● వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం
జరగకుండా సమన్వయంతో పనిచేయాలి
● కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
ములుగు: జిల్లాలో కురిసే వర్షాలు, సంభవించే విపత్తు పరిస్థితుల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సూచించారు. జిల్లాలో వర్షాల పరిస్థితులు, ముందస్తు జాగ్రత్తలు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల సమయంలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకలు, చెరువుల పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక అప్రమత్తత అవసరమన్నారు. ఎక్కడైనా వరద ముప్పు ఏర్పడే అవకాశం ఉంటే ముందుగానే చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు అధికారులు అందుబాటులో ఉండి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సిహెచ్.మహేందర్ జి, సంపత్ రావు పాల్గొన్నారు.
ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణను ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. శుక్రవా రం తన చాంబర్‌లో ఉచిత శిక్షణకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులకు చెందిన అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలన్నారు. ఆసక్తి గల నిరుద్యోగులు ఈనెల 12లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవే శ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారని, మెరి ట్ సాధించిన అభ్యర్థులకు హైదరాబాద్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉచిత వసతి, భోజన సౌకర్యంతో పాటు శిక్షణ ఇస్తారన్నారు. కార్యక్రమంలో ఎస్సీ డెవలప్‌మెంట్ అధికారి కొమురయ్య, ఏఓ అల్లం రాజ్‌కుమార్, ఎస్‌ఓ లాల్ పాల్గొన్నారు.


