ఆయిల్‌పామ్‌ సాగుప్రోత్సహించాలి | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పామ్‌ సాగుప్రోత్సహించాలి

Jul 5 2026 7:14 AM | Updated on Jul 5 2026 7:14 AM

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు

ములుగు: పంట మార్పిడి విధానాలు, ఆయిల్‌ పామ్‌ సాగు విస్తీర్ణం పెంచేలా రైతులను అధికారులు ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా జిల్లా నుంచి అదనపు కలెక్టర్‌ సంపత్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో 2026– 27 సంవత్సరానికి గాను 85 వేల ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ పంట సాగు చేసేందుకు లక్ష్యం నిర్ధేశించామన్నారు. దీనికి అనుగుణంగా జిల్లాలో అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. పంట మార్పిడి విధానాలను అవలంభించాలన్నారు. కూరగాయల సాగు వైపు దృష్టి సారించాలని వివరించారు. సూక్ష్మ సేద్య పద్ధతులు రైతులు పాటించేలా ప్రోత్సహించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement