హేమాచల క్షేత్రంలో వేలం | - | Sakshi
Sakshi News home page

హేమాచల క్షేత్రంలో వేలం

Jul 17 2026 3:22 AM | Updated on Jul 17 2026 3:22 AM

మంగపేట : మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 17 నుంచి 2026 ఏప్రిల్‌ 16 వరకు ఫొటోలు తీసుకునేందుకు, చెప్పుల స్టాండ్‌, కొబ్బరి ముక్కలు పోగుచేసుకునేందుకు, పాత ఇనుప సామగ్రికి ఆలయ ఇన్‌చార్జ్‌ కార్యనిర్వాహణ అధికారి ఎం.వీరస్వామి ఆధ్వర్యంలో గురువారం బహిరంగ వేలం నిర్వహించారు. ఫొటోలు తీసుకునేందుకు మల్లూరుకు చెందిన అటిక ముత్తయ్య రూ.22,500, చెప్పుల స్టాండ్‌ వై.నర్సింహారావు రూ.34,500, కొబ్బరి చిప్పలు రూ.91,000, పాత ఇనుప సామగ్రి రూ.8,000కు వనపర్తి భిక్షపతి వేలం ద్వారా దక్కించుకున్నట్లు వీరస్వామి తెలిపారు. వేలం పరిశీలకులుగా కొమ్మాల లక్ష్మీనర్సింహాస్వామి దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి ప్రసాద్‌, ఆలయ అర్చకులు ముక్కామల రాజశేఖర్‌శర్మ, పవన్‌కుమార్‌ ఆచార్యులు, సిబ్బంది గోనె లలక్ష్మీనారాయణ, శేషు పాల్గొన్నారు.

కన్నవారిని

పట్టించుకోకపోతే చర్యలు

ములుగు : వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం ప్రకారం కన్నవారిని కొడుకులు పట్టించుకోకుంటే చర్యలు తప్పవని 2007 చట్టాన్ని కచ్ఛితంగా అమలు చేస్తామని సీనియర్‌ సిటిజన్‌ పోషణ సంక్షేమ ట్రిబ్యునల్‌ అధికారి, ఆర్డిఓ కృష్ణవేణి గురువారం తెలిపారు. ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామానికి చెందిన గాదె నక్షత్రారెడ్డి, జేసితమ్మలు తాము సంపాదించిన ఆరు గుంటల స్థలాన్ని తమ కుమారులు గాదె అశోక్‌రెడ్డి, గాదె అబ్రహంరెడ్డికి సమానంగా పంచిన అనంతరం తమను పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ క్రమంలో నక్షత్రారెడ్డి కుమారులకు 2007 చట్టం సెక్షన్‌ 5(1) ప్రకారం నోటీసులు జారీ చేసి జూన్‌ 30వ తేదీన విచారణ చేసిననట్లు తెలిపారు. విచారణలో తల్లిదండ్రులను పట్టించుకోవడంలేదని తేలడంతో 2007 చట్టం సెక్షన్‌ 9(1) సెక్షన్‌ 4 ప్రకారం వారు సంపాదించిన ఆస్తిలో కొడుకులు జోక్యం చేసుకోవద్దని, తమ ఉత్తర్వులు పాటించకుంటే చట్ట ప్రకారం కేసునమోదు చేస్తామని తెలిపారు.

ఎక్స్‌ప్రెస్‌ బస్సులు

తగ్గించలేదు

హన్మకొండ: హైదరాబాద్‌ రూట్‌లో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు తగ్గించారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని టీజీఎస్‌ ఆర్టీసీ వరంగల్‌ రీజినల్‌ మేనేజర్‌ భవానిప్రసాద్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరంగల్‌–హైదరాబాద్‌ (ఉప్పల్‌, జేబీఎస్‌, జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లి, బీహెచ్‌ఎల్‌) మార్గంలో ప్రస్తుతం మహాలక్ష్మి ఎ క్స్‌ప్రెస్‌, పల్లెవెలుగు బస్సులు ప్రతీ 20 నిమి షాలకు ఒక సర్వీస్‌ చొప్పున నడుస్తున్నట్లు వివరించారు. హనుమకొండ బస్‌ స్టేషన్‌ నుంచి మొ దటి బస్సు ఉదయం 04:30 గంటలకు, చివరి బస్సు రాత్రి 08:30 గంటలకు బయల్దేరుతుంద ని, రోజుకు మొత్తం 49 ట్రిప్పులు నడుస్తున్నట్లు తెలిపారు. హనుమకొండ నుంచి జనగామకు ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు చొప్పున 53 ట్రిప్పులు.. జనగామ నుంచి ఉప్పల్‌కు ప్రతి 16 నిమిషాలకు ఒక బస్సు చొప్పున మొత్తం 60 ట్రిప్పులు నడుపుతున్నట్లు వివరించారు. మహాలక్ష్మి పథకం దృష్టిలో పెట్టుకొని కరీంనగర్‌, కాళేశ్వరం, ఖమ్మం, సిద్దిపేట రూట్లలో అదనంగా బస్సు ట్రిప్పులు పెంచినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు ఇచ్చిన వినతుల మేరకు మహాలక్ష్మి పథకం సౌకర్యాన్ని కల్పించేందుకు వివిధ రూట్లలో 77 సర్వీస్‌లు నడుపుతుట్లు పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలుకు ఆర్టీసీ వరంగల్‌ రీజియన్‌ చిత్తశుద్ధితో ముందుకు వెళ్తోందని ఆర్‌ఎం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement