ములుగు: జిల్లా పరిధిలోని గట్టమ్మ వద్ద నిర్మిస్తున్న కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు మంత్రి నూతనంంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను బుధవారం పరిశీలించారు. భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు. కలెక్టరేట్ భవనాన్ని సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభం చేయించనున్నట్లు సీతక్క వెల్ల డించారు. అదేవిధంగా గట్టమ్మ వద్ద నిర్మిస్తున్న పైలాన్ ప్రాజెక్టు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క


