రూ.91.03 కోట్లు | - | Sakshi
Sakshi News home page

రూ.91.03 కోట్లు

Jul 10 2026 7:28 AM | Updated on Jul 10 2026 7:28 AM

79,389 మంది రైతుల ఖాతాల్లో జమ

9 ఎకరాల వరకు అందిన పెట్టుబడి సాయం

రైతు భరోసా..

ములుగు: వానాకాలం సాగు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. పంటల సాగు కోసం ఎకరానికి రూ.6వేల చొప్పున జిల్లాలోని 79,389 మంది రైతులకు రూ.91.03 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేసింది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభ సమయంలోనే పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 9 ఎకరాల వరకు ఉన్న రైతాంగానికి ప్రభుత్వం గురువారం వరకు రైతుభరోసా డబ్బులు జమచేసింది. జిల్లాలో 10 ఎకరాల వరకు ఉన్న మరో వెయ్యిమంది రైతులకు మరో రూ.9 కోట్లను శుక్రవారం వరకు ప్రభుత్వం జమ చేయనున్నట్లు వ్యవసాయ అధికారులు వెల్లడించారు.

1.70 లక్షల ఎకరాల్లో పంటల సాగు

జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో 1.70 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనాలు వేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జిల్లాలోని 10 మండలాల పరిధిలో రైతుభరోసా కింద 88,450 మంది రైతులకు ఎకరాకు రూ.6 వేల చొప్పున సుమారు రూ.106 కోట్లకు పైగా అందించేందుకు ప్రభుత్వానికి నివేధించారు. గురువారం వరకు జిల్లాలోని 79,389 మంది రైతులకు రూ.91.03 కోట్ల పెట్టుబడి సాయం అందింది.

రైతుల వివరాలు

రూ. 11.78 కోట్లు

రూ. 11.90 కోట్లు

రూ. 8.60 కోట్లు

రూ. 14.21 కోట్లు

రూ. 7.31 కోట్లు

రూ. 8.67 కోట్లు

రూ. 10.41 కోట్లు

రూ.7.23 కోట్లు

రూ. 5.72 కోట్లు

రూ. 5.20 కోట్లు

వెంకటాపురం(ఎం)

వెంకటాపురం(కె)

వాజేడు

ములుగు

తాడ్వాయి

మల్లంపల్లి

ఏటూరునాగారం

గోవిందరావుపేట

కన్నాయిగూడెం

మంగపేట

6,655

6,300

10,959

11,745

8,355

7,386

7,811

5,573

4,734

9,871

వానాకాలం సాగుకు అందిన పెట్టుబడి సాయం

ఆనందం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు

వానకాలం సీజన్‌కు సంబంధించి ఇప్పటివరకు 9 ఎకరాల భూమి ఉన్న రైతులందరికీ పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ అయింది. శుక్రవారం సాయంత్రం వరకు మరో వెయ్యి మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమకానున్నాయి. కొత్త పట్టాదారు పాస్‌బుక్కులు పొందిన రైతులకు సైతం ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందిస్తుంది. – సురేశ్‌కుమార్‌, జిల్లా వ్యవసాయ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement