దొడ్ల– కొండాయి జంపన్నవాగుపై చేపట్టిన హైలెవల్ బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలి. వర్షాకాలంలో గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జి లేకపోవడంతో కొండాయి, కొత్తూరు, మల్యాల, ఐలాపూర్, గోవిందరాజుల కాలనీ ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. బ్రిడ్జి లేక విద్యార్థులు సైతం చదువుకు దూరం అవుతున్నారు.
– పి. దేవేందర్, దొడ్ల, ఏటూరునాగారం
ఎలిశెట్టిపల్లి వద్ద బ్రిడ్జి నిర్మించాలి..
గతేడాది భూమి నమూనాలను తీసుకెళ్లారు. ఇంత వరకు పనులు చేపట్టలేదు. బ్రిడ్జి లేక కాలినడకన ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాగు దాటాల్సి వస్తుంది. ఇప్పుడు పడవను ఏర్పాటు చేశారు. విద్యార్థులు చుదువుకునేందుకు మండల కేంద్రంలో నివాసం ఉండాల్సిన పరిస్థితి ఉంది. బ్రిడ్జి పనులు చేపట్టి గిరిజనులను ఆదుకోవాలి.
– డి.రమేశ్, ఎలిశెట్టిపల్లి, ఏటూరునాగారం


