వెంకటాపురం(కె): మండలంలోని రంగరాజాపురం కాలనీలోని పల్లె దవాఖానాలో డాక్టర్ లేకపోవడంతో ఆశ వర్కరే అన్ని చూసుకుంటున్నారు. ఉదయం పది గంటలకు ఆశ వర్కర్ వచ్చి సెంటర్ ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ విధులు నిర్వర్తించిన వైద్యులు ఉన్నతచదువుల నిమిత్తం వెళ్లగా మళ్లీ ఎవరినీ కేటాయించలేదు. ఏఎన్‌ఎం ఉన్నా సమయపాలన పాటించడం లేదు. దీంతో వైద్యశాలకు వచ్చిన రోగులకు తిప్పలు తప్పడం లేదు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఆశ వర్కర్లే మందులు అందజేస్తున్నారు. వైద్యశాలలో సిబ్బంది లేకపోవడంతో ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి.


