298.40 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

298.40 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

Jul 19 2026 1:32 AM | Updated on Jul 19 2026 1:32 AM

గోవిందరావుపేట: పేదలకు ప్రభుత్వం పంపిణీ చేయాల్సిన 298.40 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా ఛత్తీస్‌గఢ్‌కు తరలిస్తున్న లారీని అధికారులు పట్టుకున్నారు. డిప్యూటీ తహసీల్దార్‌(సివిల్‌ సప్లయీస్‌) విజయ్‌ కుమార్‌, పస్రా ఎస్‌హెచ్‌ఓ తాజొద్దీన్‌ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సంయుక్త దాడుల్లో ఈ భారీ అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. పక్కా సమాచారంతో నిఘా ఏర్పాటు చేసిన అధికారులు ఓ లారీని తనిఖీ చేయగా అందులో 298.40 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వాటిని సీజ్‌ చేసి మండలంలోని లక్ష్మీగణపతి రైస్‌ మిల్లులో భద్రపరిచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి రవాణాకు పాల్పడిన వారిపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ బియ్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి నుంచి బయలుదేరి, లింగాల–పస్రా మార్గం మీదుగా ఛత్తీస్‌గఢ్‌కు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై తాజొద్దీన్‌ మాట్లాడుతూ పేదలకు అందాల్సిన పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా తరలించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement