ఆయిల్‌పామ్‌తో కాసులు | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పామ్‌తో కాసులు

Jul 2 2026 2:29 AM | Updated on Jul 2 2026 2:29 AM

దీర్ఘకాలిక ఆదాయం..

ఈ ఏడాది పెరగనున్న సాగు

భూపాలపల్లి: ఏళ్ల తరబడి కష్టనష్టాలను అనుభవించి పత్తి, మిర్చి, వరి సాగు చేసిన రైతులు ఆధునిక వ్యవసాయ రంగం వైపు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్‌లో అత్యంత డిమాండ్‌ ఉన్న ఆయిల్‌పామ్‌ సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ యిల్‌పామ్‌ గెలల ధర రోజురోజుకూ పెరుగుతుండటంతో సాగుకు రైతన్నలు ఆసక్తి చూపుతున్నారు.

ఈ ఏడాది 2,500 ఎకరాల్లో సాగు అంచనా..

జిల్లాలోని 12 మండలాల్లో 2021 సంవత్సరంలో ఆయిల్‌ పామ్‌ సాగు 352 ఎకరాలతో ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతీ ఏటా పెరుగుకుంటూ రాగా 2024–2026 మధ్య కాలంలో కాస్త తగ్గింది. జిల్లాలో 2021లో సాగు ప్రారంభించిన రైతులకు మార్చి నెల నుంచి మంచి దిగుబడి వస్తుంది. దీంతో రైతులంతా ఈ పంటను సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే 150 ఎకరాల్లో రైతులు మొక్కలు నాటగా.. మునుపెన్నడూ లేని విధంగా 2,500 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు జరిగే అవకాశం ఉందని ఉద్యానశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వందల మంది రైతులు మొక్కల కోసం డీడీలు తీసి ఉన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా వీరంతా ఈ నెల చివరి వారంలో మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు.

భారీ ధర పలుకుతున్న గెలలు..

మన దేశానికి ముఖ్యంగా మలేషియా నుంచి క్రూడ్‌ పామాయిల్‌ ఎక్కువగా దిగుమతి అవుతుంది. కోవిడ్‌ సమయం 2021లో మలేషియా ఎగుమతిని నిలిపివేసింది. దీంతో అప్పుడు ఆయిల్‌పామ్‌ గెల టన్ను ధర రూ. 24వేలకు చేరుకుంది. అనంతరం పరిస్థితులు చక్కబడటంతో 2022లో రూ.13వేలు, 2023లో రూ.13,500, 2024లో రూ.14వేలు, 2025లో రూ.20వేల ధర పలికింది. ఇప్పుడు ఏకంగా గెలల టన్ను ధర రూ.24వేలకు చేరుకుంది. ప్రస్తుత ధరలను గమనించిన రైతులు, భవిష్యత్‌లో కూడా ఆయిల్‌పామ్‌కు డిమాండ్‌ ఉంటుందని భావించి మూడు ఎకరాలకు పైన ఉన్న రైతులంతా ఈ పంట సాగుకు సన్నద్ధం అవుతున్నారు. దీంతో ఈ ఏడాది ఊహించని రీతిలో జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగు జరగబోతుందని తెలుస్తోంది.

రైతులు

ఎకరాలు

1,877.54

610.61

352.55

478.4

1,163.90

229

189

112

609

403

2021

2022

2023

2025

2026

2024

ఆయిల్‌పామ్‌ సాగుతో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం ఉంటుంది. సాగు ఖర్చు కూడా తక్కువ. మొక్కలు, డ్రిప్‌కు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. ఈ ఏడాది 2,500 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు జరుగుతుందని అంచనా వేశాం. ఆయిల్‌పామ్‌ సాగు వలన కలిగే లాభాలను రైతులకు వివరిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పంట సాగు అనుకూలంగా ఉంటుంది.

– తిరుపతి, జిల్లా ఉద్యానశాఖ అధికారి

ప్రస్తుతం టన్ను గెల ధర రూ.24వేలు

ఎకరాకు రూ.లక్షన్నరకు పైగా రాబడి

30 ఏళ్లపాటు రానున్న దిగుబడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement