సరుకుల నాణ్యతలో రాజీపడొద్దు | - | Sakshi
Sakshi News home page

సరుకుల నాణ్యతలో రాజీపడొద్దు

Jul 4 2026 2:37 AM | Updated on Jul 4 2026 2:37 AM

ఐటీడీఏ ఇన్‌చార్జ్‌ ఏపీఓ, ఎస్‌డీసీ ప్రతాప్‌

ఏటూరునాగారం: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లోని గి రిజన విద్యార్థులకు ఆహార వస్తువుల సరఫరా చేసే గుత్తేదారులు నాణ్యత విషయంలో రాజీపడకుండా సరఫరా చేయాలని ఐటీడీఏ ఇన్‌చార్జ్‌ ఏపీ ఓ, ఎస్‌డీసీ ప్రతాప్‌ అన్నారు. శుక్రవారం ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన సంక్షేమ పాఠశాలలకు జూలై నుంచి ఆగస్టు 2026 వరకు ఆహార వస్తువులు, క్లీనింగ్‌ పై టెండర్లను ఖరారు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్‌ మాట్లాడుతూ ఆహార వస్తువులు, క్లీనింగ్‌, పెరిషబుల్‌ కొనుగోలుకు వ్యాపారులు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఈ టెండర్లను కోరామన్నారు. తక్కువ కోడ్‌ చేసి నాణ్యతగా వస్తువులను సరఫరా చేసే వారికి సరుకుల నాణ్యతను పరిశీలించి వారికి టెండర్లను అప్పగిస్తామన్నారు. నాణ్యత లోపిస్తే వెంటనే టెండర్‌ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో డీడీ ఫిరంగి, డీటీడీఓ నాగసాగర్‌, జీసీసీ డీఎం వాణి, జీసీసీ మేనేజర్‌లు దేవ్‌, యాకయ్య, వ్యాపారస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement