ఏటూరునాగారం: మండల కేంద్రానికి చెందిన కె.వర్షిత అండర్ 8 విభాగంలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు కోచ్ పర్వతాల కుమారస్వామి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 5న బండారుపల్లి గురుకుల పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో స్టాండింగ్ జంప్, 60 మీటర్ల పరుగు పందెం విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ందని పేర్కొన్నారు. నేడు హైదరాబాద్‌లో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో వర్షిత పాల్గొననున్నట్లు కుమారస్వామి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని వర్షితను ఏటూరునాగారం వాకర్స్ యూనియన్ సభ్యులు అభినందించారు.


