గోవిందరావుపేట: జిల్లాలోని రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌తో అనుసందానమైన జాతీయ రహదారి–163పై రోజురోజుకూ వాహనాల రద్దీ పెరుగుతోంది. భారీగా ఇసుక లారీలు, సరుకు రవాణా వాహనాలు, పర్యాటకుల వాహనాల రద్దీతో భయానకంగా నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వంటి కారణాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు అరైవ్ అలైవ్ అవెర్నెస్ ప్రోగ్రాం ద్వారా వాహనదారులకు పలుమార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. హెల్మెట్ ధరించాలని, సీట్‌బెల్ట్ పెట్టుకోవాలని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని, అతివేగం ప్రాణాంతకమని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పదేపదే సూచిస్తున్నారు. పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా వాహనదారుల తీరు మాత్రం మారడం లేదు.
137 ప్రమాదాలు..55 ఘోర ప్రమాదాలు
జిల్లా పోలీసుల గణాంకాల ప్రకారం ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈ నెల 17వ తేదీ 137 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. వీటిలో 55 ఘోర ప్రమాదాలు కాగా 63 సాధారణ ప్రమాదాలు, 19 గాయాలు లేని ప్రమాదాలు నమోదయ్యాయి. ఈ ప్రమాదాల్లో 60 మంది ప్రాణాలు కోల్పోగా 170 మంది గాయపడ్డారు. అయితే ట్రాఫిక్ పెరిగినంతగా రహదారి భద్రతా వ్యవస్థ బలోపేతం కాలేదనే అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు స్పందించడం కంటే, ప్రమాదం జరగకముందే నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే గుర్తించిన బ్లాక్‌స్పాట్లతో పాటు తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న ఇతర ప్రాంతాలను కూడా అధికారికంగా గుర్తించి లోపాలను సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు. రిఫ్లెక్టివ్ హెచ్చరిక బోర్డులు, హైమాస్ట్ లైట్లు, రంబుల్ స్ట్రిప్స్, స్పీడ్ కెమెరాలు, అత్యవసర వైద్య సేవలు, హైవే పెట్రోలింగ్‌ను మరింత బలోపేతం చేస్తే ప్రమాదాలను నివారించవచ్చని పలువురు సూచిస్తున్నారు.
మూడు బ్లాక్‌స్పాట్ల గుర్తింపు
ప్రమాదాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు ఇప్పటికే పెద్ద గొల్లగూడెం, చిన్నబోయినపల్లి, ఎస్‌ఎస్ తాడ్వాయి ప్రాంతాలను అధికారికంగా బ్లాక్ స్పాట్లుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో రహదారి విస్తరణ, మూలమలుపుల సవరణ, హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇది స్వాగతించదగిన చర్య అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అధికారికంగా గుర్తించిన మూడు బ్లాక్‌స్పాట్లతో పాటు మరెన్నో ప్రాంతాలు నిత్యం ప్రమాదాలకు వేదికగా మారుతున్నాయి. జిల్లాలో గట్టమ్మ తల్లి దేవాలయం సమీపంలోని మూలమలుపు, మచ్చాపూర్ గ్రామ శివారు, పస్రా–గోవిందరావుపేట మధ్య చర్చి సమీపంలోని మూలమలుపు, గుండ్లవాగు మూలమలుపు, కొండపర్తి–జలగలంచ వాగు మూలమలుపు, చిన్నబోయిన పరిసరాలు, ఏటూరునాగారం వై జంక్షన్, జగన్నాథపురం జంక్షన్ ప్రాంతాల్లో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ పూర్తిస్థాయి శాశ్వత భద్రతా చర్యలు చేపట్టాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.
పోలీస్ స్టేషన్ ప్రమాదాలు మృతులు
మొత్తం
ప్రమాదాలు
137
మొత్తం మృతులు
60
ఎన్‌హెచ్–163పై రోడ్డు
ప్రమాదాలు నిత్యకృత్యం
ఏడున్నర నెలల్లో 60 మంది మృత్యువాత
అతివేగం, మద్యం సేవించడమే
కారణం
ములుగు
పస్రా
వెంకటాపురం(ఎం)
ఏటూరునాగారం
ఎస్‌ఎస్‌తాడ్వాయి
మంగపేట
నార్లాపూర్
వెంకటాపురం(కె)
కన్నాయిగూడెం
పేరూర్
వాజేడు
అతివేగంతో ప్రమాదాలు
జిల్లాలో జాతీయ రహదారి–163పై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను ఎప్పటికప్పుడు గుర్తించి అవసరమైన చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే పెద్ద గొల్లగూడెం, చిన్నబోయినపల్లి, ఎస్‌ఎస్ తాడ్వాయి ప్రాంతాలను బ్లాక్‌స్పాట్లుగా గుర్తించి రహదారి విస్తరణ, మూలమలుపుల సవరణ, హెచ్చరిక బోర్డులు, రిఫెక్టర్లు తదితర భద్రతా చర్యలు చేపడుతున్నాం. వాహనదారులు అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి అలవాట్లకు దూరంగా ఉండి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయి.
–బి కుమారస్వామి, ఎన్‌హెచ్ డీఈఈ, ములుగు


