ములుగు రూరల్: మహిళల ఆరోగ్యాన్ని తీవ్ర ప్రభావితం చేసే వ్యాధుల్లో ఒకటైన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ప్రధాన సమస్యగా మారుతుంది. దీన్ని అదిగమించేందుకు ప్రభుత్వం 14 నుంచి 15 ఏళ్ల బాలికలకు హ్యూమర్ పాపిలోను వ్యాక్సిన్ (హెచ్‌పీవీ) అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు టీకా కార్యక్రమాన్ని మార్చి నెలలో ప్రారంభించింది. అయినప్పటికీ జిల్లాలో మాత్రం మందకోడిగా కొనసాగుతోంది. విద్యార్థినులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలో వైద్యారోగ్యశాఖ పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
క్యాన్సర్ నివారణలో కీలక పాత్ర
హెచ్‌పీవీ వైరస్ కారణంగా గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ కాకుండా ఇతర ప్రమాదకర క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. ఈ వైరస్ ప్రభావాన్ని ముందుగానే అరికట్టేందుకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ అత్యంత ప్రభావితంగా పని చేస్తుదని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల దీర్ఘకాలికంగా రోగనిరోధకశక్తి అభివృద్ధి చెందడంతో పాటు వ్యాధులను ధరిచేరకుండా చూస్తుంది. పలు రకాల క్యాన్సర్ల నివారణకు ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు.
జిల్లాలో 3,127 మంది బాలికల గుర్తింపు
జిల్లాలోని పది మండలాల్లో వైద్యారోగ్యశాఖ గణాంకాల ప్రకారం 3,127 మంది బాలికలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 1,285 మందికి మాత్రమే వ్యాక్సిన్ అందించారు. జిల్లాలో 30 శాతం మాత్రమే వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేశారు, 70 శాతం మంది బాలికలకు వ్యాక్సిన్ అందించాల్సి ఉంది. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సైతం వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగిస్తున్నారు.
హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై జిల్లాలోని ప్రతీ గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. బాలికల పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులకు వ్యాక్సిన్ వేశాం. బాలికల తల్లిదండ్రులకు వ్యాక్సిన్ వల్ల కలిగే లాభాలను వివరిస్తున్నాం. జిల్లాలో 30 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశాం. త్వరలోనే జిల్లాలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ వందశాతం పూర్తి చేస్తాం.
– గోపాల్‌రావు, డీఎంహెచ్‌ఓ
జిల్లా వివరాలు
ఆస్పత్రి పరిధి బాలికలు వ్యాక్సిన్
తీసుకున్నవారు
ములుగు 881 93
ఏటూరునాగారం 229 97
గోవిందరావుపేట 319 46
పస్రా 350 61
చుంచుపల్లి 140 40
మంగపేట 337 83
ఎస్‌ఎస్‌తాడ్వాయి 208 50
వెంకటాపురం(ఎం) 127 105
ఎదిర 135 311
పేరూరు 296 168
వాజేడు 127 209
జిల్లాలో మందకొడిగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్
30శాతం మాత్రమే పూర్తి
అవగాహన కల్పించడంలో అధికారులు విఫలం


