కన్నాయిగూడెం: మండలంలోని పల్లె దవాఖానలో ఆశ కార్యకర్తలే వైద్యం చేస్తున్నారు. పేరు కు మాత్రమే వైద్యులు, ఏఎన్‌ఎంలు రికార్డులో డ్యూటీలో ఉన్నట్లు చూ పుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆశ కార్యకర్తలే వైద్యం చేస్టున్నట్లు తెలుస్తుంది. గురువారం ఉదయం 10 గంటలకు పల్లె దవాఖానను సాక్షి విజిట్ చేయగా.. ఆశ కార్యకర్త మాత్రమే డ్యూటీలో ఉ న్నారు. రాజన్నపేట సబ్ సెంటర్‌ను పరిశీలించగా.. డాక్టర్, ఏఎన్‌ఎం లే రు. ఆశ కార్యకర్త ఉన్నారు. మండల కేంద్రంలోని హెల్త్ సెంటర్‌లో 10.30గంటకు డాక్టర్ లేకపోవడంతో నర్సు రోగులకు వైద్యం చేస్తున్నారు.


