సిబ్బంది కొరత | - | Sakshi
Sakshi News home page

సిబ్బంది కొరత

Jul 17 2026 3:22 AM | Updated on Jul 17 2026 3:22 AM

ములుగు రూరల్‌: మండలంలోని రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫార్మసిస్టు లేక స్టాఫ్‌ నర్సు విధులు నిర్వహిస్తున్నారు. పీహెచ్‌సీ పరిధిలో 13 సబ్‌ సెంటర్లు ఉండగా ఫార్మసిస్టు కొరత కారణంగా సకాలంలో సబ్‌ సెంటర్లకు మందులు పంపిణీ చేయడం ఇబ్బందిగా మారుతుంది. పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉండాలి.. కానీ ఒకరు పీజీ కోర్సు చదవడానికి వెళ్లగా మరొకరు జిల్లా ఇమ్యునేషన్‌ ప్రోగ్రాం అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో మల్లంపల్లి పల్లె దవాఖాన వైద్యుడికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక ఇద్దరు స్టాఫ్‌ నర్సుల్లో ఒకరు సెలవులో ఉన్నారు. జంగాలపల్లి పల్లె దవాఖానలో వైద్యురాలు విధులకు గైర్హాజరు కావడంతో ఏఎన్‌ఎం రోగులకు మందులు ఇచ్చి పంపించారు. సాక్షి విజిట్‌ చేయగా.. గురువారం 15 మంది అవుట్‌ పేషెంట్లు ఆస్పత్రికి వచ్చినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement