ఎస్‌ఎస్‌తాడ్వాయి: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో నార్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూడు కాజ్‌వేల వద్ద పోలీసులు మంగళవారం బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రి సీతక్క, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదేశాల మేరకు నార్లాపూర్ ఎస్సై అచ్చ కమలాకర్ ఆధ్వర్యంలో జంపన్నవాగు ఊరట్టం, కొత్తూరు కాజ్‌వే, ఎల్బాక లోలెవల్ బ్రిడ్జిని పరిశీలించారు. వరద ప్రవాహం అధిక స్థాయిలో ఉండడంతో ప్రజలు ప్రమాదాలకు గురికాకుండా కాజ్‌వేల వద్ద భారికేడ్లు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సెకండ్ ఎస్సై నరేశ్, సిబ్బంది పాల్గొన్నారు.


