిక, కొమురంభీం నగర్ -
రోడ్డు విస్తరణ పనుల్లో వేగం
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారంలో రోడ్డు విస్తరణ పనుల్లో ఆర్అండ్బీ అధికారులు వేగం పెంచారు. ఈనెల 12వ తేదీన మేడారం జాతర పనులపై నిర్వహించిన సమీక్షలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, ధనసరి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్.. రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యంపై అధికారులకు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గురువారం రోడ్డు విస్తర్ణ పనులు ఊపందుకున్నాయి.. అధికారులు దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. రోడ్డు విస్తరణ పనులను మంత్రులు అదేశించిన సమయంలో పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా మేడారంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ చలమారెడ్డి జాతరలో భక్తుల సౌకర్యార్థం తాగునీటి పైపులైన్, తాత్కాలిక జీఐ షీట్ల మరుగుదొడ్ల పనులపై సంబంధిత కాంట్రాక్టర్లతో సమావేశమయ్యారు. తాగునీటి పనుల ఏర్పాట్లు, మరుగుదొడ్ల పనులు త్వరగా ప్రారంభించాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. పనుల ప్రదేశాల్లో వరి కోతలు కాలేదని పనులు చేయడం వీలు కాదని గుత్తేదారులు ఆయనకు వివరించగా.. వరి పొలాలు లేని ఖాళీ ప్రాంతాల్లో పనులు చేపట్టాలని ఆయన సూచించారు. ఆ శాఖ ఏఈలు, డీఈలతో ఎస్ఈ సమావేశం ఏర్పాటు చేసి జాతర పనులపై పలు సూచనలు, సలహాలు అందించారు. కాంట్రాక్టర్లతో దగ్గరుండి పనులు ప్రారంభించాలని అదేశించినట్లు తెలిసింది.మంత్రుల ఆదేశాలతో అధికారుల్లో కదలిక -
అన్నివర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
● రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు గురువారం జిల్లాకేంద్రంలోని పలు అభివృద్ధి పనులను కలెక్టర్ టీఎస్ దివాకర, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణితో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు శాసీ్త్రయ విద్యాబోధనకు ఉపయోగపడే విధంగా జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.50 లక్షల నిధులతో సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ నిర్మిస్తున్నామని అన్నారు. విద్యార్థులు ల్యాబ్‌ను వినియోగించుకోవాలని సూచించారు. బండారుపల్లి జంక్షన్లో అభివృద్ధి, సుందరీకరణ పనులకు ప్రభుత్వం రూ.61లక్షలతో పనులను చేపట్టిందని అన్నారు. ముస్లిం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.1.50 కోట్ల నిధులను కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ భవనానికి రూ.15 లక్షలు, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ భవనానికి రూ.10 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. గట్టమ్మ ఆలయ సమీపంలో 33/11 విద్యుత్ ఉప కేంద్రం రూ.3 కోట్ల 62 లక్షలు కేటాయించగా భూమి పూజ చేశారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. మహిళలు ఆర్ధికాభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వడ్డీ లేని రుణాలు, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నట్లు తెలిపారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను విడతల వారీగా అందిస్తామని అన్నారు. జంగాపల్లి జంక్షన్లో రామప్ప శిల్ప కళా సంపద, ఆలయ విశిష్టతతో కూడిన పనులు చేపట్టామని అన్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నిధులు లేక అభివృద్ధి పనులు చేయలేకపోయానని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో మంత్రిగా జిల్లా అభివృద్ధిచేసి తీరుతానని స్పష్టం చేశారు. ములుగు జిల్లాను పర్యాటక హబ్‌గా మార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
పెరిగిన మెస్‌చార్జీలు
ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం మెస్‌చార్జీలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యాహ్న భోజన పథకం కార్మికులు విద్యార్థులకు చాలీచాలని వంట సరుకులను తీసుకొస్తూ మధ్యాహ్న భోజనం అందిస్తున్నారనే విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం మెస్ చార్జీలను పెంచి జూలై నుంచి అమలు చేస్తుంది. ప్రభుత్వం పెంచిన మెస్ చార్జీలకు అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే విధంగా కలెక్టర్, విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నప్పటికీ పెగిరిన మెస్ చార్జీలను మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. జిల్లాలో 655 మంది కార్మికులు జిల్లాలోని పది మండలాల్లో మొత్తం 655 మంది వంట కార్మికులు మధ్యాహ్న భోజన పథకంలో పని చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 416 పాఠశాలల్లో 15,816 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ప్రభుత్వం రేషన్ షాపుల ధ్వారా బియ్యం పంపిణీ చేస్తుంది. కూరగాయలు, పప్పులు, నూనె, కారం, ఉప్పు, కోడి గుడ్లు, వంట గ్యాస్‌ను కార్మికులు కొనుగోలు చేసి నెల వారీగా బిల్లు పెట్టుకోవాల్సి ఉంది. నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో విద్యార్థులుకు అందించే భో జనం నాణ్యత లోపించింది. దీనికితోడు నెలవారీగా చెల్లించాల్సిన బిల్లు రాకపోవడంతో భోజన కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను విడుదల చేయాని కార్మికులు కోరుతున్నారు. విద్యార్థుల మెనూ.. మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు నాణ్య మైన భోజనం అందించాలి. వారంలో మూడు రోజులు సోమవారం, బుధవారం, శుక్రవారం కోడిగుడ్డు అందించాలి. రోజు వారీగా మిక్స్డ్ కూరగాయాలు, చారు, ఆకు కూరలు, పప్పు, రాగిజావ అందించాలి. గురువారం వెజిటేబుల్ బిర్యానీ అందించాలి. జిల్లాలో ప్రైమరీ పాఠశాలలు 332 ఉండగా ఇందులో విద్యార్థులకు గతంలో మెస్ చార్జీలు ఒక్కో విద్యార్థికి రూ.6.19 అందించగా పెరిగిన ప్రకారం రూ.6.78 పైసలు అందిస్తారు. అప్పర్ ప్రైమరీ స్కూల్స్ 43 ఉండగా గతంలో రూ.9.29 పైసలు చెల్లించారు. ప్రస్తుతం 10.17 పైసలు అందిస్తున్నారు. హై స్కూల్స్ 41 ఉండగా అందులో గతంలో రూ.10.67 అందించగా ప్రస్తుతం రూ.11.17 పైసలు అందిస్తున్నారు. జిల్లాలో 416 పాఠశాలలు 15,816 మంది విద్యార్థులు నెలల తరబడి బిల్లుల పెండింగ్మధ్యాహ్న భోజన పథకంలో ప్రభుత్వం పెంచిన మెస్ చార్జీలు నామమాత్ర ఉపశమనమే. మధ్యాహ్న భోజన పథకంలో బియ్యంతోపాటు, గ్యాస్, నిత్యావసర సరుకులు, కోడి గుడ్లు ప్రభుత్వం పంపిణీ చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వంట కార్మికులకు వేతనం నెలకు రూ.10 వేలు అందించాలి. కార్మికులకు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి. – జంపాల రవీందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ -
సమస్యలు పరిష్కరించాలని వినతి
ములుగు రూరల్: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మధ్యాహ్న భోజన కార్మికులు గురువారం మంత్రి సీతక్కకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ మాట్లాడుతూ.. వంట కార్మికులను తొలగించి హరేరామా హరే కృష్ణ ఫౌండేషన్‌కు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. దీనివల్ల వేలాది మంది వంట కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లును తక్షణమే విడుదల చేయాని అన్నారు. ప్రతి విద్యార్థికి రూ.25 మెస్ చార్జీ చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు అంజాద్ పాషా, రమ, రాజకుమారి, ప్రమీల, భారతి, కమల, రాధ, పద్మ, సమ్మక్క తదితరులు ఉన్నారు. -
చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలి
● దాసగాని సుమ ఏటూరునాగారం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థినుల కోసం ప్రవేశపెట్టిన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు దాసగాని సుమ అన్నారు. మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రవి తేజ అధ్యక్షతన గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సుమ మాట్లాడుతూ.. మహిళా చట్టాలను పకడ్బందీగా అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని ఆరోపించారు. మహిళల, విద్యార్థినులపైన అత్యాచారాలు, దాడులు పెరిగిపోయాయని వాపోయారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు సేఫ్టీ నాప్కిన్స్ అందించాలని కోరారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీమేరకు విద్యార్థినుకు స్కూటీలు అందించాలన్నారు. సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం విద్యారంగానికి నిధులు కేటాయించడంలేదని ఆరోపించారు. అనంతరం 10 మందితో కన్వినింగ్ కమిటీ ఎన్నుకున్నారు. జిల్లా కన్వీనర్‌గా మధులత, కో–కన్వీనర్లుగా మానస, స్రవంతి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు బాలు, నాయకులు మమత, రామలక్ష్మి, మనవిత, దామిని, జ్యోత్స్న, కావ్య, శబానా పాల్గొన్నారు. -
మహిళలు సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి
ములుగు రూరల్: మహిళలు సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని ఉల్లాస్ జిల్లా కోఆర్డినేటర్ వేణుగోపాల్ అన్నారు. జిల్లాకేంద్రంలో నవ భారతి మండల సమైక్య ఆధ్వర్యంలో గ్రామ సంఘాల ప్రతినిధులు, వీఓలకు గురువారం ఉల్లాస్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉల్లాస్ శిక్షణలో చదువు రాని మహిళలకు చదువు నేర్పిస్తామని అన్నారు. మహిళలు సంపూర్ణ అక్షరాస్యత సాధించినప్పుడే నిజమైన అభివృద్ధి అని తెలిపారు. గ్రామస్థాయిలో వలంటీర్ల ద్వారా సంఘం సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ డీపీఎం భవాణి, ఏపీఎం శ్రీనివాస్, సీసీలు విజయ, విజయలక్ష్మి, సిబ్బంది కిషన్‌రావు, సంఘం ప్రతినిధులు, వీఓలు పాల్గొన్నారు. ములుగు రూరల్: ములుగు ఎకై ్సజ్ సేష్టన్ పరిధిలో వేర్వేరు కేసుల్లో జప్తు చేసిన వాహనాలకు ఈ నెల 14న ములుగు కార్యాలయంలో వేలం నిర్వహిస్తున్నట్లు ఎకై ్సజ్ సీఐ సుధీర్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ఎకై ్సజ్ అధికారి భూపాలపల్లి ధ్వర్యంలో వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. వేలలో పాల్గొనేవారు 50 శాతం డిపాజిట్ సొమ్మును చెల్లించాలని సూచించారు. వేలంలో వాహనం పొందిన వారు అదే రోజు పూర్తి సొమ్ము చెల్లించి వాహనం తీసుకెళ్లాలని తెలిపారు. లేని పక్షంలో డిపాజిట్ సొమ్ము జప్తు చేయబడుతుందని తెలిఆపరు. వాహనాలను తుక్కు రూపంలో మాత్రమే తీసుకెళ్లాలని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు వేలంలో పాల్గొనాలని కోరారు. ములుగు రూరల్: ప్రభుత్వం విద్యార్థుల పెండింగ్ సాల్కర్‌షిప్, ఫీజు రియింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మమన్‌యాదవ్ డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న రూ.8,500 కోట్ల స్కాలర్షిప్, ఫీజుల రియింబర్స్‌మెంట్‌ను విడుదల చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 21 నెలలు గడుస్తున్నా.. ఫీజు రియింబర్స్‌మెంట్ విడుదల చేయడం లేదని అన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులు కళాశాల ఫీజులు చెల్లించలేక విద్యకు దూరమయ్యే పరిస్థిత ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థులకు కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను భ్రష్టుపట్టిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ స్కాలర్షాప్లను విడుదల చేయాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు కోరిక సాయిరాం, ఉప్పల శ్రీతన్, రోహిత్, శిరీశ్, తదితరులు పాల్గొన్నారు. మంగపేట: తెలంగాణ పురగిరి క్షత్రియ(పెరిక) కుల సంఘం రాష్ట్ర కార్యవర్గ అసోసియేట్ అధ్యక్షుడిగా ఆకా రాధాకృష్ణ ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో బుధవారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలో మండలంలోని తిమ్మంపేటకు చెందిన రాధాకృష్ణ అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గతంలో ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన ఆయన మొదటి నుంచి పెరికలను ఐక్యం చేసి రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఆకాంక్షతో ముందుకెళ్తున్నట్లు ఆ సంఘం నాయకులు తెలిపారు. ఈమేరకు రాధాకృష్ణ ఎన్నికపై ఆ సంఘం నాయకులు ఆక రవి, పెట్రం సుధాకర్, ధర్మపురి శ్రీనివాస్, ముత్తినేని ఆదినారాయణ, చిలకమర్రి రాజెందర్, పూజారి సురేందర్, చిలకమర్రి సతీష్, వేణు, ఆక సతీష్, పూజరి నరెందర్, వెంకన్న, దంతెనపల్లి నరెందర్, యరంగారి సురేష్, మోహన్‌రావు, ఆక రామకృష్ణ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలోని నందీశ్వరుడికి కార్తీకమాసం సందర్భంగా ఈనెల 17న సోమవారం అభిషేక పూజలను నిర్వహించడానికి దేవాదా యశాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ శనిగెల మహేష్ గురువారం తెలిపారు. -
గుట్టుగా ‘గుట్కా’ దందా..!
ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా మళ్లీ జోరందుకున్న వ్యాపారంసాక్షిప్రతినిధి, వరంగల్ ● హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో గుట్కాలు విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు పది రోజుల క్రితం పోలీసులు దాడులు నిర్వహించారు. 43 ప్యాకెట్ల అంబర్, గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు శ్రీకాంత్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ● వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు జూలై మాసంలో పిన్నవారివీధిలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.4.50 లక్షలు విలువైన ఆర్ఆర్ గుట్కా 860 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. రాజ్పురోహిత భవాని సింగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. మరో వ్యక్తి రాజ్పురోహిత జబ్బార్సింగ్ పరారైనట్లు ప్రకటించారు. ● జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో మూడు రోజుల కిందట (11 తేదీన) పెద్ద మొత్తంలో నిషేధిత అంబర్, గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. పాలకుర్తి నుంచి వరంగల్‌కు కారులో తరలిస్తున్నారన్న సమాచారం మేరకు అలర్టయిన పోలీసులు రూ.6.70 లక్షల విలువైన 13 బస్తాల అంబర్, గుట్కా ప్యాట్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. నామమాత్రపు పెట్టుబడి.. పది రెట్ల లాభాలు.. అవసరమైతే ముడుపులు.. రకరకాల పేర్లు.. ఆకర్షణీయ ప్యాకింగులు... అమ్మకాల్లో ఇష్టారాజ్యం..పల్లె పట్టణం ప్రాంతమేదైనా చాపకిందనీరులా నిషేధిత గుట్కాల వ్యాపారం జోరు నానాటికీ పెరుగుతోంది. ఇటీవల ఉమ్మడి జిల్లాలో తరచూ పట్టుబడుతున్న వ్యాపారులు సహా పెరుగుతున్న కేసుల తీవ్రత గుట్కా దందా సాగుతున్న తీరుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. రూ.4లది రూ.12–రూ.15లకు అమ్మేస్తున్నారు.. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా నగరాలు, పట్టణాలు కాకుండా గ్రామాల్లోని చిన్నదుకాణాల్లో సైతం గుట్కాలను అమ్ముతున్నారు. ఒక్కో ప్యాకెట్‌ను రూ.4లకు కొనుగోలు చేసిన దుకాణదారు రూ.12–15 వరకు ఆయా బ్రాండ్ వారీగా విక్రయిస్తున్నాడు. ఇలా రోజు మొత్తంలో 20 ప్యాకెట్లను అమ్మితే సుమారు రూ.150–200 వరకు ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. ఇందులో రాటుదేలిన వ్యాపారులకు ఈ అక్రమదందా వల్ల ఒక్క రోజులోనే లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్న సందర్భాలున్నాయి. హోల్‌సేల్‌గా 20 ప్యాకెట్లు, 80 ప్యాకెట్లు ఉన్న గుట్కాలను స్థానిక వ్యాపారులకు ఒక్కసారిగా పెద్దమొత్తంలో అందిస్తుండటం వల్ల గంటల వ్యవధిలోనే పెద్ద వ్యాపారులు జేబుల్లో ఊహించని సొమ్మును నింపుకుంటున్నారు. నిషేధం.. నిబంధనలు హుష్‌కాకి జడలు విప్పిన ‘మాఫియా’.. పట్టుబడుతున్నా ఆపడం లేదు రూ.లక్షల్లో లావాదేవీలు.. నామమాత్రంగా కేసులు


