ఏటూరునాగారం: ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ధూప దీప నైవేద్యం జిల్లా అర్చక సంఘం ఆధ్వర్యంలో వరుణయాగం, గణపతి, గౌరి పూజలు కనులపండువగా శనివారం నిర్వహించారు. మండల కేంద్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో అర్చకులు ఉదయం 9 గంటలకు గణపతి పూజను స్థానిక సర్పంచ్ కాకులమర్రి శ్రీలత, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనర్సింహరావుతో దీపారాదన చేయించారు. అనంతరం వరుడికి పూజలు చేసి వరుణయాగాన్ని వేదపండితులు యల్లాప్రగడ మణికంఠశర్మ, రుత్విక్‌సాయిశర్మ జరిపించారు. పూర్ణాహుతి కార్యక్రమాన్ని ముగించుకొని వరుణయాగంలో ఏర్పాటు చేసిన జలాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి బొడ్రాయి అమ్మవారికి అభిషేకం చేసి నూతన వస్త్రాలతో అమరేశ్వర్‌శర్మ, హరికిషన్‌లు అలంకరించారు. భక్తులతో అమ్మవారికి పుష్పాభిషేకం చేశారు. తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. అలాగే దేవాదాయ శాఖ నుంచి అర్చకులకు మంజూరైన ఐడీ కార్డులను అందజేశారు. రామాలయాన్ని కూడా ధూప దీప నైవేద్యం స్కీంలో చేర్చాలని ఆలయ చైర్మన్ అలువాల శ్రీనివాస్ విన్నవించగా స్కీంలో పెట్టించే విధంగా కృషి చేస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో యల్లాప్రగడ నాగేశ్వర్‌రావుశర్మ, సూర్యనారాయణశర్మ, ఏఎన్‌శర్మ, వెంకటరమణాచార్యులు, కర్నె సాంబయ్య, జిల్లా అధ్యక్షుడు రాఘునాథచార్యులు, గౌరవ అధ్యక్షుడు పురుషోత్తంచార్యులు, శివసత్యనారాయణ, వివేకానందస్వామి, రామాలయం క మిటీ ప్రధాన కార్యదర్శి కత్తెర శ్రీనివాస్, శివాల యం చైర్మన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


