● ఆశ్రమ పాఠశాలలో
నో అడ్మిషన్స్ బోర్డు
గోవిందరావుపేట: మండల పరిధిలోని లక్ష్మీపురం–కర్లపల్లి ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ఫుల్ అయ్యాయని.. ప్రస్తుతం ఒక్క సీటు కూడా ఖాళీ లేదని పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పి.గాంగు, అడ్మిషన్ ఇన్‌చార్జ్ పెనక వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు గురువారం పాఠశాల గేట్‌కు నో అడ్మిషన్స్ బోర్డును ఏర్పాటు చేశారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలంటే అటు వైపుగా రాని విద్యార్థుల తల్లిదండ్రులు నేడు వస్తున్న ఉత్తమ ఫలితాలు, నాణ్యమైన విద్య, ఉచిత వసతి, పౌష్టికాహారం, క్రమశిక్షణ, అంకితభావంతో బోధిస్తున్న ఉపాధ్యాయుల సేవలపై నమ్మకం పెంచుకుంటున్నారు. అందుకు నిదర్శనంగానే లక్ష్మీపురం ఆశ్రమ పాఠశాలలో అడ్మిషన్లు ఫుల్ కావడం విద్యారంగంలో సానుకూల పరిణామంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.


