ఏటూరునాగారం: ఓటరు జాబితా నుంచి మరణించిన వారి ఓట్లను తొలగించాలని ములుగు ఆర్డీఓ కృష్ణవేణి బీఎల్‌ఓలను ఆదేశించారు. మండల కేంద్రంలోని 45వ బూత్‌లో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ సర్వేను గురువారం ఆర్డీఓ పరిశీలించి బీఎల్‌ఓలతో మాట్లాడారు. 2002 జాబితాతో మ్యాపింగ్ చేయాలన్నారు. ఊరికి వచ్చిన కోడళ్ల వివరాలను తెలుసుకొని వారి తల్లిదండ్రులతో మ్యాపింగ్ చేసి ఓటు ఇక్కడే ఉండేలా చూడాలన్నారు. ఒకే వ్యక్తికి రెండు బూత్‌లలో ఓటు ఉంటే ఏ బూత్‌లో కావాలని తెలుసుకొని మిగితాది తొలగించాలన్నారు. తప్పులు లేకుండా సర్ ఫామ్‌లను పూర్తి చేసేందుకు సహకరించాలన్నారు. ప్రజలు సర్ సర్వేకు సహకరించి ఓటు హక్కును కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంట తహసీల్దార్ జగదీశ్, బీఎల్‌ఓలు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
ఆర్డీఓ కృష్ణవేణి


