● స్వయం ఉపాధిపై దృష్టి సారించాలి
● ీపీఓ లెనిన్ వత్సల్ టొప్పో
ఏటూరునాగారం: ఏ రంగంలోనైనా ప్రతిభ కనబర్చినప్పుడే తగిన గుర్తింపు వస్తుందని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. మండల కేంద్రంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో ప్రపంచ యువత నైపుణ్యోత్సవ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు వివిధ రంగాల్లో శిక్షణ పొందిన నిరుద్యోగులకు పీఓ అవగాహన కల్పించారు. చదువుకున్న యువత ఏపనిచేసినా ఇష్టంతో చేస్తేనే లక్ష్యాన్ని చేరుకుంటారని సూచించారు. ఐటీడీఏ పరిధిలోని ఐదు వైటీసీలలో బ్యూటీషియన్, టైలరింగ్, హోటల్ మేనేజ్‌మెంట్‌లో శిక్షణ పొందిన 558 మంది నిరుద్యోగులు స్వయం ఉపాధిపై దృష్టిసారించి రాణించాలన్నారు. నేర్చుకున్న శిక్షణపై దృష్టి సారించి ఆ దిశగా రాణించాలని సూచించారు. గిరిజన నిరుద్యోగులకు, విద్యార్థులకు శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి, బుక్స్, మెటీరియల్, యూనిఫాంలు అందజేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జేడీఎం కొండల్‌రావు, శిక్షణ సంస్థ ప్రతినిధులు, యువతీ యువకులు పాల్గొన్నారు.


