ఎస్‌ఎస్‌తాడ్వాయి: సహజ వనరుల పరిరక్షణకు ఆదివాసీలందరూ ఉద్యమించాలని ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు కోవా దౌలత్‌రావు మోకాశి పిలుపునిచ్చారు. మండల పరిధిలోని ఆదివాసీ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడి సాయిబాబు అధ్యక్షతన శనివారం ఏర్పాటు చేసిన సంఘం విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లోని ఆదివాసీలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా భూమి, అడవి, సహజ వనరుల దోపిడీ ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులను ప్రభుత్వ సంక్షేమ పథకాలలో భాగస్వామ్యం చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూ బదలాయింపు నిరోధక(ఎల్‌టీఆర్) చట్టం, అటవీ హక్కుల చట్టం–2006, పెసా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. ఈ చట్టాల అమలుకు ఆదివాసీ సేన కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సన్నద్ధం కావాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు గుండు శరత్, సోడే వెంకటేశ్వర్లు, పొడెం సమ్మయ్య, జంగూ పటేల్, చింత అరుణ, వజ్జ జ్యోతిబసు, ఊకె రవి, ఆలం శ్రీను, కోర్సా నరేశ్, కల్తి నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు
దౌలత్‌రావు మోకాశి


