ములుగు: రైతులకు అవసరమైన యూరియా, ఎరువుల బుకింగ్ సేవలను మీ సేవల ద్వారా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే పలువురు రైతులు ఫర్టిలైజర్ మొబైల్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకుంటున్నారని తెలిపారు. యాప్ ద్వారా బుకింగ్ చేసే విధానం తెలియని రైతులు తమ సమీపంలోని మీసేవ కేంద్రాన్ని సందర్శించి సులభంగా యూరియా బస్తాలను బుక్ చేసుకోవచ్చన్నారు. యూరియా బుకింగ్ కోసం రైతులు పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ ప్రతితో పాటు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ వివరాలను మీసేవ కేంద్రంలో సమర్పించాలన్నారు. వివరాలను నమోదు చేసిన అనంతరం ప్రభుత్వం నిర్ణయించిన మేరకు యూరియా బస్తాలను బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని, బుకింగ్ పూర్తయ్యాక యూరియా బుకింగ్ ఐడీతో కూడిన రసీదును రైతులకు అందజేస్తారని వివరించారు. ప్రభుత్వం ఈ సేవకు రూ.10 రుసుము నిర్ణయించినందున రైతులు నిర్ణీత రుసుము చెల్లించి సేవలను వినియోగించుకోవాలని కోరారు. డిజిటల్ సంతకం పూర్తికాని భూములు కలిగిన పట్టాదారు రైతులు తమ ఆధార్ నంబర్ ఆధారంగా యూరియా బుకింగ్ చేసుకునే అవకాశం ఉందని దేవేందర్ వెల్లడించారు.
ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్


