ములుగు: టౌన్ ప్లానింగ్, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మున్సిపల్ కమిషనర్ సంపత్‌రెడ్డి తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో సిబ్బందితో కలిసి మంగళవారం పర్యటించి పట్టణ ప్రణాళిక, పారిశుద్ధ్య అంశాలను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డులో కొనసాగుతున్న నిర్మాణ పనులు, భవన అనుమతులు, రహదారుల పరిస్థితి, డ్రెయినేజీ వ్యవస్థ, చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపర్చాలని, చెత్తను ప్రతిరోజూ సకాలంలో సేకరించి వార్డును పరిశుభ్రంగా ఉంచాలని పారిశుద్ధ్య సిబ్బందికి సూచించారు. అలాగే డ్రెయినేజీలను నిరంతరం శుభ్రం చేయాలని సూచించారు. స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు. పరిశుభ్రమైన ములుగు పట్టణ నిర్మాణానికి ప్రజలు సహకరించాలని కోరారు.
మున్సిపల్ కమిషనర్ సంపత్‌రెడ్డి


