ములుగు రూరల్: మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ మైదానంలో నిర్వహించిన 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గెమ్స్ మీట్ 2026 క్లస్టర్–ఏలోని 14వ క్రీడా విభాగాల పోటీల్లో పతకాలు సాధించిన ములుగు పోలీస్ క్రీడాకారులను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ శుక్రవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జట్టు సమన్వయంతో లోపాలను గుర్తించి సరిదిద్దుకోవటంతోనే విజయాలు సాధించామన్నారు. పోలీసులు విధుల్లో క్రమశిక్షణ, శారీరక ధృడత్వం కీలకమన్నారు. అనంతరం పతకాల విజేతలు ఆర్‌ఎస్సైలు రాకేష్, అశోక్, హెడ్ కానిస్టేబుల్ అమిత్ కుమార్ సింగ్‌లను ఎస్పీ అభినందించారు.


