● అదనపు కలెక్టర్ మహేందర్ జీ
ములుగు: సీఎంఆర్ నిల్వ కేంద్రాలకు తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్ జీ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఎఫ్‌సీఐ జనరల్ మేనేజర్ నేత్ర ప్రకాష్, సంబంధిత అధికారులతో ధాన్యం నిల్వ కేటాయింపుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని నిర్ణీత ప్రమాణాల ప్రకారం సీఎంఆర్‌ను నిల్వ కేంద్రాలకు తరలించే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ధా న్యం నిల్వ, రవాణా, మిల్లింగ్ ప్రక్రియల్లో ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారి ఫైజల్ హుస్సేన్, డీఎం కృష్ణవేణి, డీటీ విజయ్ కుమార్, రైస్ మిల్లర్లు, అధికారులు పాల్గొన్నారు.
పెండింగ్ బకాయిలు చెల్లించాలి
మిషన్ కె 100లో భాగంగా డిఫాల్ట్ రైస్ మిల్లుల నుండి తెలంగాణ సివిల్ సప్లయిస్ కార్పొరేషనన్‌కు రావాల్సిన బకాయిల చెల్లింపులపై అదనపు కలెక్టర్ మహేందర్ జీ కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి హైదరాబాద్ సివిల్ సప్లయీస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. బకాయిల చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని అధికారులకు, మిల్లర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియలో సంబంధిత శాఖలు రైస్ మిల్లర్లు పరస్పర సమన్వయంతో పని చేసి పెండింగ్ బకాయిలను త్వరగా క్లియర్ చేయాలని సూచించారు. డిఫాల్ట్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.


