శిక్షణ ఫలాలు విద్యార్థులకు చేర్చాలి | - | Sakshi
Sakshi News home page

శిక్షణ ఫలాలు విద్యార్థులకు చేర్చాలి

Jul 16 2026 5:30 AM | Updated on Jul 16 2026 5:30 AM

జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి

ములుగు/ములుగు రూరల్‌: శిక్షణ తరగతుల్లో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి పాఠశాలల్లో అమలు చేయాలని, విద్యార్థులకు శిక్షణ ఫలాలు అందేలా కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బండారుపల్లి మోడల్‌ స్కూల్‌లో మూడు రోజులుగా హిందీ, ఫిజికల్‌సైన్స్‌, ఇంగ్లిష్‌ ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. ఈ ముగింపు సమావేశానికి డీఈఓ సిద్ధార్థరెడ్డి హాజరై మాట్లాడారు. ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో ప్రతీ విద్యార్థి అమ్మ పేరుపై ఒక మొక్క నాటేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. క్రమం తప్పకుండా పాఠశాలలకు విద్యార్థులు హాజరయ్యేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement