ములుగు: భూముల రీ సర్వేను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పారదర్శకంగా నిర్వహించాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్.లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. భూముల రీ సర్వే, నక్ష భూముల అంశాలపై ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌గాంధీ హనుమంతుతో కలిసి గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో లోకేష్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి అదనపు కలెక్టర్ మహేందర్‌జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూముల రీ సర్వేను దశలవారీగా చేపడుతోందని తెలిపారు. తొలి దశలో ప్రతీ జిల్లాలో 70 గ్రామాల్లో రీ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సర్వేతో స్పష్టమైన యాజమాన్య హక్కులు నిర్ధారించడంతో పాటు ప్రతీ భూమికి ప్రత్యేక భూధార్ యూనిక్ నంబర్ కేటాయించనున్నట్లు తెలిపారు. జీఐఎస్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రీ సర్వే చేపట్టాలని ఆదేశించారు.
వీసీలో రెవెన్యూశాఖ కార్యదర్శి
లోకేశ్ కుమార్


