● కుల్లా, నిత్యక్లిన్నా క్రమాల్లో పూజలు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం అమ్మవారికి కుల్లా క్రమంలో, నిత్యక్లిన్నా క్రమంలో పూజలు జరిపి వారాహి అమ్మవారుగా అలంకరించారు. శుక్రవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు ఉదయం నుంచి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, చతుఃస్థానార్చన, అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరానికి కుల్లా క్రమంలో పూజలు నిర్వహించి వారాహి అమ్మవారుగా అలంకరించారు. షోఢశీక్రమాన్ని అనుసరించి స్నపన మందిరంలోని బోగభేరాన్ని నిత్యక్లిన్నాగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఈఓ రాముల సునీత పర్యవేక్షించారు.
వారాహి, నిత్యక్లిన్నాగా అమ్మవారు అలంకరణ


